Intinti Gruhalakshmi Today Episode: ఆశ్రమానికి వెళ్లి షాకిచ్చిన తులసి.. నందూతో ఆ మాట అనడంతో!
ఇండియాలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే చాలా కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య, అనసూయ ఇంట్లో నుంచి కనిపించకుండా పోయే సరికి నందూ, లాస్య తులసిపై నిందలు వేస్తుంటారు. అప్పుడు లాస్య నోటికొచ్చినట్లు మాట్లాడడంతో మాధవి ఆమె చెంప పగలగొడుతుంది. ఆ సమయంలో నందూను కూడా తిడుతుంది. మరోవైపు, తాతయ్య నానమ్మ కనిపించకపోవడంతో ప్రేమ్ నిరాశగా ఇంటికి వెళ్తాడు. ఇక, అభి, దివ్య తులసికి అన్న తినిపించే ప్రయత్నం చేయగా.. ఆమె నిరాకరిస్తుంది. ఆ తర్వాత లాస్య.. నందూను రెచ్చగొట్టాలని చూస్తుంటుంది. కానీ, అతడు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోడు.

ఆశ్రమంలో ఇద్దరికీ భారీ కష్టాలు
అనసూయ, పరందామయ్య ఇద్దరూ అనాథాశ్రమంలో చేరుతారు. అక్కడ వాళ్లు పెట్టే భోజనాన్ని తినలేకపోతారు. ఎందుకంటే వాళ్లకు తులసి వంట తప్పితే మరొకరు చేసింది నచ్చదు. కానీ, తప్పని పరిస్థితుల్లో ఆహారాన్ని తినాల్సి వస్తోంది. పరందామయ్యకు ముద్ద దిగక వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడు అనసూయ 'నాకు తెలుసు ఏమాత్రం రుచిగా లేకపోయినా మీరు తినలేరు. మీకు తులసి చేతివంట తప్పితే ఇంకేదీ నచ్చదు' అంటుంది. దీనికాయన 'నచ్చని పనులకు దూరంగా ఉండాలంటే.. నచ్చినవి వదులుకోవాల్సి వస్తుంది. ఇదే జీవితం అంటే' అంటాడు.

వాళ్ల గురించి తెలుసున్న ప్రేమ్
అనసూయ ఓదార్చుతున్నప్పుడు పరందామయ్య 'రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజును గడపాల్సిందే' అని చెబుతాడు. మరోవైపు, ప్రేమ్ తన తాతయ్య మొబైల్‌కు కాల్ చేస్తుంటాడు. కానీ, అది స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు శృతితో ఈ విషయం చెప్పి నిరాశ చెందుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ్‌కు ఫోన్ వస్తుంది. తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. అప్పుడు తాతయ్య వాళ్లు వృద్ధాశ్రమంలో ఉన్నారని చెబుతాడు. అప్పుడు ప్రేమ్ వెంటనే తులసికి ఫోన్ చేద్దామనుకుంటాడు. కానీ.. వద్దంటుంది శృతి. వెంటనే మాధవికి ఫోన్ చేసి వాళ్లు ఎక్కడున్నారో చెబుతాడు.

ఆశ్రమంలో తులసిని చూసి షాక్
ఆశ్రమంలో కష్టంగానే ఉంటోన్న పరందామయ్య, అనసూయ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడామె 'అయినా మనకు ఈ కర్మ ఏంటండి' అని అడుగుతుంది. అప్పుడాయన 'ఆ లాస్య పెట్టే కష్టాల ముందు ఇవేవీ పెద్ద కష్టాలు కాదు అనసూయ. మనకే ఈ కర్మ' అంటాడు. అప్పుడు అనసూయ 'మనం తులసి దగ్గర ఉంటే పువ్వుల్లో పెట్టి చూసుకునేది' అంటుంది. ఇంతలో అక్కడికి మాధవి, తులసి వస్తారు. దీనంగా ఉన్న వాళ్లను చూసి షాక్ అవుతారు. అప్పుడు తులసి మామయ్య అని పిలుస్తుంది. దీంతో తులసిని చూసి షాక్ అవుతాడు పరందామయ్య.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టానంటూ
తులసి, మాధవి వచ్చిన తర్వాత ప్రేమ్ కూడా అక్కడకు వస్తాడు. కానీ, దగ్గరకు వెళ్లకుండా వెనకాలే ఉంటాడు. అప్పుడు పరందామయ్య 'ఏమ్మా మేము ఇలా ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా. మా బతుకు మమ్మల్ని బతకనివ్వు' అంటాడు. దీనికి తులసి 'మీ అబ్బాయితో వెళ్లడం ఇష్టం లేకపోతే ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా. వాళ్ల నిర్ణయం తెలిసినా కూడా మనసు మార్చుకునేలా బలవంత పెట్టాను. కొడుకు దగ్గర ఉండే అదృష్టాన్ని ఇస్తున్నా అనుకున్నా కానీ.. వీళ్లను ఇంతలా బాధపెడుతున్నా అనుకోలేదు. నన్ను క్షమించండి' అంటుంది తులసి.

