Intinti Gruhalakshmi Today Episode: పండుగ రోజు నందూకు లాస్య షాక్.. అభికి వనవాసం తప్పదేమో అంటూ!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై రన్ అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన తండ్రి రావట్లేదని దివ్య బాధ పడుతుండడంతో తులసి నందూకు సారీ చెబుతానని అంటుంది. కానీ, దివ్య మాత్రం అందుకు ఒప్పుకోదు. పైగా తనకు ధైర్యంగా ఉండే తన తల్లి అంటేనే ఇష్టమని, ఇలా కాంప్రమైజ్ అయ్యే తులసి ఇష్టం లేదని చెప్తుంది.
ఇక, గాయత్రి ఇచ్చిన ఆఫర్ గురించి అభి మాట్లాడే మాటలను తులసి వింటుంది. మరోవైపు, ప్రేమ్ రాసిన పాట బాగున్నా.. బాలేదని మప్పీ లహరి ఆ పాటను కొట్టేస్తాడు. ఇక, గాయత్రిని తులసి తన ఇంట్లో జరిగే శ్రీరామనవమి పండుగకు రమ్మని ఫోన్ ద్వారా ఆహ్వానిస్తుంది.

లాస్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త
శ్రీరామనవమి పండుగ రోజు నందూ పంచె కట్టుకుని బయటకు వెళ్లి ఏవేవో సామాన్లు తీసుకుని వస్తాడు. దీంతో అపార్ట్‌మెంట్‌లోని వాళ్లందరూ అతడికి పండగ రోజు శుభాకాంక్షలు తెలుపుతారు. దీంతో అతడు సరదాగా వాళ్లకు విసెష్ చెబుతాడు.
అలా నవ్వుతూ ఇంట్లోకి వెళ్లగానే లాస్య నైట్ డ్రెస్ వేసుకుని కనిపిస్తుంది. అప్పుడామె గుడ్ మార్నింగ్ నందూ అంటుంది. అంతేకాదు, 'ఏంటి పంచె కట్టుకుని ఉన్నావు. ఈరోజు కేఫేకు ఇలాగే వెళ్తావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో అతడికి కోపం వస్తుంది. 'ఏంటి ఇంకా రెడీ కాలేదు. ఈరోజు పండుగ అని చెప్పా కదా' అని ఫైర్ అవుతాడు.

నందూ ప్లాన్‌ను పాడు చేసిన లాస్య
నందూ ఎంత చెప్పినా లాస్య మాత్రం వినదు. పైగా తనకు పూజాలు కుదరదని, ఆఫీస్‌కు వెళ్లాలని అంటుంది. దీంతో అతడికి మరింత కోపం వస్తుంది. 'నీకు నిన్న రాత్రే చెప్పాను కదా. మా వంశాచారం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శ్రీరాముల వారి కళ్యాణంలో పాల్గొనాలి.
ముందు వెళ్లి రెడీ అయి రా' అంటాడు. కానీ, లాస్య మాత్రం అస్సలు వినదు. దీంతో నందూకు కోపం రెట్టింపు అవుతుంది. అప్పుడు సరే స్నానం చేసి వస్తా దండం పెట్టుకుందాం అంటుంది. దీంతో నందూ తీసుకొచ్చిన పూలు, పండ్లను అక్కడ పడేసి కోపంగా బయటకు వెళ్లిపోతాడు.

అభిని చూసి బాధ పడిన తులసి
శ్రీరామనవమి పండుగ కావడంతో అభిని నిద్ర లేపాలని తులసి అతడి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు కొడుకును చూసి తనలో తానే ఎంతగానో బాధ పడుతుంది. అంతేకాదు, 'బిడ్డల విషయంలో ఏ తల్లికైనా స్వార్థం ఎక్కువగా ఉంటుంది. బిడ్డలు ఎప్పుడూ తన దగ్గరే ఉండాలనుకుంటుంది. తన నీడలోనే బతకాలనుకుంటుంది. బిడ్డలకు రెక్కలు వచ్చినా ఆ విషయం పట్టించుకోదు. వాళ్లకు కూడా ఒక మనసు ఉంటుంది అనే విషయం మరిచిపోతుంది. చిన్నప్పుడు ఎలా చేతులు పట్టుకొని నడక నేర్పిందో.. పెద్దయ్యాక కూడా అలాగే ప్రవర్తిస్తుంది' అంటూ మాట్లాడుకుంటుంది.

