Intinti Gruhalakshmi Today Episode: చేతులు కలిపిన లాస్య, భాగ్య.. ఫ్యాక్టరీ మూతపడడంతో తులసికి కష్టం

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై రన్ అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత తన తల్లితో వెళ్లడానికి ఒప్పుకోవడంతో అంతా షాక్ అవుతారు. అప్పుడు అసలు ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం తానే అన్న విషయాన్ని తులసి బయట పెడుతుంది. దీంతో అభి తన తల్లిని ప్రశ్నిస్తాడు. అప్పుడు తులసి.. మీ బాగు కోసమే ఇలా చేశానని అభితో అంటుంది. అంతేకాదు, గొడవలతో కాకుండా మంచిగానే దూరంగా ఉందాం అని వాళ్లను ఒప్పిస్తుంది. దీంతో వాళ్లిద్దరూ గాయత్రితో కలిసి వెళ్లిపోతారు. ఇక, చివర్లో ప్రేమ్, శృతి చిలిపిగా చాలెంజ్ చేసుకుంటారు. ఇందులో ప్రేమ్ ఓడిపోతాడు.

శృతిపై ఛాలెంజ్ గెలిచిన ప్రేమ్

శృతిపై ఛాలెంజ్ గెలిచిన ప్రేమ్

బట్టలు ఆరేసే విషయంలో శృతితో ప్రేమ్ ఛాలెంజ్ చేస్తాడు. కానీ, చీరను ఆరేయలేకపోతాడు. అప్పుడు తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీంతో 'ఈ చీర ఏంటి మరీ ఇంత పొడుగు ఉంది. వోణీలా చిన్నగా ఉంటే బాగుంటుంది కదా' అని అంటాడు. దీనికి శృతి అందుకే కదా నేను పందెం కట్టింది అంటుంది. అలా నానా కష్టాలు పడిన తర్వాత ప్రేమ్ చీరను బయటకు తీసేసి చిక్కులు లేకుండానే ఆరేస్తాడు. దీంతో శృతి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. అప్పుడు ప్రేమ్ 'నేనే గెలిచాను. వచ్చి నా ముద్దులు నాకు పెట్టేయ్' అని ఆమెను సతాయిస్తుంటాడు.

ప్రేమ్‌కు ముద్దులు.. మోసం చేసి

ప్రేమ్‌కు ముద్దులు.. మోసం చేసి

ప్రేమ్ పందెంలో గెలవడంతో ముందుగా అనుకున్న దాని ప్రకారం ముద్దులు పెట్టమని శృతిని అడుగుతాడు. అప్పుడామె 'ముద్దుల అంటే మరీ ఇలా ఆరు బయట నా వల్ల కాదు. లోపలికి రా పెడతాను' అంటూ లోపలికి తీసుకుని వెళ్తుంది. అలా ఇంట్లోకి వెళ్లిన తర్వాత కళ్లు మూసుకో అంటుంది శృతి. 10 ముద్దులు అయ్యేవరకు కళ్లు తెరవ కూడదు అంటుంది. పక్కనే అద్దం ఉంటుంది. అద్దంలో ప్రేమ్‌ను చూస్తూ ముద్దులు పెడుతుంటుంది. దీంతో వెంటనే కళ్లు తెరిచి ఇది చీటింగ్.. చీటింగ్ అని అంటాడు. ఆ తర్వాత తనకు పెట్టమని ఆమెను బ్రతిమాలుతాడు.

ప్రేమ్‌కు నిజం చెప్పేసిన దివ్య

ప్రేమ్‌కు నిజం చెప్పేసిన దివ్య

శృతి ప్రేమ్ సరసాలు ఆడుకుంటూ ఉండగా దివ్య ఫోన్ చేస్తుంది. అప్పుడామె ప్రేమ్‌తో 'అన్నయ్యా.. నేను భయపడినట్టే జరిగింది. అభి అన్నయ్య, వదిన ఇల్లు వదిలి వెళ్లిపోయారు' అని చెప్పేస్తుంది. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. ఎందుకలా.. ఎవరేమన్నారు అని అడుగుతాడు ప్రేమ్. దీంతో మొత్తం జరిగింది చెబుతుంది. అప్పుడు ప్రేమ్ 'కనీసం వాడైనా ఇంట్లో అమ్మకు తోడు ఉంటాడనుకున్నాను. కానీ, ఇలా పారిపోతాడని అనుకోలేదు' అంటాడు. అప్పుడు దివ్య 'ఒక్కొక్కరు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అన్నయ్య' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'నేను మాట్లాడుతాను. నువ్వేం కంగారు పడకు' అని భరోసా ఇస్తాడు.

