For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 11th Episode: లాస్యకు బిగ్ షాక్.. తులసితో కలిసిన నందూ.. తన భర్త అంటూ!

  |

  ఇండియాలోని మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు తాను వస్తానన్న నందూతో ‘నాకు నచ్చకపోయినా.. ఇష్టం లేకపోయినా.. నా వాళ్ల సంతోషం కోసం అక్కర్లేని మనుషుల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నదాన్ని.. దీనికి మాత్రం ఎందుకు అభ్యంతరం చెబుతా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాకేం ఇబ్బందిలేదు' అని అంటుంది తులసి. ఆ తర్వాత భాగ్య, అనసూయకు లాస్య తన ప్లాన్ వివరిస్తుంది. దీన్ని అంకిత విని.. ఆశ్చర్యపోతుంది. అనంతరం ఫ్యాక్టరీకి వెళ్లేందుకు అందరూ రెడీ అవగా.. నందూ, లాస్య కోసం ఆగుతాడు.

  Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!

  నందూ, తులసిని కలిపిన పరందామయ్య

  నందూ, తులసిని కలిపిన పరందామయ్య

  లాస్య కోసం వేచి చూడాలని చెప్పిన నందూతో ‘ఆ లాస్య గారి కోసం మేమంతా వేచి చూస్తాము. కాకపోతే తులసి మాత్రం ముహూర్తం సమాయానికి అక్కడ ఉండాలి. కాబట్టి నందూ నువ్వు తులసిని తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్లరా' అని అంటాడు. అప్పుడు భాగ్య, అంకిత దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ, ప్రేమ్, అభి మాత్రం తాతయ్య మాటలకు సపోర్టుగా ఉంటారు. దీంతో పరందామయ్య మరోసారి వాళ్లిద్దరినీ కారులో వెళ్లమని అంటాడు. దీనికి నందూ ఏమీ సమాధానం చెప్పకుండానే తులసిని కారులో తీసుకెళ్తాడు. ఇది చూసి శృతి, ప్రేమ్ సంతోష పడతారు.

  తులసిలో మార్పులు వచ్చాయన్న భర్త

  తులసిలో మార్పులు వచ్చాయన్న భర్త

  తులసితో కలిసి కారులో వెళ్తుండగా నందూ మాట్లాడుతూ.. ‘తులసి నీలో చాలా మార్పులు వచ్చాయి' అని అంటాడు. అప్పుడామె ‘మనుషుల్లో మార్పులు రావడం సహజమే' అని బదులిస్తుంది. దీనికి ‘మార్పులు రావడం సహజమే. కానీ, నీలో వచ్చిన మార్పులు చాలా పెద్దవి. ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా నీలో కనిపిస్తుంది. ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే దానికి కాదు.. పిల్లలడిగే చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయేదానివి. కానీ, ఇప్పుడు పది మంది ప్రసంగాలు ఇస్తున్నావ్' అని అంటాడు. అవసరాలే తనకు నేర్పించాయని ఆమె అంటుంది.

  తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

  మనసు లేకుండానే ప్రేమించా అంటావా?

  మనసు లేకుండానే ప్రేమించా అంటావా?

  నందూ తన మాటలను కంటిన్యూ చేస్తూ ‘సాహసం చేయబోతున్నావు.. తులసి నీకు భయంగా లేదా' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తులసి ‘ఇబ్బంది పెట్టినవాళ్లే ఇబ్బందిగా ఉందా అని అడుగుతున్నట్లుంది' అంటూ చురకలేస్తుంది. అప్పుడు నందూ ఆమెకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతాడు. దీనికి నందూ ‘మనసు లేకుండానే నిన్ను విష్ చేశానా? పాతికేళ్ల క్రితం మనసు లేకుండానే నిన్ను ప్రేమించానా? కాపురం చేశానా?' అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి తులసి సమాధానాలు చెబుతుంది. ఆ తర్వాత ఫ్యాక్టరీలోకి వీళ్లిద్దరూ జంటగా ప్రవేశిస్తారు.

