Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్ పెళ్లి డేట్ ఫిక్స్.. నందూకు అనుమానం.. డీల్ విషయంలో లాస్యకు షాక్

ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలో విక్రమ్ చెక్కులు పంచుతూ ఉండగా దివ్య చూసి షాక్ అవుతుంది. నిజం తెలుసుకున్న తర్వాత విక్రమ్‌ తనను నమ్మించి మోసం చేశాడంటూ గొడవకు దిగుతుంది. దీంతో విక్రమ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తాడు.

ఎలాగోలా ఆమెను కూల్ చేసి ప్రేమిస్తున్నట్లు కన్ఫార్మ్ చేసుకుంటాడు. మరోవైపు, రాజ్యలక్ష్మితో డీల్ కుదుర్చుకున్న తర్వాత లాస్య.. దివ్యకు విక్రమ్ సంబంధం చూసినట్లు తులసి వాళ్లకు చెప్తుంది. వాళ్లు ఒప్పుకోకపోవడంతో దివ్య, విక్రమ్ ప్రేమించుకుంటున్నట్లు అందరికీ నిజం చెప్పేస్తుంది.

 లాస్యకు థ్యాంక్స్ చెప్పిన తులసి

లాస్యకు థ్యాంక్స్ చెప్పిన తులసి

దివ్య తన ప్రేమ గురించి చెప్పగానే తులసి 'చాలామ్మా.. నువ్వు ఏది కోరుకున్నావో.. అదే నీ దగ్గరకు రాబోతుంది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు' అని అంటుంది. అప్పుడు లాస్య మనసులో 'ఎంత అదృష్టవంతురాలు అనేది పెళ్లయ్యాక తెలుస్తుంది' అని అనుకుంటూ ఉంటుంది.

ఆ తర్వాత లాస్య మంచే చేస్తుందని భావించిన తులసి 'తల్లి స్థానంలో నేను ఉండి చేయాల్సిన పని నువ్వు చేసావు. థాంక్స్ లాస్య' అంటుంది. దీనికామె 'అదే మాట నందూకు కూడా చెప్పు' అంటూ.. ఇంకెందుకు ఆలస్యం రేపే పెళ్లిచూపులు ఏర్పాటు చేద్దాం అంటుంది.

జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి

జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి

లాస్య పెళ్లి చూపుల గురించి చెప్పగానే తులసి ఓకే అంటుంది. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. తర్వాత రాజ్యలక్ష్మికి ఫోన్ చేసిన లాస్య.. పెళ్లి చూపులకు రమ్మని చెబుతుంది. దీంతో ఆమె 'నిజాలు చెప్పి ఒప్పించవా? అబద్ధాలు చెప్పి ఒప్పించావా' అని లాస్యను ప్రశ్నిస్తుంది. దీంతో నిజమే చెప్పానని లాస్య అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి 'గుడ్.. మరి తులసి ఫీలింగ్ ఏంటి' అని అడుగుతుంది. అప్పుడు లాస్య 'ఎంతైనా కూతురు ప్రేమించింది కదా.

అందుకే కాదనలేకపోయింది. బలిచ్చే మేకలా తులసి తన కూతుర్ని తానే ముస్తాబు చేయబోతోంది. మీ ఇంటికి కోడలు చేసిన తర్వాత గుండెలు బాదుకుని ఏడుస్తుంది' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'జీవితాంతం ఆ తల్లి కూతుర్లు ఏడుస్తూనే ఉండాలి' అని చెబుతుంది.

పెళ్లి చేయాల్సిన బాధ్యతా నీదే

పెళ్లి చేయాల్సిన బాధ్యతా నీదే

రాజ్యలక్ష్మి మాటలకు లాస్య 'పెళ్లి చూపుల వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ పెళ్లయిపోయినట్టే' అంటుంది. దీనికామె 'అలా కాదు.. మనం అనుకున్న డీల్ ప్రకారం పెళ్లి కూడా నీ బాధ్యత. ఎలాంటి అడ్డంకులు వచ్చినా నువ్వే చూసుకోవాలి. అప్పుడే నీకు కావాల్సిన అమౌంట్‌ను నేను ఇస్తాను' అంటుంది. తర్వాత విక్రమ్ తన తల్లి దగ్గరకు వచ్చి తన ప్రేమ విషయం గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాడు.

