twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసికి షాకివ్వబోతున్న లాస్య, భాగ్య.. ఫలించిన ప్రేమ్‌ ప్రయత్నం

    |

    సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే చాలా కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన అప్పు తీర్చడానికి సమయం దగ్గర పడడంతో శశికళ తులసి ఇంటికి వస్తుంది. వచ్చీ రావడమే ఆమె ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతుంది. అంతేకాదు, ఇల్లు అమ్మమంటూ ఓ డీల్ కూడా ఆమె ముందు ఉంచుతుంది. అప్పుడు భాగ్య ఎంట్రీ ఇచ్చి ఇల్లు అమ్మడానికి వీలు లేదని అంటుంది.

    అంతేకాదు, ఈ ఇంట్లో తనకు కూడా వాటా ఉందని చెబుతుంది. అప్పుడు శశికళ.. ఇదంతా తులసి వేసిన ప్లాన్ అని అనుకుంటుంది. ఇక, ఉద్యోగం రాకపోవడంతో ప్రేమ్ తెగ నిరాశకు గురవుతూ ఉంటాడు.

    పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

    లాస్యతో కలిసి భాగ్య కన్నింగ్ ప్లాన్

    లాస్యతో కలిసి భాగ్య కన్నింగ్ ప్లాన్

    తులసి ఇంట్లో వాటా కావాలని అడిగిన భాగ్య.. ఆ తర్వాత లాస్యకు ఫోన్ చేస్తుంది. అప్పుడు నా వాటా కోసం ఇక్కడే ఉన్నా అని ఆమెకు చెబుతుంది. దీనికి లాస్య 'నీకే కాదు నాకు కూడా ఆ ఇంట్లో వాటా ఉంది. నేను నీతో చేతులు కలుపుతాను. కోర్టుకు వెళ్దాం. ఇద్దరం కలిసి కోర్టులో పోరాడుదాం. ఆ ఇంట్లో సగం హక్కు నీది.. సగం హక్కు నాది. ఇద్దరం కలిసి ఆ ఇంటిని మన సొంతం చేసుకోవాలి' అంటుంది. దీంతో నేను కూడా తగ్గేదేలే అంటుంది. అప్పుడు లాస్య 'అనుకోకుండా భాగ్య నా దారికి వచ్చింది. తులసి ఇక నిన్ను ఒక ఆట ఆడుకుంటా' అని అనుకుంటుంది.

    ఆ విషయంలో లాస్య, నందూ ఫైట్

    ఆ విషయంలో లాస్య, నందూ ఫైట్

    నందూ తన ఇంట్లో డిన్నర్ చేయడానికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. కానీ, అతడు తినడానికి మాత్రం ఫుడ్ ఉండదు. దీంతో లాస్యను పిలిచి తినడానికి ఏమీ వండలేదా అని అడుగుతాడు. దీంతో వండలేదు.. వండాలనిపించలేదు అంటూ పొగరుగా సమాధానం చెబుతుంది. అప్పుడు నందూ 'కనీసం ఆర్డర్ చేయొచ్చు కదా.. లేదంటే నాకు ముందే చెప్పొచ్చు కదా' అని ఆమెతో అంటాడు. దీనికి లాస్య అంతే పొగరుగా చేయలేదు.. అది కూడా తులసి నుంచి నేర్చుకోవాలా అని అడుగుతుంది. సరే.. వదిలేయ్ అని చెప్పి నందూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

    మరోసారి రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపి మరీ ఆ భాగాన్ని చూపిస్తూ!మరోసారి రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపి మరీ ఆ భాగాన్ని చూపిస్తూ!

