Intinti Gruhalakshmi Today Episode: అంకిత గురించి నిజం చెప్పిన తులసి.. అభి కూడా ఒప్పుకోవడంతో!

తెలుగు బుల్లితెరపై రన్ అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతి ఇంట్లో పండుగను జరుపుకుని.. ఆ తర్వాత కాసేపు రొమాంటిక్‌గా గడుపుతారు. మరోవైపు తులసి ఇంట్లో కూడా శ్రీరామనవమి పూజ జరుగుతుంది. ఆ సమయంలో అభి అడగ్గానే రాముడి గురించి తులసి వివరిస్తుంది. అనంతరం అక్కడకు గాయత్రి వచ్చి తులసి చెప్పిన మాటలను అందరికీ వివరిస్తుంది.

ఆ తర్వాత అభి, అంకితను తనతో తీసుకెళ్లేందుకు రెడీ అవుతుంది. కానీ, అభి మాత్రం వెళ్లడానికి నిరాకరిస్తాడు. అయితే, అంకిత మాత్రం వాళ్ల అమ్మతో వెళ్లేందుకు రెడీ అవుతుంది. దీంతో అందరూ షాక్ అయిపోతారు.

అంకితను ఒప్పించింది తులసినే

అంకితను ఒప్పించింది తులసినే

అంకిత తన తల్లితో వెళ్లడానికి ఒప్పుకుంది తన వల్లే అన్న విషయాన్ని తులసి బయటపెడుతుంది. 'అంకిత బాధ్యత తెలిసిన మనిషి. కష్టాలకు ఎప్పుడూ వెన్ను చూపించలేదు. ఇప్పటికీ తనకు ఇంటి నుంచి వెళ్లడం ఇష్టం లేదు కానీ.. నేనే బలవంతంగా ఒప్పించాను' అని నిజం చెబుతుంది. అంతకుముందు రాత్రే.. తులసి, అంకితతో మాట్లాడుతుంది.

ఆ సమయంలో అంకిత 'నేను అస్సలు వెళ్లను. ఈ ఇంటిని వదిలేది లేదు' అని తేల్చి చెబుతుంది. దీనికి తులసి 'కానీ.. నేను ఏం చెప్పినా మీ మంచి కోసమే కదా. అందుకే ఒప్పుకో అమ్మా' అని అంటుంది.

అమ్మ మాట వింటే బాగుంటుంది

అమ్మ మాట వింటే బాగుంటుంది

తులసి ఎంత చెప్పినా అంకిత మాత్రం వినదు. అంతేకాదు, 'ఒక్కసారి మా అమ్మను నమ్మినందుకే నాకు తగిన శిక్ష పడింది. జీవితాంతం ఆ తప్పును మోస్తూ బతుకుతున్నాను. అమ్మ అని పిలిపించుకునే అర్హత లేదు తనకు' అంటుంది. దీనికి తులసి 'నిజమే ఒప్పుకుంటాను.. మీ అమ్మ నీకు అన్యాయం చేసింది. కానీ, ఇప్పుడు మనసు మార్చుకుంది.

నీ భవిష్యత్తు కోసమే తను ఈ నిర్ణయం తీసుకుంది. మీ అమ్మ మాట వింటే మీ భవిష్యత్తు బాగుంటుందని అభి అనుకుంటున్నాడు' అని చెప్తుంది. దీనికి అంకిత అభి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతాడు అంటుంది.

నిజాన్ని అలా వివరించిన తులసి

నిజాన్ని అలా వివరించిన తులసి

అంకిత మాటలకు బదులిస్తూ 'వాడి మనసులో ఏది వస్తే అదే చేస్తాడు. నీకంటే నాకే వాడి గురించి ఎక్కువ తెలుసు. ఈ అమ్మ మీద ఉన్న ప్రేమ.. వాడిని సంకెళ్లు వేస్తోంది. అలాంటప్పుడు తల్లిగా నేను ఏం చేయాలి. బలవంతంగా వాడిని ఇంటికే బందీ చేయడం ఎంత వరకు న్యాయం. ఈ బంధాలు ప్రతి దానికి అడ్డం పడుతుంటాయి' అంటూ చివరకు ఎలాగోలా ఇంట్లో నుంచి వెళ్లేందుకు ఒప్పిస్తుంది తులసి. ఆ విషయాన్ని తులసి.. అందరికీ చెబుతుంది. దీంతో అంకిత అలాంటి నిర్ణయం తీసుకోడానికి తులసే కారణం అని అందరూ క్లారిటీకి వచ్చేస్తారు.

అభి ప్రశ్న.. తులసి సరైన జవాబు

అభి ప్రశ్న.. తులసి సరైన జవాబు

అంకితను ఒప్పించింది తనే అని చెప్పడంతో అభి 'నాతో మాట్లాడుకుండా అంకితను ఒప్పించడం ఏంటి మామ్' అంటూ తులసిని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి ఒప్పించాల్సింది నిన్ను కాదు అంకితను అని చెప్పి తనను ఒప్పించాను అంటుంది. అంతేకాదు, 'నీ జీవితంలో సెటిల్ అవ్వడానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది.

