Intinti Gruhalakshmi Today Episode: తులసి ఫ్యామిలీకి గాయత్రి షాక్.. అందరి ముందే నిజం చెప్పడంతో!

దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై రన్ అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శ్రీరామనవమి పండుగను జరుపుకునేందుకు నందూ పూలు, పండ్లు తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ, లాస్య మాత్రం ఆఫీస్‌కు వెళ్లాలంటూ అతడికి హ్యాండ్ ఇస్తుంది. దీంతో నందూ కోపంతో అవన్నీ విసిరేసి వెళ్లిపోతాడు. మరోవైపు, అభిని నిద్ర లేపేందుకు వచ్చిన తులసి.. అతడిని చూసి బాధ పడుతూ మనసులోని బాధనంతా బయట పెట్టుకుంటుంది. ఆ తర్వాత అతడికి స్నానం చేయించి రెడీ చేస్తుంది. మరోవైపు, ప్రేమ్, శృతి శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఆ సమయంలో శృతి తన భర్తకు విలువైన మాటలు చెప్తుంది.

పండగ రోజే ప్రేమ్, శృతి రొమాన్స్

పండగ రోజే ప్రేమ్, శృతి రొమాన్స్

రాముడి కష్టాల గురించి శృతి, ప్రేమ్ మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడామె 'కష్టాలు రాకుండా కాపాడు దేవుడా అంటూ మనం ఎప్పుడూ ఆయన్ను కోరుకోకూడదు. మనం పాప ఫలం అనుభవించాల్సిందే. కానీ, కష్టాన్ని తట్టుకొని నిలబడే శక్తిని ఇవ్వు అని గట్టిగా కోరుకోవాలి' అని ప్రేమ్‌కు వివరిస్తుంది. అంతేకాదు, రాముడు ఎందుకు ఆదర్శవంతుడు అయ్యాడో చెబుతుంది. ఆ తర్వాత కాసేపు ప్రేమ్‌ను ఆటపట్టిస్తుంది. దీంతో నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఆమె వెంట పడతాడు. తర్వాత ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. అలా ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది.

రాముడి గురించి చెప్పిన తులసి

రాముడి గురించి చెప్పిన తులసి

తులసి ఇంట్లో శ్రీరామనవమి పూజ వైభవంగా జరుగుతుంది. చివర్లో అంకిత అందరికీ హారతి ఇస్తుంది. ఇంతలో అభి 'మామ్ రాముడిని ఎందుకు గొప్పవాడు అంటారు' అని అడుగుతాడు. దీనికి తులసి 'తల్లిదండ్రుల మాటను జవదాటని వ్యక్తి రాముడు. కారణం అడక్కుండా.. ఏమాత్రం ఆలోచించకుండా సతీసమేతంగా వనమాసానికి వెళ్లాడు' అని చెబుతుంది. అప్పుడు దివ్య 'రాముడి వనమాసం అనేది ఆయన జీవితంలోనే బ్యాడ్ చాప్టర్ కదా.. నువ్వు ఇప్పుడు అది అన్నయ్యకు ఎందుకు చెబుతున్నావు' అని ప్రశ్నిస్తుంది. కానీ, దీనికి తులసి సమాధానం చెప్పదు.

తులసి ఇంటికి వచ్చిన గాయత్రి

తులసి ఇంటికి వచ్చిన గాయత్రి

దివ్య అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పని తులసి.. తన కొడుకునే తదేకంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య పూజ అయిపోయింది.. ప్రసాదం తిందాం అంటుంది. దీంతో అంకిత ఇంట్లోని వాళ్లందరికీ ప్రసాదాన్ని పంచుతుంది. శ్రీరామనవమి పూజ అయిపోయాక.. తులసి ఇంటి బయట ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో గాయత్రి తన ఇంటికి వస్తుంది. గాయత్రిని చూసి ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. అంకితకు చిరాకు వస్తుంది. తులసి, గాయత్రి బయట నుంచే ఏదో మాట్లాడుకుంటారు. దీంతో వాళ్లు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాదు.

వాళ్లకు నిజం చెప్పేసిన గాయత్రి

వాళ్లకు నిజం చెప్పేసిన గాయత్రి

గాయత్రి రాగానే ఆంటి ఇలా డైరెక్టుగా వచ్చేసిందేంటి అని అనుకుంటాడు అభి. ఆ తర్వాత తులసి ఆమెను ఇంట్లోకి తీసుకొని వస్తుంది. అప్పుడు తులసి 'అమ్మా.. అంకిత, మీ అమ్మ వచ్చింది పలకరించవేంటి' అంటుంది. దీనికి అంకిత 'నేను పలకరించకపోయినా మా మామ్‌కు ఏం తేడా ఉండదు ఆంటి. తను ఏం పట్టించుకోదు' అంటుంది. ఆ తర్వాత గాయత్రి 'అదేంటి తులసి.. నా కూతురును, అల్లుడును నాతో పంపిస్తానని చెప్పి ఈ డిస్కషన్ అంతా ఏంటి' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో వాళ్లిద్దరితో పాటు ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

