For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 14th Episode: తులసి సూపర్ ప్లాన్‌.. పనులు మొదలు.. నందూకు ప్రాణభయం

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీలో జరిగిన దానికి కారణం గిరిధర్‌ అని తెలుసుకున్న ప్రేమ్.. అతడితో గొడవ పడేందుకు బయలుదేరుతాడు. అంతలో ప్రేమ్‌ను శృతి ఆపుతుంది. ఆ తర్వాత తులసికి నందూ సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అంతేకాదు, ఏదైనా సహాయం చేయాలా అని కూడా అడుగుతాడు. అనంతరం లాస్య, తులసి ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ వెంటనే తులసితో మంచిగా మెలుగుతున్నాడన్న కారణంతో లాస్య నందూతో తీవ్ర స్థాయిలో గొడవకు దిగుతుంది. అంతేకాదు, ఆమెకు దూరంగా ఉండాలంటూ వార్నింగ్ కూడా ఇస్తుంది.

  Paagal Movie Twitter Review: పాగల్‌కు ఊహించని టాక్.. ప్లస్‌లు మైనస్‌లు ఇవే.. మొత్తంగా ఎలా ఉందంటే!

  తులసికి జాగ్రత్తలు చెప్పిన రామచంద్ర

  తులసికి జాగ్రత్తలు చెప్పిన రామచంద్ర

  తనను అందరూ తిడుతున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధ పడుతుంది తులసి. అప్పుడే ఆమెకు రామచంద్ర ఫోన్ చేసి కరెంట్ బిల్ గురించి అడుగుతాడు. అంతేకాదు, ‘ఈ రంగమే అంత అమ్మా.. మనం ఎదగాలనుకుంటే వెనక్కి లాగాలని చూస్తుంటారు. మనం వర్క్ త్వరగా ప్రారంభించాలి. లేకుండా మిశ్రా గారి కంపెనీ నుంచి కూడా మనకు మాట వస్తుంది. ఎలాగైనా డబ్బు చూసుకో అమ్మా. కరెంట్ బిల్ కట్టడమే మనకు ఉన్న ఏకైక మార్గం' అని జాగ్రత్తలు చెబుతాడు. దీంతో తులసి ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నా అంటూ చెబుతుందామె.

  శృతి కంగారు.. ప్రేమ్ మాత్రం కూల్‌గానే

  శృతి కంగారు.. ప్రేమ్ మాత్రం కూల్‌గానే

  రామచంద్రతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత కంగారు కంగారుగా ఫ్యాక్టరీకి బయలుదేరుతుంది తులసి. అప్పుడు వెనకే వచ్చిన శృతి ‘ఎందుకు ఆంటీ.. అంత కంగారు పడుతున్నారు. టిఫిన్ చేసి వెళ్లొచ్చు కదా' అని ఆపుతుంది. కానీ, తులసి మాత్రం కంగారుగానే వెళ్లిపోతుంది. అప్పుడు ప్రేమ్ అక్కడకు వచ్చి శృతికి ధైర్యం చెబుతాడు. ‘అమ్మ అంత కంగారుగా వెళ్తుందంటే ఏదో ఐడియా వచ్చి ఉంటుంది. దాన్ని వెంటనే అమలు చేయాలనే అలా వెళ్తుంది' అని చెబుతాడు. ఆ తర్వాత గతంలో శృతి తనను అరెస్ట్ చేయించిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు.

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ మొత్తం చూపించిన తెలుగు పిల్ల

  తులసి కొత్త ఐడియా... వర్కర్లతో అలా

  తులసి కొత్త ఐడియా... వర్కర్లతో అలా

  రామచంద్రతో ఫోన్ మాట్లాడిన సమయంలో పాత కుట్టు మెషీన్లు ఉన్నాయా అని అడుగుతుంది. దానికి ఆయన ఉన్నాయని చెప్పగానే కంగారుగా ఫ్యాక్టరీకి వెళ్లిన తులసి.. వాటితో పనులు మొదలు పెడదామని రామచంద్రతో చెబుతుంది. ఆ తర్వాత వర్కర్లను అందరినీ కూర్చోబెట్టి.. ‘మనం ఆడవాళ్లం.. డెలివరీ టైమ్‌లో ఎంతో నొప్పిని భరించాం. దాని ముందు చిన్న చిన్న కష్టాలు ఎంత? అందుకే మనం పాత కుట్టు మెషీన్లతో పనులు మొదలు పెడదాం' అని అంటుంది. దీనికి ఆ వర్కర్లు కూడా అంగీకరించడంతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధం అవుతారు.

