Intinti Gruhalakshmi: విక్రమ్ గురించి తెలిసిన నిజం.. దివ్య ఊహించని నిర్ణయం.. తులసికి చెప్పడంతో!

చాలా భాషలతో పోల్చుకుని చూస్తే.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన మీద తరచూ చిరాకు పడుతున్న సంజయ్‌ను ప్రియ ప్రశ్నిస్తుంది. అప్పుడే రాజ్యలక్ష్మి రావడంతో సంజయ్ తనకు సహాయం చేయాలని తల్లిని అడుగుతాడు. అంతలో అక్కడకు విక్రమ్ రావడంతో లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రియ, సంజయ్ ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది.

ఇక, రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లిన లాస్యకు ఆమె డబ్బు ఆఫర్ చేస్తుంది. దీంతో దివ్యకు, విక్రమ్‌కు పెళ్లి చేయమని రాజ్యలక్ష్మికి సలహా ఇస్తుంది. అలా చేస్తే దివ్య చెప్పినట్లు పడి ఉంటుందని అంటుంది. అలాగే, వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పేస్తుంది.

విక్రమ్‌ను చూసి షాకైన దివ్య

విక్రమ్‌ను చూసి షాకైన దివ్య

ఆస్పత్రిలో తన పని అయిపోగానే విక్రమ్‌కు ఫోన్ చేసిన దివ్య 'విక్రమ్ నా పని అయిపోయింది. నేను బయలుదేరుతున్నా. మీరు కూడా బయలుదేరండి' అని చెబుతుంది. దీంతో విక్రమ్ నేను బయట ఉన్నా.. సరే బయలుదేరుతా అంటాడు. ఆ వెంటనే దివ్య రూమ్‌లో నుంచి బయటకు వచ్చి నర్స్‌కు వెళ్లిపోతున్నానని చెబుతుంది. దీంతో ఆమె 'మేడం అక్కడ చెక్కులు ఇస్తున్నారు. పనిలో పనిగా మీరు కూడా తీసుకోండి. ఒక పని అయిపోతుంది' అని అంటుంది. దీంతో దివ్య అక్కడకు వెళ్లి చూడగా విక్రమ్ కనిపిస్తాడు. అప్పుడు ఇద్దరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.

దివ్యకు పెళ్లి సంబంధమని

దివ్యకు పెళ్లి సంబంధమని

ఇక, నందూ దగ్గరకు వచ్చిన తులసి 'బిజినెస్ బాగానే జరుగుతుందా నందగోపాల్ గారు' అని అడుగుతుంది. దీనికతడు బాగానే జరుగుతుంది అంటాడు. ఇంతలో పరంధామయ్య అక్కడికి రావడంతో కాఫీ కావాలా మావయ్య అని తులసి అడుగుతుంది. ఇంతలోనే లాస్య వచ్చి 'కాఫీ కాదు.. దివ్యకు పెళ్లి సంబంధం తీసుకుని రండి' అంటుంది. దీంతో నందూ.. లాస్య అని అరుస్తాడు. అప్పుడామె 'లాస్య అని అరవడం కాదు.. ముందు దివ్య కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొని రండి.

మొన్న నేను ఒక పెళ్లి సంబంధం తీసుకుని వస్తే కాదన్నారు. కనీసం మీరైనా ట్రైల్ చేయాలి కదా' అంటుంది. దీంతో తులసి ఇప్పుడు నీ సమస్య ఏంటి లాస్య అని అడగ్గా.. సమస్య కాదు తులసి.. దివ్య కోసం ఒక సంబంధం చూడాలి ఆ బాధ్యత లేదా అని ప్రశ్నిస్తుంది.

ఆ సంబంధం వద్దన చెప్పి

ఆ సంబంధం వద్దన చెప్పి

లాస్య మాటలకు తులసి 'సంబంధం చూడాలి అంటే దొరకాలి కదా' అంటుంది. దీంతో లాస్య 'వెతికితే దొరుకుతాయి. అందుకే నేను ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చాను' అంటుంది. దీనికి నందూ 'ఇప్పుడు రెండో పెళ్లి వాడా? మూడో పెళ్లి వాడా? లేకపోతే ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్నవాడా' అని వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు పరందామయ్యా 'నువ్వు ఆగరా.. తను చెప్పేది చెప్పనివ్వు.

అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి లాస్య' అని అడగ్గా.. 'కోట్లకు అధిపతి. నాలుగు తరాలు ఐనా కూర్చొని తినవచ్చు. హాస్పిటల్ ఉంది' అని చెప్పగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు నందూ అబ్బాయి చదువుకున్నాడా లేదా అనగా.. చదవలేదు అని చెబుతుంది. దీంతో నందూ అయితే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అంటాడు.

