Intinti Gruhalakshmi: తులసికి దొరికిపోయిన లాస్య, రాజ్యలక్ష్మి.. దివ్య కూర తిని షాకైపోయిన విక్రమ్
కొత్త కొత్త షోలు మొదలవుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి డ్యూటీకి వెళ్తానన్న దివ్యను రాజ్యలక్ష్మి వద్దంటుంది. అంతేకాదు, ఇంట్లో అందరితో సరదాగా తిరుగుతూ ఉండమంటుంది. అలాగే, వంట కూడా చేయమని సలహా ఇస్తుంది. దీంతో దివ్య తల్లికి ఫోన్ చేసి ఆమె సహాయంతో గుత్తి వంకాయ కూరను వండుతుంది.
ఇక, నందూ తీరుపై తులసికి సందేహం వస్తుంది. కానీ, అతడు నిజం చెప్పడు. అలాగే, లాస్య అతడి దగ్గరకు రాగా.. పది లక్షల రూపాయలు కావాలని అడుగుతాడు. దీంతో గతంలో ఆ డబ్బును ఆమె వాడుకున్నది గుర్తు చేసుకుని.. రాజ్యలక్ష్మి దగ్గర తీసుకోవాలనుకుంటుంది.

దివ్యను చూసి జాలిపడ్డ ప్రియ: విక్రమ్ చదువు గురించి ప్రియ అడగ్గానే దివ్య 'మా ఇద్దరి మధ్య ఎప్పుడూ చదువుకు సంబంధించిన టాపిక్ ఎప్పుడూ రాలేదు. మేము ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నామో.. జీవితాంతం అంతే హాయిగా ఉంటామన్న నమ్మకం మాకుంది. అయినా నువ్వు నర్స్, సంజయ్ డాక్టర్ అయినా మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా.
అలాగే మేము కూడా' అంటుంది. దీంతో నిజం తెలిసిన ప్రియ 'పిచ్చి పిల్ల మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంటుంది. నాకేమో నిజం చెప్పటానికి నోరు పెగలడం లేదు' అని తనలో తానే బాధ పడుతుంది. ఇంతలో రాజ్యలక్ష్మి పిలవడంతో వెళ్లిపోతుంది.

తులసి వాళ్ల కంటపడ్డ లాస్య: రాములమ్మతో కలిసి తులసి కూరగాయాలు కొనేందుకు మార్కెట్‌కు బయలుదేరుతుంది. వీళ్లిద్దరూ ఆటోలో వెళ్తూ ఉండగానే.. దివ్య వంటింట్లో ఎలాంటి పాట్లు పడుతుందో అంటూ తులసి నవ్వుతుంది. అప్పుడు రాములమ్మ 'పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడపిల్లకి ఉండే పాట్లే కదమ్మా' అంటుంది.
అప్పుడు తులసి 'ఇదే మా వియ్యపురాలి హాస్పిటల్' అని రాములమ్మకు చూపిస్తుంది. అప్పుడు రాములమ్మ అక్కడ కారు దిగి లోపలికి వెళ్తున్న లాస్యను చూస్తుంది. ఆ వెంటనే తులసి 'లాస్యమ్మ ఇక్కడ పని చేస్తున్నారా. లోపలికి వెళ్తుందేంటి' అని అడగ్గా.. తులసి 'అలాంటిదేమీ లేదు. పదా చూద్దాం' అంటూ వాళ్లు కూడా లోపలికి వెళ్తారు.

కూర తిని షాకైపోయిన విక్రమ్: తను వండిన గుత్తి వంకాయ కూర మంచి సువాసన రావడంతో దివ్య సంతోషపడుతుంటుంది. ఆ వాసనకు విక్రమ్ కూడా వంట గదిలోకి వస్తాడు. అప్పుడతను 'వాసన అదిరిపోతుంది. బయటికి వెళ్తున్న నన్ను ఇటు వైపు లాక్కుని వచ్చింది' అంటూ కూరను టేస్ట్ చేస్తాడు.
దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీంతో దివ్య ఏమైంది అని కంగారుగా అడగ్గా.. 'ఏమీ లేదు.. కూర చాలా టేస్టీగా వచ్చింది. ఈ కూర ఎవరికీ పెట్టకు. నాకు మాత్రమే దాచిపెట్టు' అంటాడు. దీంతో దివ్య 'అదేంటి ఈ కూర అంటే అత్తయ్య గారికి కూడా ఇష్టమే కదా. ఆమె కూడా తింటారు' అంటుంది.

