Intinti Gruhalakshmi: విడాకులు ఇవ్వమని ప్రియకు వార్నింగ్.. వాళ్ల రాకతో తులసి ఇంట్లో సంతోషం
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. షాపింగ్ మాల్‌లో దివ్యను కలిసేందుకు విక్రమ్ ట్రయల్ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడికి ఆమెకు బదులు వేరే అమ్మాయి వస్తుంది. చీకట్లో చూసుకోని అతడు ఆమెతో రొమాన్స్ చేస్తాడు. చివర్లో అసలు విషయం తెలిసి షాకై పారిపోతాడు. తర్వాత విక్రమ్‌కు నచ్చినట్లుగానే దివ్యకు చీరలు కొంటారు.
ఆ తర్వాత దివ్య, విక్రమ్ ట్రయల్ రూమ్‌లోకి వెళ్లి రొమాన్స్ చేస్తుంటారు. అప్పుడు అనసూయ పిల్లిలా అరవగా దివ్య బయటకు వచ్చి వాళ్లను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత విక్రమ్ కూడా దొంగలా వచ్చి సిగ్గు పడుతూ వెళ్లిపోతాడు.
సంజయ్‌కు విడాకులు ఇవ్వు: ప్రియ ముందరే రాజ్యలక్ష్మి 'ఈ పులి పంజా దెబ్బ ఆ దివ్య రుచి చూడబోతోంది. పది మందిలో అది చెప్పిన మాట విని తలవంచుకున్నాను కాబట్టి మేక పిల్లని అనుకుంటుందేమో.. దాన్ని అమాయకపు గొర్రె పిల్లను చేసి కసాయి ఇంటికి రప్పిస్తున్నాను' అని ఫోన్‌లో మాట్లాడుతుంది.
దీంతో ప్రియ 'నన్ను ఎలాగో హింసిస్తున్నారు కదా మేడం. దివ్య మేడంను వదిలేయండి' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'అయితే వెంటనే మా సంజయ్‌కు నువ్వు విడాకులు ఇచ్చేయ్' అని కొత్త డిమాండ్ చేస్తుంది. దీంతో షాకైన ప్రియ కాసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది.

అవ్వా కావాలి.. బువ్వా కావాలా: రాజ్యలక్ష్మి మాటలకు అవాక్కయిన ప్రియ.. కాసేపటికి తేరుకుని మాట్లాడబోతుంది. అప్పుడామె 'నువ్వు సంజయ్‌కు విడాకులు ఇచ్చావంటే దివ్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము' అంటుంది. దీంతో ప్రియ 'అప్పుడు నా జీవితం నాశనం అవుతుంది కదా మేడం' అని అడుగుతుంది.
దీంతో రాజ్యలక్ష్మి 'మరి అవ్వ కావాలి.. బువ్వ కావాలి అంటే అవుతుందా. నువ్వు తప్పుకుంటే దివ్యను చూసుకుంటా. లేదంటే నీకు పట్టిన గతే ఆ దివ్యకు కూడా పట్టేలా చేస్తా. కాబట్టి నోరు మూసుకుని చెప్పింది చేసుకుంటూ ఉండు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.
విక్రమ్ అసహనంగా మాట్లాడి: పనిమనిషి రాములమ్మ దివ్యను రెడీ చేస్తూ ఉండగా.. 'ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాములమ్మా' అని అడుగుతుంది. దీంతో రాములమ్మ 'పెళ్లి కూతురుకి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి సమయం ఉండదు కదా అందుకే ఇలా చేస్తున్నాను. ఈ సమయంలో కనుక విక్రమ్ బాబు ఇక్కడ ఉండుంటే' అంటుంది. అప్పుడు దివ్య ఏం చేసేవాడు నగలు బాగున్నాయని చెప్పేవాడు.
అంతేకాదా అంటుంది. అప్పుడు దివ్యను రాములమ్మ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంతలోనే దివ్యకు విక్రమ్ ఫోన్ చేసి 'ఈ పెద్ద వాళ్ళు ఏంటో పక్క పక్కన ఉండాల్సిన మనల్ని ఇలా దూరం పెడుతున్నారు. అలా సరదాగా మాట్లాడుకుందామా' అంటాడు. దీంతో దివ్య అది నిజం అవ్వాలని కోరుకో అంటుంది. అప్పుడు విక్రమ్ 'ఇలా అయితే గోడ దూకాల్సిందే' అనుకుంటాడు.