అందరిలా తప్పు చేశాను అంటూ
అభిని అలా చూస్తూ తులసి 'తన ఎదురుగా ఉన్న బిడ్డను ప్రాణంగా ఉన్న మనిషిగా కాకుండా.. ప్రాణం లేని బొమ్మగా అనుకుంటుంది. ప్రతి తల్లి చేసే ఈ తప్పే నేను చేశాను. నా భర్త దూరం అయ్యేసరికి.. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్నాను. మీరే నా జీవితం అనుకున్నాను. కానీ, మీకంటూ ఒక జీవితం ఉంటుందని, మీకంటూ కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయని, నువ్వు ఈ నిజాన్ని నాకు గుర్తు చేసి చాలా మంచి పని చేశావు. నాకు తప్పు దిద్దుకునే అవకాశం ఇచ్చావు. స్వార్థాన్ని పక్కన పెట్టి.. నా గురించి ఆలోచించడం మానేసి.. నీ గురించి ఆలోచిస్తాను' అంటుంది.

వనవాసం వెళ్లాలేమో అన్న తాత
అభిని చూసి బాధ పడిన తర్వాత అతడిని తులసి నిద్ర లేపుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంతేకాదు, 'మామ్ ఏంటి.. నువ్వు వచ్చి నన్ను లేపుతున్నావు' అంటాడు. దీంతో ఈరోజు శ్రీరామనవమి కదా.. నువ్వు రెడీ అయితే.. పూజ చేద్దాం అంటుంది తులసి. దీంతో సరే.. రెడీ అవుతా అంటాడు. నువ్వు రెడీ అవ్వడం కాదు.. నేనే ఈరోజు నిన్ను రెడీ చేస్తా అంటుంది.
ఆ తర్వాత అతడికి నలుగు పెట్టి తలంటు స్నానం చేపిస్తుంది తులసి. ఆ తర్వాత అభిని రెడీ చేస్తుంది. ఇంతలో పరందామయ్య వచ్చి 'ఒరేయ్ మనవడా.. మీ అమ్మ నిన్ను శ్రీరామచంద్రుడిని చేసింది. వనమాసానికి వెళ్లాల్సి వస్తుందేమో చూసుకో' అంటాడు. దీంతో అభి, తులసి షాక్ అవుతారు.

క్షమాపణ కోరిన పరందామయ్య
అభిని వనవాసం వెళ్లాలని అన్న పరందామయ్య ఆ తర్వాత తేరుకుంటాడు. 'ఏం అనుకోకు అమ్మా.. ఏదో సరదాకు ఆటపట్టించడానికి అన్నాను అంతే. నా మనసులో వేరే ఉద్దేశం ఏం లేదు' అని క్షమాపణలు కోరుకుంటాడు. దీనికి తులసి 'మీరు ఏ ఉద్దేశంతో అన్నా జరగాల్సింది జరగక మానదు మామయ్య. మన చేతుల్లో ఏముంది' అంటుంది. దీంతో 'వాడికి నువ్వంటే ప్రాణం.. నీకు వాడంటే ప్రాణం.. ఒకరికి మరొకరు ఎలా దూరం అవుతారు' అంటాడు పరందామయ్య. ఆ తర్వాత అందరూ కలిసి శ్రీరామనవమి పూజలో పాల్గొంటారు. అభి, అంకితలతో పూజ చేయిస్తుంది.

కష్టాలు తీర్చమని కోరకూడదని
తులసి ఇంట్లో అందరూ కలిసి శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉండగా.. మరోవైపు శృతి, ప్రేమ్ మాత్రం ఇద్దరే పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత ప్రేమ్ 'శ్రీరాముడు చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలు అనుభవించాడు కదా. మరి ఆయనను మన కష్టాలు తీర్చమని ఎందుకు అడగాలి' అని శృతితో అంటాడు. దీనికామె 'కష్టాలు రాకుండా కాపాడు దేవుడా అంటూ మనం ఎప్పుడూ దేవుడిని కోరుకోకూడదు. మనం పాప ఫలం అనుభవించాల్సిందే' అంటూ సమాధానం చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.


Click it and Unblock the Notifications











