Intinti Gruhalakshmi: తులసికే ఓటేసిన విక్రమ్.. నందూ స్పెషల్ గిఫ్ట్.. ఆయనకు నిజం చెప్పేసిన దివ్య
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ తనకు లైన్ వేస్తున్నాడని గ్రహించిన తులసి అతడికి క్లాస్ పీకుతుంది. అంతేకాదు, మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని తేల్చేస్తుంది. ఇక, మాణిక్యం కాంట్రాక్టు రద్దు కావడంతో ఆస్పత్రిలో టెండర్ వేయడానికి ఎవరూ రాకుండా అడ్డుకుంటూ ఉంటాడు. కానీ, తులసి వాళ్లు మాత్రం అతడిని ఎదురించి లోపలికి వస్తారు. దీంతో రాజ్యలక్ష్మి బ్యాచ్‌కు కోలుకోలేని షాక్ తగులుతుంది. తులసి వాళ్లు టెండర్‌ను రాజ్యలక్ష్మి వద్దని అంటుంది. కానీ, విక్రమ్ మాత్రం తన నిర్ణయం అయిపోయిందని అందరికీ ట్విస్ట్ ఇస్తాడు.

గృహలక్ష్మి కిచెన్‌కు టెండర్:టెండర్ విషయంలో విక్రమ్ ట్విస్ట్ ఇవ్వడంతో రాజ్యలక్ష్మి 'టెండర్ ఫైనల్ అయిందా? ఇంతకీ ఏం నిర్ణయించావు రా' అని అడుగుతుంది. అప్పుడే లాస్య 'మాణిక్యం గారికే కాంట్రాక్ట్ ఇద్దాం అని అనుకుంటున్నావా' అని ప్రశ్నిస్తుంది. దీనికి విక్రమ్ 'ఆ పని చేసి అమ్మ పరువును తీయలేను. మా అమ్మ మనసులో గృహలక్ష్మి కిచెన్‌కు ఆర్డర్ ఇద్దాం అని ఉందని నాకు తెలుసు.. ఆ విషయం నాకు అర్ధమైంది. నీ మంచితనం నాకు తెలుసు.. వాళ్లకు మనం నచ్చకపోయినా.. వాళ్లను నువ్వు మాత్రం దూరం పెట్టవని నాకు తెలుసు. వాళ్లకే ఇచ్చేస్తున్నాం' అని అంటాడు.
ఆర్డర్ రెడీ చేయరా సంజయ్:విక్రమ్ ఆ మాట చెప్పగానే తులసి, దివ్య సంతోషిస్తారు. కానీ, రాజ్యలక్ష్మి, లాస్య బ్యాచ్ డీలా పడిపోతుంది. తర్వాత విక్రమ్ 'బంధుత్వానికి, బిజినెస్‌కు సంబంధం ఉండదని అంటున్నారు కాబట్టి.. మీ నిర్ణయానికే మేం ఓటు వేస్తున్నాం. ఆర్డర్స్ రెడీ చెయ్ సంజయ్. అమ్మ సంతకం పెడుతుంది' అని వెళ్లిపోతాడు. దీంతో తులసి 'థాంక్స్ మేడమ్.. మీ నమ్మకాన్ని నిలబెడతాం' అని అంటుంది. అప్పుడు నందూ కూడా థ్యాంక్స్ అంటూ దండం పెడతాడు. ఆ తర్వాత తులసి వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు.

