Intinti Gruhalakshmi: విక్రమ్‌కు ఆ మాట చెప్పిన ప్రియ.. నందూ, తులసిని అపార్థం చేసుకోవడంతో!

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Intinti Gruhalakshmi Serial Today Episode April 6th 2023

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యను ఎలాగైనా తన కాళ్ల దగ్గర పడేసుకుంటానని రాజ్యలక్ష్మి ప్రియకు చెబుతుంది. దీంతో ఆమె ఎలాగైనా ఈ విషయాన్ని దివ్యకు చెప్పాలని ప్లాన్ చేసుకుంటుంది. ఇక, దివ్య పెళ్లి జరగబోతుండడంతో తులసి ఇంట్లో ఎమోషనల్ సీన్స్ కనిపిస్తాయి.

అప్పుడు నందూ.. దివ్య తనను పట్టించుకోవట్లేదని బాధ పడతాడు. దీంతో తన తండ్రి గురించి తెలుసుకున్న దివ్య.. నువ్వే నా రియల్ హీరో అంటుంది. ఇక, తులసి తమ ఇంటికి వస్తే అసలు విషయం చెప్పాలని అనుకున్న ప్రియ ప్లాన్‌ను రాజ్యలక్ష్మి ఫెయిల్ అయ్యేలా చేస్తుంది.

ప్రియను ప్రశ్నించిన విక్రమ్: విక్రమ్‌కు ఎలాగైనా నిజం చెప్పాలని అనుకున్న ప్రియ.. అతడికి కాఫీ తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో బసవయ్య అక్కడే నక్కి మరీ చూస్తూ ఉంటాడు. అప్పుడు ప్రియ కాఫీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. విక్రమ్ నేను అడగలేదు కదా అంటాడు. దీంతో ప్రియ.. నాకే ఇవ్వాలనిపించింది. అందుకే మీకు తీసుకొచ్చాను అని చెప్తుంది.

ఇది విన్న బసవయ్య 'మా అక్కకు ఈ విషయం తెలిస్తే నీ గూబ గుయ్యమనిపిస్తుంది' అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ప్రియను విక్రమ్ అత్తారిల్లు ఎలా ఉంది అని అడగ్గా.. బాగుంది అంటుంది. దీంతో విక్రమ్ 'నీ ముఖం చూస్తే అలాగా అనిపించలేదు.. ఏదో కోల్పోయిన దానిలా ఉంటున్నావు' అని ప్రశ్నిస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode April 6th 2023

అవన్నీ నిజం కాదు అంటూ: విక్రమ్ ప్రశ్నించగానే ప్రియ 'ఒక మాట చెప్పనా కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కావు.. కనిపించనివి అబద్ధాలు కావు' అని అంటుంది. అప్పుడు విక్రమ్ 'నాది మా అమ్మ పెంపకం. నిజం ఏదో.. అబద్ధం ఏదో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు. అయినా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నావు' అని అడుగుతాడు.

దీంతో ప్రియ.. దివ్యని మీరే రక్షించాలి అని అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న బసవయ్య కావాలనే ఓ వస్తువును కింద పడేసి ప్రియకు అక్కడి నుంచి వార్నింగ్ ఇస్తూ సైగలు చేస్తాడు. దీంతో ప్రియ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

షాపింగ్ కోసం.. దివ్య టెన్షన్: పెళ్లికి సమయం దగ్గర పడడంతో తులసి వాళ్ళందరూ కలిసి బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్తారు. అప్పుడు దివ్యకు విక్రమ్ ఫోన్ చేసి నేను వస్తున్నాను అని చెప్పడంతో ఆమె వద్దు అంటుంది. దీనికతడు 'నువ్వు వద్దు అనగానే నేను రావడం మానేస్తానా వస్తున్నాను' అని కాల్ కట్ చేస్తాడు.

