Intinti Gruhalakshmi Today Episode: తులసికి మందు కలిపిచ్చిన లాస్య.. మత్తులో పిచ్చిపిచ్చిగా ఎగురుతూ!

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే చాలా కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారన్న బాధలో ఉన్న తులసికి జీకే ఫోన్ చేస్తాడు. అప్పుడామె మంచి చెడ్డల గురించి అడిగి తెలుసుకున్న తర్వాత అక్షరకు వివాహం అయిపోయిందని, రిసెప్షన్‌కు రావాలని ఆహ్వానిస్తాడు. అప్పుడామె కుదరదని అనగా.. అవసరమైతే డేట్ మారుస్తా అంటాడు. దీంతో తులసి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అక్షర.. శృతికి ఫోన్ చేసి ఆహ్వానిస్తుంది. ఇక, రిసెప్షన్ పార్టీలో తులసి, నందూ ఎదురు పడతారు. అప్పుడు గంధం గజాలా లాస్యను ఘోరంగా అవమానిస్తూ మాట్లాడతాడు.

గజాలా తీరుపై హీరోలిద్దరూ కోపంగా

గజాలా తీరుపై హీరోలిద్దరూ కోపంగా

ఈవెంట్ మేనేజర్ గంధం గజాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే గెస్టులుగా వచ్చిన సీరియల్ హీరోలు తట్టుకోలేకపోతుంటారు. అప్పుడు వీడి ఎక్స్‌స్ట్రాలు చూడలేకపోతున్నాం అని అనుకుని ఏదైనా చేయాలని నవ్వుకుంటారు. ఇంతలో దివ్య, వేద వస్తుంది. అప్పుడు వేదాతో నిన్ను కూడా ఈవెంట్ కోసం బుక్ చేసుకున్నారా అంటాడు అర్జున్. అప్పుడామె 'లేదు పెళ్లి కూతురు నా ఫ్రెండ్. అవును.. మేము వచ్చే సమయానికి బాగా నవ్వుకుంటున్నారు ఏంటి.. జోక్ ఏంటో చెబితే మేము కూడా నవ్వుకుంటాం కదా' అంటుంది వేద. దీంతో 'జోక్ కాదు.. జోకర్.. అదిగో చూడు.. వాడిని చూసే.. వాడిని ఆడుకోవాలని డిసైడ్ అయ్యాం' అంటాడు రామా.

తులసిపై లాస్య ప్లాన్... విన్న దివ్య

తులసిపై లాస్య ప్లాన్... విన్న దివ్య

ఈ పార్టీలో తులసిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్న లాస్య.. ఆమెతో మందు తాగించాలని అనుకుంటుంది. దాన్ని ఒక గ్లాస్‌లో పోసి.. 'అలవాటు ఉన్న నాకే ఇది తాగితే ఎలాగో ఉంటుంది. నువ్వు తాగితే ఇక అంతే. నిన్ను నలుగురిలో అవమానించాలి. నిన్ను చూసి అందరూ నవ్వేలా చేయాలి. నీ పరువు పోవాలంటే ఇంతకంటే మార్గం లేదు' అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా వెనకాలే ఉన్న దివ్య చూస్తుంది. అప్పుడు అక్కడకు వచ్చిన శృతితో చెప్పి 'లాస్య ఏదో ప్లాన్ చేసింది. మామ్‌ను దీని నుంచి మనమే కాపాడాలి' అని మరో ప్లాన్ వేస్తుంది.

కూతురు గురించి బాధ పడిన జీకే

కూతురు గురించి బాధ పడిన జీకే

రిసెప్షన్ స్టేజ్ మీదకు వచ్చిన జీకే.. తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాడు. అప్పుడాయన 'ఇప్పుడు నాకు కొంత సంతోషంగా.. కొంత బాధగా ఉంది. ఇంత మంచి మనసున్న అల్లుడు దొరికినందుకు హ్యాపీగా.. నా భార్య పోయినప్పటి నుంచి నా చిట్టితల్లి నా దగ్గరే పెరిగింది. ఇప్పుడు తను వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ఎప్పుడూ బాగుండాలి. మీరు అందరూ నా కూతురు, అల్లుడిని దీవించండి. ఆ తర్వాత ఈ పార్టీని ఎంజాయ్ చేద్దాం' అంటాడు జీకే. ఆ తర్వాత అందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తారు.