అలా చేస్తే నిందలు వేస్తారు:టెండర్ ఓకే అయిన తర్వాత నందూ, తులసి వెళ్లిపోతుండడంతో దివ్య వచ్చి 'ఇది టూమచ్ అమ్మా.. క్యాంటీన్ కాంట్రాక్ట్ రాగానే నాకు చెప్పకుండా వెళ్లిపోవడమేనా' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'హాస్పిటల్ కాంపౌండ్‌లో మనం ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదనిపించిందమ్మా. అందుకే వెళ్లిపోతున్నాం' అని చెప్తుంది. దీనికి ఎందుకలా అని దివ్య అడగడంతో 'బంధుత్వం వేరు.. బిజినెస్ వేరు అని అల్లుడు గారు చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదమ్మా' అని అంటుంది. దీనికి నందూ 'ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడితే.. మాకోసం క్యాంటీన్‌కు సంబంధించిన పాత పార్టీని వెళ్లగొట్టావు అని నిందలు వేస్తారు' అని అంటాడు. దీనికి దివ్య 'నిందలు వేయాలనుకునే వాళ్లకి నిజనిజాలతో పని లేదు నాన్నా' అంటుంది.
నాకు సలహాలు ఇస్తుందిగా:తర్వాత నందూ 'తప్పనిసరి పరిస్థితుల్లో ఈ టెండర్ మాకు ఇచ్చారు తప్పితే ఇవ్వాలని కాదు' అనగా.. దివ్య 'ఏదైతే ఏమైంది నాన్నా.. ఇకపై మీరిద్దరూ నా కళ్ల ముందే ఉంటారు. నాకు అస్సలు దిగులు ఉండదు. ఎప్పుడు ఏ సలహా కావాలన్నా అమ్మ అందుబాటులో ఉంటుంది' అని అంటుంది. అప్పుడు తులసి 'హాస్పిటల్‌లో ఉన్నంతసేపూ మనపై నిఘా ఉంటుంది.. మనం జాగ్రత్తగా ఉండాలి' అని అంటుంది. దీంతో దివ్య 'ఎవరు ఏం చేసినా విక్రమ్‌ను నేను జాగ్రత్తలో పెట్టుకుంటాను కదా.. మీరు టెన్షన్ పడొద్దు' అని చెబుతుంది.

దివ్యకు వింటే తరిమేస్తుంది:టెండర్ తర్వాత రాజ్యలక్ష్మి 'దివ్య హాస్పిటల్‌కు రావడమే తలనొప్పి అనుకుంటే.. ఇప్పుడు దానమ్మను కూడా తీసుకొచ్చింది. ఫ్యామిలీ ఫ్యామలీ మొత్తం హాస్పిటల్‌లో సెటిల్ అయ్యారు' అని అంటుంది. అప్పుడు లాస్య 'అసలు విక్రమ్ మనసు ఏంటో అర్ధం కావడం లేదు. దివ్యతో ఎడమొహం పెడమొహంలా ఉంటాడు. చివరికు దివ్య చెప్పిందే చేస్తున్నాడు' అని అంటుంది. దీనికి సంజయ్ 'అవునమ్మా.. హాస్పిటల్‌లో నేనైనా ఉండాలి. ఆ దివ్య అయినా ఉండాలి' అంటాడు. దీనికి బసవయ్య 'రేయ్.. గట్టిగా మాట్లాడకురా. దివ్యకు వినిపిస్తే నిన్నే తరిమేస్తుంది' అంటాడు.

వాళ్లను పంపాలని ప్లాన్స్:ఆ తర్వాత సంజయ్ 'దివ్య హాస్పిటల్‌లో లెక్కలు తవ్వడం స్టార్ట్ చేసిందంటే మొదట దొరికేది నేనే. నేను దొరికితే మీరు దొరికినట్టే. అందర్నీ అన్నయ్య హాస్పిటల్ నుంచి బయటకు గెంటేస్తాడు' అని అంటాడు. అప్పుడు లాస్య 'ఎవరూ భయడాల్సిన పనిలేదు. కష్టాలను పెట్టిన దేవుడే పరిష్కారం చూపిస్తాడు' అంటుంది. దీనికి లాస్య 'చెప్పను చేసి చూపిస్తాను. ఈసారి పిల్ల తలకాయిని కాదు.. తల్లి తలకాయినే కొడతాను.. చిక్కుల్లో పడేస్తాను' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్లను హాస్పిటల్ నుంచి తరిమి కొట్టాలి. తల్లి తల పిల్ల తల అతలాకుతలం అవ్వాలి' అని అంటుంది. దీనికి లాస్య ఏం చేస్తానో నువ్వే చూస్తావ్ కదా అని అంటుంది.

దివ్య ధైర్యం.. తులసికి గిఫ్ట్:ఇంటికి వెళ్లిన తర్వాత ప్రకాశం గదిలోకి వెళ్లిన దివ్య అసలు విడాకులకు తాను అప్లై చేయలేదని, అంతా రాజ్యలక్ష్మి ప్లాన్ అంటూ నిజం చెప్తుంది. అంతేకాదు, మామయ్యకు కొండంత ధైర్యం వచ్చేలా మాటలు చెప్తుంది. ఇక, తులసికి నందూ లైన్ వేసే ప్రయత్నాలు చేయడం.. దాన్ని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడం చేస్తుంటారు. అప్పుడు నందూ తులసి కోసం ఓ పాత టేప్ రికార్డర్‌ను గిఫ్టుగా ఇస్తాడు. అది చూసిన ఆమె మైమరచిపోతుంది. అంతేకాదు, నందూకు పడిపోయినట్లు సిగ్నల్ ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











