Intinti Gruhalakshmi Today Episode: ప్రవళ్లిక రాకతో ఫ్యాక్టరీ ఓపెన్.. డాక్యూమెంట్స్ ఇచ్చేసిన తులసి

భారతదేశంలో ఉన్న ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై రన్ అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీ మూతపడడంతో తులసి ధీనంగా ఇంటికి వస్తుంది. అప్పుడు భాగ్య, లాస్య ఈ విషయాన్ని నందూకు చెబుతారు. దీంతో వాళ్లంతా కలిసి తులసి దగ్గరకు వస్తారు. వచ్చీ రావడమే ఆమెపై విరుచుకుపడతాడు నందూ. తులసి చేతగానితనం వల్లే ఇలా జరిగిందని నిందిస్తాడు. మరోవైపు అభి కూడా అక్కడకు వచ్చి తల్లికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. దీంతో ప్రేమ్ ఎంట్రీ ఇచ్చి తన తల్లి వైపు నిలబడతాడు. ఆ తర్వాత పరందామయ్య కూడా నందూ, అభిని తిడతాడు. అంతేకాదు, ఇక్కడి నుంచి వెళ్లిపోమని హెచ్చరిస్తాడు.

తులసి ఇంటికి వచ్చి ఫ్రెండ్ ప్రవళ్లిక

తులసి ఇంటికి వచ్చి ఫ్రెండ్ ప్రవళ్లిక


ఫ్యాక్టరీ మూతపడడానికి కారణం తన చేతకానితనమే అని నందూతో పాటు అభి కూడా నిందించడంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. అలాగే, ఇంట్లో అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఎక్కడివారక్కడే కూర్చుంటారు. తులసి మాత్రం నిద్రపోకుండానే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక, తర్వాతి రోజు ఉదయాన్నే తులసి.. తన బైక్‌కు వాటర్ కొడుతూ ఉంటుంది. ఇంతలో ప్రవళ్లిక ఆమె ఇంటికి వస్తుంది. ముందు ప్రవళ్లికను గమనించదు. తర్వాత ప్రవళ్లికను చూసి తులసి షాక్ అవడంతో పాటు ఆమెనే తదేకంగా చూస్తుంది.

తులసిని కలిసేందుకు కష్టపడ్డానని

తులసిని కలిసేందుకు కష్టపడ్డానని

తులసి తనను గుర్తు పట్టకపోయేసరికి ప్రవళ్లిక ఒక మొట్టికాయ వేస్తుంది. దీంతో ఆమె నువ్వు ప్రవళ్లిక కదా అంటుంది. ఇద్దరూ కౌగిలించుకుంటారు. ఆ తర్వాత పాతికేళ్లకు గుర్తుపట్టలేనంతగా మారిపోయానా అని ప్రవళ్లిక ఆమెను ప్రశ్నిస్తుంది. ఏదోలా గుర్తుపట్టావు కాబట్టి వదిలేశాను అని తులసి అంటుంది. అప్పుడు ప్రవళ్లిక 'లంగా వోణి వేసుకొని నుదిటిన బొట్టు పెట్టుకొని అమాయకంగా కనిపించే తులసే నాకు ఇంకా కళ్ల ముందు కనిపిస్తోంది. కానీ, అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా. ప్రపంచాన్ని మొత్తం మోస్తున్నంత భారంగా ఇప్పుడు కనిపిస్తోంది' అని చెప్తుంది.

తులసికి గుడ్ న్యూస్ చెప్పిన ఫ్రెండ్

తులసికి గుడ్ న్యూస్ చెప్పిన ఫ్రెండ్

ఆ తర్వాత ప్రవళ్లిక 'కలవాలని మనసులో ఉంటే ఎన్నో మార్గలు ఉంటాయి. నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఎంతగా ట్రై చేశానో తెలుసా? నువ్వనే కాదు.. 90 శాతం ఆడవాళ్లు అంతే. పెళ్లి కాగానే పాత ఫ్రెండ్‌షిప్‌లను అన్నింటినీ డస్ట్‌బిన్‌లో పడేస్తారు' అని అంటుంది. తర్వాత ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. అనంతరం ప్రవళ్లిక ఒక డాక్యుమెంట్‌ను తులసికి ఇచ్చి అది చదువు అంటుంది. అంతేకాదు 'అన్యాయంగా నీ ఫ్యాక్టరీని సీజ్ చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశావు కదా. ఆ అన్యాయాన్ని సరి చేస్తూ నీ ఫ్యాక్టరీని నడుపుకోవచ్చు అని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇది' అని గుడ్ న్యూస్ చెప్తుంది.

