Intinti Gruhalakshmi: క్యాంటీన్‌లో సీన్ చూసి విక్రమ్ షాక్.. లాస్యకు మాజీ భర్త ఝలక్.. నందూ చేతిలో గన్

భారతదేశంలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode August 12th 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలో పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంటీన్ కాంట్రాక్టును తులసి వాళ్లకు ఇస్తున్నట్లు విక్రమ్ చెప్తాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత దివ్య ఆస్పత్రిలో తులసి తనకు సలహాలు ఇస్తుందని సంతోషిస్తుంది. ఇక, తులసి వాళ్లను ఎలాగైనా కాంట్రాక్టు వద్దని పారిపోయేలా చేయాలని రాజ్యలక్ష్మి అనుకుంటుంది. దీనికి లాస్య మంచి ప్లాన్ చెబుతానంటుంది. చివర్లో నందూ.. తులసికి ఎంతో ఇష్టమైన పాత టేపు రికార్డర్‌ను బహుమతిగా ఇవ్వడంతో ఆమె సంతోషిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 12th 2023

ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి: దివ్యను మర్చిపోలేకపోతున్న విక్రమ్.. ఫోన్‌లో ఆమె ఫొటోను చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె తన తల్లిని అన్న మాటలు గుర్తొచ్చి ఫోన్‌ను విసిరి కొడతాడు. అప్పుడే దివ్య వచ్చి 'నన్ను చూడాలనిపిస్తే నేనే ఎదురుగా వచ్చి నిలబడతాను కదా' అంటుంది. తర్వాత విక్రమ్ దగ్గరకు వచ్చి.. ఫోన్‌లో ఉన్న తన ఫొటోని చూసి మురిసిపోతుంది. అలాగే, 'దివ్య అంటే అంత ఇష్టమా? తెగ దాచేసుకుంటున్నావు. ప్రేమను మనసును ఎక్కువ దాచుకోకూడదు. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి' అని అంటుంది. దీంతో ఇంక ఆపుతావా అంటూ చిరాకు పడతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 12th 2023

మోటుగా ఉంటేనే ఇష్టం అని: విక్రమ్ కోపగించుకోవడంతో దివ్య 'నేను నీ బుగ్గగిల్లానా? చంకనెక్కానా? ఏం చేశానని ఆపేయడానికి? మరీ ఇంత మోటుగా ఉంటే పనికి రాదమ్మా. మోటుగా ఉంటే ఆడవాళ్లకి ఇష్టమే.. కానీ మరీ ఇంత వద్దు. కొంచెం మీటర్ తగ్గించు. ముచ్చటగా ఉంటుంది. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది' అంటూ ముద్దు పెట్టుకోబోతుంది. దీంతో విక్రమ్.. దివ్యను నెట్టేసి 'ఒక్కసారి చెప్తే సిగ్గు ఉండాలి. నువ్వు నా పెళ్లానివి కాదు. అతిథివి మాత్రమే. నువ్వు ఈ ఇంట్లో ఉన్నావా? తిన్నావా? విడాకులు తీసుకుని వెళ్లానా? అన్నట్టుగానే ఉండు' అని క్లాస్ పీకుతాడు.

విక్రమ్ కన్నీళ్లతో అర్థం అయి: విక్రమ్ మాటలకు దివ్య 'మనసు చంపుకుని మాట్లాడకు విక్రమ్' అనగా.. 'మనసును నేను చంపుకోలేదు.. నువ్వే చంపేశావు' అని అరుస్తాడు. దీనికామె 'సరే చంపుకున్నది నేనే కదా.. ఆ మనసును బతికించుకునే అవకాశం ఇవ్వు' అనగా.. 'ఇదేం బొమ్మలాట కాదు జీవితం. అలిగినప్పుడు తోసేసి.. అలక తగ్గగానే అతుక్కుపోవడానికి నేను వస్తువును కాదు.

