Intinti Gruhalakshmi: విక్రమ్‌ను రెచ్చగొట్టిన తాత.. దివ్య గదిలో దూరి సరసాలు.. రాజ్యలక్ష్మి చూడడంతో!
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar
శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య పెళ్లి అయిపోవడంతో ప్రేమ్ దంపతులు వాళ్ళ ఊరు బయలుదేరడానికి రెడీ అవుతారు. ఆ సమయంలో అందరూ ఎమోషనల్ అవుతుంటారు. అప్పుడు తులసిని మంచిగా చూసుకుంటానని నందూ ప్రేమ్‌కు హామీ ఇస్తాడు.
తనను కలవకుండా వెళ్లారని దివ్య ఫోన్ చేయగా.. ఆమెకు రాజ్యలక్ష్మి అబద్దం చెప్పిందని అర్థం అవుతుంది. ఇక, విక్రమ్ కనిపించకపోయే సరికి రాజ్యలక్ష్మి టెన్షన్ పడుతుంటుంది. ఆ తర్వాత అతడు రాగానే ఊపిరి పీల్చుకున్న ఆమె.. ఫస్ట్ నైట్‌ను వాయిదా వేసినట్లు చెప్పి విక్రమ్‌కు కోలుకోలేని షాక్‌ను ఇస్తుంది.
సంఘర్షణ కాదు.. యుద్దమే అని: దివ్య విషయంలో జరిగిన, జరగబోతున్న విషయాలను తలుచుకుని నందూ తెగ కంగారు పడుతూ ఉంటాడు. పైకి మాట్లాడుతున్నా లోలోపల ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. అతడిని దగ్గర నుంచి గమనించిన తర్వాత తులసి 'మీరు ఎక్కువ మానసిక సంఘర్షణ పడుతున్నట్లుగా ఉన్నారు' అని అంటుంది.
తులసి మాటలకు నందూ 'సంఘర్షణ కాదు.. పెద్ద యుద్ధమే జరుగుతుంది. అందులో గెలుస్తానో, ఓడిపోతానో అర్థం కావట్లేదు' అని చెబుతాడు. దీంతో తులసి 'వెళ్లి ఆంజనేయస్వామి దండకం చదువుకుంటూ పడుకోండి' అని సలహా ఇస్తుంది.

ఆ బాధ ఏంటో తెలుస్తుందంటూ: తులసి సలహా ఇచ్చిన తర్వాత నందూ మానసికంగా కామ్ అవుతాడు. అంతేకాదు, 'మన పెళ్లి అయిన కొత్తలో మీ అమ్మ గారు వాళ్ళు తరచుగా మన ఇంటికి వస్తుంటే పిచ్చోళ్ళు అనుకునేవాడిని. కానీ, నా కూతురికి పెళ్లయిన తర్వాత ఆ బాధ ఏంటో తెలిసింది' అంటుంది.
దీంతో తులసి 'పోనీలెండి ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఇప్పటికే లేట్ అయింది. రేపు వ్రతానికి దివ్య వాళ్ల ఇంటికి వెళ్లాలి కదా. త్వరగా వెళ్లి పడుకోండి' అని అంటుంది. దీంతో నందూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతాడు. కానీ, అతడి ఆలోచన మొత్తం దివ్య గురించే ఉంటుంది.
విక్రమ్‌ను రెచ్చగొట్టిన తాతయ్య: ఫస్ట్ నైట్ వాయిదా పడడంతో విక్రమ్ డీలా పడతాడు. వెళ్లి తన తాత దగ్గర పడుకుంటాడు. కానీ, దివ్య ఆలోచనలతో నిద్ర పట్టక అవస్థ పడుతుంటాడు. అది చూసిన వాళ్ల తాతయ్య నవ్వుకుంటాడు. ఆ సమయంలో విక్రమ్‌ను ఆటపట్టించడం కోసం రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని వింటుంటాడు.
దీంతో విక్రమ్ 'ఏంటి తాతయ్య ఆ పాటలు? నాకు అసలే నిద్ర పట్టడం లేదు. నన్ను చూస్తే నీకు జాలి వేయటం లేదా' అని అంటాడు. దీనికాయన 'చేవలేని వాడి గురించి ఆలోచించడం వేస్ట్' అంటాడు. దీంతో విక్రమ్ కోపంతో 'నేను చేవలేని వాడినా? అమ్మే కదా ముహూర్తాలు లేవని చెప్పింది' అంటాడు.

