twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసికి గుడ్ న్యూస్ చెప్పిన జీకే.. శృతికి భారీ షాకిచ్చిన అక్షర

    |

    తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే చాలా కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య, అనసూయ విషయంలో తులసిని నిందిస్తూ నందూ, లాస్యలు గొడవ పడతారు. దీంతో తులసి వీళ్లిద్దరిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ చురకలు అంటిస్తుంది. అలా చాలా సేపు నందూకు అతడి తప్పులు గుర్తు చేస్తుంది.

    ఆ తర్వాత నందూ, లాస్య ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. అనంతరం తులసి ఏడుస్తూ పడుకోగా.. ఆమె కాళ్లకు ఉన్న గాయాలకు అనసూయ మందు రాస్తుంది. చివర్లో లాస్య, నందూ కొత్త ఫ్లాట్‌కు చేరుకుంటారు. అప్పుడు లాస్య సంతోషంగా ఉన్నా.. నందూ మాత్రం తులసిపై రగిలిపోతూ కనిపిస్తాడు.

    శృంగార వీడియోలు షేర్ చేసిన రాంగోపాల్ వర్మ: వామ్మో ఇద్దరు హీరోయిన్లతో దారుణంగా!శృంగార వీడియోలు షేర్ చేసిన రాంగోపాల్ వర్మ: వామ్మో ఇద్దరు హీరోయిన్లతో దారుణంగా!

    తులసి రోడ్డున పడడం ఖాయమని

    తులసి రోడ్డున పడడం ఖాయమని

    ఇంట్లో నుంచి వెళ్లిపోయినా లాస్య, నందూ తులసి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె మీద కోపంతో నందూ రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు 'భర్త లేకపోతే బతకడం ఎంత కష్టమో తులసికి అర్థం అవుతుంది. ఈ తండ్రి సపోర్ట్ లేకుండా పిల్లల జీవితాలను ఎలా నిలబెడుతుందో నేను చూస్తాను' అని అంటాడు నందూ. అప్పుడు లాస్య 'అంతెందుకు నందూ.. శశికల అప్పు తీర్చలేక తులసి రోడ్డున పడాల్సిందే. అయినా ఇలాంటి కష్ట సమయంలో మీ అమ్మనాన్నలను తీసుకెళ్లి పెట్టుకుంది. వాళ్లే తర్వాత మన దగ్గరకు వచ్చేస్తారులే' అని సమాధానం చెబుతుంది.

    తులసికి జీకే ఫోన్.. విషయం చెప్పి

    తులసికి జీకే ఫోన్.. విషయం చెప్పి

    చాలా రోజుల తర్వాత జీకే.. తులసికి ఫోన్ చేస్తాడు. ఎలా ఉన్నావమ్మా అంటాడు. నందూ మారాడా అని ఆయన అడుగుతాడు. దీనికామె 'ఇల్లు మారాడు. లాస్యను తీసుకొని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది.. అది సహజం కానీ.. ఈయనలో స్వార్థం మాత్రమే ఉంది' అంటుంది. దీంతో విడాకులు తీసుకొని మంచి పని చేశావమ్మా అంటాడు జీకే.

    దీనికి తులసి 'మంచి జరుగుతుందనో.. మరో కారణంతోనో నేను విడాకులు తీసుకోలేదు అన్నయ్య గారూ. పరిస్థితులు అలాంటి పని చేశాయి' అంటూ సమాధానం చెబుతుంది.

    Bigg Boss Non Stop: అతడి వల్లే తేజస్వీ బలి.. ప్లాన్ ప్రకారమే ఎలిమినేట్.. తెరపైకి సంచలన నిజంBigg Boss Non Stop: అతడి వల్లే తేజస్వీ బలి.. ప్లాన్ ప్రకారమే ఎలిమినేట్.. తెరపైకి సంచలన నిజం

    తులసికి గుడ్ న్యూస్ చెప్పిన జీకే

    తులసికి గుడ్ న్యూస్ చెప్పిన జీకే

    మంచి చెడ్డల గురించి మాట్లాడుకున్న తర్వాత జీకే 'నీకో శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను' అని తులసితో అంటాడు. ఆ వెంటనే తులసి 'అక్షరకు పెళ్లి కుదిరిందా అన్నయ్య గారూ' అని అడుగుతుంది. అప్పుడు జీకే 'అనుకోకుండా అక్షర పెళ్లి అయిపోయిందమ్మా. రేపు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాం. మీరంతా తప్పకుండా రావాలి' అంటాడు. దీనికి రేపు కుదరదు అంటుంది. దీనికాయన 'అయితే మీకు కుదిరినప్పుడే రిసెప్షన్ పెట్టుకుంటాం' అంటాడు. అప్పుడు తులసి 'సరే.. మాకోసం మీరేమీ మార్చకండి. రేపు మేమంతా వస్తాం' అంటుంది.

