Intinti Gruhalakshmi Today Episode: లెటర్ రాసి వెళ్లిపోయిన తులసి.. అసలు విషయం తెలిసి అందరూ షాక్

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీని రామచంద్రకు అప్పగించిన తర్వాత ఇంట్లో వాళ్లందరూ తులసి నిర్ణయాన్ని తప్పుబడతారు. అప్పుడే ఆమె కళ్లు తిరిగి పడిపోబోతుంది. అంతలోనే అక్కడకు ప్రవళ్లిక వచ్చి ఆమెను పట్టుకుంటుంది. ఆ తర్వాత తులసి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంది. ఇక, ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో గొడవ పడిన తర్వాత శృతి మాటలు గుర్తొచ్చి జాబ్ చేస్తానని అంటాడు. ఆ తర్వాత ఇంటికి రావడంతో శృతి అతడికి ధైర్యం చెబుతుంది. ఇక, ఫ్యాక్టరీ రీ ఓపెన్ అవడంతో లాస్య కోపంగా ఉంటుంది. దీంతో నందూను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

దివ్యకు బాధ్యత అప్పగించిన తులసి

దివ్యకు బాధ్యత అప్పగించిన తులసి

వరుసగా కష్టాలు ఎదురవుతోన్న సమయంలో తులసి బాధలు మరింత ఎక్కువ అవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో తన కూతురు దివ్య మొబైల్‌లో అలారం పెట్టేసి తులసి ఎక్కడికో వెళ్లిపోతుంది. అలారం మోగిన వెంటనే దివ్య నిద్ర లేస్తుంది. అప్పుడు నన్ను అలారం పెట్టి మరీ ఎవరు నిద్రలేపారు అని అనుకుని ముందుకు వెళ్తుంది. అలా వెళ్లగానే ఒక టేబుల్ మీద ఒక చీటీ ఉంటుంది. అందులో 'టేబుల్ మీద ఫ్లాస్క్, ఫ్లాస్క్‌లో పాలు ఉన్నాయి. నువ్వు తాగి.. నానమ్మ, తాతయ్యకు అందించు. నేను బయటికి వెళ్తున్నాను' అని తులసి రాసినట్లు ఉండగా దివ్య షాక్ అవుతుంది.

అందరిలో కంగారు.. తులసి ఎక్కడ?

అందరిలో కంగారు.. తులసి ఎక్కడ?


దివ్య ఆ పేపర్ చదవగానే కంగారు పడుతుంది. మరోవైపు, పరందామయ్య, అనసూయ ఇద్దరూ కాఫీ కోసం ఆరాటంగా ఎదురు చూస్తుంటారు. ఇంతలో గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ నానమ్మ అంటూ దివ్య వాళ్లకు పేపర్, కాఫీ పట్టుకొని వస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు అంటుంది. నువ్వు ఈ టైమ్ కు లేవడమే విచిత్రం అంటారు. మీ కోడలు పొద్దున్నే చెప్పాపెట్టకుండా షికారుకు వెళ్లింది అని చెబుతుంది. అంటే.. కాఫీ నువ్వు చేశావా అంటే.. లేదు అమ్మ చేసి ఫ్లాస్క్‌లో పోసింది అంటుంది. ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్లినట్టు అని వాళ్లు కూడా కంగారు పడతారు.

ప్రవళ్లికతో వాకింగ్.. తులసికి ప్రశ్నలు

ప్రవళ్లికతో వాకింగ్.. తులసికి ప్రశ్నలు

ఒకవైపు తన కుటుంబ సభ్యులు కంగారు పడుతుండగా.. తులసి మాత్రం తన స్నేహితురాలు ప్రవళ్లికతో కలిసి వాకింగ్‌కు వెళ్తుంది. ఆ సమయంలోనే తన జీవితంలో జరిగిన విషయాలను ఆమెతో పంచుకుంటుంది. కానీ, ప్రవళ్లిక మాత్రం తులసి మాటలను లైట్ తీసుకుంటుంది. అంతేకాదు, 'సరైన సమాధానం చెప్పు.. నీకు పనికొచ్చే సమాధానం చెప్పు. భర్త, కాపురం, కొడుకు, కూతురు, అత్తామామలు.. బాధ్యతలు అవి తప్ప నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకున్నావు' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'నా సంసారం, నా బాధ్యత అదే నా గురించి కదా. ఇంకా నా గురించి సపరేట్‌గా ఆలోచించడానికి ఏముంది' అని అడుగుతుంది.

