Intinti Gruhalakshmi Today Episode: బహుమతి ఇస్తానంటూ తులసి హామీ.. ప్రేమ్‌కు నిజం తెలియడంతో షాక్!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటిని శశికళకు రాసివ్వడంతో దీపక్ వచ్చి తులసిని వెంట తీసుకెళ్తానని అంటాడు. కానీ, దీనికామె ఒప్పుకోదు. పైగా అతడిని తిట్టి పంపించేస్తుంది. ఆ తర్వాత అభి తన స్నేహితుడి ఇంటిని అద్దెకు మాట్లాడతాడు. ఈ విషయాన్ని తులసికి చెప్తాడు. ఆ తర్వాత అందరూ ఇంటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధ పడతారు. ఇక, తులసి.. దీపక్‌తో వ్యవహరించిన తీరుపై పరందామయ్య అసంతృప్తిగా ఉంటాడు. ప్రేమ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ మప్పీ లహరి అవమానిస్తాడు. కానీ, అతడు మాత్రం కోపం తెచ్చుకోకుండా ఉంటాడు.

 తులసిని ప్రామిస్ అడిగిన దివ్య

తులసిని ప్రామిస్ అడిగిన దివ్య


ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని అందరూ బాధ పడుతూ ఉంటారు. అప్పుడే దివ్య తన ఫ్యామిలీ ఫొటోను చూసి ఏడుస్తూ ఉంటుంది. అంతలో తులసి అక్కడకు వస్తుంది. అప్పుడు దివ్య ఆ ఫ్యామిలీ ఫొటోను తల్లికి చూపిస్తూ 'ఈ ఫోటోలో ఉన్నవాళ్లలో సగం మంది ఇప్పుడు మనతో లేరు కదమ్మా. డాడ్ లేరు. ప్రేమ్ అన్నయ్య వాళ్లు లేరు. రేపటి నుంచి మన జీవితాలు నిప్పుల మీద నడకలా ఉంటాయి. కష్టాలు మనస్పర్థలను మనకు ఇంకా పెరగొచ్చు. కాబట్టి ఈ గ్రూప్ ఫోటోలో మరిన్ని తీసివేతలు లేకుండా చూసుకుంటానని మాటివ్వు మామ్' అని అడుగుతుంది.

 దివ్యకు మాట ఇచ్చిన తులసి

దివ్యకు మాట ఇచ్చిన తులసి

దివ్య ప్రామిస్ చేయమని అడిగినా తులసి మాత్రం వినదు. అంతేకాదు, 'నేను దేవుడిని కాదు.. కానీ ప్రయత్నిస్తా అని మాత్రం మాటివ్వగలను. వానరాకుండా ఆపలేను కానీ.. గొడుగు మాత్రం పట్టుకోగలను. పదమ్మా భోజనం చేద్దువు కానీ' అంటుంది తులసి. అందరూ చివరి సారి ఆ ఇంట్లో భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. కానీ.. ఒక్కరిలో సంతోషం ఉండదు. అందరూ దీనంగా కూర్చొని ఉంటారు. ఏదో పోగొట్టుకున్నవాళ్లలా ఉంటారు. అప్పుడు తులసి అదేంటి అందరూ అలా కూర్చున్నారు మొదలుపెట్టండి అంటుంది. కానీ.. ఒక్కరూ స్పందించరు.

తులసిపై నిందలు వేసుకుని

తులసిపై నిందలు వేసుకుని


ఎవరిని పిలిచినా అన్నం తినరు. అప్పుడు తులసి అమ్మా దివ్య అంటే.. నాకసలు భోజనం చేయాలనేలేదు. నేను తినలేను అంటుంది. అమ్మ అంకిత అంటే నాకు తినాలని లేదు ఆంటి అంటుంది. అప్పుడు తులసి 'ఎందుకు అందరూ బాధపడుతున్నారు. ఎందుకు అందరి కళ్లలో కన్నీళ్లు? మీ కళ్లలో కనిపించే ప్రతి కన్నీటి బొట్టు నా చేతగానితనాన్ని గుర్తు చేస్తుంది అత్తయ్య' అంటూ తనపై నిందలు వేసుకుంటుంది. దీనికి అభి 'చేతగానితనం నీది కాదు మామ్.. నాది.. కొడుకును అయి ఉండి నిన్ను ఆదుకోలేకపోయాను' అంటూ కన్నీరు పెట్టుకుంటాడు.

