Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు ఊహించని ఆఫర్.. అభితో గాయత్రి కన్నింగ్ ప్లాన్
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య న్యూడిల్స్ చేయడంపై కోపంగా ఉన్న నందూ లాస్యకు క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత అద్దె ఇంట్లో అందరూ ఇబ్బందులు పడుతూ కనిపిస్తారు. ముఖ్యంగా దివ్య తనకు చదువుకోవడం కుదరడం లేదని అంటుంది. అలాగే, ఇంట్లో వాళ్లందరూ తమ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. అంతలో గాయత్రి అక్కడకు వస్తుంది. అప్పుడు అంకిత ఇల్లు తుడుస్తూ కనిపిస్తుంది. దీంతో ఆమెకు కోపం వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. అయితే, అంకిత మాత్రం తన తల్లికి ఎదురు తిరుగుతుంది. దీంతో ఆమె కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

వాళ్లను అంటే మీరు ఊరుకుంటారా
గాయత్రి వచ్చి వెళ్లిన తర్వాత తులసి.. అంకితను మందలిస్తుంది. అప్పుడామె 'ఆంటి నేను ఒంటరిగా లేను. అత్తారింట్లో కోడలుగా ఉన్నాను. మా అమ్మ ఎంతో మీరూ అంతే. ఇంత వయసు వచ్చాక మా అమ్మకు ఇది నేను నేర్పించాలా. నిజంగా ఈ ఇంట్లో అందరం పస్తులు ఉంటున్నామంటే.. నా ఒక్కదాని కడుపు నింపితే ఎలా' అంటుంది. అప్పుడు తులసి 'ఇదే విషయాన్ని నెమ్మదిగా కూడా చెప్పొచ్చు కదా' అంటుంది. దీనికి అంకిత 'ఒక్క విషయం చెప్పండి ఆంటి.. మీ అత్తామామలను ఎవరైనా ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా' అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి ప్రేమ్ లాగానే.. అంకిత కూడా ఇలాగే మొండిగా మాట్లాడుతోంది అని అనుకుంటుంది తులసి.

తులసి కోసం ఇంటికి వచ్చిన తల్లి
అంకితతో తులసి మాట్లాడుతుండగా వాళ్ల అమ్మ అక్కడకు వస్తుంది. దీంతో తులసి ఆమెను చూసి సంతోషిస్తుంది. అప్పుడు అంకిత ఎదురుగా కనిపిస్తేనేనా ఆపేక్ష. అమ్మ దగ్గరికి వెళ్లాలి.. చూడాలి అనిపించలేదా అని అడుగుతుంది. దీనికి తులసి 'నేనేంటో.. నేను ఉన్న పరిస్థితి ఏంటో మా అమ్మకు బాగా తెలుసు' అంటుంది. ఇంతలో దివ్య వచ్చి అమ్మమ్మ అని పలకరిస్తుంది. ఏరోజు చివరి రోజు అవుతుందో తెలియదు. అందరినీ చూడాలనిపిస్తోంది అని అంటుంది తులసి తల్లి. తర్వాత ఇంట్లోకి వెళ్తుంది. అనసూయ, పరందామయ్య అందరూ తనను పలకరిస్తారు. తనకు రాసి పెట్టి ఉంది జరిగింది.. అనుభవించాల్సి ఉంది.. అనుభవిస్తుంది అని చెబుతుంది తులసి తల్లి.

తులసిపై అత్తమామల ప్రశంసలు
తులసి తల్లితో పరందామయ్య, అనసూయ 'తులసి మమ్మల్ని కన్నకూతురుగా చూసుకుంటుంది. అమ్మలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎలా తన రుణం తీసుకోవాలి' అంటారు. అప్పుడామె 'మీరు గుర్తొచ్చినప్పుడల్లా నాకు అసూయగా ఉంటుంది. మిమ్మల్ని తులసి నాకన్నా బాగా చూసుకుంటుంది' అంటుంది. అప్పుడు తులసి 'కష్టాలు నాకు కొత్త కాదు. వాటిని ఎలా ఎదుర్కోవాలో మా అమ్మే నాకు నేర్పించింది' అని చెబుతుంది. అంతేకాదు, తాను ఎదుర్కొంటోన్న సమస్యలు, కష్టాల గురించి తన తల్లి దగ్గర మనసు విప్పి మాట్లాడుతుంది తులసి.

ప్రేమ్‌కు అదిరిపోయే అవకాశం
షూటింగ్ విషయంపై మప్పి లహరి దగ్గరికి డైరెక్టర్ వస్తాడు. అనుకున్న సమయానికి నాకు సాంగ్ కావాలి.. అంటూ డిమాండ్ పెడతాడు. దీంతో ఇప్పటికిప్పుడు ఎవరు పాట రాస్తారు అని మప్పి లహరి అనుకుంటాడు. అక్కడే ప్రేమ్ ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ టెన్షన్ పడుతుంటే.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అంటాడు. ఏం చేయాలో హరికి అర్థం కాదు. సిచ్యుయేషన్ చెప్పండి.. నేను పాట రాస్తాను అంటాడు. సరే అని సిచ్యుయేషన్ చెబుతాడు. ఒకవేళ రేపు ఉదయం వరకు నువ్వు పాట రాయకపోతే మళ్లీ నాకు కనిపించకు అంటాడు. ఒకవేళ వీడు పాట బాగా రాస్తే.. దాన్ని మనం నొక్కేసి మన పేరు అచ్చేయించుకుందాం అనుకుంటాడు.

అభిని రహస్యంగా కలిసిన అత్త
అంకిత కష్టాలు చూసిన గాయత్రి.. అభిని సీక్రెట్‌గా కలుస్తుంది. అప్పుడామె 'నా కూతురు మీ ఇంటి కోడలుగా కష్టాలు పడుతోంది. అది నేను చూడలేకపోతున్నాను' అంటుంది. దీనికి అభి 'అంకితను మా అమ్మ కన్న కూతురులా చూసుకుంటోంది' అంటాడు. కానీ, గాయత్రి 'నా కూతురు పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. నా దగ్గర కావాల్సినంత ఆస్తి ఉంది.. పలుకుబడి ఉంది కానీ, దాని కోసం ఏం చేయలేకపోతున్నాను. ఈ అమ్మ మనసు తెలుసుకోకుండా నన్ను ఒక శత్రువులా చూస్తోంది' అంటుంది. ఈ సమస్యకు పరిష్కారం లేదంటాడు అభి.

అభికి ఆఫర్ ఇచ్చిన గాయత్రి
అభి మాటలకు గాయత్రి మాట్లాడుతూ... 'ఈ సమస్యకు పరిష్కారం ఉంది. మీరిద్దరూ ఆ ఇల్లు వదిలి మా ఇంటికి రండి' అంటుంది. దీంతో అది కుదరదు అంటాడు అభి. అంతేకాదు, 'కిందటి సారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చేసిన అవమానాలు నాకు ఇంకా గుర్తున్నాయి. అవి నేను అంత ఈజీగా మరిచిపోలేను' అంటాడు. అప్పుడు గాయత్రి 'సరే.. ఇంకొక పరిష్కారం చెబుతాను. అంకిత పేరు మీద త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నా. ఇవి ఫ్లాట్ కీస్. వాటిని తీసుకొని మీరు ఇద్దరు ఆ ఫ్లాట్‌లో ఉండండి' అని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











