Intinti Gruhalakshmi: నిజం చెప్పాలని ప్రియ ప్లాన్.. ట్విస్ట్ ఇచ్చిన అత్త.. పెళ్లి వద్దన్న దివ్య
ఐదు కాదు.. పది కాదు.. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి రాజ్యలక్ష్మి, బసవయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పెళ్లి తర్వాత దివ్యకు చుక్కలు చూపిస్తానని రాజ్యలక్ష్మి అంటుంది. ఇవన్నీ చాటుగా విన్న ప్రియ.. దివ్యకు అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది.
ఇక, పెళ్లి చూపుల తర్వాత తులసి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే దివ్య మా అమ్మ నాన్న పెళ్లి పీటల మీద కూర్చొని నాకు కన్యదానం చేయాలి అని అడుగుతుంది. దీంతో అంతా షాక్ అవుతారు. తర్వాత దివ్యకు హెల్ప్ చేయాలనుకున్న ప్రియకు రాజ్యలక్ష్మి గట్టి వార్నింగ్ ఇస్తుంది.

ప్లాన్ బయటపెట్టిన రాజ్యలక్ష్మి
ప్రియకు వార్నింగ్ ఇస్తోన్న సమయంలోనే రాజ్యలక్ష్మి 'మావాడు దాని మెడలో పసుపు తాడు వేస్తాడు. ఆ వెంటనే నేను పలుపుతాడు వేస్తాను. దాని బలుపు తగ్గేలా చేస్తాను' అని అంటుంది. అప్పుడు ప్రియ 'దయచేసి వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వండి మేడం. కావాలంటే నా మీద పగ తీర్చుకోండి' అని వేడుకుంటుంది.
దీనికి రాజ్యలక్ష్మి 'పగ నీ మీద కాదు.. దానిమీద. నీలాగే అది కూడా నా కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగాలి. వెక్కి వెక్కి ఏడవాలి. దాని చేతులతోనే వేయించిన నీ మెడలో తాళిని.. దాని చేతులతోనే తీయిస్తా. అప్పుడు దాని గురించి ఆలోచిస్తా' అంటుంది. దీంతో ప్రియ తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది.

ఆనందం శాశ్వతంగా కాదమ్మా
దివ్య, పరందామయ్య గేమ్ ఆడుతూ ఉండగా పక్కనే ఉన్న అనసూయ తింటూ ఉంటుంది. అప్పుడు చెస్‌లో దివ్య గెలుస్తుంది. దీంతో పరందామయ్య 'అబ్బా దివ్య.. ఇందాకటి నుంచి మీ నానమ్మ తెగ డిస్ట్రబ్ చేస్తోంది. పక్కకు వెళ్ళమని చెప్పు' అంటాడు. దీనికి అనసూయ నా తిండి నా ఇష్టం అంటుంది. దీనికాయన 'నీ తిండి మాత్రమే నీ ఇష్టం.
నా తిండి నుండి కూడా తింటున్నావు. నా కడుపు తరుక్కుపోతుంది' అని అనగా ఆమె కూడా కౌంటర్లు వేస్తుంది. ఆ తర్వాత దివ్య 'అవును తాతయ్య.. నేను వెళ్ళిపోయాక ఎవరితో ఆడతావు' అని అడుగుతుంది. దీంతో పరందామయ్య 'ఆనందం ఎవరీతోనూ శాశ్వతం కాదమ్మా' అని అంటాడు.

ఆ వీడియో చూసి ఎమోషనల్
దివ్య, పరందామయ్య ఆడుకుంటూ ఉండగా నందూ, తులసి వెడ్డింగ్ కార్డులు తీసుకొచ్చి సెలెక్ట్ చేయమంటారు. కానీ, దివ్యకు ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కాదు. అప్పుడు తులసి తన మనసులో 'నాకు తెలుసమ్మా.. నీకు నా సెలక్షన్ నచ్చుతుంది' అనుకుంటుంది. కానీ, దివ్య మాత్రం నందూ తెచ్చిన సెలక్షన్ బాగుంది అనడంతో సంతోషపడుతుంటాడు.
ఆ తర్వాత అందరూ దివ్యను చూసి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే నందూ.. దివ్య పుట్టినప్పుడు తీసిన వీడియోని చూసి ఆనందపడుతూ ఉండగా తులసి కూడా వస్తుంది. అప్పుడు ఇద్దరూ కలిసి ఆ వీడియో చూస్తూ మురిసిపోతారు. అది చూసిన దివ్య ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

