For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: జర్నీకి ముందు కిందపడ్డ తులసి.. ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లిన నందూ

  |

  చాలా భాషలను పోల్చి చూసుకుంటే తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్.. తులసిని వైజాగ్ తీసుకెళ్తానని అన్నప్పటి నుంచి నందూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆమెను ఎలాగైనా ఆపాలని ఈ విషయాన్ని అనసూయకు ఫోన్ చేసి చెప్తాడు. అంతలో తులసి కూడా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలనుకుంటుంది. అప్పుడు అనసూయ వచ్చి ఇది చెప్పడంతో పాటు వైజాగ్ వెళ్లేందుకు అందరినీ ఒప్పిస్తుంది. ఇక, హనీ.. తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ.. తులసిని అమ్మా అని పిలవాలని ఉన్నట్లు సామ్రాట్‌కు చెప్తుంది. ఆ తర్వాత అతడికి తులసి కలలోకి వచ్చి ఓ పాట పాడుతుంది.

  పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

  నందూపై నిందలు వేసిన లాస్య

  నందూపై నిందలు వేసిన లాస్య

  తులసిని సామ్రాట్ వైజాగ్ తీసుకెళ్తానని అన్నప్పటి నుంచి నందూలో కోపం పెరిగిపోతూనే ఉంటుంది. అదే సమయంలో లాస్య కూడా తులసిని నిందిస్తూ నందూను మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తులసి అలా మారడానికి నందూనే కారణం అని లాస్య నిందిస్తుంది. ‘అసలు నీ వల్ల తులసి అలా తయారైంది. నువ్వు చేసిన పనుల వల్లే తులసిలో మార్పులు వచ్చాయి. అవి ఇప్పుడు మనకు ఇబ్బందిగా మారాయి' అని అంటుంది. అప్పుడు నందూ ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోతాడు. దీంతో లాస్య మరింత రెచ్చిపోతుంది.

  గతాన్ని గుర్తు చేసుకున్న నందూ

  గతాన్ని గుర్తు చేసుకున్న నందూ

  నందూ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. తులసి ఒంటరిగా కూర్చుని ‘ఎప్పటికైనా విమానం ఎక్కాలి. అలాగే అందమైన ప్రకృతి మధ్య కూర్చోని ప్రకృతి పులకరించేలా పాడాలి. ఆ తర్వాత చదువుకున్న వాళ్లతో దీటుగా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, రాయగలగాలి. అలాగే, నా చుట్టూ ఉన్నవాళ్లు గొప్పగా ఎదగాలి' అని అనుకుంటుంది. అంతలో నందూ వచ్చి ఏం చేస్తున్నావు అంటాడు. అప్పుడామె రాసుకున్నది చూపించి ‘నా ఆశలు అవి. మీరు చూడండి' అంటుంది. దీంతో ఆ సోది నాకు చదివే ఓపిక ఇప్పుడు లేదు అంటూ చిరాకుగా మాట్లాడి బాధ పెడతాడు. ఆ తర్వాత ఈ పిచ్చి రాతలు ఆపు.. ఇక ఈ డైరీని బీరువాలో దాచుకో అంటూ చీదరించుకుంటాడు. ఇవన్నీ నందూ గుర్తు చేసుకుంటాడు.

  బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

  నందూను రెచ్చగొట్టేసిన లాస్య

  నందూను రెచ్చగొట్టేసిన లాస్య

  నందూతో లాస్య ‘సామ్రాట్ తులసి వైపు అడుగులు వేస్తున్నాడు. తులసి ప్రాజెక్ట్‌కు ఇన్వెస్ట్ చేయడం మొదటి అడుగు, తనను వైజాగ్‌కు తీసుకెళ్లడం రెండో అడుగు. వైజాగ్ నుంచి తిరిగి వచ్చాక ఆ ఐదు అడుగులు పడుతాయి' అని రెచ్చగొడతాడు. దీంతో నందూ అలా జరగదు అంటాడు. అప్పుడు లాస్య ‘ఎందుకు జరగదు. ఇవాళో రేపో సామ్రాట్ కంపెనీకి తులసి బాస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తులసిని సామ్రాట్‌కు దగ్గర కాకుండా చూసుకుంటే కానీ మనకు ఫ్యూచర్ ఉండదు. ఆలోచించు నందూ' అని చెబుతుంది. దీంతో నందూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు లాస్య ఈ మట్టిబుర్రకు ఎలా అర్థం అవుతుందో ఏమో అని అనుకుంటుంది.

