Intinti Gruhalakshmi: తులసి కోరిక తీర్చిన నందూ.. రాజ్యలక్ష్మి బండారం బయటపెట్టిన మామయ్య
ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే : మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి అమ్మగారి ఇంటికి వెళ్లిన నందూ.. తనను క్షమించమని వేడుకుంటాడు. తులసి విషయంలో ఎన్నో తప్పులు చేశానని ఒప్పుకుంటాడు. ఏడుస్తూ వేడుకుంటూ వాళ్లను తనతో వచ్చేందుకు ఒప్పిస్తాడు. ఇక, దివ్య కోసం విక్రమ్ కొరియర్ పంపించగా.. అందులో ఉన్న లెటర్ చూసి ప్రేమ్ చదువుతూ ఆమెను ఏడిపిస్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు. అనంతరం.. తులసి తల్లి, తమ్ముడిని నందూ ఇంటికి తీసుకు వస్తాడు. అది చూసి తులసి ఎంతగానో సంతోషిస్తుంది. దీంతో అందరూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు.

అమ్మమ్మపైన అలిగిన దివ్య : విక్రమ్ పంపించిన లెటర్‌ను చదువుకుంటూ దివ్య తనలో తాను మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడి నుంచే అతడితో మాట్లాడుతుంటుంది. అంతలోనే అక్కడకు తులసి వాళ్ల అమ్మ సరస్వతి వస్తుంది. ఆ వెంటనే అమ్మమ్మను హగ్ చేసుకుని దివ్య సంతోషిస్తుంది. ఆ తర్వాత బుంగమూతి పెట్టుకుని అమ్మమ్మ మీద అలుగుతుంది. అప్పుడు సరస్వతి 'ఏమైంది రా తల్లి? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఈ అమ్మమ్మ అంత పెద్ద తప్పు ఏం చేసింది' అని అడుగుతుంది. దీంతో 'మా అమ్మమ్మ ఏ తప్పు చేసిందో నీకు తెలియదా' అని ఎదురు ప్రశ్నిస్తుంది.
నాకు కూడా చెప్పలేదు కదా : సరస్వతి మాటలకు దివ్య 'మనవరాలు పెళ్లి అంటే అమ్మమ్మ పెట్టే అని సర్దుకుని వచ్చి నెల రోజుల ముందే కూర్చుంటుంది. మరి నువ్వేం చేశావు? ఊర్లో ఉండి కూడా పెళ్లంటే ఈరోజు తిప్పుకుంటూ వస్తావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసితో సరస్వతి చూసావా నీ కూతురు ఎలా మాట్లాడుతుందో అని అంటుంది. దీంతో తులసి 'ఇప్పుడు అది నా కూతురు హోదాలో మాట్లాడడం లేదు. నీ మనవరాలు హోదాలో మాట్లాడుతోంది' అంటుంది. దీనికి సరస్వతి 'అయినా బుంగమూతి పెట్టాల్సింది నువ్వు కాదు.. నేను. నీ పెళ్లి ఫిక్స్ అవ్వగానే అమ్మమ్మ నా పెళ్లి ఫిక్స్ అయిందని ఫోన్ చేసి చెప్పావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో షాకైన దివ్య అమ్మమ్మతో ప్రేమగా మాట్లాడుతుంది. అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు.

నందూ పనికి తులసి హ్యాపీ : పెళ్లి దగ్గరపడడంతో నందూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి అతడి దగ్గరకు వస్తుంది. దీంతో మీ అమ్మవాళ్లు వచ్చారు సంతోషమేనా అని అడుగుతాడు. దీనికామె 'నా ఈ సంతోషం కోసం ఈగోని పక్కన పెట్టారా' అని అడుగుతుంది. దీనికి నందూ 'నాకు ఈగో ఉంది. కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఒకప్పుడు నా స్వార్థం కోసం మాత్రమే ఆలోచించే వాడిని. కానీ ఇప్పుడు ఎదుటి వ్యక్తి కోసం ఆలోచిస్తున్నాను' అని అంటాడు. ఆ మాటలు విని తులసి ఎంతగానో సంతోషిస్తుంది. తర్వాత 'నేను మా అమ్మ ఇంటికి వస్తుంది అన్న నమ్మకాన్ని వదిలేసుకున్నాను. ఆశ కూడా పెట్టుకోలేదు. ఎంతగా బ్రతిమలాడినా కూడా అమ్మ మాత్రం వినలేదు. నువ్వు ఇలా బలవంత పెడితే మనసు చంపుకొని రావడం తప్ప మనస్ఫూర్తిగా రాలేను అంది' అని చెబుతుంది.