విక్రమ్‌పై దివ్య అసహనం

విక్రమ్‌పై దివ్య అసహనం

నిజం తెలుసుకున్న తర్వాత విక్రమ్, దివ్య ఓ చోట కలుసుకుంటారు. అప్పుడామె 'ఇంత వరకు నమ్మకద్రోహం అనే పదం విన్నాను. మొదటిసారి చూస్తున్నాను. నన్ను ఇంత మోసం చేస్తారా? ఎంతో గుడ్డిగా నమ్మాను' అని అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో విక్రమ్ 'దివ్య గారు ఒక్క నిమిషం.. నేను చెప్పే మాటలు వినండి. చెప్పిన తర్వాత మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను' అని అంటాడు. దీంతో దివ్య 'ఇన్ని రోజులు మీరు చెప్పిన మాటలే విన్నాను. ఇకపై మీరు చెప్పిన మాటలు నేను వినదల్చుకోలేదు' అని అంటుంది.

అరిచిన దివ్య.. ఏడుస్తూనే

అరిచిన దివ్య.. ఏడుస్తూనే

తర్వాత దివ్య 'నేను ఎవరిని అంత గుడ్డిగా నమ్మను. అలాంటిది నేను మిమ్మల్ని ఒకటికి పది సార్లు నా మనసును విసిగించి మీతో ప్రేమలో పడ్డాను. కానీ మీరు ఇలా చేస్తారని ఊహించలేదు' అంటుంది. దీనికి విక్రమ్ ఏడుస్తూ 'మీరు అలా మాట్లాడకండి దివ్య గారు. గుండె తట్టుకోలేదు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి' అని అంటాడు. అప్పుడామె 'ఇంకా ఎవరిని మోసం చేయడానికి ఈ దొంగ కన్నీరు కారుస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి' గెట్టిగా అరుస్తుంది. అప్పుడు విక్రమ్ 'నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మిమ్మల్ని ప్రేమించలేదు లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని అనుకున్నాను. నామీద కోపంగా ఉంటే ఒక దెబ్బ కొట్టండి తిట్టండి. అంతేగాని నన్ను వెళ్లిపోమని మాత్రం చెప్పకండి దివ్య గారు' అని బ్రతిమాలుతాడు.

హత్తుకుని చెప్పుకోవడంతో

హత్తుకుని చెప్పుకోవడంతో

విక్రమ్ మాటలకు దివ్య 'నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను.. కానీ నిన్ను ఇలా తిట్టాల్సి వస్తుందని ఊహించలేదు. నా మీద నాకే కోపంగా ఉంది' అంటుంది. దీంతో విక్రమ్ 'నేనేమైనా మీకు అబద్దం చెప్పానా? రాజ్యలక్ష్మి గారి కొడుకు అని చెప్పడానికి మన మధ్య అసలు ఆ ప్రస్థావనే రాలేదు. మిమ్మల్ని అయినా నేను మీ ఫ్యామిలీ గురించి అడిగానా? నా బ్యాగ్రౌండ్ తెలియకపోబట్టే కదా. నన్ను ఇష్టపడ్డారు.

సరే దివ్య గారు నేను ఎన్ని చెప్పినా మీరు వినే స్టేజ్‌లో లేరు. నేను ఏం చెప్పినా కూడా మీరు అపార్థం చేసుకుంటారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను. కారు ఎక్కితే మళ్లీ మీ లైఫ్‌లోకి రాను. మీరు నన్ను నమ్మితే పిలవండి' అని వెళ్లిపోతాడు. దీంతో దివ్య చాలా సేపు ఆలోచించుకుని విక్రమ్ అని పిలవగా.. ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటారు.

దివ్య ప్రేమను బయటపెట్టి

దివ్య ప్రేమను బయటపెట్టి

దివ్య పెళ్లికి నందూ ఒప్పుకోకపోవడంతో లాస్య 'మీ కూతురు ఆ అబ్బాయిని ఇష్టపడుతుందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పినా పెళ్లికి ఒప్పుకోరా' అంటుంది. అంతలోనే దివ్య అక్కడకు రావడంతో అందరూ ఆమెనే చూస్తుంటారు. అప్పుడు లాస్య 'లాస్య నువ్వు దాచిపెట్టిన నిజాన్ని నేను బయట పెట్టా. నువ్వు విక్రమ్ ప్రేమించుకుంటున్న విషయాన్ని చెప్పేశాను' అంటుంది.

దీంతో దివ్య 'నా పర్సనల్ విషయాల్లో నిన్ను ఎవరు జోక్యం చేసుకోమని చెప్పారు. రాయభారం చేయమని నేను అడిగానా? నన్ను క్షమించు అమ్మ నిన్ను కావాలని మోసం చేయలేదు. ఆ అబ్బాయి మనసులో నేను ఉన్నాను లేదో తెలుసుకోకుండా నీకు మాట చెబితే బాగోదు అందుకే ఈ విషయం దాచాను' అని చెప్పగా తులసి ఒప్పుకుంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X