Intinti Gruhalakshmi: బసవయ్య మాటకు విక్రమ్ షాక్.. దివ్యను చూసి మామలో చలనం.. రాజ్యలక్ష్మి ఇంటికి నందూ
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే: మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యపై పగ తీర్చుకునేందుకు రాజ్యలక్ష్మి వేసిన ప్లాన్ గురించి ప్రియ.. నందూకు చెబుతుంది. దీంతో అతడు పెళ్లిని ఆపేందుకు ప్రయత్నం చేయగా.. అది విఫలం అవుతుంది.
అంటే అప్పటికే దివ్య మెడలో విక్రమ్ తాళి కట్టేస్తాడు. అది చూసి నందూ చాలా బాధ పడతాడు. అంతేకాదు, తన మనసులోనే కూతురి భవిష్యత్ గురించి చింతిస్తూ ఉంటాడు. ఆ తర్వాత విక్రమ్‌తో తన కూతురిని మంచిగా చూసుకుంటానని ప్రామిస్ చేయమంటాడు. అయితే, అప్పుడు రాజ్యలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేయడంతో నందూ వెనక్కి తగ్గుతాడు.
గుండె బాదుకుంటూ ఏడ్చేశాడు: పెళ్లైన తర్వాత దివ్య ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి ప్రియ చెప్పిన మాటలను తలుచుకుంటూ నందూ కుమిలిపోతూ ఉంటాడు. ఒంటరిగా కారులో వెళ్తున్న అతడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఆ వెంటనే కారును ఎవరూ లేని ప్రదేశంలో ఆపుతాడు. అప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు. అంతేకాదు, తన కూతురు పరిస్థితి తలుచుకొని కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎలాగైనా దివ్యకు హాని జరగకుండా చూడాలని అనుకుంటాడు.

మీ అమ్మ కాదంటే ఏం చేస్తావు: విక్రమ్, దివ్య ఇంటికి రావడంతో అప్పుడు బసవయ్య 'అక్కా.. మీ పెద్ద కొడుకు తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకోవచ్చాడు సంతోషమేనా' అని ప్రశ్నిస్తాడు. దీనికామె 'వాడు నచ్చిన అమ్మాయిని కాదు.. నేను మెచ్చిన కోడల్ని తీసుకువచ్చాడు' అంటాడు. అప్పుడు బసవయ్య 'అక్కా.. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను నా అల్లుడుని ఒక ప్రశ్న అడుగుతాను' అని అంటాడు.
దీనికామె 'నా పర్మిషన్ ఎందుకు అడుగు' అని అంటుంది. దీంతో బసవయ్య 'అల్లుడు మీ అమ్మ ఒప్పుకుంది కాబట్టి దివ్యను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు ఒకవేళ మీ అమ్మ ఒప్పుకోకపోయి ఉంటే ఏమి చేసే వాడివి' అని సూటిగా ప్రశ్నిస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
మీ అమ్మనే చెప్పమను అంటూ: బసవయ్య అడిగిన ప్రశ్నకు బదులివ్వడానికి విక్రమ్ తడబడుతూ ఉండగా.. ఏంటి అల్లుడు ఆలోచిస్తున్నావు అంటాడు. దీనికతడు ఇది అవసరమా మామయ్య అంటాడు. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య 'నీకు నాకు అవసరం లేకపోవచ్చు. ఆయనకు చాలా అవసరం.
గుమ్మం దగ్గర అత్త కోడళ్ళ మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేసి సంతోషిద్దామని చూస్తున్నారు' అంటాడు. దీంతో బసవయ్య 'ఇదేంటి బాణం విసిరితే వచ్చి నాకే గుచ్చుకుంది' అనుకుంటాడు. దీంతో విక్రమ్.. తాతయ్య మౌనంగా ఉండండనగా.. ఆయన 'కాదని మీ అమ్మను చెప్పమను' అని అంటాడు.

