For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 12th Episode: ఆదిలోనే తులసికి బిగ్ షాక్.. అదంతా వీడియో తీసి చూపించడంతో!

  |

  మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు వెళ్లేందుకు ఇంట్లో అందరూ రెడీగా ఉంటే లాస్య మాత్రం ఎంతకీ రాదు. దీంతో పరందామయ్య మాట ప్రకారం నందూ, తులసి ఒకే కారులో వెళ్లిపోతారు. అప్పుడు ఇంట్లో కాసేపు గొడవ జరుగుతుంది. ఇక, కారులో వెళ్తున్నప్పుడు నందూ, తులసి మధ్య ఆసక్తికరమై సంభాషణ జరుగుతుంది. ఫ్యాక్టరీ దగ్గర రామచంద్ర.. నందూ ముందే తులసిని ప్రశంసిస్తాడు. ఆ తర్వాత కుటుంబం అంతా అక్కడకు చేరుకుంటుంది. ఎప్పటి లాగే లాస్య, భాగ్యలు తులసిని దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తుంటారు.

  ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ అరెస్ట్: ఆ ఫొటో షేర్ చేయడంతో కేసు.. విషయం చెప్పి బాధ పడిన స్టార్

  గిరిధర్‌తో లాస్య ఫోన్... వీడియో తీసి

  గిరిధర్‌తో లాస్య ఫోన్... వీడియో తీసి

  ఆలస్యంగా ఫ్యాక్టరీకి వచ్చిన లాస్యతో భాగ్య పూజ అయిపోందేమోనని కంగారు పడుతుంది. అప్పుడామె గిరిధర్‌కు ఫోన్ చేసి అలెర్ట్ చేస్తుంది. అంతేకాదు, ‘తులసి చాలా మొండిగటం. ఆమెను ఎదుర్కొనేప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి' అని చెబుతుంది. దీనికి గిరిధర్ ‘మీకు ఇది కొత్తేమో.. నాకు మాత్రం మామూలే. ఇలాంటివి ఎన్నో చేశాను. మీకేమో కానీ, నాకు మాత్రం ఆ ఫ్యాక్టరీ కావాలి.. ప్లేస్ కావాలి. మరీ ముఖ్యంగా తులసి ఓటమి కావాలి. లాస్య గారూ తులసి ఓడిపోయినప్పుడు ఆమె ముఖాన్ని వీడియో తీసి నాకు పంపించండి' అని అడుగుతాడు.

  లాస్య, భాగ్య కంగారు.. పూజ కంప్లీట్

  లాస్య, భాగ్య కంగారు.. పూజ కంప్లీట్

  ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయిపోతాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ తులసికి కంగ్రాట్స్ చెబుతారు. కానీ, భాగ్య మాత్రం హడావిడి చూసి తెగ కంగారు పడుతుంది. దీనికి లాస్య ‘నువ్వేమీ కంగారు పడకు భాగ్య. అవతల ఉన్నది గిరిధర్. ఆ విలన్ మామూలోడు కాదు. అంతా అతను చూసుకుంటాడు' అంటూ ధైర్యం చెబుతుంది. అంతలో రామచంద్ర ‘అమ్మా తులసి.. పూజ అంతా పూర్తైంది కదా.. ఇంక పనులు మొదలు పెట్టు' అని చెబుతాడు. దీంతో అక్కడి పనులన్నీ చకచకా అవుతున్నాయని భాగ్య మళ్లీ కంగారు పడుతుంది.

  ఘాటు వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల ఆరబోత

  ఆదిలోనే తులసికి భారీ ఎదురు దెబ్బ

  ఆదిలోనే తులసికి భారీ ఎదురు దెబ్బ

  పూజా కార్యక్రమాలు పూర్తైన వెంటనే పవర్ బటన్స్ ఆన్ చేయమని అందరూ అడగడంతో.. తులసి స్విచ్ ఆన్ చేస్తుంది. దీంతో ఫ్యాక్టరీలో పవర్ సప్లై అవుతుంది. కానీ, అంతలోనే కరెంట్ పోతుంది. దీంతో అందరూ కంగారు పడిపోతారు. అంతలో అక్కడకు ఎలెక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు వస్తారు. అప్పుడు వాళ్లను తులసి కరెంట్ ఎందుకు తీసేశారని అడుగుతుంది. దీనికి ఆ అధికారి ‘లక్షలు లక్షలు బిల్ కట్టకుండా పెండింగ్ ఉంటే కరెంట్ కట్ చేయరా? మీరు డబ్బులు కట్టే వరకూ పవర్ రాదు' అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో తులసితో పాటు అంతా షాక్ అవుతారు.