తులసికి మందు కలిపిచ్చిన లాస్య

తులసికి మందు కలిపిచ్చిన లాస్య

లాస్య తన ప్లాన్ ప్రకారం.. కూల్ డ్రింక్‌లో మందు కలుపుతుంది. ఆ తర్వాత వెయిటర్‌ను పిలిచి ఆ డ్రింక్ తులసికి ఇవ్వాలని చెబుతుంది. అంతేకాదు, అతడికి డబ్బులు కూడా ఇస్తుంది. ఇదంతా దివ్య, శృతి చూస్తుంటారు. లాస్య మాట ప్రకారం.. వెయిటర్ ఆ డ్రింక్‌ను తీసుకుని వెళ్లి తులసికి ఇవ్వగా.. ఆమె తాగేస్తుంది. దీంతో లాస్య తన ప్లాన్ వర్కవుట్ అయింది అని అనుకుని తెగ సంబర పడుతుంది. మరోవైపు వేద డ్యాన్స్ వేస్తుంది. అందరూ చీర్స్ అంటారు. ఇక, రామా, అర్జున్.. జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి మాతో కలిసి డ్యాన్స్ చేయండి అంటారు. ఆ తర్వాత గజాలాకు మోషన్స్ ట్యాబ్లెట్స్ కలిపిన డ్రింక్ ఇస్తారు. అలా అతడితో ఓ ఆట ఆడుకుంటారు.

లాస్యతోనే మందు తాగించిన దివ్య

లాస్యతోనే మందు తాగించిన దివ్య

తులసి జ్యూస్ తాగినా ఆమెకు మత్తు ఎక్కదు. దీంతో ఆమెది అంత స్ట్రాంగ్ బాడీనా అనుకుంటుంది లాస్య. ఇంతలో దివ్య వచ్చి 'ఆంటి.. ఒక్కరే కూర్చున్నారు ఏంటి. మీ ఇద్దరి కోసం జ్యూస్ తీసుకొచ్చాను ఆంటి.. జ్యూస్ తాగండి' అని బతిమిలాడుతుంది. దీంతో లాస్య ఆ జ్యూస్ తాగుతూ ఉంటుంది. అప్పుడు దివ్య 'మీరు వెళ్లిపోయాక ఇల్లు అంతా బొసిపోయినట్టు ఉంది' అంటూ కాకా పడుతుంది. అయితే, అంతకు ముందే దివ్య మందు గ్లాస్‌ను లాస్య తాగుతున్న జ్యూస్‌లో కలుపుతుంది. ఆ విషయాన్ని దివ్య గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది.

లాస్య పిచ్చి డ్యాన్స్.. అందరూ షాక్

లాస్య పిచ్చి డ్యాన్స్.. అందరూ షాక్

మందు కలిపిన జ్యూస్ తాగగానే.. లాస్యకు పిచ్చెక్కినట్లు అవుతుంది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి పిచ్చిపిచ్చిగా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. అది చూసి నందూకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయంలోనే ఆమెను చూసిన అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత నందూ వెళ్లి లాస్యను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ వినకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన దివ్య నవ్వుకుంటుంది. చివరకు తులసి వెళ్లి లాస్యను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్తుంది.

తులసి లాస్య ఫైట్.. సవాల్ చేస్తూ

తులసి లాస్య ఫైట్.. సవాల్ చేస్తూ

లాస్యను తులసి పక్కకు తీసుకొచ్చినా ఆమె మాత్రం వినదు. దీంతో ఆమె ముఖాన నీళ్లను కొడుతుంది. అప్పుడు తులసి 'నీ తింగరి వేషాలు చూడలేక ఏదో ఒక రోజు నీ నందూ నిన్ను వదిలేయడం ఖాయం. నా వరకు నంద గోపాల్‌తో నా కాపురం ఒక పీడ కల. ఆ పీడ కలను మళ్లీ కోరుకునే ప్రసక్తే లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు ఇలాగే ఉంటే.. నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయడం ఖాయం' అంటుంది. దీనికి లాస్య 'నీ వాళ్లను మొత్తం నా వైపుకు తిప్పుకొని నిన్ను ఒంటరి దాన్ని చేస్తా. చూద్దాం.. నీ మాట నిజం అవుతుందో నా మాట నిజం అవుతుందో' అంటూ సవాల్ చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X