Intinti Gruhalakshmi Today Episode: తులసితో కలిసి లాస్యకు షాకిచ్చిన భాగ్య.. నిజం తెలిసి నందూ డీలా!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇల్లు అమ్మనివ్వకుండా అడ్డుకుంటానన్న భాగ్యతో తులసి మాట్లాడుతుంది. అప్పుడామెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, భాగ్య మాత్రం అస్సలు వినదు. అప్పుడు తులసి 'ఇల్లు అమ్మనిస్తే నీకు 20 లక్షలు ఇస్తా' అని ఆమెకు ఆఫర్ ఇస్తుంది. దీంతో భాగ్య ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఇదే విషయాన్ని లాస్య ఫోన్ చేస్తే చెబుతుంది. మరోవైపు, శృతి ఓ ఇంట్లో పనిమనిషిగా జాయిన్ అవుతుంది. ఈ విషయం రాములమ్మకు తెలుస్తుంది. ఇక, శశికళ డబ్బుల కోసం ఇంటికి రాగా.. తులసి.. భాగ్య నిర్ణయం గురించే అడుగుతుంది.

భాగ్యకే అవకాశం ఇచ్చిన తులసి

భాగ్యకే అవకాశం ఇచ్చిన తులసి

శశికళ వచ్చి తులసిని తన అప్పు గురించి ఏం ఆలోచించావు అని ప్రశ్నిస్తుంది. ఏమైంది ఏం నిర్ణయం తీసుకున్నావు అని పదే పదే అడుగుతుంది. అంతేకాదు, తులసి నా సహనాన్ని పరీక్షించకు.. ఏం నిర్ణయం తీసుకున్నావు అంటుంది. దీంతో తులసి సమాధానం చెప్పు భాగ్య అంటుంది. కానీ, భాగ్య మాత్రం ఏం మాట్లాడదు. అప్పుడు శశికళ నేను అప్పు ఇచ్చింది నీకు.. నువ్వు నా అప్పు తీర్చాలి అని తులసితో అంటుంది. దీనికి తులసి 'చూశావు కదా భాగ్య. నేను నష్టపోతే నీకు రూపాయి రాదు. ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో చెప్పు టైమ్ లేదు' అంటుంది.

భాగ్యకు మళ్లీ ఆఫర్ ఇచ్చిన అక్క

భాగ్యకు మళ్లీ ఆఫర్ ఇచ్చిన అక్క

తులసి అడిగినా భాగ్య మాట్లాడదు. అప్పుడు 'ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. కోర్టుకు వెళ్లాలన్నా వెళ్లు.. అడ్డుపడను. ఏదో ఒకటి పైకి చెప్పు. ఎందుకంటే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుంది' అంటుంది తులసి. అప్పుడు 'నువ్వు నాకు సమాధానం చెప్పకుండా విసిగిస్తున్నావు. ఇంక నా వాళ్లను పిలిపించాలా చెప్పు' అని అంటుంది. దీంతో తులసి 'నువ్వు కోర్టుకు వెళ్తావా? లేక మమ్మల్ని ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లమంటావా' అని భాగ్యను సూటిగా అడుగుతుంది. ఇంతలో భాగ్యకు లాస్య ఫోన్ చేస్తుంది. కానీ ఆమె లిఫ్ట్ చేయకుండా కాల్‌ను కట్ చేస్తుంది.

ఒప్పుకున్న భాగ్య.. డబ్బు ఇచ్చేసి

ఒప్పుకున్న భాగ్య.. డబ్బు ఇచ్చేసి

తులసి ఇచ్చిన ఆఫర్ గురించి ఆలోచించిన భాగ్య.. కోర్టుకు వెళ్లాలని అనుకోవడం లేదని చెబుతుంది. అప్పుడు తులసి నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను. నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడి ఉండు అంటుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో ఎలా ఉండవో జీవితంలో జరిగేది ఏదీ మన చేతుల్లో ఉండదు. ఎవ్వరికీ ఇష్టం లేని నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది క్షమించండి. శశికళ గారు ఇక నుంచి ఈ ఇల్లు మీది' అంటుంది. అప్పుడు శశికళ 'మొత్తానికి మాట నిలబెట్టుకున్నావు తులసి. నేను నా మాట నిలబెట్టుకుంటాను' అని చెప్పి 20 లక్షల డబ్బు తెచ్చి తులసికి ఇస్తుంది. దీంతో ఆ డబ్బును వెంటనే భాగ్యకు ఇచ్చేస్తుంది తులసి. దీంతో డబ్బు ఉన్న బ్యాగు తీసుకొని భాగ్య చాలా సంతోషిస్తుంది. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతుంది.

