Intinti Gruhalakshmi: పెళ్లి తర్వాత షాకిచ్చిన విక్రమ్.. కత్తితో పొడుచుకున్న దివ్య.. అంతలోనే ట్విస్ట్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode April 18th 2023

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్ పెళ్లి పీటల మీద ఉన్న సమయంలోనే కన్యాదానం చేయడానికి నందూను రమ్మని పిలుస్తారు. కానీ, దానికి లాస్య ఒప్పుకోదు. పైగా నందూను తులసితో పంపించనని మొండిపట్టు పడుతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి కూడా తనకు మంచే జరుగుతుంది అనుకుంటుంది.

అంతలోనే దివ్య మా అమ్మనాన్న కన్యాదానం చేయకపోతే పెళ్లి చేసుకోనని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో రాజ్యలక్ష్మి వెళ్లి లాస్యను బెదిరిస్తుంది. దీంతో చేసేందేంలేక లాస్య.. నందూను పంపిస్తుంది. ఆ తర్వాత ప్రియ కూడా కల్యాణ మండపం దగ్గరకు వస్తుంది.

జీవితం సర్వనాశనమే అని: దివ్య, విక్రమ్ పెళ్లి జరిగే గుడి దగ్గరకు వచ్చిన ప్రియ.. నందూను ముఖ్యమైన విషయం చెప్తానని పక్కకు తీసుకు వెళ్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి, లాస్య కలిసి వేసిన ప్లాన్ గురించి మొత్తం వివరించి చెబుతుంది. ఆ తర్వాత 'ఈ పెళ్లి కనుక జరిగితే దివ్య మేడం జీవితం సర్వనాశనం అవుతుంది అంకుల్.

ఈ గుడిలో నిల్చుని ప్రమాణం చేసి చెబుతున్నాను' అని అంటుంది. దీంతో నందూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత 'నో ఈ పెళ్లి జరగకూడదు. దివ్య మెడలో తాళి పడకూడదు. వెంటనే ఈ పెళ్లిని ఆపేయాలి' అంటూ గుడి లోపలికి పరుగులు తీస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode April 18th 2023

పెళ్లి ఆపలేకపోయిన నందూ: ప్రియ అసలు విషయం చెప్పిన వెంటనే నందూ పరుగు పరుగున లోపలికి వెళ్తుంటాడు. అప్పుడు తులసి.. 'నందగోపాల్ గారు కనిపించడం లేదేంటి? లాస్య ఆయనను ఎక్కడైనా చూశావా' అని అడుగుతుంది. దీనికామె 'నందూ ఉంటే నీ పక్కనే ఉంటాడు కదా. నాకేం తెలుసు' అని బదులిస్తుంది.

అలా తులసి అతడి గురించి వెతుకుతూ ఉండగానే.. నందూ పరుగులు పెడుతూ ఉండగానే విక్రమ్.. దివ్య మెడలో తాళిని కట్టేస్తాడు. ఆ సన్నివేశాన్ని చూసి అందరూ సంతోషిస్తూ ఉంటారు. కానీ, నందూ మాత్రం అప్పుడే వచ్చి పెళ్లి ఆపలేకపోయానని బాధ పడుతుంటాడు.

తనలో తానే కుమిలిపోతాడు: దివ్య పెళ్లి ఆపడంలో విఫలం అయిన నందూ తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు 'తులసి.. దివ్య జీవితం నాశనం అయిపోయింది. ఈ విషయం నీకు ఎలా చెప్పాలి' అంటూ బాధ పడుతూ అక్కడకు వెళ్తాడు. అప్పుడు తులసి 'ఎక్కడికి వెళ్లిపోయారండి? ఇవిగో అక్షింతలు పట్టుకోండి.

పిల్లలను దీవించండి' అంటూ నందు చేతికి అక్షింతలు ఇస్తుంది. దీంతో నందూ అవి తీసుకుని వాళ్లిద్దరినీ ఆశీర్వదిస్తాడు. ఆ సమయంలో కొత్త జంటను హైలైట్ చేసి చూపిస్తుంటారు. అప్పుడందరూ సంతోషంగా ఉంటారు. కానీ, నందూ మాత్రం లోలోపలే ఏడుస్తూ ఉంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode April 18th 2023

నందూ ఏడుపు.. ఓదార్చేలా: దివ్య జీవితం నాశనం అవుతుందని భయపడిపోతోన్న నందూ.. కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన తులసి 'ఏంటండీ.. ఎందుకంత దిగులు? ఆ కన్నీళ్లు ఎందుకు? మన కూతురుకి మనం గుర్తుండమనా' అని అడుగుతుంది. కానీ, నందూ మౌనంగానే ఉండిపోతాడు. అప్పుడే అనసూయ వచ్చి.. 'ఎందుకు నాన్నా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?