భోజనం చేసేందుకు సిద్ధంగా

భోజనం చేసేందుకు సిద్ధంగా


ఎంతకూ వాళ్లు వినకపోవడంతో తులసి 'కొన్ని విషయాలను ఎదిరించి నిలబడలేకపోయాను. అందరూ ఒకటి గుర్తుపెట్టుకొండి. ఇది మనందరం ఈ ఇంట్లో కలిసి చేసే ఆఖరి భోజనం. కన్నీళ్లు తుడుచుకొని అందరం సంతోషంగా భోజనం చేద్దాం. ఈ మెమోరీని పదిలంగా మనసులో దాచుకుందాం. దయచేసి నాకోసం తినండి' అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో పరందామయ్య 'అమ్మా తులసి నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి అమ్మ. ఎట్టిపరిస్థితుల్లోనూ నీ కన్నీరు ఎవరికీ మంచిది కాదు. నువ్వు అన్నట్టుగానే అందరం ఆనందంగా భోజనం చేస్తాం. ' అని అంటాడు. అప్పుడు అనసూయ 'ఇంతకాలం మమ్మల్ని అందరినీ బిడ్డల్లా చూసుకున్నావు. ఈ ఇంట్లో ఆఖరి భోజనం గుర్తుండిపోవాలంటే నీ చేత్తో ముద్దలు కలిపి పెట్టు' అంటుంది.

ప్రేమ్‌కు నిజం తెలియడంతో

ప్రేమ్‌కు నిజం తెలియడంతో


అందరూ భోజనం చేసిన తర్వాత రాములమ్మ నేరుగా ప్రేమ్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడామె 'ఇలాంటి వార్త నా నోటితో చెప్పాల్సి వస్తుందని నేను ఏనాడూ అనుకోలేదు బాబూ. అప్పు కింద మీ ఇంటిని ఆ శశికళ కొనేసింది. రేపే ఇల్లు ఖాళీ చేస్తున్నారు. నాకైతే చాలా బాధగా అనిపిస్తోంది' అంటూ నిజం చెప్పేస్తుంది. దీంతో ప్రేమ్ నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అంటాడు. దీనికి శృతి 'ఇప్పుడు నువ్వు ఆంటీ దగ్గరకు వెళ్లి ఏం చేస్తావు? నువ్వు కష్టపడడి ఒక స్థాయికి చేరుకున్నాక ఆంటి వాళ్లను మన దగ్గరికి తెచ్చుకుందాం. అంతేకానీ కంగారు పడకు' అని సలహా ఇస్తుంది.

మామయ్యకు తులసి ప్రామిస్

మామయ్యకు తులసి ప్రామిస్


పరందామయ్యతో తులసి మాట్లాడుతూ.. 'మామయ్య.. మీకు ఒక మాట ఇస్తున్నాను. మీ పెద్ద కొడుకును తిరిగి మీ దగ్గరికి చేర్చలేను కానీ.. మీ బిడ్డలా భావిస్తున్న ఈ ఇంటిని తిరిగి మీకు బహుమతిగా అందిస్తాను' అంటుంది. అప్పుడాయన 'ఈ ఇల్లు మనదై ఉండాలంటే.. ముందు దీన్ని పోగొట్టుకునేవాళ్లం కాదు తులసి' అంటాడు. ఇక, ఉదయాన్నే తులసి ఇదే నా ఆఖరి పూజ అమ్మ అని గుడిలో దండం పెట్టుకొని బయటికి వస్తుంది. అందరూ బ్యాగులు సర్దుకొని హాల్‌లోకి వస్తారు. అందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లపోబోతుంటారు. సామాన్లను అన్నింటినీ అద్దె ఇంటికి పంపించేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X