Intinti Gruhalakshmi Today Episode: తులసికి ప్రవళ్లిక సపోర్ట్.. నందూతో కలిసి లాస్య కన్నింగ్ ప్లాన్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై రన్ అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీని సీజ్ చేసిన తర్వాత నందూ, అభి వచ్చి సూటిపోటి మాటలు అన్న దాన్ని తులసి జీర్ణించుకోలేకపోతుంది. ఆ సమయంలోనే ఆమె స్నేహితురాలు ప్రవళ్లిక తులసి ఇంటికి వస్తుంది. ముందుగా ఆమెను సర్‌ప్రైజ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయడానికి వీలుగా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీని తులసికి ఇస్తుంది. దీంతో ఆమె ఎంతో సంతోషించి.. ఫ్యాక్టరీని తెరుస్తుంది. కానీ, ఇకపై అందులో భాగంగా ఉండనని చెప్పి రామచంద్రతో అంటుంది. ఇక, ఫ్యాక్టరీ తెరుచుకోవడంతో లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

ప్రేమ్ కంట్రోల్.. మళ్లీ రాస్తానంటూ

ప్రేమ్ కంట్రోల్.. మళ్లీ రాస్తానంటూ


మ్యూజిక్ డైరెక్టర్ మప్పి లహరి తన పాటను కాపీ చేయడంతో ముందుగా ప్రేమ్ ఆయనతో గొడవకు దిగుతాడు. కానీ, ఆ తర్వాత అతడికి శృతి గతంలో చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తాయి. దీంతో మోసం చేసినప్పటికీ ఆయన ఆఫీస్‌లోనే పని చేయడానికి ప్రేమ్ ఒప్పుకుంటాడు. అప్పుడు మప్పీ లహరి 'ఏంటి మానేయవా.. మరి ఈ పాటను ఎవరు రాశారు చెప్పు' అని అడుగుతాడు. దీంతో మీరే రాశారు సార్ అంటాడు ప్రేమ్. దీనికాయన 'అవసరం ఉంటే చెప్తా.. మళ్లీ పాట రాద్దువు గానీ' అంటాడు. డస్ట్‌బిన్‌లో పడేయడానికా సార్ అంటాడు. దీంతో భలే క్యాచ్ చేశావు అంటాడు.

తులసి నిర్ణయంపై వాళ్లు నిరాశగా

తులసి నిర్ణయంపై వాళ్లు నిరాశగా

తులసి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. పరందామయ్య, అనసూయ, దివ్య మాత్రం బాధ పడుతూ ఉంటారు. అప్పుడు పరందామయ్య 'ఫ్యాక్టరీని వేరే వాళ్లకు ఇచ్చేయడం ఏంటి' అని ఆమెను అడుగుతాడు. దీంతో నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది అంటుంది. దీనికి అనసూయ 'నువ్వు ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చిన ఫ్యాక్టరీ అది. నీ గురించి నువ్వు ఆలోచించుకోవా తులసి' అంటుంది. దీంతో 'నిజమే ఫ్యాక్టరీని కూడా బిడ్డలా పెంచాను. అందుకేనేమో నా బిడ్డలతో పాటు అది కూడా దూరం అయింది' అంటుంది. అప్పుడు మామ 'మీ వర్కర్స్ కోసం గొప్ప మనసుతో మంచి త్యాగం చేశావమ్మా ఒప్పుకుంటాను కానీ.. ఉన్న ఆధారాన్ని వదులుకుంటే బతికేదెలా' అంటాడు.

స్పృహ తప్పి పడిపోయిన తులసి

స్పృహ తప్పి పడిపోయిన తులసి

తులసి మాటలకు అనసూయ 'అందరూ నీకు దూరం అయ్యారు. నీకు అండగా నిలబడే వారే లేరు' అంటుంది. దీనికి తులసి 'ఎవరో తోడుగా వస్తారని మనం ఆగలేం కదా. ఒకప్పుడు ఎవ్వరూ లేని స్థితి మనది. అక్కడి నుంచే కదా.. ఇప్పుడు ఇంత దూరం వచ్చాం. కష్టపడటం మనకు కొత్తేం కాదు కదా మామయ్య' అంటుంది. దీనికి పరందామయ్య 'నీ కష్టాలకు తోడు.. మేము కూడా తోడయ్యాం. మేము లేకపోతే.. నీకు ఇన్ని కష్టాలు ఉండకపోయేవి కావు' అంటాడు. అప్పుడు దివ్య 'నేను కూడా నీకు బర్డెన్ అయ్యాను. నా చదువు ఆపేస్తాను మామ్' అంటుంది. దీంతో తులసికి కళ్లు తిరిగినట్టు అవుతూ పడిపోబోతుంది.

