Intinti Gruhalakshmi: రౌడీలతో మాణిక్యం దౌర్జన్యం.. తులసి డేరింగ్ స్టెప్.. టెండర్ ఇవ్వమని అడగడంతో!
ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనను చూస్తూ నందూ ఏదేదో ఊహించుకోవడం గమనించిన తులసి అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. అంతేకాదు, మన మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని తేల్చి చెప్పేస్తుంది. ఇక, ఆస్పత్రికి వచ్చిన విక్రమ్‌కు దివ్య క్యాంటీన్‌లో జరిగిన గొడవ గురించి వివరిస్తుంది. అంతేకాదు, కాంట్రాక్టర్ మాణిక్యం.. సంజయ్‌తో చెప్తానన్నది కూడా చెప్తుంది. దీంతో విక్రమ్‌కు కోపం వచ్చి అతడి కాంట్రాక్టును రద్దు చేయమని చెప్తాడు. ఇక, క్యాంటీన్ కాంట్రాక్టును తులసి వాళ్లకు ఇవ్వాలని దివ్య ప్లాన్ చేసి.. ఆమెకు ఫోన్ చేసి వివరిస్తుంది.

నందూను నిలదీసిన తులసి:తులసిని మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న నందూ ఆమెను కాకా పట్టే పనులు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే తులసి స్కూటీని తుడుస్తూ మురిసిపోతూ ఉంటాడు. అది చూసిన తులసి కోపంగా వెళ్లి 'మీరు చేస్తున్న పని ఏంటి' అని నిలదీస్తుంది. అప్పుడతను 'ఏం లేదు తులసీ.. బైక్ తుడుస్తున్నాను. ఎలాగో నా కార్ క్లీన్ చేస్తున్నాను. పక్కన నీ బైక్ ఖాళీగా ఉంది కదా అని క్లీన్ చేస్తున్నాను' అని అంటాడు. దీంతో తులసి 'నేను క్లీన్ చేయమని చెప్పానా? మీరు కాకా పట్టడానికి ట్రై చేస్తున్నారు' అంటూ అతడిపై ఓ రేంజ్‌లో కోప్పడుతుంది.

మనసులో పిచ్చి ఆలోచనలు:తులసి మాటలకు నందూ 'చిన్న విషయానికి ఎందుకంత కోపం? నువ్వు ఎన్నిసార్లు నాకు సాయం చేయలేదు' అని అంటాడు. దీనికామె 'నేను సాయం చేశాను. కానీ సిన్సియర్‌గా చేశా. మీలా మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని సాయం చేయలేదు' అని తిడుతుంది. దీంతో నందూ 'ఏదో నా తృప్తి కోసం తుడుస్తున్నాను. ఎందుకు అపార్ధం చేసుకుంటున్నావు' అని ఫీల్ అవుతాడు. దీంతో తులసి 'ఇకపై మీరు నా బైక్ జోలికి రావొద్దు.. నేను మీ కారు జోలికి రాను' అని వెళ్లిపోతుంది. వాళ్లు అలా గొడవ పడుతుంటే పరందామయ్య చూస్తూ మురిసిపోతూ ఉంటాడు.

టెండర్‌కు ఎవరూ రాకుండా:ఆస్పత్రిలో ఉన్న రాజ్యలక్ష్మి 'క్యాంటీన్ టెండర్ బయటకు వెళ్లడానికి వీళ్లేదు. ఒక్కరు కూడా టెండర్ వేయడానికి ముందుకు రాకూడదు' అని సంజయ్‌తో చెప్తుంది. దీనికి లాస్య 'అవును రాజ్యలక్ష్మీ.. ఇప్పుడు టెండర్ వేరే వాళ్లకి వచ్చి జనాలకు మంచి ఫుడ్ వెళ్తే.. దివ్యకు మంచి పేరు వచ్చేస్తుంది. అప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా దివ్య దగ్గరకే వస్తారు' అని రెచ్చగొడుతుంది. దీంతో సంజయ్ 'అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఆ మాణిక్యం చేస్తున్నాడో చెప్పడం కాదు.. చూపిస్తానురా' అని తీసుకెళ్లగా.. అతడు రౌడీలతో టెండర్‌కు వచ్చే వాళ్లను బెదిరిస్తుంటాడు.