నందూ బాధ... నువ్వే నా హీరో
తులసి కూడా దివ్య చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంది. అప్పుడు నందూ 'దివ్య నన్ను చిన్నప్పుడు కలవరించేది. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా నాపై తనకు ప్రేమ కనిపించడం లేదు' అని బాధ పడతాడు. అంతేకాదు, తన కోసం నందూ చేసినవి అన్నీ దివ్య వింటుంది. దీంతో ఏడ్చుకుంటూ వెళ్లి నందూను హత్తుకుంటుంది.
అంతేకాదు, 'నాన్న నీ మీద నాకు ఎప్పటికీ కోపం లేదు. నాన్న అమ్మకి దూరం అయ్యారు. అమ్మను ఒంటరి దాన్ని చేశారు అన్న కోపం మాత్రమే ఉండేది. అప్పుడు అమ్మ వైపు మాట్లాడాలో మీ వైపు మాట్లాడాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డా. ఆ ఒక్క విషయం తప్పితే నువ్వు ఎప్పుడూ నా హీరోవే నాన్న' అంటుంది. దీంతో నందూ కూడా ఏడుస్తాడు.

దివ్యకు నిజం చెప్పాలని ప్లాన్
రాజ్యలక్ష్మి ప్లాన్ గురించి తెలుసుకున్న ప్రియ.. 'ఎలాగైనా దివ్య మేడంకు సమాచారాన్ని చేరవేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆమెకు అత్తయ్య గారి ప్లాన్ గురించి ఎలా చెప్పాలి' అనుకుంటుంది. అంతలోనే రాజ్యలక్ష్మి 'మీ ఇంట్లో మురిపాలు ముచ్చట్లు సంతోషాలు ఎన్నో రోజులు ఉండవులే దివ్య.
అతి త్వరలోనే మాయం కాబోతున్నాయి' అని అనుకుంటుంది. ఇక, నగలు తీసుకోవడానికి రాజ్యలక్ష్మి ఇంటికి తులసి వస్తుందని తెలిసి ఆమెకు మొత్తం చెప్పాలని ప్రియ ప్లాన్ చేస్తుంది. అందుకోసం మానసికంగా కూడా సన్నద్దం అవుతూ ఉంటుంది.

బిగ్ ట్విస్ట్ ఇచ్చిన రాజ్యలక్ష్మి
తులసికి నిజం చెప్పాలని ప్రియ అనుకుంటూ ఉండగానే రాజ్యలక్ష్మి ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి 'దివ్య వాళ్ళ అమ్మను నగలు తీసుకొని వెళ్లడానికి ఇక్కడికి రమ్మన్నాను. కానీ బాగుండదని చెప్పి జువెలరీ షాప్ అతన్నే వాళ్ళ ఇంటికి పంపించాను' అని ప్రియకు ట్విస్ట్ ఇస్తుంది. దీంతో ప్రియ 'ఈ అవకాశం కూడా చేయి జారిపోయిందా? ఇప్పుడు ఎలా' అని మనసులో అనుకుంటుంది. ఇప్పుడు నాకు విక్రం బావకి చెప్పడం తప్పవేరే దారి లేదు అనుకుంటూ ఉంటుంది. అందుకోసం అతడు ఒంటరిగా ఉన్నప్పుడే చెప్పాలని ప్లాన్ చేసుకుంటుంది.
ఇంట్లో సందడి.. లాస్య టెన్షన్
దివ్య గురించి పరందామయ్య జోకులు చేస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడకు రాజ్యలక్ష్మి పంపించిన నగలు తీసుకొచ్చి తులసికి ఇస్తారు. అప్పుడు దివ్య 'మా అత్తయ్య గారు పంపించారు' అంటుంది. దీంతో అందరూ ఆమెను ఆటపట్టిస్తారు. దీంతో దివ్య అలా అయితే నేను పెళ్లి చేసుకోను అంటుంది. అది విన్న లాస్య తెగ టెన్షన్ పడుతూ 'ఇది పెళ్లి వద్దంటే నా బ్రీఫ్‌కేస్ ఏమవుతుంది' అనుకుంటుంది. తర్వాత దివ్యను కూల్ చేస్తుంది. ఇక, విక్రమ్‌కు నిజం చెప్పాలని ప్రియ అనుకుంటూ అతడి దగ్గరకు కాఫీ పట్టుకుని వెళ్తుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











