Intinti Gruhalakshmi: తులసికి నిజం చెప్పేసిన దివ్య.. విక్రమ్‌కు షాక్ ఇచ్చిన రాజ్యలక్ష్మి

ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode April 22nd 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మా ఆచారం ప్రకారం ఫస్ట్ నైట్ మగ పెళ్లి వాళ్ల ఇంట్లోనే జరగాలని రాజ్యలక్ష్మి తేల్చడంతో తులసి, నందూ ఓకే అంటారు. తర్వాత దివ్యను పిలవమని అడగ్గా తను పడుకుంది అంటారు. దీంతో తులసి వాళ్లు బాధగా వెళ్లిపోతారు.

తర్వాత దివ్యకు ప్రియ నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ, అంతలోనే తులసి వాళ్లు వచ్చినట్లు దేవుడు దివ్యకు చెప్తాడు. అప్పుడామె వెళ్లగా వాళ్లు వెళ్లిపోయారని చెప్తారు. ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పడంతో అంతా బాధ పడతారు. రాజ్యలక్ష్మి మాత్రం ఫస్ట్ నైట్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంది.

జీవిత కాలం బాధపడేది అంటూ: దివ్య పెళ్లి అయిపోవడంతో ప్రేమ్ దంపతులు వాళ్ళ ఊరు బయలుదేరడానికి రెడీ అవుతారు. అప్పుడు తులసి 'ఒక తల్లిగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలనిపిస్తుంది. కానీ తప్పదు కదా' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంటుంది.

చాలాసార్లు ఉద్యోగం మానేద్దామని కూడా అనిపించింది' అంటాడు. అప్పుడు తులసి 'అలాంటి పని చేయకు. నీ భవిష్యత్తుకు ఈ తల్లి ఎప్పుడు అడ్డు కాకూడదు. నీ అన్నయ్య పెళ్లికి రావడం కుదరలేదు. కనీసం నువ్వైనా వచ్చావు. లేకపోతే నీ చెల్లెలు జీవిత కాలం బాధపడేది' అని చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode April 22nd 2023

ప్రేమ్‌కు హామీ ఇచ్చిన నందూ: ఆ తర్వాత తులసి శృతి దగ్గరికి వెళ్లి 'నా కొడుకుని అమ్మ లాగా చూసుకుంటున్నావు సంతోషం' అంటుంది. అప్పుడు శృతి 'అమ్మ ప్రేమకు ఏది సాటి రాదు. ఆయన నన్ను రోజుకి నన్ను నాలుగు సార్లు అమ్మ అని పిలుస్తారు' అని చెప్తుంది.

అప్పుడే ప్రేమ్ 'నీకు ఏ అవసరం వచ్చినా, నీకు ఉండాలనిపించినా ఈ చిన్న కొడుకు ఉన్నాడని మర్చిపోవద్దు' అంటాడు. దీనికి ప్రేమ్ 'మీ అమ్మ ఈ ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం ఎప్పటికీ రాదు. నేను మాటిస్తున్నాను' అని ప్రామిస్ చేస్తాడు. తర్వాత ఇంట్లోని పెద్ద వాళ్లు అందరి దగ్గర ఆశీర్వచనం తీసుకొని వెళ్తారు.

తులసికి నిజం చెప్పేసిన దివ్య: ఇంటికి వచ్చినా తల్లిదండ్రులు తనను కలవకుండా వెళ్ళినందుకు దివ్య బాధపడుతుంది. అదే విషయాన్ని తల్లికి ఫోన్ చేసి అడుగుతుంది. అప్పుడు తులసి 'మీ అత్తగారు నువ్వు పడుకున్నావు అని చెప్పారు. అందుకే లేపడం ఇష్టం లేక వచ్చేసాము. మాదే తప్పు ఈసారి వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తాము' అంటుంది.

దీంతో ఒకసారిగా షాక్ అయిన దివ్య.. 'నేను పడుకోలేదు. నాకు మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు లేదు నీకు కూడా తెలుసు కదా. అత్తయ్య అలా ఎలా చెప్పేస్తారు. చాలాసేపు గది నుంచి బయటికి రాకపోవటంతో అలా అనుకొని ఉంటారు' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode April 22nd 2023

తులసిలో మొదలైన సందేహం: దివ్య మాటలు విన్న వెంటనే తులసి 'అయినా ఎలాగు రేపు వ్రతానికి వస్తాం కదా. అక్కడ బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం' అని కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత తులసి 'రాజ్యలక్ష్మి గారు అలా ఎలా చూడకుండా దివ్య నిద్రపోయిందని చెప్పారు' అంటూ అనుమానిస్తుంది.

