Intinti Gruhalakshmi Today Episode: తల్లితో సవాల్ చేసిన ప్రేమ్.. నందూ, లాస్యకు మరో భారీ ఎదురుదెబ్బ

ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అద్దె ఇంటికి వెళ్లడానికి సమయం దగ్గర పడడంతో తులసి ఇంట్లోని వాళ్లంతా బాధ పడుతూ ఉంటారు. అలా చాలా ఎమోషనల్ అవుతూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటారు. అప్పుడు పని మనిషి రాములమ్మ వాళ్లకు ఎదురై తులసితోనే ఉంటానని చెప్తుంది. అప్పుడామె వద్దని అన్నా తోబుట్టువులా వస్తానని అంటుంది. మరోవైపు, ప్రేమ్ తన ఫ్యామిలీ గురించి బాధ పడుతూ ఉంటాడు. ఎలాగైనా తన తల్లిని చేసేందుకు వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు శృతి వద్దని చెప్పినా అతడు అస్సలు పట్టించుకోకుండా ఆమెనే ఒప్పిస్తాడు.

దివ్యకు కోపం.. ఒప్పించిన తులసి

దివ్యకు కోపం.. ఒప్పించిన తులసి

అద్దె ఇంటికి వెళ్లిన తర్వాత దాన్ని చూసి తులసి కుటుంబ సభ్యులు సంతోష పడుతుంటారు. అప్పుడు మొదటి అడుగు నువ్వే పెట్టు తులసి అని అనసూయ అంటే.. లేదు అత్తయ్య మీరు, మామయ్య.. ఇద్దరూ మొదటి అడుగు పెట్టండి అంటుందామె. లేదు.. నువ్వే పెట్టాలమ్మా అంటుంది అనసూయ. ఇల్లు మొత్తం అందరూ ఒకసారి తిరిగి చూస్తారు. ఈ ఇంట్లో రెండు బెడ్ రూమ్సే ఉండటంతో దివ్యకు కోపం వస్తుంది. నాకు సపరేట్ రూమ్ కావాలి అంటుంది దివ్య. అప్పుడు తులసి 'నువ్వు.. తాతయ్య, నానమ్మతో కలిసి రూమ్‌లో ఉండు' అంటుంది. దీంతో దివ్య 'వామ్మో నేను తాతయ్య రూమ్‌లో ఉండను. నేను కూడా నీతో పాటే హాల్‌లో ఉంటానులే' అని ఒప్పుకుంటుంది

తులసి ఇంటికి నందూ, లాస్య రాక

తులసి ఇంటికి నందూ, లాస్య రాక

అందరూ కొత్త ఇంటికి చేరుకున్నా సామాన్లు మాత్రం రావు. దీంతో వాళ్లకు ఫోన్ చేయమని తులసి.. అభికి చెప్తుంది. అంతలోనే అక్కడకు నందూ, లాస్య చాలా కోపంతో వస్తారు. వాళ్లను చూసి తులసితో పాటు అందరూ షాక్ అవుతారు. అప్పుడు పరందామయ్య 'అమ్మా తులసి ఇంటికి అతిథులు వచ్చారు.. మంచినీళ్లు కావాలేమో కనుక్కో అమ్మ' అంటాడు. దీనికి నందూ 'మీ మాజీ కోడలు గొప్పదనం గురించి కాసేపు మాట్లాడుకుందాం. ప్రాణం పోయినా ఇల్లు కాపాడుతాను.. మామయ్య గారి ఇల్లు కాపాడుకుంటాను అని వీర లేవల్లో రెచ్చిపోయింది కదా. మరి ఇప్పుడెందుకు వీరభవనం నుంచి పెంకుటిళ్లుకు తీసుకొచ్చింది. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు మా అమ్మానాన్నను తీసుకొచ్చి ఇక్కడ పడేశావు. అంతే కదా నువ్వు చేసింది' అని గొడవ పడతాడు.

నందూను బాగా రెచ్చగొట్టిన లాస్య

నందూను బాగా రెచ్చగొట్టిన లాస్య

తులసిపై నందూ గొడవ పడుతుండగానే లాస్య కూడా సీన్‌లోకి వస్తుంది. 'తులసి చాలా చేసింది. ఇప్పటికే నిన్ను.. మీ అమ్మానాన్నలతో విడదీసింది. ఇప్పుడు నన్ను, నీతో విడదీసేందుకు ప్లాన్ చేసింది. ఆ విషయమే నాకు చెప్పింది కూడా. నీ చుట్టూ నీ సైనికులు చాలా మంది ఉన్నారు. నాకు ఉన్నది నా నందూ ఒక్కడే. కలలో కూడా నా నందూ నన్ను వదిలిపెట్టనని మాటిచ్చాడు' అంటూ రెచ్చగొడుతుంది. అప్పుడు తులసి 'మరి నాకు వేదమంత్రాల సాక్షిగా మాటిచ్చి వదిలేశాడు కదా. యుద్ధభూమి నుంచి పారిపోయిన పిరికివాడికి.. చివరి వరకు పోరాడిన సైనికుడిని ప్రశ్నించే అధికారం ఉండదు' అంటూ ధీటుగానే బదులిస్తుంది.

