Intinti Gruhalakshmi: ఆమెపై నందూకు డౌట్.. తప్పించుకున్న ప్రియ.. పెళ్లికి ముందే ఊహించని విధంగా!
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బసవయ్య రెచ్చగొట్టడంతో విక్రమ్ నా జీవితంలోకి ఎవరు వచ్చినా అమ్మ స్థానం తర్వాతే. నాకు అమ్మ మాట తర్వాతే ఏదైనా అంటాడు. ఆ తర్వాత విక్రమ్ తండ్రి దగ్గరకు వెళ్లగా ఆయన ఎమోషనల్ అవుతాడు.
మరోవైపు నందూ.. దివ్యను చూసి ఎమోషనల్ అవగా.. ఆమె కూడా ఏడ్చేస్తుంది. అలా పెళ్లి ఇంట్లో అందరూ ఈ సీన్స్ చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. ఇక, ప్రియ ఎలాగైనా ఫోన్ చేసి దివ్యకు అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. అంతలోనే రాజ్యలక్ష్మి అక్కడకు వచ్చి ఆమెను బంధించాలని అనుకుంటుంది.
ప్రియ కిడ్నాప్.. వార్నింగ్ ఇచ్చి: ప్రియతో రాజ్యలక్ష్మి 'ఆ దివ్య ఈరోజే మొగుడుతో సరసాలు ఆడుతూ సంతోషంగా ఉండేది. రేపటి నుంచి ఆ సంతోషాన్ని నేను దూరం చేస్తాను' అంటుంది. దీంతో ప్రియ బాధ పడుతూ 'మీ కాళ్లు పట్టుకుంటాను అత్తయ్య' అని బ్రతిమాలుతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'ఈ పని నువ్వు ఇప్పుడు కాదు.. సంజయ్‌ను పెళ్లి చేసుకోక ముందు చేయాల్సింది.
నన్ను పిచ్చిదాన్ని చేసే ఆడించారు. ఇప్పుడు నువ్వు అది ఇద్దరు కలిసి అనుభవించండి' అంటుంది. తర్వాత పని మనిషిని పిలిచి 'నేను చెప్పే వరకు దీన్ని ఇక్కడే బంధించండి పొరపాటున తెరిస్తే ఏమవుతుందో తెలుసు కదా' అని వార్నింగ్ ఇస్తుంది.

ముందుగానే వచ్చేసిన దివ్య: తులసి వాళ్ల ఫ్యామిలీ కల్యాణ మండపానికి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ వచ్చి దివ్య కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పటికే ఆమె కారులో వచ్చి కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. దీంతో దివ్యను ప్రేమ్ ఆట పట్టిస్తాడు.
ఆ సమయంలో దివ్య 'మీరు నన్ను మర్చిపోతారేమో అనుకుని వచ్చి ముందే కూర్చున్నాను' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'నువ్వు వచ్చి కూర్చున్నా పర్లేదు. కానీ, ఇక్కడ కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉంటావా' అని సరదాగా అడుగుతాడు. వీళ్లిద్దరి గొడవను చూసి ఇంట్లో వాళ్లు అందరూ విపరీతంగా నవ్వుకుంటూ ఉంటారు.
మంగళసూత్రం మర్చిపోయి: పెళ్లికి సమయం దగ్గర పడడంతో అందరూ కారు ఎక్కి కూర్చుంటారు. ఆ సమయంలోనే లాస్య కవర్ తీసుకుంటాననగా ఆమె వద్దంటుంది. అప్పుడు నందూ, తులసి ఒకేసారి మంగళసూత్రం పెట్టారా అని అడుగుతారు. దీంతో తులసి 'మంగళసూత్రం దేవుడి గదిలో పెట్టాను. ఒక్క నిమిషం ఉండండి వెళ్లి తీసుకుని వస్తాను' అని అంటుంది.
మరోవైపు.. అందరూ తమ వస్తువులు అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అనసూయ కారు ముందు కొబ్బరికాయ కొట్టగా.. పరందామయ్య ఆమెను ఆటపట్టాస్తాడు. అలా అందరూ సంతోషంగా మాట్లాడుకుంటారు.