అందుకే నేను చొరవ తీసుకున్నాను. నీకేది మంచిదో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను. తర్వాత అమ్మ కోసం త్యాగం చేయడం వల్లే నష్టపోయాను అనుకుంటాడు. ఆ ఒక్కటి చాలు నేను తలదించుకోవడానికి' అంటూ క్లాస్ పీకుతుంది.

సంతోషంగా దూరం అవుదామని

సంతోషంగా దూరం అవుదామని

తులసి మాటలకు అభి 'డాడీ తన దారి తాను చూసుకున్నారు. ప్రేమ్‌ను ఇంట్లో నుంచి పంపించేశావు. ఇప్పుడు నన్ను పంపించేస్తున్నావు. అందరినీ పంపించేసి ఎలా ఉంటావు మామ్' అని సూటిగా ప్రశ్నిస్తాడు. దీనికి 'నువ్వు బాగుపడితే చూసి ఆనందించాలని ఉందిరా నాకు కూడా. నేను స్వార్థపరుడినే. ఒక్కోసారి గీత దాటి ఆలోచిస్తాను. నాకోసం మాత్రమే ఆలోచిస్తాను.

కానీ, దాని అర్థం నాకు ఎవ్వరూ అక్కర్లేదు అని కాదు మామ్. నేను నీకు ఇప్పుడు అడ్డుపడితే.. అది ఏదో ఒక రోజు మనస్పర్థలను తీసుకురావచ్చు. సంతోషంగా దూరం అవుదాం. దాని వల్ల కనీసం మన మధ్య ప్రేమ అలాగే ఉండిపోతుంది. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ప్రేమ్‌ను కూడా వాడి భవిష్యత్తు కోసమే పంపించాను. ఇప్పుడు నీ విషయంలో కూడా అంతే' అని చెప్తుంది.

కాలమే సమాధానం చెబుతుంది

కాలమే సమాధానం చెబుతుంది

అభి మాట్లాడిన తర్వాత గాయత్రి 'మొదటి సారి మీ అమ్మ చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. తన గురించి కాకుండా తన పిల్లల గురించి ఆలోచించింది. ఇంకా ఆలోచన ఏంటి అభి. రాహు కాలం రాకముందే బయలు దేరుదాం' అంటుంది. దీనికి అభి 'అంకిత.. మామ్‌ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందాం పదా' అంటాడు.

అప్పుడు అంకిత 'వెళ్లే ముందు మీరంటే నాకు ఎంతో ఇష్టం ఆంటి. ఎంత ఇష్టం అంటే.. నా నుంచి దూరంగా మీరు వెళ్లండి అని చెప్పినా కాదనలేని ఇష్టం. మీరు తీసుకున్నది సరైన నిర్ణయమో కాదో.. కాలమే సమాధానం చెబుతుంది' అంటుంది.

ఆ క్షణమే మీ కాళ్ల దగ్గర ఉంటా

ఆ క్షణమే మీ కాళ్ల దగ్గర ఉంటా

ఆ తర్వాత చాలా ఎమోషనల్ అయిన అంకిత 'కేవలం మీ సంతోషం కోసం.. తృప్తి కోసం మీరు చెప్పిన దానికి తలూపాను. మమ్మల్ని దూరం చేసుకొని కూడా మీరు సంతోషంగా లేరని తెలుసుకున్న మరుక్షణం నేను మీ కాళ్ల దగ్గర ఉంటాను' అని చెప్తుంది. ఆ తర్వాత బ్యాగు తీసుకొని అంకిత, అభి.. గాయత్రితో పాటు వెళ్లిపోతారు. వాళ్లు అలా వెళ్లిపోగానే దివ్య ఏడుస్తూ 'మీ ఫ్రెండ్‌కు ఏదో సమస్య అన్నావు కదా. ఈరోజుతో అది సాల్వ్ అయినట్టే కదా మామ్' అని సీరియస్‌గా అంటుంది. దీనికి తులసి సైలెంట్‌గా ఉంటుంది. దీంతో దివ్య లోపలికి వెళ్లిపోతుంది.

శృతితో ప్రేమ్ చిలిపి చాలెంజ్

శృతితో ప్రేమ్ చిలిపి చాలెంజ్

ఇక, శృతిని రెస్ట్ తీసుకోమని చెప్పి ప్రేమ్ బట్టలు ఆరేస్తా అంటాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకు చేతగాని పనుల జోలికి రాకు అంటుంది శృతి. దీంతో నాకు చేతగాని పనా అంటాడు ప్రేమ్. దీంతో ఆమెతో ఓ పందెం కాస్తాడు ప్రేమ్. దీంతో ఆ పందేనికి ఒప్పుకుంటుంది. దీంతో బట్టలు ఆరేయడం స్టార్ట్ చేస్తాడు ప్రేమ్. తన బట్టలు ఆరేసుకుంటాడు కానీ.. శృతి చీరను మాత్రం ఆరేయలేకపోతాడు. అప్పుడు అతడు నీరసం అయిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X