For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి పెద్ద తిరుగుబోతు.. బాగా బరితెగించింది.. జర్నీ ముందు సమస్య

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్‌తో కలిసి తులసి వైజాగ్ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో నందూ రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు లాస్య.. తులసి ఇలా మారడానికి నువ్వే కారణం అంటూ అతడిని నిందిస్తుంది. ఆ సమయంలో తులసి రాసుకున్న కోరికల చిట్టా గురించి నందూ గతం గుర్తు చేసుకుంటాడు. అనంతరం తులసి ఇంట్లో వాళ్లు వైజాగ్ టూర్ గురించి ఆమెకు ధైర్యం చెబుతారు. అప్పుడు సామ్రాట్ ఫోన్ చేసి ఫ్లైట్ టైం సహా కొన్ని వివరాలు చెప్తాడు. దీంతో తులసి అదే ఊహించుకుంటూ పడుకుని.. చెడ్డ కల కని బెడ్ మీద నుంచి కింద పడిపోతుంది.

  శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!

  తులసిని జాగ్రత్తగా పంపించారు

  తులసిని జాగ్రత్తగా పంపించారు


  వైజాగ్ వెళ్తోన్న సంతోషంలో తులసికి ఏం చేస్తుందో అర్థం కాదు. అప్పుడు దివ్య ‘అమ్మా.. నీ ఆధార్ కార్డ్‌తో పాటు నీకు కావాల్సినవి అన్నీ ఇందులో పెట్టాను' అని అంటుంది. ఆ తర్వాత ప్రేమ్ ‘అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకుంటే నువ్వే మాకు చాలా ముఖ్యమైనదానివి' అంటూ ఎమోషనల్ అవుతాడు. దీంతో తులసి కూడా కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తర్వాత అందరూ జాగ్రత్తలు చెప్పి ఆమెను ఆటో ఎక్కిస్తారు. ఆటోలో వెళ్తోన్న సమయంలో తులసి తనలో తాను సంతోషిస్తూ మురిసిపోతుంది. దీంతో ఆటో డ్రైవర్ కూడా నవ్వుకుంటాడు.

  సామ్రాట్ కారుకు బ్రేకులు డౌన్

  సామ్రాట్ కారుకు బ్రేకులు డౌన్

  ఫ్లయిట్‌కు సమయం దగ్గర పడడంతో సామ్రాట్ కూడా తన కారులో ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతాడు. అప్పుడు కారులో విజిల్స్ వేసుకుంటూ యమ జోష్‌తో కనిపిస్తాడు. దీంతో పక్కనే ఉన్న అతడి బాబాయి ఏంటి హుషారుగా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ ఏం లేదు బాబాయి. నీకు తెలుసు కదా. నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అంటాడు. ఇక, తులసి ఎప్పుడెప్పుడు విమానం ఎక్కాలా అని తెగ సంతోషపడుతూ ఉంటుంది. దీంతో ఆటో డ్రైవర్ తులసి ప్రవర్తనను చూసి షాక్ అవుతాడు. మార్గమధ్యంలో సామ్రాట్ కారు ఆగిపోతుంది. దీంతో డ్రైవర్‌ను ఏమైంది అంటే తెలియదు సార్ వెళ్లి చెక్ చేయాలి అంటాడు. దీంతో డ్రైవర్ వెళ్లి చూసి కారు బ్రేక్ డౌన్ అయింది సార్. కారు స్టార్ట్ అవడం చాలా కష్టం అంటాడు.

  Laal Singh Chaddha Twitter Review: రిలీజ్ రోజే అమీర్‌కు షాక్.. సినిమా టాక్ ఇలా.. నాగ చైతన్య మాత్రం!

  తులసికి చెప్పుకుండానే వెళ్లేలా

  తులసికి చెప్పుకుండానే వెళ్లేలా

  కారుకు బ్రేక్ డౌన్ అవడంతో ఎయిర్‌పోర్టుకు ఎలా వెళ్లాలి అని సామ్రాట్ తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ల బాబాయి క్యాబ్ బుక్ చేసుకో అంటాడు. కానీ, క్యాబ్స్ చెక్ చేస్తే అన్నీ 30 నిమిషాలు వెయిటింగ్‌లో ఉంటాయి. దీంతో ఏం చేయాలో సామ్రాట్‌కు పాలుపోదు. ఇక, చేసేదేం లేక అతడు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ సమయంలో సామ్రాట్ ‘తులసి ఈ పాటికి దారిలో ఉండి ఉంటుంది. నాకు లేట్ అవుతుందని కాల్ చేసి చెప్పనా. వద్దులే ఏదోలా చేసి తులసి చేరే టైమ్‌కు నేను చేరుకోవాలి' అని అనుకుంటాడు. తులసి మాత్రం ఆటోలో వెళ్తూ ఉంటుంది.