    ప్రేమ్‌కు అబద్ధం చెప్పేసిన శృతి

    ప్రేమ్‌కు అబద్ధం చెప్పేసిన శృతి

    ఎంతో పొద్దెక్కినా పడుకొనే ఉంటాడు ప్రేమ్. ఇంకా లేవకపోయే సరికి.. ఎలాగైనా ప్రేమ్ ను నిద్రలేపాలని ఆంటి మీరేనా వచ్చింది అంటూ అబద్ధం ఆడుతుంది. దీంతో లేచి చూస్తాడు. అది అబద్ధం అని తెలిసి శృతిపై సీరియస్ అవుతాడు. ఆ తర్వాత నన్ను నిద్రలేపినందుకు నాకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అంటూ ఆమెను సతాయిస్తాడు. దీంతో ఇద్దరి మధ్యా కాసేపు రొమాంటిక్ సన్నివేశాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ప్రెష్‌అప్ అయి వచ్చి టిఫిన్ తింటాడు. ఆ తర్వాత పని కోసం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

    తులసిని అలా భయపెట్టిన లాస్య

    తులసిని అలా భయపెట్టిన లాస్య

    తులసికి లాస్య ఫోన్ చేస్తుంది. అప్పుడు 'నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. కడుపు నిండిందా లాస్య' అని అడుగుతుంది. దీనికి లాస్య 'అప్పుడేనా కథ ఇప్పుడే మొదలైంది. నీ నుంచి నందూను లాక్కున్నాను నువ్వు ఏం చేయగలిగావు' అని అడుగుతుంది. దీనికి తులసి నువ్వు లాక్కోలేదు.. నేను వదిలేశాను అంటుంది. అప్పుడు లాస్య 'అలాగే ఇంటిని కూడా వదులుకోవచ్చు కదా' అంటుంది.

    అప్పుడు తులసి 'ఏది వదులుకోవాలో.. ఏది వదులుకోవద్దో అన్నింటికీ లెక్కలు ఉంటాయి లాస్య. దేనికీ కంగారు పడకూడదు' అంటుంది. దీనికి లాస్య 'భాగ్య నేను వదిలిన బాణం. ఆ ఇల్లు అమ్మకపోతే అప్పు తీరదు. అప్పు తీర్చకపోతే శశికళ ఊరుకోదు. ఇల్లు మేము అమ్మనీయము. ఇప్పుడు నీకు ఇల్లు పాయె.. పరువు పాయె' అంటుంది.

    Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!

    ఉద్యోగం సంపాదించేసిన ప్రేమ్

    ఉద్యోగం సంపాదించేసిన ప్రేమ్

    ఉద్యోగ అన్వేషణలో భాగంగా ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కలవడానికి ఆఫీసుకు వెళ్తాడు. అక్కడ మప్పిలి హరి అనే మ్యూజిక్ డైరెక్టర్‌ను కలుస్తాడు. ఇంతలోనే ఓ అమ్మాయి వచ్చి పాటలు పాడేందుకు అవకాశం కావాలంటుంది. దీంతో ప్రేమ్‌ను వదిలేసి ఆమెతో మాట్లాడుతాడు. ఆ తర్వాత ప్రేమ్ కూడా పాట పాడి వినిపిస్తాడు. కానీ, సరిగ్గా వినడు. అప్పుడు 'కొన్నాళ్లు నాతో పనిచేయి. కాలాన్ని బట్టి అవకాశం వస్తే అప్పుడు చూద్దాం' అంటాడు. దీనికి ప్రేమ్‌కు ఎంతగానో కోపం వస్తుంది. కానీ, శృతి చెప్పిన మాటలు గుర్తొచ్చి అలాగే సార్.. థాంక్యూ అని చెబుతాడు.

    భర్తకు ఫోన్ చేసి రమ్మన్న భాగ్య

    భర్తకు ఫోన్ చేసి రమ్మన్న భాగ్య

    తులసి ఇంటిని అమ్మకుండా అడ్డుకునేందుకు భాగ్య ఎంతగానో పరితిపిస్తుంది. ఇందులో భాగంగానే తన భర్తకు ఫోన్ చేసి 'ఇంట్లో వాటా అయినా సంపాదిద్దాం.. కోర్టులో కేసు వేయాలి.. మీరు వెంటనే బయలుదేరి రండి' అని చెబుతుంది. ఆ విషయం తులసి వింటుంది. అప్పుడామె 'నేను వచ్చి మాట్లాడేవరకు కూడా ఆగలేకపోయావా భాగ్య. నేను అప్పు చేసింది మామయ్య గారి ఆపరేషన్ కోసం. నా సొంత పనులకు కాదు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 600: Prem Gets Job From Music Director. After That Tulasi Shocked After Learning about Bhagya Evil Plan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X