Intinti Gruhalakshmi: నందూకు గాయం.. డబ్బు విషయంలో లాస్యకు షాక్.. ఒక్క కాల్‌తో దివ్యను కాపాడిన తులసి
జనరేషన్లు మారుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫస్ట్ నైట్‌కు ముహూర్తాలు లేకపోయినా చేయాలా అని రాజ్యలక్ష్మి ప్రశ్నించగా.. ఓకే అంటూ నందూ ఆమెకు షాకిస్తాడు. కానీ, తులసి అతడిని సముదాయించడంతో కామ్ అవుతాడు. ఆ తర్వాత దివ్యను రెచ్చగొట్టాలని రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. కానీ, ఆమె మాత్రం వాళ్లు ఊహించని విధంగా చేసి మన్ననలు పొందుతుంది. ఇక, ఇంటికి వెళ్తోన్న సమయంలో అనసూయకు కూడా రాజ్యలక్ష్మి వ్యవహార శైలిపై డౌట్ వస్తుంది. ఆ సమయంలో నందూ ఏదో ఆలోచిస్తూ యాక్సిడెంట్ చేయబోతుంది. దీంతో అంతా భయపడిపోతారు.

అబద్దాలు ఎలా చెబుతున్నారో:ఇంట్లో బోర్ కొడుతుందని ఆస్పత్రికి వెళ్తానని దివ్య అనడంతో రాజ్యలక్ష్మి వద్దంటుంది. ఆ తర్వాత 'నీకు బోర్ కొట్టకుండా నేను చూసుకుంటాను. అయినా నువ్వు మహాలక్ష్మిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడ్డానికి మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే, నువ్వు ఇంట్లో అందరితోను కలిసి తిరుగుతుంటే అందరూ అలవాటు అవుతారు' అంటుంది. అప్పుడు బసవయ్య వాళ్లు జోకులు చేస్తారు. దీంతో ఇవన్నీ విన్న ప్రియ 'అబ్బా అబద్దాలు కూడా ఎంత చక్కగా చెబుతున్నారో. పాపం దివ్య మేడం ఇవన్నీ నిజం అని నమ్మేస్తుంది' అని అనుకుంటుంది.

వంట చేయమని చెప్పడంతో:అందరూ మాట్లాడుతుంటే దివ్య కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఆ సమయంలో బసవయ్య 'నువ్వు అందరితో కలిసుంటే నీ మొగుడు ఇష్టాఇష్టాలు తెలుస్తాయమ్మా. అప్పుడే నీ కాపురం కుదురుగా ఉంటుంది' అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'వెంటనే వంట మొదలు పెట్టు' అనగా.. దివ్య తనకు వంట రాదని కంగారు పడుతుంది. అప్పుడు బసవయ్య భార్య వంట వచ్చో రాదో అనగా.. రాజ్యలక్ష్మి 'తులసి వంటలో ఎక్స్‌పర్ట్ అని విన్నాను. తల్లికి వచ్చినప్పుడు కూతురికి రాదా. అందులో సగమైనా నేర్చుకోకుండా ఉంటుందా? అత్తారింటికి పంపించేటప్పుడు నేర్పకుండానే ఉంటారా' అంటుంది. తర్వాత బసవయ్య 'మీ ఆయన ప్రాణం గుత్తి వంకాయ కూరలో ఉంది. ఒక పూట వండితే నెలరోజులు నీ మాట వింటాడు. వెంటనే రంగంలోకి దిగు' అంటాడు.

నందూకు గాయం అవడంతో:సోఫాలో నిద్ర పోతున్న నందూను చూసిన తులసి 'ఆయన ఎందుకో మానసికంగా ఆందోళన పడుతున్నారు. ఎంత చెప్పమన్నా చెప్పడం లేదు' అని బాధ పడుతుంది. అంతలోనే నిద్రలో ఉన్న నందూకు అత్తింట్లో వాళ్లు పెట్టే బాధ పడలేక దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా కల వస్తుంది. దీంతో అతడు ఉలిక్కిపడి లేస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న పండ్ల బాస్కెట్‌ను తన్నడంతో అందులో ఉన్న చాకు అతడి చేతికి గుచ్చుకుని తెగిపోతుంది. అప్పుడు గాయమై రక్తం కారుతుంది. దీంతో తులసి భయంతో కంగారుగా అక్కడకు వచ్చి అతడి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది.

