Intinti Gruhalakshmi Today Episode: విమానంలో సమస్య.. నందూకు తులసి ఝలక్.. వాళ్లిద్దరూ ఒకే రూమ్‌లో!

ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్లైట్‌లో తులసి ఫొటోలు దిగాలని అనుకుంటుంది. దీనికి సామ్రాట్ సహాయం చేసి కొన్ని పిక్స్ తీస్తాడు. అవి తులసి తన ఇంట్లో వాళ్లకు పంపుతుంది. ఆ తర్వాత పక్క సీటులో ఉన్న బాలరాజు తులసి, సామ్రాట్‌ను భార్య భర్తలని, లాస్య‌ను నందూను సెటప్‌ అని కామెంట్ చేస్తాడు. దీంతో నందూకు కోపం వస్తుంది. మరోవైపు, అభి గొడవ పడి తినడం మానేయడంతో అంకిత వంట చేయకూడదని అనుకుంటుంది. ఇక, శృతిని ఎలాగైనా తనతో తీసుకుని రమ్మని ప్రేమ్‌కు అంకిత కొన్ని విలువైన సలహాలను ఇస్తుంది.

సామ్రాట్‌ను విసిగించేసిన తులసి

సామ్రాట్‌ను విసిగించేసిన తులసి

ఫ్లైట్‌లో పక్కనే కూర్చున్న తులసి ఊరికే సామ్రాట్‌ను విసిగిస్తూ ఉంటుంది. దీంతో అతడు 'తులసి గారు మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరు తొలిసారి విమానం ఎక్కారు. విమానం ఎక్కిన అనుభూతిని పొందండి' అంటాడు. అప్పుడు తులసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపు నిద్రపోతుంది. దీంతో ఆమెకు చలి పెడుతోందని తెలుసుకొని తన బ్లేజర్ తీసి కప్పుతాడు. ఆ తర్వాత ఆమె లేచి చూసి కోటు ఎందుకు కప్పారు అని అడుగుతుంది. దీంతో మీకు చలిపెడుతోందని కప్పాను అంటాడు. అనంతరం అది తీసుకుని కప్పుకుంటాడు.

ప్రేమ్‌కు అంకిత విలువైన సలహా

ప్రేమ్‌కు అంకిత విలువైన సలహా

అంకిత చెప్పినట్టుగా శృతిని తీసుకొని వచ్చేందుకు ప్రేమ్.. ఆమె ఉండే ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ శృతి ఉండదు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. దీంతో ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత అతడికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో అంకిత ఫోన్ చేస్తుంది. దీంతో అక్కడ జరిగిన దానిని ప్రేమ్ ఆమెకు వివరించి చెబుతాడు. దీంతో అంకిత 'నువ్వు ఏం టెన్షన్ పడకు. శృతి నీతో వస్తుంది. శృతికి ఫోన్ చేసి తను ఎక్కడుందో కనుక్కో. అలా చేయడం వల్ల తను నీతో వచ్చే అవకాశం ఉంటుంది' సలహా ఇస్తుంది. దీంతో ప్రేమ్ ఆమెకు ఫోన్ చేయాలని అనుకుంటాడు.

విమానంలో సమస్య.. నందూ ఫైర్

విమానంలో సమస్య.. నందూ ఫైర్

తులసి, సామ్రాట్, నందూ, లాస్యలు ప్రయాణం చేస్తోన్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడుతుంది. దీంతో విమానం కుదుపులకు గురవుతుంది. అప్పుడు విమానంలోని ప్రయాణికులంతా షాక్ అవుతారు. తమకు ఏం జరుగుతుందో తెలియక అందరూ కంగారు పడతారు. అప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి వాళ్లందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ప్రయాణికులంతా తమకు తోచిన విధంగా మాట్లాడుతుంటారు. ఆ సమయంలోనే నందూ ఏకంగా ఎయిర్ హోస్టెస్ మీద అరుస్తాడు. కాక్‌పిట్‌లోకి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకుంటానని సీరియస్ అవుతాడు.

