twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: ఇంట్లో నుంచి నందూ, లాస్య ఔట్.. తులసి తీరుపై శృతి ఆగ్రహం

    |

    చాలా భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే చాలా కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య, అనసూయ ఎక్కడ ఉన్నారో ప్రేమ్ కనుక్కుంటాడు. వెంటనే ఆ విషయాన్ని మాధవికి చెప్తాడు. దీంతో ఆమె తులసిని తీసుకుని అక్కడకు వెళ్తుంది. కానీ, ఇంటికి రావడానికి పరందామయ్య, అనసూయ నిరాకరిస్తారు. అప్పుడు వాళ్లను నందూతో పంపనని హామీ ఇస్తుంది తులసి. దీంతో వాళ్లిద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు నందూ.. తులసి ప్లాన్ ప్రకారమే వాళ్లిద్దరూ వెళ్లిపోయారని ఆరోపిస్తూ గొడవకు దిగుతాడు. అప్పుడు లాస్య కూడా అతడికి సపోర్టుగా తులసిని నోటికొచ్చినట్లు మాట్లాడి నిందలు వేస్తుంది.

    Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!

    నందూ, లాస్యకు తులసి ఆన్సర్

    నందూ, లాస్యకు తులసి ఆన్సర్

    నందూ తనను నోటికొచ్చినట్లు తిడుతుండడంతో తులసి స్పందిస్తుంది. 'నేను పెద్ద ఫెయిల్యూర్. నా గురించి.. నా జీవితం గురించి ఆలోచించకుండా మీకు కట్టుబానిసలా బతికాను కదా.. అది కూడా నా ఫెయిల్యూరే' అంటుంది. అప్పుడు లాస్య విషయాన్ని డైవర్ట్ చేస్తున్నావు తులసి అని అంటుంది. దీనికి మాధవి 'అస్సలు కాదు. నీ భర్త తేనెతెట్టెను కదిపాడు. భర్తగా వీడు నీకు మర్యాద ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు అమ్మా మర్యాద ఇవ్వడం' అంటుంది. అప్పుడు తులసి కూడా తన నోటికి పని చెబుతుంది. ఈ క్రమంలోనే నందూ తప్పులను ఎత్తి చూపుతుంది.

    నందూపై తులసి తీవ్ర ఆగ్రహం

    నందూపై తులసి తీవ్ర ఆగ్రహం

    నందూ క్యారెక్టర్ గురించి తులసి మాట్లాడుతూ.. 'ఏ ఒక్క రోజూ ఆయన నన్ను సినిమాకు షికారుకు తీసుకెళ్లలేదు.. ఏ ఒక్క రోజు నన్ను మెచ్చుకున్నది లేదు. భార్యంటే ఆయన దృష్టిలో ఒక డోర్ మ్యాట్ మాత్రమే. దానికి అవసరాలు ఉండవు. అయినా ఎప్పుడూ నేను కిక్కురుమనలేను.. భార్యను కదా. నాకు జరిగే అవమానాల కన్నా ఆయన గౌరవమే ముఖ్యం. భర్తగా మీరు అతిపెద్ద ఫెయిల్యూర్. ఇక తండ్రిగా మీ గొప్పదనం కూడా వింటారా.. పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ మీరు పట్టించుకోలేదు. మీ అవసరానికి మాత్రం ప్రేమ్‌కు ఇష్టం లేని పెళ్లి చేయడానికి తయారయ్యారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

    ప్రియుడికి శృతి హాసన్ సర్‌ప్రైజ్: స్పెషల్ డేన ఆ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసి మరీ!ప్రియుడికి శృతి హాసన్ సర్‌ప్రైజ్: స్పెషల్ డేన ఆ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసి మరీ!

    నా ఫెయిల్యూర్‌కు నువ్వు రీజన్

    నా ఫెయిల్యూర్‌కు నువ్వు రీజన్

    తులసి అంతటితో ఆపకుండా 'తండ్రిగా మీరు పెద్ద ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారా? పొరపాటున మామయ్య వాళ్లు మీతో వస్తే వాళ్ల ఆరోగ్యం చెడిపోతే దేవుడి మీద భారం వేసి కూర్చుంటారా? ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని మీ అమ్మానాన్నను తీసుకెళ్లడం కాదు. నీకు నిజంగా బాధ్యత ఉండాలి' అంటుంది. అప్పుడు నందూ 'నేను నిన్ను దూరం పెట్టినప్పటి నుంచి నువ్వు పిల్లల్లో నా మీద ద్వేషం పెంచావు. తండ్రిగా నేను ఫెయిల్యూర్ అయ్యానంటే దానికి కారణం నువ్వే. సంపాదిస్తున్నాను అనే అహంకారం నీ కళ్లలో కనిపిస్తోంది. ఇలాగే ప్రవర్తిస్తే నువ్వు దెబ్బతింటావు' అంటూ హెచ్చరిస్తాడు.