  తలో మాట అనడంతో తులసికి బాధ

  తలో మాట అనడంతో తులసికి బాధ

  విద్యుత్ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చి వెళ్లిన తర్వాత ఇంట్లో వాళ్లందరూ తులసిని తలో మాట అంటుంటారు. అనసూయ ‘నేను అనుకుంటూనే ఉన్నా ఇలా జరుగుతుందని. ఇలాంటివి చేయాలంటే జాతకం బాగుండాలి. అయినా నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నా నీకు ఇలాంటివి వద్దని. దేవుడు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇక, ఇంటికెళ్లి వంటలు చేసుకో' అంటుంది. ఆ తర్వాత లాస్య, భాగ్య, అంకిత కూడా ఆమెను మరింతగా నిరుత్సాహ పరిచేలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు శృతి, ప్రేమ్ మాత్రం ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు.

  ఘాటు ఫొటోలతో షాకిచ్చిన రుహానీ శర్మ: సినిమాల్లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  గిరిధర్‌కు వీడియో చూపించిన లాస్య

  గిరిధర్‌కు వీడియో చూపించిన లాస్య

  ఫ్యాక్టరీలో జరిగినదంతా దొంగచాటుగా వీడియో తీసిన లాస్య.. దాన్ని గిరిధర్‌కు చూపిస్తుంది. అది చూసిన తర్వాత అతడు ‘నాకు చాలా నవ్వొస్తుంది లాస్య. లేకపోతే ఆ తులసి నాకే సవాల్ చేస్తుందా? తను నా కాలి గోటితో సమానం. ఆరంభంలోనే ఇలా షాక్ తగిలింది. ఇప్పటితో వదలిపెట్టను తనకు ఇంకా ఇంకా అవరోధాలు కలిగిస్తూనే ఉంటాను' అని అంటాడు. దీనికి లాస్య కూడా ‘నాకు కూడా కావాల్సింది అదే గిరిధర్. నువ్వు అలానే చెయ్. నీ గెలుపే నా గెలుపు. ఆ తులసి వరుస దెబ్బలకు బిత్తరపోవాలి' అంటూ ఇద్దరూ మరిన్ని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు.

  ఇంట్లో మళ్లీ రచ్చ.. గిరిధర్ వల్లేనంటూ

  ఇంట్లో మళ్లీ రచ్చ.. గిరిధర్ వల్లేనంటూ

  ఫ్యాక్టరీలో జరిగిన ఘటన తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. ఆ సమయంలో పరందామయ్య ‘ఏంటమ్మా తులసి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు' అని ప్రశ్నిస్తాడు. దీనికి ‘ఏం జరిగిందో? ఏం చేయాలో నాకూ అర్థం కావడం లేదు మామయ్య. ఇదంతా ఆ గిరిధర్ పనే. మీకు చెప్పాను కదా. ఓ వ్యాపారవేత్త ఉన్నాడు.. తను ఫ్యాక్టరీని లాక్కోవాలని చూస్తున్నాడు అని. అతడి పనే ఇదంతా. ఎలాగైనా నన్ను ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీని తన వశం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఇలా కరెంట్ తీయించేశాడు' అంటూ వాళ్లకు వివరిస్తుంది తులసి.

  గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి పర్సనల్ ఫొటోలు: సీరియల్‌లో అలా.. రియల్‌గా ఇలా.. లేటు వయసులో ఘాటు ఫోజులు

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతిని అవమానించేలా అంకిత అలా

  శృతిని అవమానించేలా అంకిత అలా

  ఒకపక్క ఫ్యాక్టరీలో జరిగిన దానికి తులసి బాధ పడుతుంటే.. అనసూయ మళ్లీ ఆమెను నిరుత్సాహ పరిచేలా మాట్లాడుతుంది. ఇకనైనా ఆ ఫ్యాక్టరీలు గట్రా ఆపేయమని అంటుంది. అప్పుడు ప్రేమ్ ఆమెపై ఫైర్ అవుతాడు. దీంతో ‘మీ అమ్మ చెప్పే అబద్ధాలు మీరు నమ్మండి' అని అంటుంది. దీనికి శృతి ‘అమ్మమ్మ ఎందుకు ఆంటీని నిరుత్సాహ పడేలా మాట్లాడతారు' అని అడుగుతుంది. దీంతో అంకిత ‘ఏ నీ ఆస్తులు అమ్మి ఆ మూడు లక్షలు తెస్తావా. నోరు మూసుకుని కూర్చో. ప్రతి దానికి మధ్యలోకి రావద్దు' అంటూ ఘోరంగా అవమానిస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 396: Giridhar and Lasya Planned to Give Shock to Tulasi. Then Electricity Department Officers Did Power Cut in That Factory. After That Anasuya, Lasya and Bhagya Blame Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X