ఏంటి నందూ ముద్దొచ్చానా?: తులసి మంగళసూత్రం తీసుకు రావడానికి వెళ్లగా.. నందూ అప్పుడే కంగారుగా వచ్చి 'తులసి కనిపించిందా? ఇంకా రాదేంటి' అని అడుగుతాడు. దీంతో పక్కనే ఉన్న లాస్య 'ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో' అని మనసులో అనుకుంటుంది.
ఇంతలో తులసి వచ్చి నందూతో ఎందుకు పిలిచారు అని అడగ్గా మర్చిపోయాను అంటాడు. అప్పుడు లాస్య 'చూడాలనిపించి పిలిచి ఉంటావులే' అనుకుంటూ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత మగపెళ్లి వారు రావడంతో వెళ్లి సంతోషంగా వాళ్ళని పీల్చుకొని వస్తాను అంటూ వెళ్లిన లాస్య అందరికీ స్వయంగా మర్యాద చేస్తుంది.
లాస్యపై నందూకు సందేహం: అందరినీ కల్యాణమండపంలోకి పిలిచిన తర్వాత నందూ లాస్య వైపే చూస్తూ ఉంటాడు. దీంతో ఆమె కంగారుగా అక్కడకు వచ్చి 'ఏంటి నందూ.. అలాగే చూస్తున్నాం ముద్దొస్తున్నానా' అని అడుగుతుంది.
దీంతో నందూ 'ఎందుకు నువ్వు రాజ్యలక్ష్మితో రాసుకుపోసుకు తిరుగుతున్నావు? డబ్బున్నాయి కదా అని ఎక్కువ రాసుకుపోసుకొని తిరిగి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మర్యాదగా ఉండదు' అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో లాస్య 'కొంపదీసి నందూకు ఏమైనా డౌట్ వచ్చిందా ఏంటి? ఏమైనా పెళ్లయ్యే అంత వరకే కదా' అంటుంది.

ప్రియ బాధగా.. బ్రతిమాలుతూ: రాజ్యలక్ష్మి గదిలో కిడ్నాప్ చేసి ఉంచడంతో ప్రియ.. దివ్యను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. దీంతో తనను వదిలేయమని గదిలో నుంచే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసినా పని మనుషులు ఏమీ చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటారు.
అప్పుడు ప్రియ 'అక్కడ ఆడపిల్లకు అన్యాయం జరుగుతోంది. మీరు బయట ఉన్నారని నాకు తెలుసు. ప్లీజ్ తలుపులు తీయండి. ప్లీజ్ కాంతం నేను ఒకసారి చెప్పేది విను' అంటూ బ్రతిమాలుతుంది. కానీ వాళ్లు మాత్రం సహాయం చేయడానికి ఒప్పుకోరు. ఇక, కల్యాణమండపంలో పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతుంటాయి.
ప్రియకు పనిమనిషి సాయం: కళ్యాణ మండపంలో విక్రమ్ ఒకవైపు, దివ్య వాళ్లు కలిసి పూజ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత విక్రమ్‌ను దేవుడు ఆటపట్టిస్తూ ఉండగా.. బసవయ్య మాత్రం రాజ్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటాడు. అలా పెళ్లికి సమయం దగ్గర పడుతూ ఉంటుంది.
అప్పుడే గదిలో ఉన్న ప్రియ 'ఈ పెళ్లిని నేను ఆపలేను కాబట్టి నా ఊపిరి నేను ఆపేస్తాను. నా ప్రాణాలు తీసుకుంటాను' అని బెదిరిస్తుంది. దీంతో వాళ్లు ప్రాణం తీసుకోవడం ఏంటమ్మా అని డోర్ తీయగా ప్రియ బయటకు వచ్చి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











