Intinti Gruhalakshmi Today Episode: అభికి గాయత్రి ఊహించని ఆఫర్.. ఆఫీస్‌లో అమ్మాయికి ప్రేమ్ ప్రేమలేఖ
భారతదేశంలోని చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గాయత్రితో గొడవ పడి పంపేసిన అంకితకు తులసి క్లాస్ పీకుతుంది. కానీ, తనకు అత్తగారే ఎక్కువని ఆమె బదులిస్తుంది. ఇక, తులసి కోసం ఆమె తల్లి ఇంటికి వస్తుంది. అప్పుడు తన బాధలన్నీ తల్లికి చెప్పుకుంటుంది. ఆ సమయంలోనే తులసిపై పరందామయ్య, అనసూయ ప్రశంసలు కురిపిస్తారు. మరోవైపు, అభి, అంకితను తులసికి దూరం చేయాలని గాయత్రి ప్లాన్ చేస్తుంది. అందుకోసం అతడికి ఇంటి తాళం ఇచ్చి వెళ్లాలని అడుగుతుంది. ఇక, ప్రేమ్‌కు పాట రాసే అవకాశం దక్కుతుంది. దీంతో అతడు సంతోషిస్తాడు.

అభికి ఫ్లాట్ ఆఫర్ ఇచ్చిన గాయత్రి
తులసి ఇంట్లో నుంచి అంకితను బయటకు తీసుకు రావలన్న ఉద్దేశంతో అభిని గాయత్రి సీక్రెట్‌గా కలుస్తుంది. అప్పుడు అతడికి కొత్త ఫ్లాట్‌కు సంబంధించిన తాళాలను ఇవ్వబోగా.. అభి వద్దని అంటాడు. అప్పుడామె 'మీరు మీ అమ్మ దగ్గర ఉండక్కర్లేదు.. నా దగ్గర ఉండక్కర్లేదు. హ్యాపీగా చిలకాగోరింకల్లా ఆ ఫ్లాట్‌లో ఉండండి. నేను మీకు దూరంగా ఉంటాను. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. అంతేకాదు అభి మీ ఇద్దరి కోసం నేను చాలా ప్లాన్ చేశాను. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తాను. సొంతంగా హాస్పిటల్ కూడా కట్టిస్తాను. నన్ను నమ్ము అభి' అంటుంది.

అభికి ఫ్లాట్ కీస్ ఇచ్చేసిన గాయత్రి
అభి మనసు మార్చాలని ప్రయత్నించిన గాయత్రి 'నాకు తెలుసు.. అంకిత ఈ ప్రపోజల్‌కు ఒప్పుకోదు. తను అడ్డు పడుతుంది' అంటుంది. దీంతో అంకితకు ఇష్టం లేని పని నేను చేయను అంటాడు అభి. అప్పుడు గాయత్రి 'నాకు నా బిడ్డ మీద ఎంత ప్రేమో.. నీకు నీ తల్లి మీద అంత ప్రేమ. కానీ, ఈ బంధాలు నీకు ప్రేమను పంచిస్తాయేమో కానీ, ఎదగడానికి ఉపయోగపడవు. ఆలోచించు.. ఈ కీస్ నీ దగ్గర ఉంటే.. నేను చెప్పిన విషయం గురించి నువ్వు ఓ క్లారిటీ తెచ్చుకోవచ్చు. నీ ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటాయి' అంటూ అభి మనసు మార్చే ప్రయత్నం చేస్తోంది.

అభికి అగ్నిపరీక్ష.. టైమ్ కావాలని
అభి ఎంత చెప్పినా వినిపించుకోని గాయత్రి.. అతడినే తన దారిలోకి తెచ్చుకునేలా మాట్లాడుతుంది. అంతేకాదు, ఆ ఫ్లాట్ తాళాన్ని అతడి చేతిలో పెట్టేస్తుంది. అప్పుడు 'నిర్ణయం తీసుకునే వరకు ఈ విషయం అంకితకు చెప్పకు అడ్డుపడుతుంది' అంటూ కండీషన్ పెడుతుంది. దీంతో అభి 'మామ్ మాట దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని నాకు ఎందుకు ఈ అగ్ని పరీక్ష. నన్ను దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు' అని మనసులో అనుకుంటాడు. తర్వాత నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి ఆంటి అని చెప్పి వెళ్లిపోతాడు.