మీ భార్యకైనా చెప్పండి అని:ఫస్ట్ ఎయిడ్ చేస్తోన్న సమయంలోనే తులసి 'ఏం జరిగిందో చెప్పటం లేదు. కనీసం మీ ఆవిడకైనా చెప్పి గుండె బరువు దించుకోండి' అంటుంది. అప్పుడు నందూ 'నీతో తప్పితే నేను మనసు విప్పి ఎవరితోను మాట్లాడలేను. నాకు ఏదో పీడకల వచ్చింది. దివ్య ఆ ఇంట్లో సుఖంగా ఉన్నట్టు అనిపించడం లేదు. అల్లుడు తల్లి చేతిలో కీలుబొమ్మేమో అని అనుమానంగా ఉంది' అంటాడు. దీనికి తులసి 'మన కూతురు మనల్ని ఎలా ప్రేమిస్తుందో.. అతను తన తల్లిని అలా ప్రేమిస్తున్నాడు. ఇందులో తప్పేముంది' అంటుంది. దీనికి నందూ 'నేను ఎలాగో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నిజం చెప్పి నిన్ను ఎందుకు టెన్షన్ పెట్టాలి' అనుకుంటాడు.

దివ్యకు హెల్ప్ చేసిన తల్లి:రాజ్యలక్ష్మి ఆర్డర్ వేసిన తర్వాత తన గదిలోకి వచ్చిన దివ్య అప్పుడే వంట అంటున్నారు అంటూ కంగారు పడుతూ తలసికి ఫోన్ చేస్తుంది. అప్పుడామెకు జరిగిన విషయం అంతా చెప్తుంది. దీంతో తులసి 'నేను చెప్తూనే ఉన్నాను. కొంచెం వంట నేర్చుకో అత్తారింటికి వెళ్తే కష్టపడతావు అని. నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో' అంటూ దివ్యను తిడుతుంది. ఆ తర్వాత 'ఈ మాత్రానికే కంగారు పడటం ఎందుకు? వంటింట్లోకి వెళ్లిన తర్వాత వీడియో కాల్ చెయ్. నేను చెప్పింది ఫాలో అయిపో' అంటూ సలహా ఇస్తుంది. దీంతో దివ్య మంచి ఐడియా అని అంటుంది.

నందూ డబ్బుతో లాస్య షాక్:ఆ తర్వాత నందూ దగ్గరికి వచ్చిన లాస్య 'ఈమధ్య నువ్వు బాగా మారిపోయావు. నా పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అయిందో తెలుసా' అంటుంది. దీనికతడు 'ఈ మధ్య నేను పనిలో ఎంత బిజీగా ఉన్నానో మీకు కూడా తెలుసు కదా. ఇదంతా మన మధ్య ఎప్పుడూ ఉండేదే కానీ ఎల్లుండి మన బ్రాంచ్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మాట్లాడటానికి ఇంజనీర్ వస్తున్నాడు. ఆ వర్క్ అంత నువ్వే చూసుకో. అతను అడ్వాన్స్ 10,00,000 అడుగుతున్నాడు. ఎలాగూ ఆ డబ్బు బ్యాంకులో ఉంది కదా. చెక్ రెడీ చేసి పెట్టు' అంటాడు. దీంతో ఆ డబ్బును వాడుకున్న లాస్య కంగారు పడుతుంది. వెంటనే రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు తీసుకోవాలని అనుకుంటుంది.

ప్రియ ప్రశ్నకు దివ్య ఆన్సర్:ఇక, వంట చేస్తున్న దివ్య దగ్గరికి వచ్చిన ప్రియ 'కొత్త పెళ్లి కూతురికు అప్పుడే వంట చెప్పేసారు. కనీసం ఏ వస్తువు ఎక్కడ ఉందో చెప్పాలి కదా' అంటుంది. దీనికామె 'ఇదేమైనా అరణ్యమా? ఒక అరగంట కష్టపడితే ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలిసిపోతుంది' అంటుంది. అప్పుడు ప్రియ 'ఇది బావగారికి కాఫీ తాగే టైమ్. అయినా ఎవరినీ ఏది అడగరు మనమే తెలుసుకొని ఇవ్వాలి' అంటుంది. అప్పుడు దివ్య 'ఇంట్లో అందరినీ బాగానే స్టడీ చేశావు. కానీ పూర్తిగా యాక్సెప్ట్ చేసినట్లుగా అనిపించడం లేదు' అంటుంది. దీంతో కంగారుపడిన ప్రియ 'నా సంగతి వదిలేయండి. బాగా చదువుకున్న మీకు, అసలు చదివే లేని బావగారికి ప్రేమ ఎలా సెట్ అయింది. మీకేమీ నామోషీగా అనిపించడం లేదా' అని ప్రశ్నిస్తుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











