Intinti Gruhalakshmi Today Episode: భాగ్యకు తులసి బంపర్ ఆఫర్.. లాస్యకు భారీ షాక్.. పనిమనిషిగా శృతి
మిగిలిన భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని ఇల్లు అమ్మనివ్వకుండా అడ్డుకుంటానన్న భాగ్య.. లాస్యకు ఫోన్ చేస్తుంది. అప్పుడామె నీ వెనుక నేను ఉంటాను.. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్లు అన్నట్లుగా రెచ్చగొడుతుంది. అలా భాగ్యను అడ్డం పెట్టుకుని తులసిని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది.
ఈ విషయాన్ని తులసికే ఫోన్ చేసి చెబుతుంది. కానీ, ఆమె మాత్రం అస్సలు భయపడదు. మరోవైపు ప్రేమ్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు ఉద్యోగానికి వెళ్తాడు. ఆయన అవమానించి ఆఫర్ ఇస్తాడు. దీనికి ప్రేమ్ ఇష్టం లేకపోయినా శృతి మాట ప్రకారం ఒప్పుకుంటాడు.

భాగ్యను మార్చాలని తులసి ప్లాన్
భాగ్య వచ్చి ఇంటిని అమ్మడానికి వీలు లేదని.. అంత వరకూ వస్తే కోర్టుకు వెళ్లి తులసి మీద కేసు వేస్తానని అంటుంది. అప్పుడు తులసి 'శశికళ దగ్గర తీసుకున్న అప్పు మామయ్య గారి ఆపరేషన్ కోసమే తీసుకున్నా' అని భాగ్యతో అంటుంది.
దీనికామె'అప్పు నిన్ను ఎవరు తీసుకొమ్మన్నారు. మామయ్య గారి విషయాన్ని చూసుకోవడానికి కొడుకులు ఉన్నారు కదా. నీకెందుకు' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'అప్పు తీర్చడానికి ఈ ఇల్లు అమ్మడానికి తప్ప వేరే మార్గం లేదు భాగ్య. దయచేసి అడ్డు పడకు' అంటుంది. కానీ.. వాటా విషయంలో నేను రాజీపడను అంటుంది.

20 లక్షలు ఇస్తానని అన్న తులసి
ఎంత చెప్పినా భాగ్య వినకపోవడంతో నువ్వు లాస్య మాటలు విని ఇలా ప్రవర్తిస్తున్నావు కదా అని అడుగుతుంది. దీనికి భాగ్య 'నాది విశాల హృదయం కాదు. మనం కోర్టులోనే తేల్చుకుందాం. అక్కడే నాకు న్యాయం జరుగుతుంది' అంటుంది. దీంతో తులసి 'నువ్వు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదు.
ఎందుకంటే ఇది మామయ్య గారి కష్టార్జితం. నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఉంటే.. ఇల్లు అమ్మగా మిగిలిన 20 లక్షలు నీకు ఇస్తా. లాస్య మాటలు విని నువ్వు అనవసరంగా కోర్టుకు వెళ్తున్నావు. కేసు ఓడిపోతే నీకు నష్టం తప్పితే రుపాయి కూడా లాభం ఉండదు. లాస్య మాటలు విని నష్టపోతావా.. లేక నా మాటలు విని లాభపడతావా నువ్వే ఆలోచించుకో' అంటుంది.

పని మనిషిగా మారిపోయిన శృతి
రాములమ్మ పని చేయడానికి వేరే ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతుంది. దీంతో ఆ ఇంటి ఓనర్ ఆమెను తిడుతుంది. అంతేకాదు, 'నేను కొత్త పనిమనిషిని పెట్టుకున్నా. నువ్వు ఇక రావాల్సిన అవసరం లేదు' అంటుంది. అయితే, అక్కడ పనిమనిషిగా వచ్చింది శృతి అని రాములమ్మ చూసి షాక్ అవుతుంది. అప్పుడు శృతి 'ఇది నువ్వు పని చేసే ఇల్లు అని తెలియదు రాములమ్మ. నువ్వే పని చేసుకో' అంటుంది. దీనికి రాములమ్మ 'ఏంటమ్మా ఇదంతా. మీరు పనిమనిషిగా మారడం ఏంటి. తప్పు అనిపించలేదా' అంటుంది. దీనికి శృతి తనకు వేరే మార్గం లేదంటుంది.

ఆ ఆఫర్ గురించి లాస్యకు చెప్పి
తులసి 20 లక్షలు ఆఫర్ చేయడంతో దాని గురించే భాగ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య ఆమెకు ఫోన్ చేస్తుంది. చెప్పు లాస్య అంటుంది. అప్పుడు లాస్య 'తులసి వచ్చిందా.. నీతో మాట్లాడిందా ? మాయమాటలు చెప్పి నీ మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు అస్సలు వినకు' అని రెచ్చగొడుతుంది. అప్పుడు భాగ్య 'ఇల్లు అమ్మిన వెంటనే 20 లక్షలు నాకు ఇస్తా అంది' అని లాస్యకు చెబుతుంది. కానీ.. లాస్య తులసిని నమ్మొద్దని అంటుంది.
అంతేకాదు, భాగ్య.. తులసి మాయలో పడిపోయావా అని అడుగుతుంది. దీంతో లేదు లాస్య.. నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత ఆమెకు ఎవరివైపు వెళ్లాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. తులసి మాత్రం భాగ్య తన మాటే వింటుందని అనుకుంటుంది.

శశికళ ఎంట్రీ.. నిర్ణయం భాగ్యకే
ఇంటిని అమ్మేయాలని అనుకుంటోన్న సమయంలోనే శశికళ ఎంట్రీ ఇస్తుంది. వచ్చీ రావడమే ఆమె ఏం ఆలోచించావు అని తులసిని అడుగుతుంది. కానీ, తులసి సమాధానం చెప్పకపోవడంతో నా సహనాన్ని పరీక్షించకు. ఏ నిర్ణయం తీసుకున్నావు చెప్పు అంటూ సీరియస్ అవుతుంది. దీనికి తులసి సమాధానం చెప్పు భాగ్య అంటుంది. అంతకు ముందు ఆమెకు ఆఫర్ ఇచ్చిన దాని ప్రకారం నడుచుకోవాలని తులసి అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌ను సస్పెన్స్‌తో ముగించారు.

గత వారం గృహలక్ష్మి రేటింగ్
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఇటీవలే ఆరు వందల ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులతో సాగిపోతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది రేటింగ్‌ను కూడా అత్యధికంగా రాబడుతోంది. తద్వారా స్టార్ మాలో ప్రసారం అవుతోన్న సీరియళ్లలో టాప్ 3లో ఉంటోంది. ఇక, తాజాగా ఈ సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. గత వారంలో 10.26 రేటింగ్‌ను సాధించింది. గత కొద్ది వారాలుగా ఈ సీరియల్ మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొంటూ దూసుకెళ్లున్నది.


Click it and Unblock the Notifications