అంతలోనే తులసి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్లి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ, దివ్య మాత్రం విక్రమ్ వాస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే, తులసి, నందూకు ఇద్దరు ఒకే చోట కూర్చొని చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండగా అది చూసి దివ్య సంతోషిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode April 6th 2023

మేము భార్యభర్తలం కాదని: తులసి, నందూ కలిసి చీరలు సెలెక్ట్ చేయడంతో పరందామయ్య, అనసూయ కూడా సంతోషిస్తారు. కానీ, 'వీళ్లు ఇలా కలిసి ఉండడం ఇదే మొదటిసారి.. ఇదే చివరిసారి' అంటూ బాధ పడతారు. ఆ తర్వాత తులసి, నందూ ఇద్దరు కలిసి ఒకే చీర సెలెక్ట్ చేయడంతో.. షాపులో ఉన్న సిల్క్ సుందరం 'నా ఇన్నేళ్ల అనుభవంలో భార్యభర్తలకు ఇద్దరికీ ఒకటే చీర నచ్చడం చాలా రేర్‌గా చూశాను.

ఇది ఎనిమిదో వింత' అని అంటాడు. అది చూసి అందరూ సంతోషిస్తారు. కానీ, తులసి, నందూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతేకాదు, తులసి 'ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మేము భార్యాభర్తలం కాదు స్నేహితులం' అని అంటుంది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోతాడు.

సుందరంపై లాస్య కోపంగా: మరోవైపు, అనసూయ, పరందామయ్య బట్టల విషయంలో గొడవ పడుతూ ఉంటారు. అంతలోనే అక్కడికి సుందరం వచ్చి 'వాళ్లిద్దరూ స్నేహితులు కదా' అని అడుగుతాడు. అప్పుడు పరందామయ్య 'వాళ్ళిద్దరూ నా కొడుకు కోడలు' అంటాడు. దీంతో ఏంటో అర్థం కాక అతడు అయోమయంగా చూస్తుంటాడు. ఆ తర్వాత అతడు లాస్య దగ్గరికి వెళ్తాడు.

అప్పుడు వాళ్ల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండగా ఆమెకు కోపం వస్తుంది. దీంతో లాస్య ఒక్కసారిగా అతడిపై కోప్పడుతూ 'ఇంకొకసారి వాళ్ళిద్దరూ భార్యాభర్తలా అన్నావంటే పీక పిసికేస్తాను. ఆయన నా భర్త ఆమె పెళ్లికూతురు తల్లి' అనడంతో సిల్క్ సుందరం అర్థం కాక జుట్టు పట్టుకుని ఆలోచిస్తుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode April 6th 2023

కన్‌ఫ్యూజ్ చేసేసిన దివ్య: ఆ తర్వాత విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న దివ్య దగ్గరకు వచ్చిన సిల్క్ సుందరం.. వాళ్లిద్దరూ ఎవరు అని అడుగుతాడు. దీంతో వాళ్లిద్దరూ మా అమ్మా నాన్న అని చెబుతుంది. దీంతో సుందరానికి ఏమీ అర్థం కాదు. అసలు వీళ్లు ఎవరో అని జుట్టు పీక్కుంటూ ఉండిపోతాడు.

ఆ వెంటనే మళ్లీ ఆమెను 'నా దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి. అవి క్లియర్ చేస్తావా? మీ అమ్మ ఎవరు' అనగా తులసి వైపు చూపిస్తుంది. కానీ, కన్‌ఫ్యూజ్ చేస్తుంది. దీంతో సుందరం 'పోమ్మా నువ్వు కూడా నన్ను కన్ఫ్యూజన్ చేశావు' అంటూ అక్కడి నుంచి అయోమయంగా వెళ్లిపోతాడు.

బుజ్జి బంగారం పక్కకు రా: అనంతరం ముందుగా ఫోన్‌లో చెప్పినట్లుగానే విక్రమ్ దొంగచాటుగా షాపింగ్ మాల్‌కు వస్తాడు. అప్పుడు దివ్యకి సైగలు చేస్తుండగా దివ్య పట్టించుకోకపోవడంతో అక్కడే ఉన్న పువ్వు తీసుకొని విసర్గ అది కాస్త వెళ్లి అనసూయకు తగులుతుంది.

ఆ తర్వాత ఇంకో పూవు వేయగా పరందామయ్య చేతిలో పడుతుంది. దీంతో ఆయనే వేశాడని అనసూయ అనుకుంటుంది. చివరికి దివ్య విక్రమ్‌ను చూస్తుంది. అప్పుడు 'బుజ్జి బంగారం.. ఒకసారి పక్కకు రా మాట్లాడుకుందాం' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X