తులసే పంపిస్తానని అంది అని

తులసే పంపిస్తానని అంది అని

గాయత్రి ఆ మాట చెప్పగానే అందరూ షాక్‌లో ఆమెనే చూస్తూ ఉంటారు. అప్పుడామె 'ఏమైంది.. అందరూ నా వైపు బిత్తరపోయి చూస్తున్నారు? అదేంటి తులసి.. విషయం వాళ్లకు చెప్పలేదా. సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నావా? పాపం.. అనవసరంగా వాళ్లను టెన్షన్ పెడుతున్నావు తులసి. ఒక్కసారి నువ్వు డిసైడ్ చేసుకున్నాక చెప్పొచ్చు కదా. పోనీ, నన్ను చెప్పమంటావా. విషయం ఏంటంటే.. నాకూతురు, అల్లుడును పర్మినెంట్‌గా నాతో పంపడానికి తులసి ఒప్పుకుంది. తీసుకెళ్లడానికి నన్ను రమ్మంది. అందుకే ఇక్కడకు వచ్చాను' అని మొత్తం వివరించి చెబుతుంది.

తులసిపై అందరూ కోపంగానే

తులసిపై అందరూ కోపంగానే

గాయత్రి అసలు విషయం చెప్పగానే అనసూయ 'ఏంటి తులసి గాయత్రి చెప్పేది నిజమేనా' అని అడుగుతుంది. అభి కూడా 'నాతో కలిసి ఒక్కమాట కూడా చెప్పలేదు ఏంటి మామ్' అంటాడు. అలాగే పరందామయ్య 'నీ కొడుకును కోడలును గాయత్రితో పంపడం ఏంటమ్మా.. అసలు అర్థం ఉందా' అని ప్రశ్నిస్తాడు. ఇక దివ్య మాత్రం 'చెప్పాపెట్టకుండా నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావన్న కోపంతోనే డాడీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు మామ్. నువ్వు మారలేదు మామ్' అంటుంది. ఇలా అందరూ ఆమెపై కోపంగానే డైలాగులు వదులుతారు.

అభి గురించి నిజం చెప్పగానే

అభి గురించి నిజం చెప్పగానే

అందరూ తనపై కోప్పడుతుండగా తులసి 'నేను మారాను. నా స్వార్థం పక్కన పెట్టాను కాబట్టే అభి, అంకితలను గాయత్రితో పంపించేందుకు సిద్ధమయ్యాను. నా కళ్లలోకి చూసి నిజం చెప్పు. మీ అత్తగారి ఆఫర్ మీద మనసు పడి ఈ ఇంటిని వదిలి వెళ్లాలని అనుకున్నావా లేదా' అని అభిని ప్రశ్నిస్తుంది. దీనికి అతడు 'అంటే అది.. అలాంటి ఆలోచన అయితే మనసులోకి వచ్చింది కానీ' అని ఏదో చెప్పబోతాడు. దీనికి తులసి 'నన్ను వదిలి వెళ్లి వెళ్లడానికి ఆలోచించావు అంతే కదా . నీ జీవితం బాగుంటుంది అంటే.. వెళ్లడంలో తప్పేముంది. మీ అత్తగారు కొన్న ఫ్లాట్ కీస్ ఎందుకు తీసుకొచ్చావు? నీ మనసు ఒప్పుకోబట్టే కదా. తప్పు కాదు అని అనుకుంటేనే కదా. మరి ఇఫ్పుడెందుకు మొహమాటపడుతున్నావు' అని నిజాలు చెప్పేస్తుంది.

ఒప్పుకున్న అంకిత... చివర్లో

ఒప్పుకున్న అంకిత... చివర్లో

ఆ తర్వాత అభి 'అంకిత నువ్వు మాట్లాడవేంటి.. నీ మనసులో ఏముందో మామ్‌కు చెప్పు' అంటాడు. అప్పుడు మా మామ్‌తో వెళ్లడం నాకు ఇష్టమే అంటుందామె. దీంతో అందరూ షాక్ అవుతారు. దీనికి అభి అంకిత.. తెలిసే మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. దీనికి అంకిత 'నా మనసులో మాట చెప్పమన్నావు.. చెప్పాను. అంతకంటే డిస్కషన్ ఏముండదు అభి. నిర్ణయం జరిగిపోయింది' అంటుంది. ఆ తర్వాత పరందామయ్య అంకిత మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. దీంతో గాయత్రికి కోపం వస్తుంది. తులసే అలా మాట్లాడిస్తుందని అంటుంది. దీంతో వాళ్లిద్దిర మధ్య డిస్కర్షన్ జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X