For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసితో సామ్రాట్ చిలిపి పనులు.. బలరాజు ఎంట్రీతో నందూకు షాక్

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని ఇంట్లో వాళ్లు అందరూ కలిసి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వైజాగ్‌కు పంపిస్తారు. అప్పుడామెను ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు ఓ ఆటో ఎక్కిస్తారు. మరోవైపు, సామ్రాట్ తన కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆ కారుకు బ్రేకులు ఫెయిల్ అవుతాయి. దీంతో సామ్రాట్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు తులసి అతడిని చూసి ఆటో ఎక్కించుకుంటుంది. మరోవైపు నందూ, లాస్యలు పక్కింటి వాళ్లను తులసి ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు వాళ్లంతా తులసిపై దారుణంగా కామెంట్లు చేస్తారు.

  బద్రీ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్: వామ్మో ఇది చూశారంటే షాకే!

  నందూ వెంటే లాస్య ప్రయాణం

  నందూ వెంటే లాస్య ప్రయాణం

  ముఖ్యమైన ఫైల్ మర్చిపోయి.. దాన్ని నందూను తీసుకు రమ్మని సామ్రాట్ చెప్తాడు. అంతేకాదు, వైజాగ్ వచ్చేయమని అంటాడు. దీంతో నందూ అఇష్టంగానే వెళ్లేందుకు ఒప్పుకుంటాడు. ఇంట్లో రెడీ అవుతుండగా లాస్య కూడా వస్తానని అంటుంది. 'నందూ నాకు కూడా టికెట్ బుక్ చేయి. నేను కూడా వస్తా' అంటుంది. దీంతో నందూ సామ్రాట్ గారు ఏమైనా అనుకుంటారేమోనని అంటాడు. అప్పుడు లాస్య 'ఏం కాదు.. పెళ్లాం కాని పెళ్లం తులసిని ఆయన తీసుకెళ్లగా.. నేను నీతో రావడంలో తప్పేముంది' అంటుంది. దీంతో నందూ ఆమెను తీసుకెళ్లేందుకు ఓకే అంటాడు.

  ఎయిర్‌పోర్టులో పులిహోర తిని

  ఎయిర్‌పోర్టులో పులిహోర తిని

  సామ్రాట్, తులసి ఎయిర్ పోర్ట్ లో కూర్చొంటారు. అప్పుడు సామ్రాట్ 'ఫైల్ తీసుకొని నందూను నెక్స్ట్ ఫ్లయిట్‌కు రమ్మన్నాను. కానీ, మన ఫ్లయిటే 2 గంటలు లేట్ అయింది. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వచ్చాం కదా. పదా ఏదైనా తిని వద్దాం' అంటాడు. దీనికి తులసి అవసరం లేదు. నేను పులిహోర తీసుకొచ్చాను అంటుంది. అప్పుడు సామ్రాట్ పులిహోరనా అని నవ్వుతాడు. తర్వాత వాసన మంచిగా రావడంతో వెంటనే ఆ పులిహోరను తినేస్తాడు. అప్పుడు 'వావ్.. కడుపు నిండిపోయింది. అయ్యో మొత్తం తినేశానా? మీకు ఏం పెట్టలేదా' అంటాడు. దీంతో తులసి మీకు గుర్తు లేదా అని అడుగుతుంది. అప్పుడతను సారీ అండి మొత్తం తినేశా అంటాడు. దీంతో పర్వాలేదు.. నేను విమానంలో తింటాను అంటుంది.

  తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత: ఆమె డ్రెస్, ఫోజులు చూస్తే!

  అభితో గొడవకు దిగిన అంకిత

  అభితో గొడవకు దిగిన అంకిత


  ఆస్పత్రికి వెళ్లేందుకు అభి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. అంతలో అంకిత అక్కడకు వచ్చి ఆ బట్టలను చిందరవందర చేస్తుంది. దీంతో అభి 'ఏంటి అంకిత.. హాస్పిటల్‌కు వెళ్లాలి.. షర్ట్ నలిగిపోయింది. చూడు.. ఇప్పుడు ఎలా వెళ్లాలి' అని ప్రశ్నిస్తాడు. దీంతో అంకిత 'షర్ట్ నలిగితేనే ఇంతలా బాధపడుతున్నావు. నువ్వు ఆంటి మీద ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన దానికంటే ఇదేమీ పెద్ద విషయం కాదు' అంటుంది. దీనికి అభి 'జరిగేదే కదా అన్నాను. అయినా పక్కింటి వాళ్లు మమ్మీని ఇంకా మాటలు అన్నారు. నేను నీకోసం వచ్చాను అంకిత. నువ్వు హర్ట్ అయితే సారీ' అంటాడు. అప్పుడు అంకిత 'పక్కింటి వాళ్లకు ఆంటీ గురించి తెలీదు. నీకు తెలుసు కదా' అంటూ గట్టిగానే క్లాస్ పీకుతుంది.