  నందూను మరో పెద్ద కోరిక కోరిన లాస్య

  నందూను మరో పెద్ద కోరిక కోరిన లాస్య

  ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటున్న నందూ దగ్గరకు లాస్య వస్తుంది. రావడం రావడమే రొమాంటిక్‌గా చూస్తూ అలాగే ఉండిపోతుంది. దీంతో అతడు ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు ‘ఏంటి లాస్య అలా చూస్తున్నావ్' అని ప్రశ్నిస్తాడు. దీనికి ‘ఏ చూడకూడదా' అని అడుగుతుంది. అప్పుడు నందూ ‘నువ్వు చూస్తే ప్రాబ్లం లేదు. ఏదో మతలబు ఉంది అని అనిపిస్తుంది' అంటాడు. అప్పుడు లాస్య ‘మనం ఒక ఇల్లు కొందాం నందూ. ఎన్ని రోజులని పరాయి ఇంట్లో ఉండాలి. ఆ తులసి ఇంట్లో ఎందుకు ఉండాలి' అని చెబుతుంది. దీనికి నందూ మాత్రం అస్సలు ఒప్పుకోడు.

  Bigg Boss Telugu 5లోకి ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా: మతి పోగొట్టే ఫోజులతో ఘాటు ఫొటోలు

  నందూకు దివాకర్ సీరియస్ వార్నింగ్

  నందూకు దివాకర్ సీరియస్ వార్నింగ్

  లాస్య ఇల్లు కొందామని అంటుండగా.. నందూ మాత్రం అప్పులు అన్నీ అలా ఉంచుకుని ఎలా కొనాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడే దివాకర్ ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే ‘నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మీరు ఇల్లు కొనుక్కుని ఎంజాయ్ చేయండి' అని అంటాడు. దీంతో లాస్య ‘మీరు చేసిన అగ్రిమెంట్ ఇల్లీగల్. మీ దగ్గర అప్పు చేస్తే మేమేమీ కొనకూడదా' అని అంటుంది. దీనికి దివాకర్ ‘ఏంట్రా నందూ అప్పు తీసుకుని.. ఇప్పుడు ఈమెను నా మీదకు ఉసిగొల్పుతున్నావా? రేపటి కల్లా డబ్బు ఇవ్వకపోతే నేనేంటో నీకు చూపిస్తా' అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

  తులసిపై ప్రేమ్, శృతి ప్రశంసల వెల్లువ

  తులసిపై ప్రేమ్, శృతి ప్రశంసల వెల్లువ

  కుట్టు మెషీన్లతో ఫ్యాక్టరీ పనులు ప్రారంభం అవుతాయి. వర్కర్లకు తులసి సలహాలు ఇస్తుంటుంది. అంతలో అక్కడకు ప్రేమ్, శృతి చేరుకుంటారు. అప్పుడు ఆమె పనులు చేయించడం చూసి తెగ మురిసిపోతుంటారు. అనంతరం వాళ్లను చూసి అక్కడకు వస్తుంది తులసి. ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఐడియాను ప్రస్తావిస్తూ ప్రేమ్, శృతి ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. దీనికి తులసి కూడా బాగా సంతోషిస్తుంది. కానీ, తనకు ఐడియా మాత్రమే వచ్చిందని, కష్టమంతా వర్కర్లదేనని చెబుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

  ట్రాన్స్‌పరెంట్ బ్రాతో కంగనా రనౌత్ ఘాటు ఫోజులు: అరాచకమైన ఫొటోలతో రచ్చ చేసిన బ్యూటీ

  స్వీట్స్ పంచిన ప్రేమ్.. ఇంట్లో వాళ్లు షాక్

  స్వీట్స్ పంచిన ప్రేమ్.. ఇంట్లో వాళ్లు షాక్

  ఫ్యాక్టరీ నుంచి ఇంటికి చేరుకున్న ప్రేమ్, శృతి స్వీట్స్ పట్టుకుని వచ్చి కుటుంబ సభ్యులు అందరికీ పంచుతారు. దీంతో అందరూ ఏమైందని అడుగుతారు. అప్పుడు శృతి ‘తులసి ఆంటీ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించారు' అని చెబుతుంది. దీనికి అందరూ సంతోషించగా.. అంకిత మాత్రం మూడు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతుంది. అప్పుడు కుట్టు మెషీన్లతో పని చేస్తున్నారని చెబుతారు. దీంతో అనసూయ ‘ఏ మీ అమ్మ అంత గొప్ప పని చేసిందా? దీనికే ఇంత చేస్తున్నారు. నాలుగు రోజులు మెషీన్ తొక్కితే కాళ్లు పోతాయ్' అని అంటుంది. ఇక, ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 398: Tulasi Motivated Workers and Started Factory Work. Then Diwakar Asked his Money From Nandhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X