నీ కూతురు చూడు ఎంత సంతోషంగా ఉందో. నిన్ను చూస్తే అది కూడా ఏడుస్తుంది. నీ బాధని దిగమింగెయ్రా' అని ఓదార్చుతుంది. దీంతో నందూ 'నాకు అంతా అయోమయంగా ఉంది.. మీ మాట వినాలో నా మనసు చెప్పే మాట వినాలో అర్దం కావడం లేదు' అని అనుకుంటూ బాధ పడతాడు.

కత్తితో పొడుచుకున్న దివ్య: తాళి కట్టేసిన తర్వాత జరగాల్సిన తంతు మొత్తాన్ని చూపిస్తుంటారు. అప్పుడు కొత్త జంట ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలోనే నందూ మాత్రం ఓ కల కంటాడు. అందులో విక్రమ్ దివ్య మెడలో కట్టిన తాళి తన చేతులతోనే స్వయంగా విప్పేస్తాడు.

అంతేకాదు, రాజ్యలక్ష్మి, లాస్య పక్కన నిల్చుని తమ ప్లాన్ ఇదేనంటూ చెప్తాడు. దీంతో మోసపోయానని గ్రహించిన దివ్య 'నా జీవితం నాశనం అయిపోయింది నాన్నా.. ఇక నేను బతకడం వేస్ట్' అంటూ చాకుతో పొడుగుచుకుంటుంది. దీంతో ఒక్కసారిగా తేరుకున్న నందూ.. ఆ పీడకల నుంచి బయటకు వచ్చేస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode April 18th 2023

అలా ట్విస్ట్ ఇచ్చిన విక్రమ్: పెళ్లి అయిపోయిన తర్వాత విక్రమ్, దివ్య కలిసి తమను ఆశీర్వదించమని నందూ దగ్గరకు వస్తారు. ఆ సమయంలో దివ్య 'ఏంటి నాన్న ఇంత దిగాలుగా ఉన్నారు' అని అడుగుతుంది. అప్పుడు విక్రమ్ 'అల్లుడు మా కూతుర్ని మీ అంత బాగా చూసుకుంటారో లేదో అని దిగులుపడుతున్నారు అంతే కదా మామయ్యా.

ఖచ్చితంగా మీ అంత ప్రేమగా చూసుకోను' అని గ్యాప్ ఇస్తాడు. దీంతో అంతా షాక్ అవుతారు. ఆ తర్వాత విక్రమ్ 'మీ అంత ప్రేమగా చూసుకోను. మీ కంటే ప్రేమగా చూసుకుంటాను. మీకేమైనా అభ్యంతరమా' అని ట్విస్ట్ ఇవ్వగా అంత నవ్వుతారు.

నమ్మకం లేదంటే చెప్పు: విక్రమ్ మాటలకు రాజ్యలక్ష్మి మాత్రం కోపంగా చూస్తుంది. అప్పుడు నందూ 'నాకు కావాల్సింది నోటి మాట కాదు.. చేతిలో చేయ్యేసి ఇచ్చే మాట.. నా కూతుర్ని బాగా చూసుకుంటానని మాటివ్వు అల్లుడు' అని అడుగుతాడు. దీంతో విక్రమ్ ప్రామిస్ చేస్తుండగా రాజ్యలక్ష్మి 'చేతిలో చేయి వేసి మాట ఇవ్వడం పెద్ద విషయం కాదు.

కానీ ఆశ్చర్యం ఏంటంటే. అల్లుడు ఇచ్చిన మాటను పిల్లనిచ్చిన మామ నమ్మకపోవడం. ఏమ్మా దివ్యా.. విక్రమ్ మాటపై నమ్మకం లేదా? లేదంటే చెప్పు. అప్పుడు మీ నాన్న చేతిలో చేయి వేసి మాట ఇస్తాడు' అని అంటుంది. ఆ మాటతో నందూ సరదాగా అన్నానని అంటాడు. తర్వాత దివ్య కూడా నందూను చూసి ఎమోషనల్ అవుతుంది. అనంతరం అప్పగింతలు జరుగుతాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X