Intinti Gruhalakshmi Today Episode: అభి మాటలు వినేసిన తులసి.. ప్రేమ్‌కు భారీ షాకిచ్చిన డైరెక్టర్
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య చదువుతున్న కాలేజ్ నుంచి నందూకు ఫోన్ వస్తుంది. పేరెంట్స్ మీటింగ్ ఉంది.. మీ భార్యతో కలిసి రండి అని చెబుతారు. దీంతో నందూ.. దివ్య దగ్గరకు వచ్చి విషయం చెబుతాడు. అప్పుడు తులసి అడ్డుకుని నందూను రావొద్దని అంటుంది. దీంతో నందూ ఈ నిర్ణయాన్ని దివ్య మీద వేస్తాడు.
దీంతో ఆమె కూడా తులసి వస్తే చాలని అంటుంది. దీంతో నందూ కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు, ప్రేమ్ తన పాటను పూర్తి చేస్తాడు. దీంతో శృతి ఆ పేపర్‌కు పూజ చేసి మరీ అతడికి ఇచ్చి.. టెన్షన్ పోగొట్టేందుకు ధైర్యం చెబుతుంది.

దివ్య కోసం రాజీ పడాలని తులసి
దివ్య తన తండ్రి గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంది. అది చూసిన తులసి ఆమెతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ‘మీ నాన్నకు కాల్ చేసి మాట్లాడుతాను. చెప్పమ్మా. పేరెంట్స్ మీటింగ్‌కు రమ్మంటావా. నువ్వు కావాలంటే ఆయనకు సారీ చెప్పి రమ్మని అడుగుతాను' అని అడుగుతుంది.
దీంతో దివ్య ‘వద్దు మామ్.. నీకు నీ ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో.. నాకూ నీ ఆత్మాభిమానం అంతే ముఖ్యం మామ్. అందరూ నీవైపు తలెత్తి చూసేలా చేస్తున్నావు. అలాంటిది ఎందుకు మామ్.. ఒక్కసారిగా ఇదివరకు తులసిలా మారిపోతున్నావు' అంటూ తల్లిని ప్రశ్నిస్తుంది.

నాకు అలాంటి మామ్ ఇష్టం అని
అయినా తులసి ధీనంగా ఉండడంతో దివ్య ‘ఎందుకు డాడీకి సారీ చెప్పేందుకు రెడీ అయ్యావు. నాకు రాజీ పడే తులసి కంటే.. ఆత్మాభిమానం కోసం నిలబడే తులసి అంటేనే ఇష్టం. నువ్వు అలా ఉంటేనే నాకు ఇష్టం. డాడీ మీటింగ్‌కు రాకూడదనే నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడంతో నాకు సగం భారం తగ్గింది. పేరెంట్స్ మీటింగ్‌కు నువ్వు ఒక్కదానివే వస్తావని ఇప్పటికే నేను మా ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి చెప్పాను. ఇక నువ్వు దాని గురించి ఆలోచించకు' అని చెబుతుంది దివ్య. దీంతో తులసి ఎంతగానో సంతోషిస్తుంది. అప్పుడు దివ్య కూడా తల్లిని హత్తుకుంటుంది.

పాట తీసుకొచ్చి ఇచ్చేసిన ప్రేమ్
ఎంతో కష్టపడి రాత్రికి రాత్రే పాటను పూర్తి చేసిన ప్రేమ్.. దాన్ని పేపర్‌పై రాసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ మప్పీ లహరికి ఇస్తాడు. అది చూసిన ఆయన ఆ పాటను చదివి.. ‘అబ్బబ్బా.. అమోఘం.. అద్భుతం.. ఇలాంటి చెత్త లిరిక్ నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ చదవలేదు కూడా. ఇది ఎక్కడ ఉండాలో తెలుసా? అసలు ఎక్కడ ఉంచాలో తెలుసా' అంటూ చెప్పి ఆ పేపర్‌ను తీసుకెళ్లి డస్ట్ బిన్‌లో వేసేస్తాడు. ఆ తర్వాత ‘నీ స్థాయి పాట రాయడం కాదు.. కాఫీ తీసుకురావడం.. పో కాఫీ తీసుకురాపో' అని ప్రేమ్‌పై సీరియస్ అవుతాడు.

