Intinti Gruhalakshmi: అత్త ఇంట్లో దివ్యకు తొలి షాక్.. ఫస్ట్ నైట్ జరగకుండా ప్లాన్.. ప్రియకు అడగడంతో!
ఇండియాలోని ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మామను చూడగానే దివ్య చలించిపోతుంది. అంతేకాదు, ఇకపై ఆయన బాధ్యతను తాను తీసుకుంటానని విక్రమ్‌కు తేల్చి చెబుతుంది. అనంతరం లాస్య.. రాజ్యలక్ష్మితో మాట్లాడడం చూసి నందూ సందేహిస్తాడు. కానీ, ఆమె అబద్ధాలు చెబుతుంది. ఆ తర్వాత నందూ, తులసి.. రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లి.. ఫస్ట్ నైట్ కోసం దివ్య, విక్రమ్‌ను పంపించమని అడుగుతారు. కానీ, దీనికి రాజ్యలక్ష్మి ఒప్పుకోదు. దీంతో వాళ్లకు అవమానం జరుగుతుంది. అంతేకాదు, మగ పెళ్లి వాళ్ళ పద్ధతులు ఏవైతే అవే ఫాలో అవ్వాలి అంటూ గట్టిగానే డిమాండ్ చేస్తుంది.

మీకు నచ్చినట్లే చేయండి:విక్రమ్, దివ్యను మొదటి రాత్రి జరపడం కోసం తమ ఇంటికి తీసుకు వెళ్లాలని వచ్చిన తులసి వాళ్లకు రాజ్యలక్ష్మి షాక్ ఇస్తుంది. అంతేకాదు, అప్పుడు బసవయ్య ఇంకా రెచ్చగొడుతూ 'మగ పెళ్లి వాళ్ళ ఆచారాలే ఆడ పెళ్లి వాళ్ళు పాటించాలి. కాబట్టి మా ఆచారం ప్రకారం ఫస్ట్ నైట్ ఇక్కడే జరగాలి' అంటాడు. దీంతో తులసి 'ఆడపిల్ల ఇంట్లో అయితే తనకి భయం, బెరుకు ఉండవు కదా' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'అత్తిల్లు ఏమీ నరకం కాదు కదా. ఇక్కడ కూడా అలవాటు చేసుకోవాలి కదా' అంటుంది. దీంతో తులసి మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంటుంది.
అత్తయ్య మంచి వారే కదా:ప్రియను చూసిన దివ్య 'నీ మొహంలో ఏదో దిగులు కనిపిస్తుంది. నవ్వటానికి కూడా చాలా కష్టపడుతున్నావు. నువ్వు ఇక్కడ సుఖంగానే ఉన్నావా' అని అడుగుతుంది. దీనికామె 'ఎలా ఉన్నా బ్రతుకుని ఎలాగో ఒకలాగా ముందుకి సాగించాలి కదా మేడం' అని అంటుంది. దీంతో దివ్య 'ఎందుకు అంత వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నావు? ఇక్కడ నీకు ఎవరి వల్ల కష్టమో చెప్పు నేను మాట్లాడతాను. పెళ్లి చేయడంతోనే నా బాధ్యత అయిపోలేదు. నాకు తెలిసి నీకు సంజీవతో మాత్రమే కష్టం కలిగి ఉంటుంది ఎందుకంటే అత్తయ్య గారు చాలా మంచివారు కదా' అంటుంది.