దివ్య చాప్టర్ క్లోజ్ అయింది:సంజయ్ ప్లాన్‌ను మెచ్చుకున్న రాజ్యలక్ష్మి 'ఒకే దెబ్బకి రెండు పిట్టలు. దివ్య చాప్టర్ క్లోజ్. ఇంకెవరూ టెండర్ వేయడానికి రాకపోవడంతో విక్రమ్ చచ్చినట్టు మన మాట వింటాడు.. ఆ దివ్య కాగితం పులి అని తేలిపోతుంది' అని అంటుంది. అప్పుడు విక్రమ్, దివ్య వచ్చి.. టెండర్‌కి ఎవరూ రాలేదా అని అడుగుతారు. అప్పుడు సంజయ్ 'నీకే కాదు దివ్యా మాకూ ఆరాటంగా ఉంది. అందుకే ఈరోజు క్యాంటీన్ సర్వీస్ ఆపేశాం. ఈరోజు ఎవరూ రాకపోతే మొదటికే మోసం వస్తుంది. పేషెంట్స్ ముందు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. విక్రమ్ చెప్పాడు కదా అని మాణిక్యాన్ని మానిపించి తెగించి టెండర్స్‌కి వెళ్లాం. కానీ, ఇప్పటి వరకూ ఎవరూ రాలేదు' అని అంటుంది.

వాడు దుర్మార్గుడు వెళ్లొద్దు:మేనేజర్ వచ్చి 'బయట మాణిక్యం టెండర్స్‌కు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నాడు' అని విక్రమ్‌కు చెప్తాడు. దీంతో అతడు కోపంతో 'అసలు వాడు ఏమనుకుంటున్నాడు.. ఈ హాస్పిటల్ వాడి జాగీరా? మనం చేతులు ముడుచుకుని కూర్చుంటే వాడు ఎవడ్నీ రానీయడు. వాడి సంగతి చూస్తాను' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి, సంజయ్‌లు అడ్డుకుంటారు. పైగా సంజయ్ 'వాడు దుర్మార్గుడు.. ఎంతకైనా తెగిస్తాడు.. వెళ్లొద్దు అన్నయ్యా' అంటాడు. దీంతో దివ్యకు మేటర్ అర్థమై ఎందుకు మాణిక్యాన్ని అంతలా వెనకేసుకొస్తున్నారు అని ప్రశ్నిస్తుంది.

ఎదురించి వచ్చిన తులసి:దివ్య మాటలకు లాస్య 'ఎందుకు దివ్యా.. విక్రమ్‌ను రెచ్చగొడుతున్నావు? ఆ రౌడీల చేతిలో తను తన్నులు తింటే చూసి ఆనందించాలనా? విక్రమ్‌పై ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకోవాలని అనుకుంటున్నావా' అని రెచ్చగొడుతుంది. దీనికామె 'నేను విక్రమ్‌ను రెచ్చగొట్టడం లేదు. వాస్తవాలు మాట్లాడుతున్నాను. నీ ఇష్టం విక్రమ్ హాస్పిటల్‌కు చెడ్డపేరు వచ్చినా పర్లేదంటే నీకు నచ్చింది చెయ్' అంటుంది. మరోవైపు, తులసి, నందూ టెండర్ ఫైల్ పట్టుకుని వస్తుండగా మాణిక్యం ఆపుతాడు. అప్పుడు తులసి అతడికి ఎదురు తిరుగుతుంది. దీంతో మాణిక్యం సైడ్ ఇచ్చేస్తాడు. అలా తులసి వాళ్లు ఆస్పత్రి లోపలికి వస్తారు.

షాకైన బ్యాచ్.. వాళ్లకే డీల్:మాణిక్యాన్ని ఎదురించేందుకు విక్రమ్ రెడీ అవుతుండగా మేనేజర్ వచ్చి 'సార్ టెండర్ కోసం ఎవరో వచ్చారు. మీకు కార్డ్ ఇవ్వమన్నారు' అంటుంది. దాని మీద 'గృహలక్ష్మి కిచెన్' అని ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. తర్వాత నందూ, తులసి అక్కడకు వస్తారు. అప్పుడు రాజ్యలక్ష్మి వాళ్లు కాంట్రాక్టు ఇవ్వడం కుదరదు అంటుంది. దీనికి విక్రమ్ కూడా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు తులసి వాళ్లను బ్రతిమాలుతుంది. తర్వాత మేనేజర్ వచ్చి 'పేషెంట్లు గొడవ చేస్తున్నారు' అని చెప్తాడు. దీంతో విక్రమ్ 'డీల్ క్లోజ్ అయిందని చెప్పండి. కాంట్రాక్టు ఓకే అయింది రేపటి నుంచి ఫుడ్ వస్తుందని తెలపండి' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