శశికళ ఆఫర్.. రిజెక్ట్ చేసిన తులసి

శశికళ ఆఫర్.. రిజెక్ట్ చేసిన తులసి

డబ్బులు ఇచ్చిన తర్వాత శశికళ 'చూడు అమ్మి.. ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయాలంటే ఎవ్వరికైనా కష్టమే. మీరు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు' అని ఆఫర్ ఇస్తుంది. కానీ.. తులసి మాత్రం 'ఈ ఇంటితో మాకు ఇక రుణం తీరిపోయింది. ఈ ఇంట్లో మేము పరాయి వాళ్లమే. రేపే ఖాళీ చేస్తాం' అంటుంది. మరోవైపు డబ్బు తీసుకొని సంతోషంగా ఆటోలో వెళ్తూ ఉంటుంది భాగ్య. తులసి అక్క ఎంత మంచిది అని అనుకుంటుంది. అంతేకాదు, అనవసరంగా ఆమెను అనుమానించానని అనుకుంటుంది. మరోవైపు లాస్య భాగ్యకు ఏకధాటిగా ఫోన్ చేస్తూనే ఉంటుంది.

లాస్యకు నిజం చెప్పేసిన భాగ్య

లాస్యకు నిజం చెప్పేసిన భాగ్య


లాస్య ఫోన్ చేస్తున్న సమయంలో 'తీయటి పాయసంలో ఈగ పడినట్టు ఇలాంటి హ్యాపీ టైమ్‌లో లాస్య కాల్ చేసింది' అని అనుకుంటుంది భాగ్య. ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. హాయ్ లాస్య అంటుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది లాస్య. దీంతో పని అయిపోయింది. నేను ఇంటికి వెళ్తున్నాను అంటుంది భాగ్య. దీంతో లాస్యకు కోపం వస్తుంది. నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేది ఏంటి అని ప్రశ్నిస్తుంది. తులసి అక్క వాళ్లు రేపే ఇల్లు ఖాళీ చేస్తున్నారు. శశికళతో డీల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఉంటా మరి అని కట్ చేస్తుంది.

లాస్య కోపం.. నందూ ఆలోచనలో

లాస్య కోపం.. నందూ ఆలోచనలో

భాగ్య డబ్బు తీసుకోవడంతో పాటు కాల్ కట్ చేయడంతో లాస్యకు చిర్రెత్తుకొస్తుంది. అప్పుడే నందు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఎవరి మీద కోపం అంటే.. ఈ లోకం మీద అంటుంది. నా మాట ఎవ్వరూ వినడం లేదు అంటుంది. అసలు విషయం చెబుతుంది. తులసి ఇచ్చిన 20 లక్షలకు భాగ్య అమ్ముడు పోయిందని చెబుతుంది. అప్పుడు నందూ 'శశికళ అప్పు తీర్చడానికి బ్యాంకు లోన్ తీసుకుంటా అని చెప్పింది కదా.. ఇప్పుడు ఇల్లు అమ్మేయడం ఏంటి. అయినా ఇల్లు అమ్మేసి వాళ్లు ఎక్కడికి వెళ్తారు' అని అంటాడు. దీంతో లాస్యకు మరింతగా కాలిపోతుంది.

దీపక్‌తో గొడవకు దిగిన తులసి

దీపక్‌తో గొడవకు దిగిన తులసి

ఇల్లు అమ్మేసిన తర్వాత అందరూ సైలెంట్‌గా ఉంటారు. అప్పుడే తులసి తమ్ముడు దీపక్ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే నాతో రా అక్క అంటాడు. కానీ, నా అత్తామామల ప్రేమ నాకు ఉంది అంటుంది. దీంతో దీపక్ 'కన్న కొడుకే వీళ్లను వదిలేసి పోయాడు. నువ్వెందుకు ఈ ముళ్లకంపను తగిలించుకుంటున్నావు' అంటాడు. దీంతో తులసికి కోపం వస్తుంది. అప్పుడు 'నోర్మూయ్.. కన్నకొడుకు వాళ్లను వదిలేయలేదు.. వాళ్లే వద్దనుకున్నారు. నేను ఇంటికి రాను. వీళ్లను వదిలేది అస్సలు లేదు' అని చెప్పేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X