మొదటి రోజే దివ్య కన్నీరు:రాజ్యలక్ష్మి ఏం చెప్పినా వినకపోవడంతో తులసి వాళ్లు వెళ్లిపోతామని అంటాడు. అప్పుడు తులసి 'మేము బయలుదేరుతాము. ఒకసారి దివ్యని పిలిపిస్తే మాట్లాడి వెళ్లిపోతాము' అంటుంది. దీనికా 'దివ్య పడుకుంది. రేపు ఎలాగా సత్యనారాయణ వ్రతం ఉంది కదా. అప్పుడు మాట్లాడుకోవచ్చు లెండి' అంటుంది. దీంతో నందూ, తులసి బాధగా వెనుదిరుగుతారు. ఇక, ప్రియను 'నువ్వు నిజం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది' అని దివ్య నిలదీయగా.. ఏదైతే అదే జరిగింది నిజం చెప్పేయాలి అనుకుంటుంది. ఇంతలో దేవుడు వచ్చి మీ అమ్మగారు వాళ్ళు వచ్చారు అని చెప్పటంతో దివ్య ఆనందంతో వెళ్తుంది. కిందికి వచ్చి చూసేసరికి అక్కడ నందూ వాళ్ళు ఉండరు. దీంతో దివ్య పెళ్లైన తర్వాతి రోజే ఏడుస్తుంది.
తట్లుకోలేవు అంటూ బాధ:దిగులుగా ఉన్న నందూను చూసి ఎందుకు అంత దిగులు దివ్య కోసమేనా అని తులసి ప్రశ్నిస్తుంది. దీనికతడు మూడు రాత్రులు మన ఇంట్లో జరగనివ్వరిట అంటాడు. దీంతో తులసి 'ఆవిడకు కోడలు అంటే ఎంత ప్రేమ. తల్లిలాగా బాధ్యత తీసుకుంటుంది' అంటుంది. దీనికతడు రాజీ పడుతున్నావా తులసి అంటాడు. అప్పుడామె 'మన ప్రయత్నాలు ఏవి ఫలించినప్పుడు ఆఖరికి మనం చేయవలసింది అదే' అంటుంది. దీంతో నందూ 'రేపు కూతురు సునామీలో చుట్టుకోపోతుంది అంటే ఇంకేమైపోతావో అందుకే నిజం తెలిసినా చెప్పలేకపోతున్నాను' అనుకుంటాడు.

లాస్య అలా.. వాళ్లు ఇలా:నందూ, తులసి కలిసి దివ్య వాళ్లు తీసుకు వస్తుంటారని ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తుంటారు. అప్పుడు లాస్య 'అక్కడ రాజ్యలక్ష్మి వీళ్ళను తన్ని తరిమేసి ఉంటుంది. లైవ్‌లో చూసేదాన్ని అనవసరంగా ఈ ముసలి దానివల్ల మిస్ అయిపోయాను' అని అనుకుంటుంది. ఇంతలోనే నందూ, తులసి అక్కడకు వస్తారు. వాళ్లను చూసి దివ్యను తీసుకు రాలేదేంటి అని అడుగుతారు. అప్పుడు నందూ ఏమీ మాట్లాడకుండా దిగులుగా ఇంట్లోకి వెళ్లిపోతాడు. తులసి ద్వారా జరిగిందంతా తెలుసుకుని మండిపడతారు. కానీ, లాస్య మాత్రం తనలో తానే తెగ సంతోష పడుతుంది.
దివ్యకే ప్రమాదం అంటూ:తులసి ఆ మాట చెప్పగానే ప్రేమ్ 'అలా కామ్‌గా ఎందుకు వచ్చేసారు? నిలదీయవలసింది కదా. నేను బావగారితో మాట్లాడుతాను' అంటాడు. దీంతో లాస్య 'మొదటి రోజే తల్లి కొడుకులతో గొడవపడకు. అది మన దివ్యకే ప్రమాదం' అంటుంది. దీంతో తులసి 'అవును లాస్య చెప్పింది నిజమే. అయినా ఈ విషయం గురించి పెద్ద వాళ్లమే మేము చూసుకుంటాము. మీరు వదిలేయండి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక, తులసి వాళ్లకు సరైన సమాధానం చెప్పావని రాజ్యలక్ష్మిని బసవయ్య పొగుడుతూ ఉంటాడు.

ఫస్ట్ నైట్ జరగనీయనని:తులసి వాళ్లు వెళ్లిన తర్వాత బసవయ్య 'ఇంటికి వచ్చిన వాళ్ళకి నోటు మీద వాత పెట్టినట్టు మా అక్కయ్య భలే చెప్పింది. వాళ్ల మొహాలు చూస్తే నాకే బాధనిపించింది. కానీ బాధపడవలసింది వాళ్ళు కాదు దివ్య. తన కంట్లోంచి రక్తం రావడం మా అక్క చూడాలి. అవును రేపు ఫస్ట్ నైట్ సంగతి ఏంటి' అని రాజ్యలక్ష్మిని అడుగుతాడు. దీనికామె 'ఫస్ట్ నైట్ జరిగితే ఆ విక్రమ్ నా చేతిలో నుంచి జారి దివ్య ఒళ్ళో పడతాడు. అందుకని ఫస్ట్ నైట్ జరిగే చాన్సే లేదు' అంటుంది. దీంతో బసవయ్య 'ఎన్నాళ్ళని ఆపుతావు? నీ కొడుక్కి అనుమానం రాకపోయినా ఆ దివ్యకి అనుమానం వస్తుంది కదా' అంటాడు. దీనికి రాజ్యలక్ష్మి 'అప్పుడు నా కొడుకుని ఆయుధంగా ప్రయోగిస్తాను' అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











