Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు నిజం చెప్పిన శృతి.. తులసి దగ్గరకెళ్లాలని నందూ నిర్ణయం

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

 మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో నుంచి వెళ్లిపోతామన్న బాధలో ఉన్న వాళ్లందరూ ఎవరికి వారే ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలోనే దివ్య ఫ్యామిలీ ఫొటోను చూపిస్తూ తన తల్లితో ఇందులో ఉన్న వాళ్లమైనా ఎప్పటికీ కలిసుండేలా ప్రామిస్ చేయమంటుంది. కానీ, తులసి మాత్రం దానికి గ్యారెంటీ ఇవ్వలేనని అంటుంది. మరోవైపు, అందరూ అన్నం తినకుండా బాధగా ఉంటే తులసి తన మాటలతో అందరి మనసులు మారుస్తుంది. ఇక, రాములమ్మ వెళ్లి ప్రేమ్‌కు నిజం చెప్పేస్తుంది. దీంతో అతడు తల్లి దగ్గరకు వెళ్లాలని అనుకున్నా శృతి ఆపేస్తుంది.

బాధగా బయటకెళ్లిన ఫ్యామిలీ

బాధగా బయటకెళ్లిన ఫ్యామిలీ


ఎంతగానో బాధ పడిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తులసి తన కుటుంబంతో కలిసి అద్దె ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు అందరూ ఇంటితో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్లు మొత్తం ఏడుస్తూనే బయలుదేరుతారు. పని మనిషి రాములమ్మ వాళ్లకు ఎదురై ఎమోషనల్ అవుతుంది. అప్పుడే తులసి చేతిలో ఉన్న బ్యాగ్‌ను ఆమె తీసుకోబోతుంది. అంతలో తులసి నా బ్యాగ్ నేనే మోసుకుంటాలే అని అంటుంది. దీనికి రాములమ్మ 'మీకు రుణం తీరింది.. ఈ ఇంటితో కానీ ఈ పని మనిషితో కాదమ్మా' అని అంటుంది.

తులసితో కలిసిన పని మనిషి

తులసితో కలిసిన పని మనిషి

రాములమ్మ వస్తానని అనగానే తులసి 'ప్రస్తుతం మా జీవితాలే దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.. నీకు జీతం ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు' అంటుంది. దీనికామె 'ఇన్నేళ్ల తరువాత కూడా మీకు నేను జీతం తీసుకుని పని మనిషిలాగే కనిపిస్తున్నానా? మన మధ్య వేరే అనుబంధం లేకపోతే నా కూతురు ఆపరేషన్‌కు మీరు ఎందుకు సాయం చేశారు? స్కూల్ ఫీజు కోసం గాజులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఎందుకు ఇచ్చారు? నన్ను తోబుట్టువులా ఎందుకు చూసుకున్నారు? నన్ను దూరం చేయకండి.. దయచేసి మీతోనే ఉండనీయండి' అని ధీనంగా వేడుకుంటుంది.

 తల్లి దగ్గరకు వెళ్లాలని ప్రేమ్

తల్లి దగ్గరకు వెళ్లాలని ప్రేమ్


రాములమ్మ విషయం చెప్పిన దగ్గర నుంచి ప్రేమ్ తన తల్లి గురించే ఆలోచించుకుంటూ బాధ పడుతుంటాడు. ఆ సమయంలో శృతి అతడి మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ, ప్రేమ్ 'నాకు అమ్మదగ్గరకు వెళ్లాలని ఉంది.. నువ్వు వద్దంటావని తెలుసు. కానీ, మనసు అమ్మ దగ్గరే ఉంది' అని అంటాడు. దీనికి శృతి 'పడేది మామూలు వాన అయితే గొడుగులు పట్టుకోవచ్చు. కానీ అది వాన కాదు తట్టుకోలేనంత తుఫాన్. ఆంటీ నీ మాట వినదు.. నీ ఆలోచన మార్చుకో ప్రేమ్. ఈ పరిస్థితుల్లో మనం అక్కడి వెళ్లడం అస్సలు మంచిది కాదు' అని బ్రతిమాలుతుంది.