ప్రవళ్లిక ఎవరు? అత్తమామకు చెప్పి

ప్రవళ్లిక ఎవరు? అత్తమామకు చెప్పి

ప్రవళ్లిక.. ఫ్యాక్టరీ గురించి మాట్లాడగానే తులసి 'నీకు ఈ విషయాలు అన్నీ ఎలా తెలుసు. నీకు ఎవరు చెప్పారు. నువ్వు ఏమైనా కలెక్టర్ ఆఫీసులో పని చేస్తున్నావా. నువ్వు నిజంగా దేవతవు. చాలా ఏళ్ల తర్వాత కలిసి గొప్ప గిఫ్ట్ ఇచ్చావు' అంటుంది. దీంతో ప్రవళ్లిక 'చూడు తులసి.. ఫ్రెండ్స్ మధ్య ఉండేది ఇచ్చి పుచ్చుకోవడాలు అంతే. సరే.. నేను వెళ్లి వస్తాను. మళ్లీ వస్తాను. అప్పుడు అందరినీ పరిచయం చేద్దువు కానీ' అని వెళ్లిపోతుంది. మరోవైపు పరందామయ్య, అనసూయకు తులసిని ఎలా ఓదార్చాలో అర్థం కాదు. ఇంతలో తులసి వచ్చి మన ఫ్యాక్టరీని మళ్లీ ఓపెన్ చేసుకునే ఆర్డర్స్ ఇచ్చారు అని వాళ్లకు చెప్తుంది. దీంతో ఎంతగానో సంతోషిస్తారు.

లాస్యకు ఆ నిజం చెప్పేసిన భాగ్య

లాస్యకు ఆ నిజం చెప్పేసిన భాగ్య

తులసి ఫ్యాక్టరీ మళ్లీ ఓపెన్ చేయబోతున్నారన్న విషయాన్ని లాస్యకు భాగ్య చెప్తుంది. దీంతో ఆమెకు బాగా కోపం వస్తుంది. ఇంతలో భాగ్యకు ఎవరి నుంచో ఫోన్ వస్తుంది. దీంతో లాస్య ఉన్న కోపానికి ఆమె ఫోన్‌ను కింద పడేసి తొక్కుతుంది. అంతేకాదు 'నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ సొంతం కాకూడదు. ఎలాగైనా దాన్ని క్లోజ్ చేయించాలి' అంటుంది. దీనికి భాగ్య 'మళ్లీ మనం అవకాశ కోసం ఎదురు చూడాల్సిందే' అంటుంది. దీంతో లాస్య మరో ప్లాన్ ఆలోచించాలని అనుకుంటుంది.

ఫ్యాక్టరీని రామచంద్రకు ఇచ్చేస్తూ

ఫ్యాక్టరీని రామచంద్రకు ఇచ్చేస్తూ


అనంతరం తులసి ఫ్యాక్టరీని తెరిపించి.. కార్మికులను పిలుస్తుంది. అప్పుడు 'నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఫ్యాక్టరీతో తెగ తెంపులు చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది మీ భవిష్యత్తు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మళ్లీ రేపు ఎప్పుడైనా ఫ్యాక్టరీ మూత పడితే మీ భవిష్యత్తు మళ్లీ అంధకారం అవుతుంది. అందుకే.. భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీకి మళ్లీ సమస్యలు రాకూడదంటే.. నేను ఈ ఫ్యాక్టరీలో ఉండకూడదు. నా నిర్ణయాన్ని స్వాగతించండి' అని చెప్పి ఫ్యాక్టరీ డాక్యుమెంట్లను రామచంద్రకు అప్పగించి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

పాట కొట్టేసిన డైరెక్టర్.. ప్రేమ్ ఫైట్

పాట కొట్టేసిన డైరెక్టర్.. ప్రేమ్ ఫైట్

ప్రేమ్.. మప్పీ లహరి ఆఫీస్‌కు వెళ్తాడు. అక్కడ ప్రొడ్యూసర్‌తో ఆయన మాట్లాడటం చూస్తాడు. ఏమీ అర్థం కాక ఏమైంది అని వేరే వ్యక్తిని అడుగుతాడు. దీంతో సార్ పాట రాశారు. అద్భుతంగా ఉంది అని దాని జీరాక్స్ ఒకసారి చూపిస్తాడు. దీంతో ఇది నేను రాసే పాటే అని అనుకొని షాక్ అవుతాడు ప్రేమ్. వెంటనే మప్పీ లహరి దగ్గరికి వెళ్లి సీరియస్ అవుతాడు. 'ఆ పాట రాయడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో తెలుసా సార్. ఈ పాట నాకు పేరు తీసుకొస్తుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నాకు పాటలు రాయడం చేతగాదేమో అని భయపడ్డాను. కానీ, ఇంత మోసం చేస్తారని అనుకోలేదు సార్' అని గొడవ చేస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X