దీంతో రాజ్యలక్ష్మి 'నాకు అంతా తెలుసు నాన్నా. నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు దివ్య కదా' అంటుంది. దీంతో విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తర్వాత విక్రమ్ సంతోషపడుతూ ఉండగా.. పెళ్లి చూపుల గురించి ఆమె చెప్తుంది. దీంతో 'దివ్య వల్ల నీకు గాని మన ఇంట్లో గాని ఎటువంటి సమస్య రాదు అందుకు బాధ్యత నాది' అంటాడు

లాస్య తీరుపై అనుమానంగానే

లాస్య తీరుపై అనుమానంగానే

నందూ ఒంటరిగా కూర్చుని ఉండగా తులసి అక్కడకు వెళ్లి దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. దీంతో అతడు 'రేపటి పెళ్లి చూపుల గురించి. తొందరపడి పెళ్లి చూపులకు ఒప్పుకున్నామేమో అనిపిస్తుంది' అంటాడు. దీనికి తులసి దేని గురించి మీ అనుమానం అని అడుగుతుంది. దీంతో నందూ 'మొదటి విషయం లాస్య ఇన్వాల్వ్మెంట్.. తన మీద నాకు నమ్మకం ఎప్పుడో పోయింది' అంటాడు.

దీనికామె 'ఇది లాస్య తెచ్చిన సంబంధం కాదు దివ్య కోరుకున్న సంబంధం' అనగా.. నందూ 'అలాంటప్పుడు ఇందులో లాస్య ఎందుకు అంత ఇన్వాల్వ్ అవుతుంది? ఇందులో ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది' అంటాడు. దీంతో తులసి ఆలోచనలో పడుతుంది.

లాస్యను దూరం పెట్టాలనుకుని

లాస్యను దూరం పెట్టాలనుకుని

ఆ తర్వాత నందూ 'లాస్య ఎప్పుడూ ఒకరి తలపై చేతులు పెట్టి పైకి ఎదగాలని చూస్తుంది. నేను ఇప్పటికీ ఎప్పటికీ లాస్య మాటలు వినను, నమ్మను కానీ.. నిన్ను దివ్యని నమ్ముతున్నాను' అంటాడు. అప్పుడు తులసి 'దివ్య చాలా పరిమితి చెందింది. దేని గురించి అయినా కానీ పూర్తిగా తెలుసుకొని గాని ఇటువంటి నిర్ణయం తీసుకోదు' అని చెప్తుంది.

దీంతో నందూ 'ఎందుకైనా మంచిది.. దివ్య పెళ్లి సమయంలో లాస్యను దూరం పెడదామా' అని అంటాడు. దీంతో తులసి 'అది నాకు సంబంధం లేని వ్యవహారం.. నేను చెప్పినా వినదు.. మీరే ఏదో ఒకటి చేయండి' అంటుంది. అప్పుడు నందూ 'కిందటిసారి పెళ్లి అప్పుడే చెప్పాను.. అయినా సిగ్గులేకుండా ఇన్వాల్వ్ అవుతోంది' అంటాడు. దీంతో తులసి సరే మన జాగ్రత్తలో మనం ఉందాం అంటుంది.

పెళ్లి చూపులు.. విక్రమ్ ట్విస్టు

పెళ్లి చూపులు.. విక్రమ్ ట్విస్టు

మరుసటి రోజు ఉదయం విక్రమ్ వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు. అప్పుడు లాస్య తెగ హడావిడి చేస్తుండగా.. రాజ్యలక్ష్మి మాత్రం తెగ యాక్టింగ్ చేస్తూ తులసితో మంచిగా మాట్లాడుతుంది. అప్పుడు తులసి 'మీ అబ్బాయి సంజయ్ విషయంలో మా దివ్య చేసిన పనికి' అని అనబోతుండగా.. బసవయ్య 'ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టింది అని మా అక్క చాలా సంతోషించింది' అని అబద్దం చెప్తాడు. తర్వాత దివ్య వచ్చి రాజ్యలక్ష్మి ఆశీర్వాదం తీసుకుని కూర్చోగా.. ఇద్దరూ చూసుకుని నవ్వుకుంటారు.

ఆ తర్వాత లాస్య 'మీది లవ్ మ్యారేజే అయినా ఎందుకైనా మంచిదని అడుగుతున్నా. మీ ఇద్దరికీ ఈ పెళ్లి ఇష్టమేనా అనగా.. విక్రమ్ 'నాకు ఇష్టం కాదు. నా అదృష్టం' అని అంటాడు. తర్వాత దివ్య కూడా నాకు ఓకే అని చెబుతుంది.

మేము విడాకులు తీసుకున్నాం

అంతా ఓకే అనుకున్నాక దివ్య నవ్వుతూ ఉంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి మనసులో 'బాగా నవ్వుకో దివ్య.. పెళ్ళైయ్యాక నీకు ఆ క్షణం నవ్వు ఎప్పటికీ ఉండదు' అని మనసులో అనుకుంటుంది. ఆ సమయంలో తులసి 'అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను, నందగోపాల్ గారు విడాకులు తీసుకున్నాము. కూతురి పెళ్లి అని ఇతరులకు చేప్తున్నాము' అని అనడంతో రాజ్యలక్ష్మి మాకు అంతా తెలుసు అంటుంది. తర్వాత పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు చెప్తుంది. ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్లి దివ్య చేసిన పనులు తలుచుకుని రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆమెను బసవయ్య ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X