రుచి చూసి దివ్య మైండ్ బ్లాక్: దివ్య చెప్పిన మాటలకు విక్రమ్ 'కావాలంటే వాళ్లకోసం శాంతను వండమందాము' అంటాడు. కానీ, దీనికి దివ్య మాత్రం ఒప్పుకోదు. అయినప్పటికీ విక్రమ్ మాత్రం ఆమెను వారిస్తూనే ఉంటాడు. దీంతో ఆమె వెంటనే తను వండిన గుత్తి వంకాయ కూరను రుచి చూస్తుంది.
ఆ వెంటనే ఆమె మైండ్ కూడా బ్లాక్ అవుతుంది. అప్పుడు 'ఇంత చేదుగా ఉంటే అలా లొట్టలేసుకొని ఎలా తింటున్నావు? అయినా అన్ని అమ్మ చెప్పినట్లే చేశాను. అయినా ఎక్కడ తేడా వచ్చింది' అంటుంది. దీనికి విక్రమ్ 'వంకాయలను ఉప్పు నీటిలో కడిగావా' అనగా లేదు అంటుంది. దీంతో అందుకే కూర చేదు వచ్చిందని చెప్తాడతను.
దివ్యపై కోప్పడిన మామయ్య: ప్రియ వద్దని చెప్పినా వినకుండా దివ్య మామగారికి భోజనం తినిపించడానికి ఆయన గదిలోకి వెళ్తుంది. అప్పుడామె 'ఎన్నాళ్లు ఇలా చీకట్లో ఉంటారు? బయటకు రమ్మంటే నా మాట వినట్లేదు. ఉండండి నా చేతులతోనే ముద్దులు కలిపి పెడతాను' అంటుంది.
అప్పుడాయన మనసులో 'నువ్వు నాకు దగ్గరవుతున్నావంటే ఆ రాక్షసి నిన్ను ప్రశాంతంగా ఉంచదు' అనుకుంటాడు. అందుకే దివ్య లైట్ వేయగానే ప్రకాష్. ముఖం మీద వెలుతురు పడుతుంది. ఆ వంకతో దివ్యపై కోప్పడతాడు. దీంతో భయపడిపోయిన దివ్య వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
డబ్బు తీసుకోవడం చూశారు: ఆస్పత్రికి వచ్చిన తులసి వాళ్లు లాస్యను వెతుకుతుండగా.. ఒక నర్స్ ఆమెను పలకరించి ఎండీ రూమ్‌లో ఉన్నారని చెప్తుంది. అక్కడకు తులసి వాళ్లు వెళ్లి చూడగా.. లాస్య, రాజ్యలక్ష్మి నవ్వుతూ మాట్లాడుకుంటుంటారు. దీంతో తులసి 'వీళ్ళిద్దరికీ ఇప్పుడే పరిచయం కదా. ఇంతలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఏంటి' అంటుంది.
తర్వాత రాజ్యలక్ష్మి.. లాస్యకు డబ్బులు ఇవ్వటం చూసి షాక్ అవుతారు. అప్పుడు తులసి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనగా.. మీ వియ్యపురాల్ని అడిగేస్తే సరిపోతుంది కదా అని రాములమ్మ అంటుంది. దీంతో తులసి 'అలా అడిగితే బాగోదు. ఎలా తెలుసుకోవాలో అలాగే తెలుసుకుంటాను' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మామ గురించి మాట్లాడుతూ: ఇక, ఇంట్లో దివ్య మామగారు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన విక్రమ్‌తో 'నేను మీ నాన్నగారి గురించి మాట్లాడాలి' అంటుంది. దీనికతడు 'మాట్లాడేది ఏముంది? ఆయన గురించి నీకు అన్ని తెలుసు కదా ' అంటాడు. దీనికామె 'ఆయనకు ఏదో బాధ ఉంది. అది నువ్వు ఎప్పుడూ అడగలేదా లేకపోతే నీకు అర్థం కాలేదా? అయినా ఏదో జరగకపోతే ఆయన ఎందుకు అందరికీ దూరంగా జరుగుతారు' అంటుంది.
దీంతో విక్రమ్ 'మొదటి భార్య మీద బెంగతో అయినా నిరాశకి గురవుతున్నారు. మందులు కూడా వేసుకోవటం లేదు. మేము ఎంత చెప్పినా వినటం లేదు. ఒకవేళ మాది లోపం అని నీకు అనిపిస్తే ఆయనని మార్చటానికి ప్రయత్నించు. నీవల్ల మా నాన్నగారు బాగుపడితే మంచిదే' అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