ప్రేమ్‌ను నిజం చెప్పిన శృతి

ప్రేమ్‌ను నిజం చెప్పిన శృతి

శృతి ఎంత చెప్పినప్పటికీ ప్రేమ్ మాత్రం అస్సలు వినడు. 'నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పు.. నిన్ను ఇబ్బంది పెట్టను.. నేనొక్కడినే వెళ్తాను' అని అంటాడు. దీంతో శృతి 'నాకు నీతో రావడం ఇష్టంలేక కాదు ప్రేమ్.. మనతో మాట్లాడటానికి ఆంటీ ఇష్టపడటం లేదు. మొన్న అక్షర పెళ్లి ఫంక్షన్‌లో మన ముఖం చూడటానికి ఇష్టం లేదని చెప్పింది. మన ముఖం చూపించొద్దు అని అన్నది. నీకు ఈ విషయం చెప్తే బాధపడతావని చెప్పలేదు. ఇప్పుడు చెప్పడం తప్పలేదు. ఆంటీలో ఉన్నది కోపం కాదు.. ద్వేషం ఏమో ఆలోచించు' అని అసలు నిజాన్ని చెప్పేస్తుంది.

నువ్వే ఆంటీకి పెద్ద సమస్య

నువ్వే ఆంటీకి పెద్ద సమస్య


శృతి ఎంత సర్ధి చెప్పినా ప్రేమ్ మాత్రం అస్సలు వినిపించుకోడు. పైగా 'తల్లి సముద్రం అయితే బిడ్డలు అలలు. సముద్రానికి కోపం వస్తే ఉరికేస్తుంది. అలలకు కోపం వస్తే ఎగిసిపడతాయి. అలాగని అలలు సముద్రాన్ని వదలవు. అమ్మని పట్టించుకోకుండా వదిలేద్దామా... బంధాలను తెంపేసుకుందామా? అమ్మ సమస్యల్లో ఉంది. సమయం కోసం ఎదురుచూస్తూ ఆగిపోలేను' అని అంటాడు. దీనికి శృతి 'తనకున్న సమస్య కంటే నిన్నే పెద్ద సమస్య అనుకుంటుంది ఆంటీ.. నీ గురించి ప్రస్తావన వస్తేనే ఆంటీ కోపంగా ఊగుతున్నారు వద్దు ప్రేమ్ వెళ్లొద్దు' అంటుంది.

ప్రేమ్ వెళ్లడానికి ఒప్పుకుని

ప్రేమ్ వెళ్లడానికి ఒప్పుకుని

తులసికి ప్రేమ్‌ను చూడడం ఇష్టంలేదని శృతి ఎంత చెప్పినా ప్రేమ్ పట్టించుకోడు. పైగా 'నడవాల్సింది గతుకుల బాట అయినప్పుడు ఎదురుదెబ్బల గురించి ఆలోచించకూడదు శృతి. అమ్మకు అనే హక్కు ఉంది.. ప్లీజ్ శృతి వెళ్దాం' అని అంటాడు. ఇక ఎంత చెప్పినా అతడు పట్టించుకోకపోవడంతో శృతి 'సర్లే నీ ఇష్టం కానీ.. ఎక్కువ ఆశలు పెట్టుకోకు.. ఏది జరిగినా ఆంటీ ఏం అన్నా పర్లేదు అనుకుంటేనే బయల్దేరు' అని అంటుంది. సర్లే అని ప్రేమ్ తులసి దగ్గరకు వెళ్లడానికే నిర్ణయించుకుని శృతిని కూడా బయల్దేరమని అంటాడు.

అద్దె ఇంటిపై అభిప్రాయం

అద్దె ఇంటిపై అభిప్రాయం

అభి చూసిన అద్దె ఇంటిని చూసి తులసి ఎంతగానో సంతోషిస్తుంది. కానీ, దివ్యకు మాత్రం ఆ ఇల్లు నచ్చదు. 'ఫైవ్ స్టార్ లాగేసుకుని.. చేతిలో పిప్పర్‌మెంట్ పెట్టినట్టు ఉంది' అంటుంది. అప్పుడు తులసి 'ఆకాశంలో ఎగిరేపక్షి కూడా ఓపికలేనప్పుడు.. భూమి మీదకే దిగి విశ్రాంతి తీసుకోవాలి.. కాలచక్రం కదులుతూ ఉంటే.. అదృష్టాలు కూడా తారుమారు అవుతాయి అదే జీవితం' అంటుంది. ఆ తర్వాత తులసి మొక్క గురించి కూడా తులసి ఏదో విషయాన్ని వివరించి చెబుతుంది. ఇక, నందూ, లాస్య అక్కడకు వెళ్లాలని అనుకుంటారు. లాస్యకు ఇష్టం లేకపోయినా సరే అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X