ప్రేమ్ పాటను కాపీ చేసి మోసం
మప్పీ లహరి తన పాట చూసి గొడవ చేయడంతో ప్రేమ్ ఒక్కసారిగా నీరుగారిపోతాడు. అదే బాధతో కాఫీ తీసుకుని వచ్చేందుకు వెళ్తాడు. అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ వెళ్లిపోగానే చెత్త బుట్టలో ఉన్న పేపర్‌ను తీసి ప్రేమ్ గాడు పాట బాగానే రాశాడు. దీన్ని మనమే కాపీ కొట్టేసి పేరు కొట్టేయాలి అని అనుకుంటాడు. అంతేకాదు, ‘అరేయ్ ప్రేమ్‌గా ఒక్కరోజులోనే ఇంత మంచి పాట ఎలా రాశావురా.. నేను ఎన్నో పాటలు రాశాను.. కంపోజ్ చేశాను. కానీ, నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు. ఇందులో పదాలు మార్చి నా పేరుతో వేసుకుంటాను. సారీరా' అని అనుకుంటాడు.

అభి మాటలు విని తులసి షాక్
అభి టెర్రస్ మీద ఫోన్ మాట్లాడుతుండగా తులసి అతడికి పాలు తీసుకుని వెళ్తుంది. అప్పుడు అభి తన స్నేహితుడితో గాయత్రి ఆఫర్ గురించి మాట్లాడుతుంటాడు. ‘మా అత్తయ్య గారు ఈ మధ్య చాలా మారిపోయారు. నేను ఒప్పుకుంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆంటి ప్రపోజల్‌ను ఒప్పుకోవడానికి నేను ఫిక్స్ అయ్యాను. కానీ, నేనే ఈ మాటను దాచుకున్నాను. పైకి ఎవ్వరికీ చెప్పలేదు. తనే మాకోసం సొంత ఇల్లు తీసుకుంది. హాస్పిటల్ కూడా కట్టిస్తానంది. కానీ, మామ్ గురించి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను' అని అంటాడు అభి.

తులసిని సూటిగా అడిగిన అభి
తల్లి గురించి ఆలోచించకు అని ఫ్రెండ్ అభికి సలహా ఇస్తాడు. అప్పుడతను ‘అవును.. నా స్వార్థం నేను చూసుకోవడంలో తప్పేం లేదు. మామ్ కాదనడానికి కారణం లేదు కదా. మామ్ నాకోసం చాలా చేసింది. ఎమోషనల్‌గా లాక్ అయిపోతున్నాను. లేకపోతే ఎప్పుడో నేను అత్తింటికి చేరేవాడిని. మామ్ నా బాధ అర్థం చేసుకొని ఈ జైలు నుంచి రిలీజ్ చేస్తే బాగుండు' అని అనుకొని వెనక్కి తిరిగి చూసి తులసి కనపడగానే షాక్ అవుతాడు. అప్పుడామె ఏమీ విననట్లుగానే అతడితో పాలు తాగిస్తుంది.
దీంతో అభి ‘అదేంటి మామ్ మౌనంగా ఉన్నావు. ఏదైనా మాట్లాడు' అంటాడు. దీనికామె నా మౌనమేమీ ఆయుధం కాదు.. నిన్ను ఇబ్బంది పెట్టడానికి అంటుంది. నేను ఫోన్‌లో మా ఫ్రెండ్‌తో మాట్లాడింది విన్నావా అని అడగ్గా.. వినలేదు అని చెప్తుంది.

ప్రేమ్ బాధగా.. ఓదార్చిన శృతి
మప్పీ లహరి దగ్గర తనకు జరిగిన అవమానం గురించే ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. చెట్టు కొమ్మ మీద చేయి పెట్టి అది గుచ్చుకొని రక్తం వస్తున్నా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. తనను అలా చూసి శృతి షాక్ అవుతుంది. ఏంటి ప్రేమ్ ఇది. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది శృతి. అతడిని ఓదార్చుతుంది. అంతేకాదు, ‘నువ్వు గాయం చేసుకోవడం వల్ల లాభం ఏంటి. లక్ష్యాన్ని దూరం చేసుకోవడం తప్ప. ఇంకెప్పుడు ఇలా చేయనని మాటివ్వు' అంటుంది. దీంతో సరే అని మాటిస్తాడు ప్రేమ్. సరే పదా.. ఇప్పటికే ఆలస్యం అయింది. భోజనం చేద్దాం అంటుంది శృతి.
Recommended Video


గాయత్రిని ఆహ్వానించిన తులసి
అభి మాటలను విన్న తర్వాత గాయత్రికి తులసి ఫోన్ చేస్తుంది. అప్పుడామె శ్రీరామనవమి పండుగకు తమ ఇంటికి రమ్మని ఆమెను ఆహ్వానిస్తుంది. కానీ, గాయత్రికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ సమయంలో గాయత్రికి తులసి ఏదో విషయాన్ని చెప్తుంది. దీంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. ఆ తర్వాత నీ మాటలు నమ్మమంటావా అని అడుగుతుంది. దీనికి తులసి నాకు ఇచ్చిన మాట తప్పే అలవాటు కూడా లేదు అంటుంది. దీనికి గాయత్రి నీ మాట ప్రకారం రేపు వస్తాను. మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