తులసి కోసం నందూ చీరతో: ఇంట్లో పని చేసుకుంటూ ఉన్న తులసి దగ్గరకు నందూ వస్తాడు. అప్పుడు ఆమె కోసం ఒక చీరను తీసుకుని వస్తాడు. కానీ, దాన్ని తులసికి ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి చీర తీసుకొని 'చాలా బాగుంది. కానీ మీ ఆవిడ ఇలాంటివి కట్టదు కదా.
ఇలాంటి చీర నాలాంటి వంటింటి కుందేళ్ళకు సరిపోతుంది' అని అంటుంది. దీంతో నందూ 'ఈసారి తీసుకుంది నీకోసమే' అని అంటాడు. దీనికామె ఎందుకు తీసుకున్నారు అనడంతో.. 'నాకే ఎప్పటి నుంచో తీసుకోవాలనిపించింది.. అందుకే ఇప్పుడు తీసుకున్నాను' అని చెప్తాడు.
తెలిసే అది తీసుకు వచ్చాను: నందూ చీర ఇవ్వగానే తులసి 'ఏదైనా నాకు ఒకటి అనిపిస్తోంది. కట్టుకున్న భార్యకు తప్ప వేరే వాళ్లకు చీరలు తీసుకోవడం మీకు అలవాటే కదా' అని అంటుంది. దీంతో నందూ గతాన్ని గుర్తు చేయద్దు అనగా మీరు మర్చిపోయారా అని అడుగుతుంది. అంతేకాదు, 'అయినా ఈ చీరను అందరి ముందు ఇవ్వకుండా ఇలా చాటుగా తీసుకొచ్చారు ఏంటి' అని అంటుంది.
దీనికతడు 'నువ్వే ఇలా చాటుగా ఇవ్వమని చెప్పావు కదా' అంటాడు. అప్పుడామె 'అయ్యయ్యో ఆ మాట నేను ఎప్పుడూ అన్నాను' అనగా 'నేను ఎప్పుడో మనం భార్యాభర్తలుగా ఉన్నప్పుడు అన్నాను. అయినా మీకు తెలియకుండానే నాకు ఇష్టమైన కలర్ తెచ్చారు' అంటుంది. దీంతో నందూ 'తెలియకుండానే కాదు.. తెలిసే తెచ్చాను' అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అడ్డంగా దొరికిపోయిన విక్రమ్: ఆ తర్వాత విక్రమ్ దొంగ చాటుగా గోడ దూకి దివ్యను కలవడానికి వెళ్తాడు. అప్పుడామె పడుకుని ఉండగా ఎంత ముద్దుగా ఉందో అనుకొని చెవి దగ్గరికి వెళ్లి దివ్య అని పిలుస్తాడు. అప్పుడు దొంగ అనుకోని దివ్య గట్టిగా అరుస్తుంది. అప్పుడు అందరూ వస్తారు. ఆ సమయంలో విక్రమ్ చాటుగా దివ్యను పిలిచి నేనే వచ్చింది అంటాడు.
దీంతో దివ్య 'అయ్యో అనవసరంగా ఇంట్లో అందరినీ పిలిచానే. ఎలా అయినా విక్రమ్ రక్షించాలి లేకుంటే పరువు పోతుంది' అనుకుంటుంది. వెంటనే 'అమ్మ నాకు ఏదో పిడకల వచ్చినట్టుంది. అందరూ టైం వేస్ట్ చేసుకోకండి. వెళ్లి పడుకోండి' అంటుంది. తర్వాత ఆమె విక్రమ్‌తో మాట్లాడుతుండగా అందరూ వచ్చి వాళ్లను పట్టుకుంటారు.
ప్రేమ్ ఫ్యామిలీ రావడంతో
దివ్య, విక్రమ్ దొరికిపోగానే అందరూ వాళ్ల వైపు చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు నందూ 'అల్లుడు నీ పరిస్థితి నాకు అర్థం అయింది. రేపు ఉదయాన్నే రా. ఇప్పుడు వద్దులే బాగోదు' అని విక్రమ్‌ను బయటకు పిలుచుకొని వెళ్తాడు. తర్వాత అందరూ కలిసి సరదాగా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రేమ్ వాళ్లు అక్కడకు వస్తారు. దీంతో అందరూ మరింతగా సంతోషిస్తారు. వాళ్లు వచ్చిన కాసేపటికే మాధవి, మోహన్ కూడా వస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











