Intinti Gruhalakshmi August 13th Episode: తులసికి అండగా నిలిచిన నందూ.. లాస్యతో మొదలైన యుద్ధం
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఆలస్యం లేకుండా చూద్దాం పదండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పూజా కార్యక్రమాలు జరుగుతోన్న సమయంలో లాస్య, గిరిధర్ ప్లాన్ ప్రకారం తులసి ఫ్యాక్టరీలో కరెంట్ కట్ చేయిస్తారు. మూడు లక్షల రూపాయలు బకాయి ఉన్నట్లు.. అవి చెల్లిస్తేనే కరెంట్ వస్తుందని చెబుతారు. అప్పుడు అనసూయ, లాస్య, భాగ్యలు తులసిని అవమానిస్తారు. ఆ తర్వాత ఫ్యాక్టరీలో తీసిన వీడియోను గిరిధర్‌కు చూపిస్తుంది లాస్య. అప్పుడు ఇద్దరూ కలిసి తెగ సంతోషిస్తారు. అనంతరం ఇంట్లో దీనిపై పెద్ద డిస్కర్షన్ జరుగుతుంది. ఆ సమయంలో అంకిత, శృతిని తీవ్రంగా అవమానిస్తుంది.

తులసికి నందూ సపోర్ట్.. తీవ్ర ఆగ్రహం
ఫ్యాక్టరీలో జరిగిన దాని గురించి తులసిని అందరూ నిందిస్తూ ఉంటారు. అప్పుడు లాస్య కూడా ఆమెను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుంది. ఆ సమయంలో నందూ మాట్లాడుతూ.. 'ఎందుకు లాస్య తులసిని నిందిస్తారు. తన ప్రయత్నం ఏదో చేసింది. దానికి ఓ సమస్య వచ్చింది. ఇప్పుడు సపోర్ట్ చేయాల్సింది పోయి.. తలో మాట అంటారేంటి' అంటూ తులసికి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు లాస్య, అనసూయ అతడిని తిడతారు. అప్పుడు తులసి 'ఎన్నో సమస్యలు చూశా. దీనికి కూడా ఏదో ఒక మార్గం గురించి ఆలోచిస్తా' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

గిరిధర్‌తో ప్రేమ్ ఫైట్... శృతి సలహాలు
ఇంట్లో గొడవ అయిపోయిన వెంటనే ప్రేమ్.. గిరిధర్‌ను కొట్టేందుకు బయలు దేరుతాడు. అప్పుడు వెనుక పరిగెత్తుకుని వచ్చిన శృతి అతడి ఆపుతుంది. దీనికి 'మా అమ్మను ఎవరైనా మాట అంటేనే తట్టుకోలేను. అలాంటిది అడుగడుగునా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్న ఆ గిరిధర్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతాను' అంటాడు. దీనికి శృతి 'ఇప్పుడు ఫ్యాక్టరీలో వచ్చింది డబ్బు సమస్య. అది మనీ కడితే అయిపోతుంది. ఇప్పుడు ఈ సమస్య వల్ల ఆంటీ బాధ పడుతున్నారు. నువ్వు ఇప్పుడు మరో సమస్యను సృష్టించొద్దు' అని సలహాలు ఇస్తుంది. దీంతో ప్రేమ్ సైలెంట్ అయిపోతాడు.

తులసికి నందూ క్షమాపణ.. ఏడుస్తూ
ఒంటరిగా కూర్చుని జరిగిన విషయాలను ఆలోచిస్తున్న తులసి దగ్గరకు నందూ వస్తాడు. 'సారీ తులసి. నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేశావ్. అది ఆదిలోనే ఆగిపోయింది' అని అంటాడు. అప్పుడు తులసి 'నేను అనుకున్నది ఏది జరిగింది? చిన్నప్పుడు పాటలు పాడాలని అనుకున్నా. నాతోనే ఉంటానన్న నా ప్రేమ మధ్యలోనే వెళ్లిపోయింది' అని ఏడుస్తూ చెబుతుంది. దీనికి 'సారీ తులసి సాయం చేయాలనున్నా చేయలేను' అని అంటాడు. అప్పుడు తులసి 'పరాయి వాళ్ల దగ్గర సహాయం ఆశించే పరిస్థితి తెచ్చుకోను. నేనే మార్గం వెతుక్కుంటా' అని అంటుంది.

