Intinti Gruhalakshmi: లాస్య మాటలు వినేసిన నందూ.. పెళ్లైన తర్వాతి రోజే తులసికి రాజ్యలక్ష్మి షాక్
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య పరిస్థితిని తలుచుకుంటూ నందూ వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరూ ప్రియ, విక్రమ్ ఫస్ట్ నైట్‌కు ముహూర్తం పెడుతూ ఉంటారు. ఆ సమయంలో నందూ అక్కడకు రావడంతో మాట్లాడిస్తారు. కానీ, అతడు మాత్రం మౌనంగా ఉంటాడు.
ఆ తర్వాత తులసి, నందూ కలిసి రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక, ఇంట్లోకి వెళ్లే సమయంలో విక్రమ్‌ను ఇరికించాలని బసవయ్య అనుకుంటాడు. ఆ తర్వాత తన తండ్రి దగ్గరకు దివ్యను విక్రమ్ తీసుకెళ్లగా.. ఆయన సంతోషిస్తాడు.
నన్ను వదల్లేదు కదా అని ప్రశ్న: విక్రమ్ వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లిన తర్వాత దివ్య ఎమోషనల్ అవుతుంది. అప్పుడామె 'మావయ్య గారిని పెళ్లికి తీసుకురావాల్సింది సంతోషించేవారు కదా. ఆయనను వదిలేసి రావడం నీదే తప్పు' అంటుంది. అప్పుడు ప్రకాశం 'మొదటిసారి ఒక గొంతుక నా తరఫున మాట్లాడుతుంది' అని మనసులో అనుకుంటాడు.
దీంతో విక్రమ్ 'పక్షవాతం వచ్చిన దగ్గరనుంచి నాన్న ఇదే గదిలో ఉండిపోయారు. నేను చెప్పినా వినరు' అంటాడు. దీంతో దివ్య 'నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను వినలేదు. అందుకని వదిలేసావా? గట్టిగా ప్రయత్నించి నన్ను సాధించుకున్నావు. అలాంటప్పుడు మావయ్య గారిని మాత్రం ఎందుకు వదిలేశావు' అని ప్రశ్నిస్తుంది

మామ బాధ్యత తీసుకున్న దివ్య: ఆ తర్వాత దివ్య 'ఈ ఇంటి పెద్ద అయిన మామయ్య గారు.. ఆ పెద్దరికం చీకట్లో ఉండిపోతే ఎలా? ఈరోజు నుంచి ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క. మిమ్మల్ని చూసుకోవటానికి దివ్య వచ్చేసింది. మీకు ఏమీ భయం లేదు' అని ప్రకాశానికి ధైర్యం చెబుతుంది.
దీంతో ఆయన మనసులో 'నా కన్న కొడుకు కూడా నాకు ఇంత భరోసా ఇవ్వలేదు' అంటూ సంతోషిస్తుంటాడు. అనంతరం దివ్య 'రేపటి నుంచి మావయ్య గారి పనులన్నీ నేనే చేస్తాను. మీకు నేను ఉన్నాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సరే మావయ్య గారు మళ్లీ వస్తాము' అంటూ అక్కడ నుంచి బయలుదేరుతారు.
రాజ్యలక్ష్మి - లాస్య ఫోన్ కాల్‌తో: ఇక, రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'నువ్వు నాకు అప్పజెప్పిన పని అయిపోయింది కదా. అంటే మన డీల్ పూర్తైంది' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'ఇక్కడితో నీ పని అయిపోలేదు. నీతో నాకు ఇంకా చాలా పని ఉంది.
ఆ దివ్యపై పగ తీర్చుకుంటేనే నా పని అయినట్లు' అంటుంది. దీంతో లాస్య 'మనం మాట్లాడుకున్నది ఇక్కడ వరకే అయినా కూడా నేను ఈ ఇంట్లో మనిషి గానే ఉంటాను. ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు చెప్తాను. ఒక రకంగా నీకు సీక్రెట్ ఏజెంట్‌లాగ వ్యవహరిస్తుంటాను. అన్నట్లు నందూ వాళ్ళు అక్కడికి వస్తున్నారు' అంటుంది.