ఎమోషనల్‌గా నందూ మాట : ఆ తర్వాత తులసి 'కూతురు బ్రతిమలాడినా కూడా వినిపించుకొని అమ్మ.. ఈరోజు గుమ్మంలో అడుగు పెట్టేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా మీ రుణం తీర్చుకోలేను' అని నందూతో అంటుంది. అప్పుడతను రుణం తీర్చుకోవడం కాదు నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నాను అంతే అంటాడు. దీనికి తులసి 'మా అమ్మ ఒప్పుకునే అంతలా మీరు ఏం చేశారు' అని అడుగుతుంది. దీంతో నందూ 'మీ కూతురు గురించి ఆలోచించండి అని చెప్పాను. నందగోపాల్ అనే వ్యక్తి మీ లైఫ్‌లోకి రాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి అన్నా' అంటాడు.
తులసి ఇంట్లో దివ్య పెళ్లి కళ : తులసి ఇంట్లో దివ్య పెళ్లి కళ కనిపిస్తుంది. ఇందుకోసం అందరూ కలిసి మామిడాకులతో తోరణాలు కడుతూ ఉంటారు. ఇంట్లోని వాళ్లందరూ తలా ఒక పని చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ మధ్య మధ్యలో పరంధామయ్యను ఆట పట్టిస్తూనే పెళ్లి పనులు చేస్తుంటాడు. ఆ తర్వాత పసుపు కొట్టే కార్యక్రమం మొదలుపెట్టగా.. అందరూ ఒకరిపై ఒకటి సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నందూ పెళ్లి పనులు చేస్తూ బిజీగా ఉండగా.. అది చూసి దివ్య సంతోషిస్తుంది. తర్వాత ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. అది చూసి తులసి కూడా ఏడుస్తుంది. తర్వాత శుభలేఖలు వస్తాయి. అవి చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. అనంతరం ఎవరు ఏ పని చేయాలో కేటాయించుకుంటారు.
వెళవెళబోయేలా విక్రమ్ ఇల్లు : విక్రమ్ ఇంట్లో కూడా పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ అంటాయి. ఇంతలో అక్కడకు వచ్చిన రాజ్యలక్ష్మి ఆ ఏర్పాట్లు అన్నీ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ వాళ్ళ తాతయ్య అక్కడికి వస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి చెప్పండి మామయ్య అని ఆయనను అడుగుతుంది. దీంతో ఆయన 'గుమ్మానికి మామిడి తోరణాలు, పూలదండలు తప్ప ఇంట్లో పెళ్లి సందడి కనిపించడం లేదు. పెదవులపై చిరునవ్వు, సంతోషం కూడా లేదు. నిజంగా నీది తల్లి మనసు అయితే ఇలా తూతూ మంత్రంగా కాకుండా విక్రమ్ గారి పెళ్లిని వైభవంగా చేయాలనుకునే దానివి' అంటాడు.
నిజాలు చెప్పిన విక్రమ్ తాత : ఆయన మాటలకు రాజ్యలక్ష్మి 'అలా కాదు మామయ్య.. విక్రమ్ తమ్ముడు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాడు. అందుకే ఇలా సింపుల్ గా చేసుకోవాలనుకుంటున్నాడు' అని అంటుంది. దీనికాయన 'ఇదంతా ప్రేమ వల్ల కాదు నీ పగ వల్ల జరుగుతుంది. నాకు మొత్తం తెలుసు' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. అప్పుడు బసవయ్య అక్కడికి వచ్చి 'అన్నీ తెలిసినప్పుడు నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అక్కయ్య ఎందుకు ఇలా ఎక్సట్రాలు చేస్తున్నాడు' అని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