దీంతో నందూ 'నిజం తెలిస్తే తట్టుకోలేవు. చేజేతులా మనమే మన పిల్లని నరకానికి పంపించాము' అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత 'అబద్ధం చెప్పవలసిన అవసరం ఆవిడకి ఏముంది? నిజంగానే దివ్య పడుకుందేమో అనుకుని ఉంటారు' అంటూ తులసికి సర్ధి చెబుతుంటాడు.

విక్రమ్ కనిపించకపోవడంతో: ఇక, ఫస్ట్ నైట్ కోసం విక్రమ్ స్వీట్స్ తీసుకొని వస్తాడు. అప్పుడతను 'ఏంటో నా ఫస్ట్ నైట్‌కు నేనే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది' అంటాడు. దీనికి దేవుడు 'నేను అదే ఆలోచిస్తున్నాను. పెద్దమ్మ గారు అలా వదిలేసారేంటి' అంటాడు. దీంతో విక్రమ్ 'ఇలాంటి చిన్న చిన్న విషయాలు అమ్మకు ఏం తెలుస్తాయి. ఇప్పుడు ఈ స్వీట్స్‌ను ఎవరికి కనిపించకుండా ఎలా పైకి తీసుకు వెళ్ళటం' అంటాడు.

దీంతో దేవుడు ఇవి కారులోనే ఉండనివ్వండి.. ఎవరు చూడకుండా నేను పైకి తీసుకు వస్తాను అంటాడు. ఇక, విక్రమ్ కనిపించకపోవడంతో రాజ్యలక్ష్మి కంగారు పడుతుంది. అప్పుడు దివ్య ఇంట్లోనే ఉందని తెలిసి రిలాక్స్ అవుతుంది. దీంతో బసవయ్య ఇలా ఎన్ని రోజులు కంగారు పడతావు అని అడగ్గా.. నా కొడుకు గీత దాటడు అని అంటుంది.

దివ్యను ఇరికించిన విక్రమ్: విక్రమ్ రావడంతో ఎక్కడికి వెళ్లారని బసవయ్య అడుగుతాడు. అప్పుడతను 'దివ్య పువ్వులు తీసుకుని రమ్మంది. అందుకే వెళ్లాను' అని చెప్తాడు. అంతలోనే అక్కడకు దివ్య వచ్చి 'నేను ఎప్పుడు తీసుకు రమ్మన్నాను' అంటుంది. దీంతో వాళ్లు కంగారు పడతారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి 'రేపు పూజ ఎనిమిది గంటలకి త్వరగా లేవండి.

అలారం పెట్టుకోండి' అని విక్రమ్‌కు చెప్తుంది. దీంతో అతడు అలారం ఎందుకు దివ్య ఉంటుంది కదా అనగా.. 'దివ్య నీ పక్కన ఎందుకు ఉంటుంది? మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ ఈ రోజు కాదు. దానికి కూడా ముహూర్తం ఉంటుంది' అని బాంబ్ పేల్చుతుంది. దీంతో విక్రమ్ డీలా పడిపోతాడు. అప్పుడు బసవయ్య అతడిని ఆటపట్టిస్తుంటాడు.

తులసికి చెప్పకూడదు అని: ఇక, నందూ 'రాజ్యలక్ష్మి పగతో దివ్యను కోడలుగా చేసుకుందని తులసికి చెప్తే మనశ్శాంతిగా ఉండలేదు. అలానే చెప్పకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను' అని లోలోపల అనుకుంటాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన తులసి ఎందుకు ఇలా ఉన్నారు ఏమైంది అని అడుగుతుంది.

అప్పుడతను 'ఒకసారి తప్పు చేస్తే ఆ బాధ జీవితాంతం భరించాల్సి వస్తుంది' అంటాడు. దీంతో తులసి 'అందుకు బాధ్యత మనది. దేవుడిని నిందించకూడదు' అంటుంది. దీనికతడు 'తెలిసి పొరపాటు చేస్తే అనుకోవచ్చు. కానీ తెలియకుండా పొరపాటు జరిగితే ఏం చేస్తాం' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X