  తులసి ఆటో ఎక్కిన సామ్రాట్

  తులసి ఆటో ఎక్కిన సామ్రాట్


  నడుచుకుంటూ వెళ్తోన్న సామ్రాట్ అదే దారిలో ఒక కారు వెళ్తుంటే దాన్ని ఆపుతాడు కానీ.. కారు ఆగదు. ఎన్ని వాహనాలను ఆపినా ఆగవు. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాదు. సరిగ్గా అప్పుడే తులసి ఉన్న ఆటో వస్తుంటుంది. దాన్ని చూసి ఆపుతాడు. ఆ సమయంలో డ్రైవర్ ఆపమంటారా మేడమ్ అని అడుగుతాడు. దీంతో తులసి ‘ఇదేమన్నా షేర్ ఆటో అనుకున్నావా.. డబ్బులు నేను ఇస్తున్నాను' అంటుంది. దీంతో ఆటో ఆపకుండా వెళ్తాడు. ఆ తర్వాత అద్దంలో తులసి సామ్రాట్‌ను చూసి ఆటోను ఆపమంటుంది. దీంతో సామ్రాట్ వచ్చి ఆటో ఎక్కుతాడు.

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!

  ఎయిర్‌పోర్టు చూసి ఆశ్చర్యంగా

  ఎయిర్‌పోర్టు చూసి ఆశ్చర్యంగా

  తన ఆటో ఎక్కిన తర్వాత సామ్రాట్‌ను తులసి మీరేంటి సార్ అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని అడుగుతుంది. దీనికి అతడు జాగింగ్ చేస్తూ వస్తున్నాను అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఆటోలో బయలుదేరి ఎయిర్‌పోర్ట్ కు వెళ్తారు. అక్కడ దిగిన వెంటనే ఆ వాతావరణం అంతా చూసి తులసి షాక్ అవుతుంది. అప్పుడు మనసులో బాబోయ్.. ఏంటి ఎయిర్‌పోర్ట్ ఇంత పెద్దగా ఉంది అని అనుకుంటుంది. అప్పుడు సామ్రాట్ తులసి గారు వెళ్దామా అని అడుగుతాడు. దీంతో సరే అంటుంది తులసి. ఆ వెంటనే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్టు ప్రేమ్‌కు ఆమె ఫోన్ చేసి చెబుతుంది.

  ప్రేమ్ సపోర్ట్.. అభి తిడుతూనే

  ప్రేమ్ సపోర్ట్.. అభి తిడుతూనే

  తులసి వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంటికి నందూ, లాస్య వస్తారు. అప్పుడు లాస్య చూస్తున్నావు కదా నందూ అని అంటుంది. అప్పుడు అతడు ‘తులసిని టూర్‌కు పంపొద్దు అంటూ అమ్మకు కాల్ చేసి మరీ చెప్పాను అయినా వినలేదు కదా' అంటూ నిందిస్తుంటాడు. అప్పుడు ప్రేమ్ ‘అమ్మకు, ఆయనకు ఏంటి సంబంధం. ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు' అని ప్రశ్నిస్తాడు. దీంతో లాస్య ‘తులసిని నువ్వు అమ్మ అని పిలుస్తావు. నందూను నువ్వు నాన్న అని పిలుస్తావు. ఆ బంధం చాలదా. తులసి గురించి మాట్లాడటానికి' అంటుంది. అప్పుడు ప్రేమ్ వాళ్ల అమ్మ గురించి అవమానకరంగా కామెంట్స్ చేస్తున్నారు అంటాడు. ఇంతలో అభి వచ్చి తప్పు చేస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అంటాడు.

  Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

  Recommended Video

  లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
  తులసిని తిరుగుబోతు అంటూ

  తులసిని తిరుగుబోతు అంటూ


  లాస్య, నందూ ఉన్న సమయంలోనే పక్కింటి వాళ్లు అక్కడకు వస్తారు. అప్పుడు తులసిని అడుగుతారు. అప్పుడు లాస్య ‘ఎక్కడ ఉంది. తన బాస్‌తో కలిసి ఫ్లైట్‌లో పక్క పక్కన కూర్చొని ఎగిరిపోయింది' అంటుంది. అప్పుడు వాళ్లు ఇంటి పట్టున ఉండక ఇదేం విడ్డూరం. పరాయి మగాడితో కలిసి వెళ్లడం ఏంటి అంటారు. దీనికి లాస్య ‘వీళ్లే హారతి పట్టి పంపించారు. ఇలా పరాయి మగాళ్లతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగే వాళ్లను మీరేమంటారు' అని అడుగుతుంది. దీనికి పక్కింటి వాళ్లు ‘తిరుగుబోతు అంటారు.. ఇంకా బరితెగించింది అని కూడా అంటారు' అని వాళ్లు అంటారు. దీంతో పరందామయ్య ‘ఆడవాళ్లు అయి ఉండి తోటి ఆడదాని మీద నిందలు వేస్తారా' అంటూ ఫైర్ అవుతాడు. దీంతో వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత సామ్రాట్ ఫైల్ మర్చిపోతాడు. వెంటనే నందూకు ఫోన్ చేసి రమ్మంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 708: Samrat Meets Tulasi After his car break down. After That Lasya Brings her Neighbours to Anasuya House to insult Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X