   లాస్య కోసం వెయిటింగ్.. మరో గొడవతో

  లాస్య కోసం వెయిటింగ్.. మరో గొడవతో

  నందూ, తులసి ఫ్యాక్టరీకి వెళ్లిపోగా ఇంట్లో వాళ్లందరూ లాస్య కోసం వేచి చూస్తుంటారు. అప్పుడు పరందామయ్య రాహు కాలం వస్తుంది.. వెళ్లిపోదాం అని అంటాడు. దీనికి ప్రేమ్ కూడా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు భాగ్య, అంకిత, అనసూయలు లాస్యకు మద్దతుగా మాట్లాడడంతో గొడవ అవుతుంది. అప్పుడు అభి తమ్ముడి వైపు మాట్లాడతాడు. అనంతరం లాస్య పిన్ని అవుతుందని అంటారు. దీనికి ప్రేమ్ తీవ్రంగా కోప్పడతాడు. తర్వాత దివ్య కూడా ‘లాస్య అక్రమంగా వచ్చింది. తను మాకు పిన్ని ఎందుకు అవుతుంది. అక్రమంగా వస్తే బంధాలు ఉండవు' అని అంటుంది.

  నందూను భర్త అన్న తులసి... ప్రశంస

  నందూను భర్త అన్న తులసి... ప్రశంస

  ఫ్యాక్టరీలోకి వెళ్లిన నందూ, తులసికి రామచంద్ర స్వాగతం పలుకుతాడు. అప్పుడు తను ఎవరు అంటూ ప్రశ్నించగా.. తులసి ‘మా ఆయన' అని సమాధానం చెబుతుంది. దీంతో నందూ షాక్ అవుతాడు. ఆ వెంటనే తేరుకున్న తులసి ‘మాకు ఈ మధ్యనే విడాకులు అయ్యాయి' అని చెబుతుంది. ఆ తర్వాత నందూ ‘మీరు ఏమీ తెలియని తులసికి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు' అంటాడు. దీనికి రామచంద్ర ‘తులసికి ఏమీ తెలియకపోవచ్చు. కానీ, సంకల్పం ఉంది. అలాగే, పట్టుదల కూడా ఎక్కువే. తను ఏదైనా సాధిస్తుంది' అంటూ ప్రశంసలు కురిపిస్తాడు.

  Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!

  లాస్యను మరోసారి మందలించిన భాగ్య

  లాస్యను మరోసారి మందలించిన భాగ్య

  ఇంట్లో వాళ్లందరూ ఫ్యాక్టరీకి వెళ్లగా భాగ్య, లాస్య కోసం చూస్తుంటుంది. అలా తయారై రాగానే ‘ఏంటమ్మా ఇప్పటికి అయిందా? హీరోయిన్‌లా తయారయ్యావా? నువ్వేమైనా ఈ ఇంటికి సక్రమంగా వచ్చిన కోడలు అనుకుంటున్నావా? అసలే నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు. ఇలా చేస్తే నీ వైపు ఎవరు ఉంటారు చెప్పు' అంటూ లాస్యను మందలిస్తుంది భాగ్య. అప్పుడామె నందూ ఏం చేస్తున్నాడు అని అడుతుంది. దీనికి ‘బావగారూ అందరి కంటే ముందే వెళ్లిపోయారు' అని అంటుంది. దీనికి లాస్య ‘నేను ఆలస్యంగా వెళ్లినా అక్కడ జరగాల్సినవి జరుగుతాయి' అని సమాధానం చెప్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఫ్యాక్టరీ తులసి కుటుంబం.. వాళ్లు కూడా

  ఫ్యాక్టరీ తులసి కుటుంబం.. వాళ్లు కూడా

  నందూ, తులసి ఫ్యాక్టరీలోకి వెళ్లిన కొద్ది సేపటికి పరందామయ్య కుటుంబం మొత్తం అక్కడకు చేరుకుంటుంది. అది చూసిన రామచంద్ర ‘మీ కుటుంబ సభ్యులు మొత్తం వచ్చారమ్మా. చూసుకో' అని అంటాడు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆ తర్వాత కాసేపటికి లాస్య, భాగ్య కూడా అక్కడకు వస్తారు. అప్పుడు ‘ఏంటి లాస్య? బయట ఎవరూ లేరు. కొంపదీసి పూజ అయిపోయింది అంటావా?' అని అంటుంది భాగ్య. దీనికి ‘వీళ్లకు సంప్రదాయాలు ఎక్కువ. అప్పుడే పూజలు కానివ్వరు' అంటుంది లాస్య. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 395: Nandhu and Lasya Went Factory on the Same Car. Then Prem, Abhi and Divya Oppose Lasya Relation. After That Ramachandra Praises on Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X