తులసి హామీతో వాళ్లు సంతృప్తి
తులసితో పరందామయ్య మాట్లాడుతూ.. 'వాడు నిన్ను వద్దు అనుకున్నప్పుడే కొడుకు మీద ఇష్టాన్ని కాదనుకున్నాం' అంటాడు. అప్పుడామె 'మీరు అనాథలు కాదు మామయ్య.. మీరు వెళ్లిపోతే మేము అనాథలం అయిపోతాం. మీరు రాకపోతే ఈ వృద్ధాశ్రమం ముందే దీక్ష చేస్తాను. మీరు నాతో వచ్చేంతవరకు నేను వదిలిపెట్టను. ఆపై మీ ఇష్టం. జీవితాంతం మీరు నాతోనే కలిసి ఉంటారు. మీ అబ్బాయితో నేను అస్సలు పంపను. నన్ను నమ్మండి. అలాంటి పరిస్థితే వస్తే.. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేస్తాను. సరేనా' అంటూ హామీని ఇస్తుంది.

ఇంటికి తిరిగొచ్చిన వాళ్లతో గొడవ
చివరికి తులసి పరందామయ్య, అనసూయను కన్విన్స్ చేసి ఇంటికి తీసుకుని వస్తుంది. అప్పుడు అందరూ వాళ్లను చూస్తుండగా.. పరదామయ్య 'మా అంతట మేము వెళ్లాం. మా అంతట మేము వచ్చాం. దయచేసి ఎవ్వరూ ఏ ప్రశ్నలూ అడక్కండి' అంటాడు. దీనికి నందూ 'చూడండి నాన్న.. మీరంతట మీరే గడప దాటారో లేక ఎవరైనా దాటించారో కానీ ఇది మాత్రం నాకు నచ్చలేదు' అంటాడు. అప్పుడు అనసూయ 'మాకు నచ్చిన పని చేస్తాం.. నచ్చినట్టు ఉంటాం' అంటుంది. దీనికి లాస్య 'అంత నిక్కచ్చిగా ఉండేవాళ్లు అయితే మీ నిర్ణయాన్ని తులసికి మొహమాటం లేకుండా చెప్పాల్సింది. మమ్మల్ని ఎందుకు మోసం చేశారు' అంటుంది.
Recommended Video


తులసిపై నందూ నిందలు వేస్తూ
పరందామయ్య మాటలకు నందూ 'మీ కొడుకుగా మీరు నా దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మాతో రండి' అంటాడు. కానీ, తులసి 'రాములమ్మ.. ఆ లగేజ్ తీసుకెళ్లి అత్తయ్య, మామయ్య గదిలో పెట్టు' అంటుంది. దీంతో నందూకు కోపం వస్తుంది. అప్పుడు తులసి.. నువ్వు మాకు చెప్పింది ఏంటి.. చేసేది ఏంటి అంటాడు నందూ. దీనికామె 'ముందు చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాను. ఇక వాళ్లు మీతో రారు. మీకు వెళ్లాలనిపిస్తే అది మీ ఇష్టం. వాళ్ల నిర్ణయాన్ని మీరు గౌరవించండి. మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను' అంటుంది. దీనికి లాస్య 'తులసి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని నేను చెబుతూనే ఉన్నాను నందూ. ఇప్పుడు చూశావా ఏమైందో' అని రెచ్చగొడుతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