    నా ప్రయాణం మాత్రం ఆగదని

    నా ప్రయాణం మాత్రం ఆగదని

    తులసిని హెచ్చరిస్తూ నందూ 'మగతోడు లేని వాళ్లను సమాజం ఎలా చూస్తుందో నేను వెళ్లాక నీకు తెలుస్తుంది' అంటాడు. అప్పుడామె 'నాకు చదువు లేకున్నా నేను నా కాళ్ల మీద నేను బతుకుతున్నాను' అంటుంది. దీనికి నందూ 'కబుర్లు చెప్పడం తేలికే తులసి' అంటాడు. అప్పుడు తులసి 'ఎవరు వచ్చినా రాకపోయినా ప్రయాణం ఆగదు' అంటుంది. దీనికి నందూ నా వాళ్లు ఎవరా అని చుట్టూ చూడాల్సి వస్తుంది అంటాడు. దీంతో తులసి 'ఖచ్చితంగా మీ వైపు మాత్రం చూడను నందగోపాల్ గారు. ఎలా ఉండాలో కాదు.. ఎలా ఉండకూడదో కూడా తెలుసుకున్నాను' అంటుంది.

    Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

    ఇంట్లోంచి నందూ, లాస్య ఔట్

    ఇంట్లోంచి నందూ, లాస్య ఔట్

    తులసితో గొడవ పడిన తర్వాత నందూ, లాస్య ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. దీంతో తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో ఆమెను అందరూ ఓదార్చుతారు. మరోవైపు ప్రేమ్.. ఇంట్లో ఏ గొడవ అయిందో అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో రాములమ్మ వచ్చి 'మీ నాన్న గారు వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పెద్దయ్య గారి వాళ్లను తులసమ్మ పంపించలేదు. లాస్యమ్మ వెళ్లిపోయాక ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంది' అంటుంది. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. అప్పుడు మీరు వెళ్లొచ్చు కదా అంటుందామె. దీనికి శృతి 'ఆంటి ఇప్పుడు పిలిచినా కూడా మేము అక్కడకి రాము. ప్రేమ్ కన్న కల నెరవేరితేనే అక్కడ అడుగుపెడతాడు' అని బదులిస్తుంది.

    తులసికి గాయాలు.. అత్త అలా

    తులసికి గాయాలు.. అత్త అలా

    ఒకవైపు నందూ, లాస్య వెళ్లిపోయారని కుమిలిపోతోన్న తులసి కాళ్లకు గాయాలు అయి ఉంటాయి. దీంతో ఆమె పడుకుని ఎంతగానో ఇబ్బంది పడుతుంది. అప్పుడు మాధవి అదంతా చూసి బాధ పడుతుంది. అంతలో పరందామయ్య, అనసూయ అక్కడకు వస్తారు. మాధవి.. తులసి గాయాల గురించి వాళ్లకు చెబుతుంది. దీంతో అనసూయ వెళ్లి తులసి పాదాలకు ఆయింట్‌మెంట్ పూస్తుంది. దీంతో తులసి చూసి.. అయ్యో అత్తయ్య ఏం చేస్తున్నారు అంటుంది. అప్పుడు అనసూయ 'నన్ను నీ అమ్మను అనుకో అమ్మా. రాయనివ్వు' అంటూ దాన్ని అప్లై చేస్తుంది.

    స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంటస్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట

    కొత్త ఫ్లాట్.. నందూ ఆలోచనలో

    కొత్త ఫ్లాట్.. నందూ ఆలోచనలో

    ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నందూ, లాస్య కొత్త ఫ్లాట్‌లో అడుగు పెడతారు. లోపలికి వెళ్లగానే నందూ చైర్‌లో కూర్చుండిపోతాడు. అప్పుడు లాస్య 'నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది నందూ. ఇప్పటికైనా పంజరం నుంచి నన్ను బయటపడేశావు. చాలా ప్రశాంతంగా ఉంది. ఏమంటావు నందూ' అంటుంది. నందూ మాత్రం చాలా దీనంగా కూర్చొని ఉంటాడు. అప్పుడామె 'ఇప్పటి వరకు నేను చెప్పింది ఏం వినలేదు కదా ' అనగా విన్నాను అంటాడు. మరి సమాధానం చెప్పకుండా అలా ఉన్నావు ఎందుకు అంటుంది లాస్య. ఆ తులసి అన్న మాటలు తీసుకోలేకపోతున్నా అంటాడు నందూ. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 596: Tulasi Points Out Nandhu Mistakes. After That He And Lasya Leave The House. Then Tulasi Cried A lot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X