తులసికి మద్దతు తెలిపిన ప్రవళ్లిక

తులసికి మద్దతు తెలిపిన ప్రవళ్లిక

తులసి పడిపోబోతుండగా ప్రవళ్లిక వచ్చి ఆమెను పట్టుకుంటుంది. తర్వాత ఆమెకు మంచినీరు తాగించి కూర్చోబెడుతుంది. అనంతరం ప్రవళ్లిక 'ఇప్పుడెలా ఉంది తులసి. అయినా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసి నిలదీద్దామని వచ్చాను. కానీ, నీ ఆర్గ్యుమెంట్ విన్నాక నువ్వు చేసిందే కరెక్ట్ అనిపించింది. అయినా మీరు ఏంటండి? తులసి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి తన వాళ్లుగా తనకు మద్దతుగా ఉండాలి కానీ ఇలా భయపెట్టడం ఏంటి' అని ప్రశ్నిస్తుంది. తర్వాత ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కారణం తనేనని తులసి.. ప్రవళ్లికను పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ప్రవళ్లిక.. తులసిని మోటివేట్ చేసి వెళ్లిపోతుంది.

ప్రేమ్‌కు ధైర్యం చెప్పేసిన శృతి

ప్రేమ్‌కు ధైర్యం చెప్పేసిన శృతి

డబ్బింగ్ స్టూడియోలో జరిగిన దానికి ప్రేమ్ చిరాకుగా ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ జరిగిందంతా శృతికి చెప్తాడు. దీంతో ఆమె 'కంగ్రాట్యులేషన్స్ డియర్. ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైమ్. నా ప్రేమ్ రాసిన పాట సినిమాకు సెలెక్ట్ అయింది. నా ప్రేమ్ రాసిన పాట అందరికీ నచ్చింది అంటుంది. కానీ, లిరిక్ రైటర్‌గా వాడు పేరు పెట్టుకున్నాడు. అయితే ఏంటి. నిన్నటి వరకు నీ పాట నచ్చలేదు అని బాధపడ్డావు. నీకు రాయడం రాలేదు అని భయపడ్డావు. కానీ, ఇప్పుడు ఏంటి నీ పాట అందరికీ నచ్చింది. దాని అర్థం ఏంటి? నీకు పాట రాయడం ఇష్టం అనే కదా. ఒకసారి మనసు పెట్టి ఆలోచించు ప్రేమ్.. నీకే అర్థం అవుతుంది. మనకు కావాల్సింది ఇదే కదా. పేరుదేముంది.. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. పాట నచ్చడం కావాలి ' అంటుంది.

తులసిపై రగిలిపోతోన్న లాస్య

తులసిపై రగిలిపోతోన్న లాస్య

తులసి ఫ్యాక్టరీ రీఓపెన్ అవడంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడామె 'తులసికి అదృష్టం అస్సలు వదలడం లేదు. ఎంత కష్టపడి ఫ్యాక్టరీని లేపేస్తే.. ఒక్కరోజులో తన చేతికి వచ్చింది' అని బాధపడుతుంది. మరోవైపు నందూ చిరాకుగా వస్తాడు. వచ్చీ రావడమే అతడు 'ఫ్యాక్టరీ తిరిగి చేతికి వచ్చినప్పుడు బుద్ధిగా నడుపుకోవచ్చుగా. సంబంధం లేదంటూ వదులుకోవడం ఏంటి' అని అంటాడు. దీంతో లాస్య 'ఎందుకు అంత చిరాకుగా ఉన్నావు ? తులసి ఫ్యాక్టరీ విషయం తెలిసిందా' అని అడుగుతుంది. దీంతో ఆ తెలిసింది అంటాడు.

తులసి నిర్ణయంపై నందూ అలా

తులసి నిర్ణయంపై నందూ అలా

తులసి నిర్ణయంపై నందూ కోపంగా ఉంటాడు. 'ఆ ఫ్యాక్టరీని వదులుకుంది కదా. ఇక నుంచి తనకు, ఫ్యాక్టరీకి ఏం సంబంధం లేదు. మొత్తం వదిలేసి వచ్చిందట' అంటాడు. దీంతో లాస్య సంతోషిస్తుంది. అప్పుడామె 'ఎలాగైనా తులసి రోడ్డు మీద పడ్డట్టే కదా. అది మనకు సంతోషమైన పనే కదా. అలా జరిగితేనే మామయ్య గారు వాళ్లు తులసిని వదిలేసి మన దగ్గరకు వస్తారు' అంటూ కవర్ చేసుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X