మాటల విన్న నందూకు డౌట్: లాస్య ఆ మాట చెప్పగానే రాజ్యలక్ష్మి 'రానీ రానీ చెప్తాను.. మళ్ళీ ఈ ఇంటికి రాకుండా చేస్తాను' అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఆ వెంటనే లాస్య వెనక్కి తిరిగేసరికి నందూ ఉంటాడు. అతడిని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నందూ 'ఎవరితో మాట్లాడుతున్నావు' అని డౌట్‌తో అడుగుతాడు.
దీంతో లాస్య 'రాజ్యలక్ష్మి గారితో మాట్లాడుతున్నా. మీరు వాళ్ల ఇంటికి వస్తున్నారని చెప్తున్నాను అంతే' అని కవర్ చేసుకుంటుంది. దీంతో నందూ 'ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు' అంటాడు. దీంతో లాస్య 'పెళ్లి ముందు వరకూ నందూ బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు' అనుకుంటుంది.
ప్రియకు వార్నింగ్.. దివ్య ప్రశ్న: టీ తీసుకుని వచ్చిన ప్రియతో రాజ్యలక్ష్మి 'నా ముందే కాదు.. ఇంట్లో అందరూ ముందు ఇంతే మౌనంగా ఉండు. నువ్వు గీత దాటితే నీ తల్లిదండ్రులు లోకాన్ని దాటుతారు' అని బెదిరిస్తుంది. ఇక, తన రూమ్ సర్దుకుంటున్న దివ్య దగ్గరికి వచ్చిన విక్రమ్ వెనుక నుంచి ఆమెను హగ్ చేసుకుంటాడు.
దీంతో దివ్య అలాంటివన్నీ ఇప్పుడు కాదు అంటూ దూరంగా నెట్టేస్తుంది. అంతలోనే అక్కడికి ప్రియ టీ తీసుకొని రావటంతో విక్రమ్ సిగ్గుతో బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు దివ్య 'ప్రియ నీ కాపురం ఎలా ఉంది' అని అడుగుతుంది. దీనికామె 'ఇక్కడే ఉంటారు కదా మీరే చూద్దురుగాని' అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
నందూ, తులసికి బిగ్ షాకిచ్చి: నందూ, తులసి కలిసి రాజ్యలక్ష్మి వాళ్ల ఇంటికి వస్తారు. దీంతో ఇలా వచ్చారేంటి అని ఆమె అడుగుతుంది. అప్పుడు బసవయ్య 'తాహతుకు మించి పెళ్లి చేశారు కదా. లెక్కలు తేడా వచ్చి ఉంటాయి. బంగారు బాతులాంటి మా అక్కను చూసేసరికి ఆశ పుట్టి ఉంటుంది. అందుకే వచ్చి ఉంటారు' అంటాడు. ఆ మాటలకి నందూ, తులసి షాక్ అవుతారు. అప్పుడు తులసి 'మేము మధ్య తరగతి వాళ్ళమే కానీ.. ఒకరి దగ్గర చేయి చాపే వాళ్ళం కాదు. మేము ఈ రాత్రికి శోభనం ముహూర్తం పెట్టించాము. పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చాము. మీరు తీరిగ్గా రండి' అంటుంది.
మా పద్దతులే ఫాలో అవ్వాలి: తులసి వాళ్లు మాట్లాడిన తర్వాత రాజ్యలక్ష్మి 'మీ పద్ధతులు ప్రకారం మేము నడుచుకోవడం ఏంటి? మాకు కూడా పద్ధతులు ఉంటాయి కదా. ముందు సత్యనారాయణ వ్రతం చేసిన తరువాత అప్పుడు ఫస్ట్ నైట్ చేయాలి.
అది కూడా మా ఇంట్లోనే జరుగుతుంది' అని కఠువుగా చెప్తుంది. దీంతో తులసి, నందూ మరోసారి షాక్ అవుతారు. ఆ వెంటనే తులసి 'ఎక్కడైనా ఆ కార్యక్రమం ఆడపిల్ల పుట్టింట్లో జరుగుతుంది కదా' అంటుంది. అప్పుడు బసవయ్య 'మగ పెళ్లి వాళ్ళ పద్ధతులు ఏవైతే అవే ఫాలో అవ్వాలి' అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