పెళ్లాం కొంగు పట్టుకున్నాడని: దీంతో రాజ్యలక్ష్మి యాక్టింగ్ చేస్తూ ప్రేమగా మాట్లాడుతుంది. అంతేకాదు, నా బిడ్డలు ఎదురైన నేను కాదనను అంటూ కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మాటలు ప్రియా వెనకాలే ఉండి వింటూ ఉంటుంది. అప్పుడు బసవయ్య 'బుద్ధి తక్కువ ఆ మాట అడిగాను.. జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాము' అని అంటాడు.
అప్పుడు దివ్య విక్రమ్ ఒకరి పేర్లు ఒకరు చెప్పి ఇంట్లోకి వెళ్తారు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో బసవయ్య రాజ్యలక్ష్మిని రెచ్చగొడుతూ.. చూశావా అక్కా.. అప్పుడే వాడు ఇప్పుడే పెళ్ళాం కొంగు పట్టుకున్నాడు అనగా రాజ్యలక్ష్మికి కోపం వస్తుంది.
రెస్ట్ కావాలంటూ వెళ్లిపోతాడు: తులసి ఇంట్లో పంతులు దివ్య, విక్రమ్ మొదటి రాత్రికి ముహూర్తం పెడుతూ ఉంటారు. అప్పుడు పరందామయ్య జోకులు వేసి అందరిని నవ్విస్తాడు. అప్పుడు నందూ ఎక్కడ అని అనసూయ తులసిని అడగ్గా.. అక్కడే ఉన్న లాస్య 'నందు భార్యను నేను.. నన్ను అడగాలి' అంటుంది.
దీంతో నువ్వే చెప్పు అనగా.. నాకు తెలియదు అని బదులిస్తుంది. ఇంతలోనే నందూ వచ్చి.. అక్కడ వాళ్ళను పట్టించుకోకుండా లోపలికి వెళుతుండగా.. 'ఏంటి నందు అలా వెళ్ళిపోతున్నావు నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు' అంటారు. దీంతో నాకు రెస్ట్ కావాలి అంటూ వెళ్లిపోతాడు.
తులసి, నందూ కలిసెళ్లాలని: నందూ లోపలికి వెళ్లిపోతుండగా.. అనసూయ ఆపి అప్పుడే నీ పని అయిపోలేదు ఇంకా చాలా ఉంది.. ప్పుడే వెళ్ళిపోతే ఎలా ఇంకా కూతురి బాధ్యత ఇంకా తీరలేదు అని అంటుంది. అప్పుడు నందూ లోలోపల కుమిలిపోతుండగా.. తులసి ఏదో జరిగి ఉంటుంది అనుకుంటుంది.
అప్పుడు నందూ ఉన్నపలంగా ఒక్కసారి కళ్ళు తిరిగి కిందపడిపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు పంతులు ఈరోజు రాత్రికి మంచి ముహూర్తం ఉంది అనడంతో ఇంకెందుకు ఆలస్యం కానీచేద్దాం అని లాస్య అంటుంది. అప్పుడు తులసి ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడితే బాగోదు ఇంటికి వెళ్లి మాట్లాడొద్దామో బయలుదేరుదామా అంటాడు.
దివ్యను చూసి మామ హ్యాపీగా: దివ్య, విక్రమ్ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. అప్పుడు దివ్య పక్కనే ఉన్న కిటికీలను ఓపెన్ చేస్తుంది. అప్పుడు దివ్యను పరిచయం చేస్తూ నాన్న నీ కోడలు దివ్య అనగా ఆమెను చూసి ఆయన సంతోషపడుతుంటాడు. ఆ సమయంలోనే ఆయన 'నా పేరులోనే ప్రకాశం ఉందమ్మా. నా జీవితంలో లేదు' అని మనసులో అనుకుంటాడు. తర్వాత విక్రమ్.. వాళ్ళ నాన్నను చూసి 'దివ్య ఈ మధ్య కాలంలో మా నాన్నను ఎప్పుడు ఇంత సంతోషంగా చూడలేదు. నాన్న నీ కోడలు నచ్చిందా' అని అడగ్గా.. ఆయన తల ఊపుతాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