నందూకు తల్లిదండ్రులు బిగ్ షాక్

నందూకు తల్లిదండ్రులు బిగ్ షాక్

ఒకవైపు నందూ, మరోవైపు లాస్య తులసిపై గొడవ పడుతూ ఉంటారు. కానీ, ఆమె మాత్రం అస్సలు తగ్గకుండా సరైన పాయింట్లతో వాళ్లను మరింత ఇబ్బంది పెడుతుంది. ఇక, చివరికి నందూ.. తన తల్లిదండ్రులను తీసుకెళ్లడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు అనసూయ 'మేము ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నాం. మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేయకండి. దయచేసి వెళ్లిపోండి' అంటూ నందుపై సీరియస్ అవుతుంది. పరందామయ్య కూడా 'ఇలా ఫోర్స్ చేస్తేనే వృద్ధాశ్రమంలో చేరాం. ఇంకా ఫోర్స్ చేస్తే అంతకంటే కఠినమైన నిర్ణయం తీసుకుంటాను' అని బెదిరిస్తాడు.

ప్రేమ్, శృతి ఎంట్రీ.. నందూ ఫైర్

ప్రేమ్, శృతి ఎంట్రీ.. నందూ ఫైర్

వీళ్ల మధ్య గొడవ జరుగుతుండగానే ప్రేమ్, శృతి ఇద్దరూ అక్కడికి వస్తారు. అప్పుడు నందూ, లాస్యకు తారసపడతారు. ప్రేమ్‌ను చూసి నందూకు మరింతగా కోపం వస్తుంది. అప్పుడతను 'మనం కలిసి ఉన్నప్పుడు ప్రేమ్‌ను పిలిపిద్దామంటే వద్దన్నావు. ఇప్పుడు మాత్రం నీ చిన్నకొడుకును పిలిపించుకున్నావా' అని ప్రశ్నిస్తాడు. దీనికి లాస్య 'ఎప్పటికైనా వాళ్లు వాళ్లు ఒక్కటి.. మనమే పరాయి వాళ్లం' అంటుంది. అప్పుడు నందూ మీరే కట్టకట్టుకొని ఊరేగండి అంటూ లాస్యను తీసుకుని వెళ్లిపోతాడు. అప్పుడు తులసికి కూడా ప్రేమ్, శృతిని చూసి బాగా కోపం వస్తుంది.

తులసి.. ప్రేమ్ మధ్య వాగ్వాదం

తులసి.. ప్రేమ్ మధ్య వాగ్వాదం

ప్రేమ్, శృతి రావడం చూసిన తులసి 'అభి.. వాళ్లను నా కళ్ల ముందు నుంచి వెళ్లిపోవాలని చెప్పు. లేకపోతే నేనే గెంటేస్తాను అని చెప్పు' అంటుంది. అప్పుడు శృతి 'ఆంటి మేము ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. ప్రేమ్ మీ మీద దిగులు పెట్టుకున్నాడు. మీరు ఇల్లు పోగొట్టుకున్నందుకు బాధపడ్డాడు. మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాడు' అంటుంది. అప్పుడు తులసి 'వాడి బతుకు వాడిని బతకమను' అంటుంది. దీంతో ప్రేమ్ 'నేను చేతగానివాడిని ఒప్పుకుంటాను కానీ.. నేను నీ కొడుకును. అమ్మ బాధలో ఉన్నప్పుడు పక్కనే ఉండాలనుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా' అని ప్రేమ్ ప్రశ్నిస్తాడు.

తల్లితో పెద్ద సవాల్ చేసిన ప్రేమ్

తల్లితో పెద్ద సవాల్ చేసిన ప్రేమ్

కోపంతో ఉన్న తులసి 'శృతి నిన్ను కలిసినప్పుడే స్పష్టంగా మళ్లీ బంధాలు కలుపుకోకండి అని చెప్పాను. మళ్లీ వాడిని ఎందుకు తీసుకొచ్చావు' అని అడుగుతుంది. దీనికి ప్రేమ్ 'శృతి నన్ను తీసుకురాలేదు.. నేనే శృతిని తీసుకొచ్చాను అమ్మ' అంటాడు. దీంతో 'వద్దు నన్ను అమ్మ అని పిలవొద్దు. వీడు ఎదగకపోవడానికి కారణం నా పెంపకం అని నా మీద చెడు ముద్ర పడింది. వీడు ఎదగాలి. అప్పుడే నా మీద ఉన్న ముద్ర చెరిగిపోవాలి. అప్పటి వరకు నేను వాడిని క్షమించను' అంటుంది తులసి. దీంతో ప్రేమ్ 'ఎదిగాకే నేను మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెడతాను. నీ మీద నా కారణంగా పడిన ముద్రను చెడిపేశాకే నేను నీ బిడ్డను అని చెప్పుకుంటాను. అప్పటికైనా క్షమిస్తావు కదా' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X