తులసికి అసలు నిజం చెప్పిన లాస్య
తులసితో మాట్లాడిన తర్వాత నందూ లోపలికి వెళ్లిపోతాడు. అప్పుడు లాస్య అక్కడకు ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే తులసిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుంది. అంతేకాదు, 'ఫ్యాక్టరీలో జరిగింది సహజ సిద్ధంగా జరిగిందని అనుకుంటున్నావా? కాదు.. అది నేను సృష్టిస్తేనే జరిగింది. నా ప్రమేయంతోనే జరిగింది. ఇదే కాదు.. నీకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తాను. ఏడాదిలో నువ్వు నా మీద ఓడిపోయి.. ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయేలా చేస్తాను. లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తావా. ఇక నుంచి నీకు ప్రతిరోజూ కష్టాలే' అని వార్నింగ్ ఇస్తుంది.

లాస్యతో మళ్లీ చాలెంజ్ చేసిన తులసి
లాస్య అన్న మాటలకు తులసి కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. 'నువ్వు ఏం చేసినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా లక్ష్యాన్ని చేరుకుంటాను. సంకల్ప బలం ముందు ఇలాంటి కుట్రలు పని చేయవు. అయినా.. ఇలాంటి సవాళ్లను నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. ఇది వాటి కంటే పెద్దదేమీ కాదు. సరే నేను నా కుటుంబాన్ని వదిలేసి వెళ్తానో.. నువ్వే ఇక్కడి నుంచి వెళ్లిపోతావో చూద్దాం' అంటూ లాస్యకు మరో ఛాలెంజ్ విసురుతుంది. దీంతో ఆమెకు దిమ్మ తిరిగిపోతుంది. ఆ కోపంతోనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తులసి గురించి నందూతో లాస్య గొడవ
తులసికి సహాయం చేస్తానని చెప్పినప్పుడు చూసిన లాస్య నందూతో గొడవకు దిగుతుంది. 'ఏం చేస్తున్నావ్ నందూ? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నీ తల్లిదండ్రులను చూసుకోడానికి.. నీ పిల్లలకు అండగా ఉండడానికి. అంతేకానీ, ఆ తులసితో నీకెందుకు' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తానేం చేశానని నందూ అడుగుతాడు. 'ఏం చేశావో తెలిదా? ఆ తులసికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావ్.. వెళ్లి ఏదైనా హెల్ప్ చేయనా అని అడుగుతున్నావ్.. అసలు నువ్వు ఆమెతో ఎందుకలా ప్రవర్తిస్తున్నావ్' అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది.
Recommended Video

నందూకు అలా వార్నింగ్ ఇచ్చిన లాస్య
లాస్య అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ.. 'ఏదో సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఓదార్చే ప్రయత్నం చేయడం తప్పా. అయినా ఎందుకలా మాట్లాడుతున్నావ్ లాస్య' అని సమాధానం ఇస్తాడు. దీనికి లాస్య 'ఏది ఏమైనా నువ్వు చేస్తున్నది తప్పు నందూ. అసలు నువ్వు తులసి గురించి పట్టించుకోవడం వేస్ట్. తను నువ్వు విడాకులిచ్చిన మాజీ భార్య. ఇకనైనా ఆమె గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఒకవేళ అలా చేస్తే మాత్రం బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో నందూ తెల్లముఖం వేసి అలా చూస్తూ ఉండిపోతాడు.


Click it and Unblock the Notifications