నాకూ మనసు ఉంటుంది. అది పగిలిపోయింది. పగిలిన మనసును అతికించడం కుదరదు' అంటూ ఎమోషనల్ అవుతాడు. దీంతో దివ్య 'నీ మనసుకు నాపై ప్రేమ ఉంది. ఈ కన్నీళ్లే సాక్ష్యం. ఆపేస్తున్న ఆ కన్నీటి చుక్కల్ని అడుగు నిజం చెప్తుంది. ఇప్పటికైనా ఒప్పుకో విక్రమ్' అంటుంది. దీనికి అతడు 'నాకు ఒకప్పటి దివ్య కావాలి. ఆ దివ్య ఇప్పుడు లేదు' అని వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 12th 2023

మాణిక్యాన్ని బెదిరించాడుగా: కెఫేలో కూర్చుని క్యాంటీన్‌కు కావాల్సిన సామాగ్రి గురించి తులసి లిస్ట్ రాస్తూ ఉంటుంది. అప్పుడు మాణిక్యం వచ్చి 'ఏంటీ ఎంతమంది ఉన్నారని లెక్కపెడుతున్నావా? వీళ్లు శాంపిల్ మాత్రమే.. ఇలాంటి వాళ్లు నా దగ్గర చాలామందే ఉన్నారు. క్యాంటీన్ నడుపుకోవడానికి నీకు ఇచ్చిన ఆర్డర్స్ కాపీ మర్యాదగా నా చేతిలో పెట్టు తులసమ్మా' అని బెదిరిస్తాడు. దీంతో తులసి అతడికి ఎదురు తిరగ్గా.. తుపాకీ తీసి చంపేస్తానంటాడు. అప్పుడే నందూ వచ్చి అది లాక్కుని మాణిక్యానికే గురి పెడతాడు. అంతేకాదు, తమ జోలికి వస్తే చంపేస్తానని అనడంతో వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 12th 2023

క్యాంటీన్ హిట్.. విక్రమ్ హ్యాపీ: తులసి వాళ్లు స్టార్ట్ చేసిన క్యాంటీన్‌కు వచ్చిన కొందరు 'అమ్మా.. మీరు క్యాంటీన్ తీసుకోవడంతో ఆస్పత్రికి మంచి రోజులు వచ్చినట్లు ఉన్నాడు. అప్పుడున్న అతడు మాకు డబ్బు తీసుకుని కూడా మంచిగా పెట్టేవాడు కాదు. మీరు ప్రేమగా ఇస్తున్నారు. ఇక్కడ తింటే ఇంట్లో తిన్నట్లే ఉంది' అని చెప్తారు.

అప్పుడే విక్రమ్, దివ్య వచ్చి ఆ మాటలు విని సంతోషిస్తారు. అప్పుడు దివ్య 'చూశావా విక్రమ్ అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో. నువ్వు తీసుకొచ్చిన మార్పు వాళ్లలో సంతోషాన్ని నింపింది. అదే నువ్వు మొత్తం ఆస్పత్రి మీద దృష్టి సారిస్తే ఇంకా బాగుంటుంది. పదా వెళ్లి తిందాం' అంటుంది. దీంతో విక్రమ్ 'వద్దులే నేను రాను. బిజినెస్ వేరు బంధుత్వం వేరు అని చెప్పతా కదా' అంటాడు. ఇదంతా రాజ్యలక్ష్మి వాళ్లు చూసి రగిలిపోతూ ఉంటారు.

లాస్యకు షాకిచ్చిన మాజీ భర్త: లాస్యకు మాజీ భర్త ఫోన్ చేసి 'లక్కీ ఉండే హాస్టల్‌కు త్వరగా రా' అని చెప్తాడు. దీంతో లాస్య అక్కడకు వెళ్లగా.. లక్కీ ఆమెకు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అంతలోనే అతడు వచ్చి 'లాస్య.. తను నాకు కాబోయే భార్య. నీతో ఎప్పుడో విడాకులు తీసుకున్నా. ఇప్పుడు వీడితో బంధాన్ని కూడా ముగించాలని అనుకుంటున్నా. మా పెళ్లి తర్వాత మాకేం ఇబ్బందులు రాకూడదు కదా. ఇదిగో లక్కీ నేను నీకు ఈ డబ్బు తప్ప ఏమీ చేయలేకపోయా' అని అంటాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు లక్కీ మాత్రం 'నాకు డాడీ కావాలి' అంటూ పట్టుబట్టి మరీ ఏడుస్తుంటాడు.

తులసి కోసం మరో గిఫ్ట్ కూడా: ఇంటికి వెళ్లిన తర్వాత అందరూ సంతోషంగా ఉండగా.. అప్పుడే ఒక పార్శిల్ వస్తుంది. నందూ పేరు మీద ఉండడంతో అందరూ అతడిని నిలదీస్తారు. అంతేకాదు, దాన్ని అక్కడే ఓపెన్ చేస్తామని అంటాడు. కానీ, నందూ మాత్రం వద్దని బ్రతిమాలుతాడు. అప్పుడు నందూ 'ఓపెన్ చేస్తే నా పని అయిపోతుంది కదా' అని అనుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X