    ప్రేమ్‌ కోసం శృతికి అక్షర కాలింగ్

    ప్రేమ్‌ కోసం శృతికి అక్షర కాలింగ్

    జీకే.. తులసి కుటుంబం మొత్తాన్ని రిసెప్షన్‌కు ఆహ్వానించగా.. శృతికి అక్షర ఫోన్ చేస్తుంది. రేపు రాత్రి రిసెప్షన్ ఉంది.. తప్పకుండా ప్రేమ్‌తో కలిసి నువ్వు కూడా రావాలి అని చెబుతుంది. దీంతో షాకైన శృతి 'అసలు నీ పెళ్లి ఎప్పుడు అయింది' అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'పెళ్లి ఎవరికీ చెప్పకుండా చేసుకున్నాను. ప్రేమ్‌ను ఖచ్చితంగా తీసుకొనిరా' అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు శృతి 'అక్షర మ్యారేజ్ రిసెప్షన్ అంటే అక్కడికి అందరూ వస్తారు కదా. అంటే ప్రేమ్ మాత్రం ఖచ్చితంగా రాడు. ఇప్పుడు ఏం చేయాలి' అని తనలో తాను అనుకుంటుంది.

    బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

    లాస్యను కూడా ఒప్పించిన నందూ

    లాస్యను కూడా ఒప్పించిన నందూ

    మ్యారేజ్ రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. తులసి, పరందామయ్య, అనసూయ, దివ్యలు వస్తారు. ఇంతలో గందం గజాలా (తాగుబోతు రమేష్) ఈవెంట్ మేనేజర్‌గా ఎంట్రీ ఇచ్చి కాసేపు వాళ్లను నవ్విస్తాడు. లాస్య, నందూ కూడా రిసెప్షన్‌కు రెడీ అవుతారు. లాస్య వెళ్దామా అంటాడు నందూ. దీనికామె 'జీకే గారి ఇంటటి ఫంక్షన్‌కు వెళ్లడం నాకు ఇష్టం లేదు అని నేను ఇప్పటికే చెప్పాను కదా. తులసి కూడా అక్కడికి వస్తుంది. నాకు ఆమె మొహం చూడటం ఇష్టం లేదు' అంటుంది. అప్పుడు నందూ 'నాకు కూడా వెళ్లడం ఇష్టం లేదు కానీ.. రేపు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆయనతో మనకు ఏదైనా అవసరం ఉంటుంది' అని ఒప్పిస్తాడు.

    లాస్యను అవమానించిన గజాలా

    లాస్యను అవమానించిన గజాలా

    రిసెప్షన్‌కు 'జానకి కలగనలేదు', 'దేవత' సీరియళ్ల హీరోలు గెస్టులుగా వస్తారు. దీంతో ఫంక్షన్ సందడిగా సాగుతుంటుంది. అప్పుడు తులసి.. అక్షరతో ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. ఆ సమయంలో శృతి వస్తుండడాన్ని చూసి పక్కకు వెళ్లిపోతుంది. ఇక, శృతిని అక్షర.. ప్రేమ్ గురించి అడగ్గా ఏదో కారణం చెబుతుంది.

    మరోవైపు, నందూ, లాస్యలు తులసి కుటుంబానికి ఎదురు పడతారు. అప్పుడు గంధం గజాలా లాస్యను నందూకు పీఏ అంటూ అవమానిస్తాడు. అంతేకాదు, 'నేను సింగిల్ నాతో మింగిల్ అవుతావా' అని సూటిగా అడుగుతాడు. దీంతో నందూ తన భర్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    Rahul Sipligunj Arrest: రాహుల్ సిప్లీగంజ్ అరెస్ట్.. పోలీసుల అదుపులో మరికొందరు ప్రముఖులు!Rahul Sipligunj Arrest: రాహుల్ సిప్లీగంజ్ అరెస్ట్.. పోలీసుల అదుపులో మరికొందరు ప్రముఖులు!

    ఫంక్షన్ అయ్యేలోపు చూసుకుంటా

    ఫంక్షన్ అయ్యేలోపు చూసుకుంటా

    గంధం గజాలా అన్న మాటలకు అందరూ నవ్వుకుంటారు. దీంతో లాస్యకు ఎంతగానో కోపం వస్తుంది. అప్పుడు నందూను తీసుకుని పక్కకు వెళ్లిపోతుంది. అప్పుడు 'ఆ తులసి ముందే నాకు అవమానం జరిగింది. దివ్య వాళ్లు నవ్వుతుంటే తులసి కనీసం ఆపలేదు. చెప్తా. ఫంక్షన్ అయ్యేలోపు నిన్ను చూసి అందరూ నవ్వుకునేలా చేయకపోతే నా పేరు లాస్యే కాదు' అని అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 597: Tulasi Blamed Shruti At Akshara's Function. After That Lasya Decided To Seek Revenge on Tulasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X