పరందామయ్య ప్రశ్నలకు అలా

పరందామయ్య ప్రశ్నలకు అలా

ఇంట్లో కూర్చుని ఉన్న తులసి.. అభి, అంకిత గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్లు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? వాళ్ల విషయంలో తాను చేసిందో కరెక్టేనా కాదా? అని ఆమె తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పరందామయ్య ఆమె దగ్గరకు వస్తాడు. అప్పుడాయన రాముడి వనవాసం గురించి తులసికి చెబుతాడు. దీనికి తులసి 'కానీ, ఈ అభిరామ్ వెళ్లింది వాడు ఎదగడం కోసం. నా బిడ్డకు ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి గాయత్రి ఉంది. నేను దిగులు పడాల్సిన అవసరం లేదు' అని ఆయనకు సమాధానాలు చెబుతుంది.

లాస్య కంగారు.. భాగ్య జాగ్రత్తలు

లాస్య కంగారు.. భాగ్య జాగ్రత్తలు

చాలా రోజుల తర్వాత భాగ్య.. లాస్య దగ్గరకు వెళ్తుంది. అప్పుడామె 'ఏం చేస్తున్నావు లాస్య.. అవుతుంది కాదు అని ఏంటో అంటున్నావు ఏంటి. టెన్షన్‌తో చచ్చిపోతున్నాను ముందు విషయం ఏంటో చెప్పు' అని ప్రశ్నిస్తుంది. దీనికి లాస్య 'జీకే కూతురు ఫంక్షన్‌లో నాకు, తులసికి గొడవ జరిగింది' అని అప్పుడు జరిగిందంతా ఆమెకు వివరిస్తుంది. దీనికి భాగ్య 'తులసక్క అంత మాట అనేసిందా. ఆవిడకు ఏమైనా ముందే ఎలా తెలుసు. బావ గారు నిన్ను వదిలేస్తారని ఎలా చెప్పింది. వెనుక ఏదో జరుగుతుంది అని అర్థం లాస్య. ఆ విషయాన్ని అంత తేలికగా తీసిపారేయకూడదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. బావ గారు ఎవరి మీద కన్నేయకుండా చూసుకోవాలి' అంటుంది.

తులసిని దెబ్బ కొట్టే వ్యూహం

తులసిని దెబ్బ కొట్టే వ్యూహం

భాగ్య మాట్లాడుతుండగా లాస్య 'నాకు ఒక పని చేయి. ఆ ఇంట్లో మనుషులు తులసిని వదిలేసి నా దగ్గరికి వచ్చేలా చేయాలి' అని అడుగుతుంది. దీనికి భాగ్య 'మొన్ననే నాకు 20 లక్షలు ఇచ్చింది. అప్పుడే తనను మోసం చేయాలంటే మనసు రావడం లేదు' అంటుంది. దీనికి లాస్య 'ఆ 20 లక్షలతో పాటు.. ఇంకొంత కలిపి ఇస్తాను' అని చెప్తుంది. దీంతో భాగ్య 'సరే.. ఓకే నా దగ్గర ఒక బెస్ట్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వర్కవుట్ అయితే తులసి చాప్టర్ క్లోజ్ అవుతుంది' అని చెబుతుంది. తర్వాత అదేంటో వివరిస్తుంది. అప్పుడు మనం మున్సిపల్ ఆఫీసులో మేనేజ్ చేస్తే తులసి ఫ్యాక్టరీ మూతపడటం ఖాయం అంటుంది భాగ్య.

మూతపడిన తులసి ఫ్యాక్టరీ

మూతపడిన తులసి ఫ్యాక్టరీ

భాగ్య, లాస్య మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో వాళ్లు వచ్చి తులసి ఫ్యాక్టరీని మూసేయాలని చూస్తారు. అప్పుడు మేనేజర్ ఆమెకు ఫోన్ చేసి మేటర్ చెబుతాడు. దీంతో ఆమె కంగారుగా అక్కడకు వెళ్లి వాళ్లను అడ్డుకుంటుంది. దీంతో 'మీరు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. అందుకే మూసేస్తున్నాం. అడ్డుకుంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది' అంటారు. దీంతో తులసి తప్పుకోగా వాళ్లు సీజ్ చేసి వెళ్లిపోతారు. ఈ విషయం తెలిసి లాస్య, భాగ్య ఎంతగానో సంతోషిస్తారు. అప్పుడు లాస్య భాగ్యను పొగుడుతూ మాట్లాడుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X