తులసికి ప్రవళ్లిక సలహాలు ఇస్తూనే

తులసికి ప్రవళ్లిక సలహాలు ఇస్తూనే

తులసి అడిగిన దానికి ప్రవళ్లిక 'బాధ్యతలను మోయమంటే నీ గురించి నువ్వు ఆలోచించవద్దని కాదు.. నీ ఆశలను చంపుకోవద్దని కాదు. ఆడవాళ్లు కూడా ఇలా బతుకుదామని కలలు కంటారు. ఎందుకంటే వాళ్లకూ మనసు ఉంటుంది కాబట్టి. పెళ్లి అంటే బాధ్యతలను మోస్తూ మన జీవితాన్ని త్యాగం చేయడం కాదు' అని సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత 'చూశావా చీరతో వాకింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది. మార్పు ఇక్కడి నుంచే మొదలవ్వాలి. రేపటి నుంచి వాకింగ్‌కు జాగింగ్ డ్రెస్‌లో రా' అంటుంది. దీనికి తులసి 'నేను వేసుకుంటే అందరూ నవ్వుతారు' అంటుంది. అప్పుడు ప్రవళ్లిక 'నీకు నచ్చదని వేసుకోవా.. లేక ఎవరైనా నవ్వుతారని వేసుకోవా' అని ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. అలాగే, ఈరోజు బయటకు వెళ్దామని తులసికి చెప్తుంది.

గాయత్రి ముందే అంకిత, అభి ఫైట్

గాయత్రి ముందే అంకిత, అభి ఫైట్

గాయత్రి ఇంట్లో అంకిత టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తల్లి వచ్చి 'అదేంటి ఒక్కదానివే తింటున్నావు. రెండు నిమిషాలు ఆగు.. అల్లుడు గారు కూడా వస్తున్నారు' అంటుంది. దీంతో అంకితకు కోపం వస్తుంది. ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలాగే అంకిత బిహేవ్ చేస్తోంది అంటాడు అభి. వచ్చి కూర్చున్నా కూడా భర్తను పట్టించుకోవా. టిఫిన్ సర్వ్ చేయవా అంటుంది గాయత్రి. అయినా కూడా అంకిత ఏం మాట్లాడదు. దీంతో అభినే టిఫిన్ పెట్టుకుంటాడు. గాయత్రి ముందే ఇద్దరూ తిట్టుకుంటారు. నీకు నచ్చినా నచ్చకపోయినా భర్త అడుగుజాడల్లో నడవాల్సిందే అని తల్లి చెప్పినా.. ఆమెను అంకిత ఎదురించి మాట్లాడుతుంది.

శృతికి అనారోగ్యం.. ప్రేమ్ సపర్యలు

శృతికి అనారోగ్యం.. ప్రేమ్ సపర్యలు

తీరిక లేకుండా పనుల మీద పనులు చేస్తూ గడుపుతోన్న శృతి కళ్లు తిరుగుతాయి. దీంతో కింద పడిపోబోతుంది. అది చూసిన ప్రేమ్ ఆమెను పట్టుకుని పడుకోబెడతాడు. ఆ తర్వాత చూసి జ్వరం ఎక్కువగా ఉందని చెబుతాడు. అంతేకాదు, 'ఇక నుంచి నువ్వు రెస్ట్ తీసుకో. ఈరోజు నువ్వు జాబ్‌కు డుమ్మా. నీతో పాటు నేను కూడా డుమ్మా. నువ్వు ఇలాగే ఉండిపో. నేను ఈరోజు వంట చేస్తాను' అంటూ కిచెన్‌లో ఏదేదో చేస్తాడు ప్రేమ్. ఆ తర్వాత తన వంటలను శృతిని తినిపిస్తాడు. ఇలా ఇద్దరూ కాసేపు అనారోగ్యాన్ని మర్చిపోయేలా వ్యవహరిస్తారు.

తిరిగొచ్చిన తులసి.. అందరూ షాక్

తిరిగొచ్చిన తులసి.. అందరూ షాక్


ఉదయాన్నే కనిపించకుండా వెళ్లిపోయిన తులసి కోసం పరందామయ్య, అనసూయ, దివ్యలు ఎదురు చూస్తుంటారు. అప్పుడు దివ్య 'ఏంటి నానమ్మా ఇది. మామ్ పొద్దున అనగా వెళ్లింది ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు' అంటుంది. ఇంతలో తులసి ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చీ రావడమే 'నాకోసమే ఎదురు చూస్తున్నారా? కాఫీ తాగారా' అని కుశల ప్రశ్నలు వేస్తుంది. దీంతో అనసూయ 'ముందు నువ్వు ఎక్కడికి వెళ్లావు' అని అడగ్గా వాకింగ్‌కు వెళ్లానని అంటుంది. దీంతో అంతా షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X