దివ్య గదిలోకి దూరిన విక్రమ్: విక్రమ్ మాటలకు వాళ్ల తాతయ్య 'పెద్దవాళ్లు అలాగే అంటారు. వాళ్ల నమ్మకాలు వాళ్ళవి. నా పెళ్లి సమయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ, నన్ను ఎవరూ ఆపలేకపోయారు' అంటూ మనవడిని యమా రెచ్చగొడతాడు. తాత మాటలతో విక్రమ్ ఆవేశంగా దివ్య గదిలోకి వెళ్తాడు. విక్రమ్‌ను సడన్‌గా అక్కడ చూసి దివ్య గట్టిగా అరుస్తుంది. దీంతో విక్రమ్ 'వచ్చింది నేనే.. గట్టిగా అరవకు నాకు కావలసింది ఇచ్చేయ్ వెళ్ళిపోతాను' అంటాడు. దీనికామె ఇప్పుడు కాదు రేపు ఇస్తాను సాంప్రదాయాలని పాటించాలి కదా అంటూ అతడిని గదిలో నుంచి పంపించేస్తుంది.
కంటి సైగ చాలు అని చెప్పేసి: రాజ్యలక్ష్మిని కాక పట్టాలని బసవయ్య ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడతను 'అక్కా.. నువ్వు నన్ను చూసుకో, నేను నీకు కావలసిన పనులన్నీ చూసుకుంటాను. కంటి సైగ చేసినా చాలు. పనులన్నీ చక చక చేసేస్తాను' అని రాజ్యలక్ష్మితో చెబుతాడు. ఇంతలో బసవయ్య భార్య అక్కడికి వచ్చి కంటితో సైగలు చేస్తుంది.
కానీ, అది బసవయ్య అర్థం చేసుకోలేడు. దీంతో ఆమె 'ఇప్పుడే చెప్పారు కదా. కంటి సైగతో పనులు చేసేస్తానని మరి అర్థం చేసుకోవడం లేదేమి' అని అడుగుతుంది. దీంతో బసవయ్య 'నేను చెప్పింది మా అక్కయ్య కోసం. నీ కోసం కాదు' అంటూ కేకలు వేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దర్నీ చూసి రాజ్యలక్ష్మి నవ్వుకుంటుంది.

దివ్య, విక్రమ్‌ను చూసి కోపం: ఇక, దివ్య దగ్గరికి వెళ్లిన విక్రమ్ 'నిన్ను ఇలా చూస్తూ కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. ఉపవాసం ఉన్నవాడి ముందు బిర్యానీ ప్లేట్ పెట్టినట్లుగా ఉంది' అని అంటాడు. దీంతో దివ్య 'లొట్టలు వేస్తూ చూస్తూ కూర్చోండి' అంటుంది. అప్పుడు దివ్యను విక్రమ్ హగ్ చేసుకోబోతే అక్కడ నుంచి పారిపోతుంది. ఆమె వెనకే విక్రమ్ కూడా పరిగెడతాడు.
వాళ్ళిద్దరూ రొమాంటిక్‌గా ఉండడాన్ని చూసిన రాజ్యలక్ష్మి, బసవయ్య కోపంతో కుళ్లుకుంటారు. అప్పుడు బసవయ్య 'మెడలో తాళి పడిన తర్వాత ఈ పరుగులు మనం ఆపలేముజ నువ్వు ఏదేదో ఊహించుకున్నావు. కానీ వాళ్ల కళ్ళకి మనం కనపడం. చూడలేక మన కళ్ళు మనం మూసుకోవాల్సిందే' అంటాడు. ఈలోగా దివ్య వాళ్లు అనుకోకుండా రాజ్యలక్ష్మి ముందుకి వస్తారు.
దివ్యకు పని చెప్పి అత్తయ్య: పరిగెత్తుకుంటూ తన ముందుకు వచ్చిన విక్రమ్‌తో రాజ్యలక్ష్మి పడితే కాళ్లు విరుగుతాయి జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఆమె 'ఇందాకే పంతులుగారు ఫోన్ చేశారు. వ్రతానికి సంబంధించిన పనులన్నీ పెళ్లికూతురు చేయాలంట. లేకపోతే అరిష్టమంట' అంటుంది. దీంతో దివ్య 'మీరు ఒక్కొక్కటిగా చెప్తూ ఉండండి. నేను చేసుకుంటూ పోతాను' అంటుంది.
అప్పుడు దివ్యను ఇరికించేందుకు రాజ్యలక్ష్మి ఎక్కువ పనులనే చెప్తుంది. దీంతో విక్రమ్ ఏదో అనగా.. తల్లిని అవమానిస్తున్నావా అని బసవయ్య అంటాడు. అప్పుడామె 'నేనేం చేసినా వాడి మంచి కోసమే అని వాడికి తెలుసు. దేవుడి మండపాన్ని అలంకరించు' అని రాజ్యలక్ష్మి వెళ్లిపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక దివ్య టెన్షన్ పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