తాళం చూసి అభితో అంకిత ఫైట్
గాయత్రితో మాట్లాడిన తర్వాత అభి ఇంటికి వస్తాడు. జేబులో నుంచి కర్చీఫ్ తీస్తుండగా గాయత్రి ఇచ్చిన తాళం కిందపడుతుంది. దాన్ని అంకిత చూసేస్తుంది. అప్పుడామె 'నాకు చెప్పకుండా మా అమ్మను ఎందుకు కలిశావు' అని ఫైర్ అవుతుంది. దీంతో అభి 'తనే కలవమన్నారు. ఆంటి నీకు చెప్పకుండా రమ్మన్నారు' అని బదులిస్తాడు. అప్పుడు అంకిత 'నా మనసులో ఏం ఉందో కూడా నీకు తెలుసు. అయినా కూడా నువ్వు వెళ్లావంటే ఏమనుకోవాలి. ఇంటికొచ్చి భయపెట్టింది.. బెదిరించింది.. కుదరకపోయేసరికి.. నిన్ను పిలిచిందా' అని అడుగుతుంది.

తులసిని వదిలిపెట్టనన్న అంకిత
గాయత్రిని అభి కలవడంపై అంకిత చాలా కోపంగా ఉంటుంది. ఆ సమయంలో అతడితో తీవ్ర స్థాయిలో గొడవ పెట్టుకుంటుంది. వీళ్ల గొడవను తులసి దూరం నుంచి వింటుంది. అప్పుడు అంకిత మా అమ్మ మాట వినొద్దు అని అభికి సలహా ఇస్తుంది. కానీ, అభి వినడు. దీంతో 'నీ ఉద్దేశం ఏంటి.. ఇంట్లో నుంచి వెళ్లిపోదామనా' అని ప్రశ్నిస్తుంది. దీనికి అభి మా అమ్మ నాకు ఒక్కసారి కాదు.. రెండు సార్లు జన్మనిచ్చింది అంటాడు. ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకో. నేను మాత్రం ఆంటీని వదిలి ఎక్కడికీ వెళ్లేది లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

శృతి హెల్ప్‌తో పాట రాసిన ప్రేమ్
మప్పీ లహరి కోసం ప్రేమ్ పాట రాయడానికి కూర్చుంటాడు. కానీ, అతడికి ఐడియాలు తట్టవు. అప్పుడు శృతి అక్కడికి వెళ్తుంది. ఏం రాస్తున్నావు అని అడుగుతుంది. లవ్ లెటర్ రాస్తున్నా అని అంటాడు. దీంతో నాకోసమా అంటుంది. అప్పుడు ప్రేమ్ 'కాదు, నీకు ఎవరు రాస్తారు. పెళ్లానికి ఎవ్వరు లవ్ లెటర్ రాస్తారు. మా ఆఫీసులో ఒక అమ్మాయి నచ్చింది. తనకోసమే రాస్తున్నా' అంటాడు. దీంతో శృతికి కోపం వస్తుంది. ఆ తర్వాత అసలు విషయం చెబుతాడు ప్రేమ్. కాన్సెప్ట్ చేప్పడంతో శృతి పెళ్లి కూతురు.. అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చెబుతుంది. అంత భయంలోనూ ధైర్యం కోసం అమ్మాయి ఆ అపరిచితుడి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది అంటుంది. దీంతో ప్రేమ్‌కు ఆలోచన వచ్చి పాటను పూర్తి చేసేస్తాడు.

తల్లి బిడ్డల బంధానికి అర్థం లేదా
ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో కష్టాలు వస్తుండడంతో తులసి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆమె దగ్గరకు కూతురు దివ్య వస్తుంది. వచ్చీ రావడమే ఏమైంది మామ్ అంటూ తల్లిని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'అమ్మ ప్రేమ బిడ్డకు పాలు ఇచ్చి పెంచడం వరకే. నడక నేర్పించి సరైన దారి చూపించేవరకే' అంటూ ఏదేదో మాట్లాడుతుంది. దీంతో దివ్య 'తల్లిబిడ్డల బంధానికి అర్థం లేదా మామ్' అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