నందూపై తులసి తీవ్ర ఆగ్రహం

నందూపై తులసి తీవ్ర ఆగ్రహం

ఒకానొక సందర్భంలో ఎయిర్ హోస్టెస్‌ను నందూ పక్కకు నెట్టేస్తాడు. దీంతో తులసి అతడిపై సీరియస్ అవుతుంది. 'మీరు అసలు మనుషులేనా. ఆవిడ ఏం చేస్తుంది. ఆవిడ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. ఆమె స్థానంలో మీ ఇంట్లోని ఆడపిల్ల ఉన్నా ఇలాగే ప్రవర్తిస్తారా? చాలా మంది యాక్సిడెంట్ చేసి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. కానీ, ఇక్కడ మనకు ధైర్యం చెబుతున్నారు' అని అరుస్తుంది. దీంతో నందూ 'వామ్మో ఇదేదో మన మీదకే వచ్చేలా ఉంది. తులసి హనీ యాక్సిడెంట్ గురించి చెప్తుందేమో' అనుకుని వెంటనే సారీ చెప్పి కూర్చుంటాడు.

తులసి ధైర్యం.. అంతా సవ్యంగా

తులసి ధైర్యం.. అంతా సవ్యంగా

నందూపై ఫైర్ అయిన తర్వాత విమానంలోని ప్రయాణికులందరితో తులసి మాట్లాడుతుంది. అప్పుడు వాళ్లతో 'మన భయమే మన మృత్యువు. పిరికివాడిని మృత్యువు తేలికగా తీసుకెళ్తుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. ధైర్యంగా ఉండండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుని కూర్చోండి' అని చెబుతుంది. ఇంతలో విమానంలో టెక్నికల్ సమస్య తగ్గినట్టు సిబ్బంది ప్రకటిస్తారు. దీంతో అందరూ తులసి మోటివేట్ చేసినందుకు చప్పట్లు కొడతారు. అప్పుడు సామ్రాట్ 'చూశారా.. మీలో ఉన్న గొప్పదనం అదే' అంటాడు సామ్రాట్. అంతలో బత్తాయి బాలరాజు.. నందూతో 'మీకో విషయం చెప్పనా? ఖచ్చితంగా వాళ్లిద్దరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటారు' అంటాడు.

కాన్ఫరెన్స్ వాయిదా పడడంతో

కాన్ఫరెన్స్ వాయిదా పడడంతో


ఆ తర్వాత వైజాగ్‌లో విమానం ల్యాండ్ అవుతుంది. సామ్రాట్, తులసితో పాటు నందూ, లాస్య హోటల్‌కు వస్తారు. హోటల్ ముందు సామ్రాట్, తులసి ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి లాస్య, నందూ షాక్ అవుతారు. తర్వాత సామ్రాట్ దగ్గరికి వెళ్తారు. ఇంతలో సామ్రాట్‌కు ఫోన్ వస్తుంది. అది మాట్లాడిన తర్వాత 'వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉందని క్లయింట్ మీటింగ్‌ను పోస్ట్ పోన్ చేశారు. రేపటికి వాయిదా వేశారు' అని చెప్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది తులసి. దీనికి సామ్రాట్ 'చేసేదేముంది. ఇవాళ రెస్ట్ తీసుకోవడమే' అని రూమ్ అడుగుతాడు.

ఒకే రూమ్‌లో తులసి సామ్రాట్

ఒకే రూమ్‌లో తులసి సామ్రాట్


రిషెప్షనిస్ట్‌ను ఇంకో రూమ్ అడుగుతాడు సామ్రాట్. దీంతో ఆమె ఖాళీ లేదని చెబుతుంది. అప్పుడు నందూ 'పర్లేదు సార్.. మనిద్దరం ఒక రూమ్‌లో ఉండి.. వాళ్లిద్దరిని ఇంకో రూమ్‌లో ఉంచుదాం' అంటాడు. అప్పుడు సామ్రాట్ 'కానీ.. వద్దు నేను ఒప్పుకోను. ఎంతో ముచ్చటపడి మీ ఆవిడను టూర్‌కు తీసుకొచ్చారు. మీ ఇద్దరిని విడదీస్తే నాకు పాపం తగులుతుంది. మీరిద్దరూ రూమ్‌కు వెళ్లండి' అని కీ ఇస్తాడు. దీంతో మరి మీరు అంటాడు నందూ. దీంతో మా విషయం మేము చూసుకుంటాం కదా అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X