  నందూను మెచ్చుకున్న బాస్

  నందూను మెచ్చుకున్న బాస్

  వైజాగ్ వెళ్లేందుకు నందూ, లాస్య క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు వస్తారు. కారు దిగిన వెంటనే అక్కడ తులసి, సామ్రాట్ ఇద్దరు ఒకేచోట కూర్చోవడాన్ని చూస్తారు. ఇంతలో వాళ్లు కూడా నందూ, లాస్యను చూస్తారు. అప్పుడు లాస్య 'ఏంటి మేడమ్ అలా చూస్తున్నారు. వన్ ప్లస్ వన్ ఆఫర్‌లా నందూను రమ్మంటే నేను కూడా వచ్చాననా' అని తులసిని అడుగుతుంది. కానీ, ఆమె ఏమీ మాట్లాడదు. అప్పుడు సామ్రాట్ 'నిజానికి నేను నందూను మెచ్చుకోవాలనుకుంటున్నాను. చాలా మంది భార్యలను భర్తలు టూర్స్ కు తీసుకెళ్లరు. కానీ.. నందూ మాత్రం అలా కాకుండా మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చాడు. మీరు ఏమంటారు తులసి గారు' అంటాడు. అప్పుడామె 'ఆయనను పొగిడేంత నా దగ్గర విషయం లేదు' అంటుంది.

  మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్

  సామ్రాట్‌కు తులసి చిన్న క్లాస్

  సామ్రాట్‌కు తులసి చిన్న క్లాస్


  నందూ, లాస్యను సామ్రాట్ మీకు టికెట్స్ దొరికాయా అని అడుగుతాడు. దీంతో మీ ప్లయిట్‌లోనే దొరికాయి సార్ అని చెబుతారు. ఆ తర్వాత ప్రయాణికులంతా విమానం ఎక్కుతారు. అప్పుడు తులసి నా సీటు ఎక్కడ అని సామ్రాట్‌ను అడుగుతుంది. దీంతో అదిగే ఆ విండో సైడ్ అంటాడు. అప్పుడామె అయ్యో ఈ సీటు డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అంటుంది. దీనికి సామ్రాట్ ఏం కాదు.. ఇది బిజినెస్ క్లాస్ అంటాడు. దీంతో తులసి 'మీకు ఎంత డబ్బు ఉంటే మాత్రం అంత విచ్చలవిడిగా ఖర్చు పెడతారా' అంటూ క్లాస్ పీకుతుంది. దీంతో ఆయన సారీ చెప్తాడు.

  బత్తాయి బలరాజు రాకతో రచ్చ

  బత్తాయి బలరాజు రాకతో రచ్చ

  ఇక, నందూ, లాస్య కూడా వాళ్ల పక్క సీట్లలోనే కూర్చుంటారు. అప్పుడు బత్తాయి బలరాజు ఎంట్రీ ఇచ్చి నందూను ఆ సీటులో నుంచి లేవమంటాడు. అంతేకాదు, కొంత ఓవర్‌ చేస్తూ 'అది నా సీటు. ఇది ఎర్రబస్సు కాదమ్మ.. ఎయిర్ బస్సు.. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. నువ్వు లేస్తే నేను ఆమె పక్కన సెటిల్ అవుతా' అంటాడు. దీంతో నందూకు కోపం వస్తుంది. అప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి బత్తాయి బలరాజు సీటు వేరేదని చూపిస్తుంది. దీంతో అతడు ఆ సీటులో కూర్చుంటాడు. ఆ తర్వాత సామ్రాట్.. సీట్ బెల్టు గురించి తులసితో రొమాన్స్ చేస్తాడని లాస్య నందూతో అంటుంది. దీంతో అతడు ఏవేవో ఊహించుకుంటాడు. కానీ, సామ్రాట్ మాత్రం ఆమెను టచ్ చేయకుండా బెల్ట్ పెట్టుకోవడం చూపిస్తాడు.

  శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!

  అభి గొడవ.. వంటలు బాలేక

  అభి గొడవ.. వంటలు బాలేక


  అంకిత, పరందామయ్య, దివ్య, అనసూయ, అభిలు అందరూ అన్నం తింటూ ఉంటారు. ఆ వంటలు అంకిత వండడంతో ఎవ్వరికీ అవి నచ్చవు. దీంతో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాదు. వంట బాగోలేదు అని చెబితే హర్డ్ అవుతుందని అభి కూడా అనుకుంటాడు. ఆ సమయంలో మాటలో మాట వచ్చి పరందామయ్య.. అభిది వాళ్ల డాడీ పోలిక అంటాడు. దీంతో అతడికి కోపం వస్తుంది. ఆ సమయంలో ప్రేమ్ ఆపినా ఆగకుండా గొడవకు దిగుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 709: Ankitha Fires On Abhi for Insulting Tulasi. After That Nandhu and Lasya Get Irritated to see Tulasi and Samrat Together.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X