  తులసి బాధగా.. ఓదార్చడంతో

  తులసి బాధగా.. ఓదార్చడంతో

  తులసి ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ సడెన్‌గా ఇలా డల్ అయిపోయావేంటమ్మా అంటాడు. దీంతో తులసి ‘అత్తయ్య, మామయ్యను వదిలి ఊరు వెళ్లాలంటే నాకు ఏదో భయంగా ఉంది' అంటుంది. అప్పుడు పరందామయ్య ‘హ్యాపీగా ఎంజాయ్ చేయమంటూ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇలా భయపడకు' అంటాడు. దీనికి అంకిత ‘అవును ఆంటీ.. బాధ్యతలు ఎప్పటికీ ఉండేవే.. కాసేపు వాటిని పక్కన పెట్టి లైఫ్‌ను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది అదే' అంటుంది. దీంతో తులసి ‘సరే అలాగే చేస్తా. విమానం ఎక్కి ఏంచక్కా వైజాగ్ వెళ్తా' అని అంటూ సంతోషిస్తుంది.

  Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

  ఖర్చు గురించి చెప్పిన తులసి

  ఖర్చు గురించి చెప్పిన తులసి

  ఆ తర్వాత తులసి ‘వైజాగ్‌ను సినిమాల్లో చూశాను. ఇప్పుడు స్వయంగా నేనే అక్కడికి వెళ్తున్నాను. సంతోషంగా ఉంది' అని అనుకుంటుంది. దీనికి కారణం ‘నువ్వు ఎదుగుతూ ఉంటే ఇలాంటి అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి' అంటాడు. దీంతో తులసి ‘అవును.. ఒకవిధంగా సామ్రాట్ గారి వల్ల నాకు జాక్‌పాట్ దొరికినట్టే. ప్రయాణానికి డబ్బులు మనమే పెట్టుకోవాలి కదా. ఎంత అవుతుంది' అని అడుగుతుంది. దీంతో ప్రేమ్ ‘సామ్రాట్ గారు నిన్ను కంపెనీ తరుపున తీసుకెళ్తున్నారు కాబట్టి.. నువ్వు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు' అంటాడు.

  తులసికి ఫోన్ చేసిన సామ్రాట్

  తులసికి ఫోన్ చేసిన సామ్రాట్


  ఇంతలో తులసికి సామ్రాట్ ఫోన్ చేస్తాడు. అప్పుడాయన ‘రేపు మార్నింగ్ మన ఫ్లయిట్ 10 గంటలకు. మీరు 8 గంటలకు అల్లా ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి. నేను వచ్చి పికప్ చేసుకుంటా' అంటాడు. దీంతో తులసి వద్దు.. నేనే ఎయిర్ పోర్ట్ కు వస్తాను అంటుంది. సరే అంటాడు సామ్రాట్. ఇక, తెల్లవారగానే సామ్రాట్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి తులసికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు. 8 అవుతుంది. ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతాడు. దీంతో అయ్యో.. అలారం మోగలేదు. అంటుంది. దీంతో మీరు వెంటనే రెడీ అయి రండి. లేకపోతే ఫ్లయిట్ కూడా మిస్ అవుతుంది అంటాడు.

  శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్

  Recommended Video

  Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
  బెడ్ మీద నుంచి పడ్డ తులసి

  బెడ్ మీద నుంచి పడ్డ తులసి

  సామ్రాట్ మాట్లాడగానే సరే అంటూ తులసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో ఆమె బెడ్ మీది నుంచి కింద పడుతుంది. లేచి చూసుకుంటే టైమ్ 4 అవుతుంది. అప్పుడు తేరుకుని ఇదంతా కల అని అనుకుంటుంది. ఆ తర్వాత వెంటనే రెడీ అవుతుంది. అందరూ లేస్తారు. దేవుడికి దండం పెట్టి తులసి బయలుదేరుతుంది. అప్పుడు పరందామయ్య ఆ దేవుడు నీకు ఎప్పుడూ తోడుంటాడు అని అంటాడు. అలాగే, అనసూయ ‘మా గురించి ఆలోచించడం తర్వాత. ముందు నీ గురించి, వెళ్లే పని గురించి ఆలోచించు' అంటుంది. అలా బయలుదేరుతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 707: Lasya Blames Nandhu for Tulasi Behaviour. After That Tulasi Gets Excited about her first Flight Journey.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X