For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 16th Episode: లాస్య గురించి నిజం తెలుసుకున్న నందూ.. ఆ మాటతో పెద్ద గొడవ

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీలోని పాత మెషీన్లను వాడాలని నిర్ణయించుకున్న తులసి.. వాటి గురించి రామచంద్రను అడుగుతుంది. ఆ వెంటనే అక్కడకు కంగారు కంగారుగా వెళ్తుంది. వర్కర్లను చైతన్య పరిచి పనులు ప్రారంభిస్తుంది. ఆ తర్వాత దివాకర్ తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం లాస్య ముందే నందూకు వార్నింగ్ ఇస్తాడు. ఇక, ఇంట్లో ప్రేమ్, శృతి అందరికీ స్వీట్లు పంచి ఫ్యాక్టరీ పనులు ప్రారంభం అయినట్లు చెబుతారు. అప్పుడు అనసూయ, అంకిత.. తులసికి వ్యతిరేకంగానే మాట్లాడి అక్కసును వెల్లగక్కుతారు. దీంతో ప్రేమ్ వాళ్లను తిడతాడు.

  తులసిని సర్‌ప్రైజ్ చేసిన ఆమె పిల్లలు

  తులసిని సర్‌ప్రైజ్ చేసిన ఆమె పిల్లలు

  కుట్టు మెషీన్ల ద్వారా ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడంపై ఇంట్లో జరిగిన చర్చలతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అనసూయను పరందామయ్య తిట్టడంతో అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత తులసి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తుంది. కానీ, లైట్లు అన్నీ ఆర్పేసి ఇంట్లో ఎవరూ కనిపించారు. దీంతో ఆమె ఎంతగానో కంగారు పడిపోతుంది. సరిగ్గా అప్పుడే అందరూ లైట్స్ ఆన్ చేసి వచ్చి చప్పట్లు కొడుతూ తులసిని సర్‌ప్రైజ్ చేస్తారు. వాళ్లు చేసిన పనికి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్య పడిపోతుంది. అందరూ కంగ్రాట్స్ చెబుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.

  Pushpa Fight Video: అల్లు అర్జున్ ‘పుష్ప' ఫైట్ వీడియో లీక్.. కేసు పెట్టిన కాసేపటికే ఇంకోటి బయటకు!

  అనసూయ అసూయ.. తులసి రిప్లైతో

  అనసూయ అసూయ.. తులసి రిప్లైతో

  తులసిని సర్‌ప్రైజ్ చేసిన తర్వాత కేక్ కూడా తీసుకొచ్చి కట్ చేయమంటారు. అప్పుడే అనసూయ అక్కడకు ఎంట్రీ ఇచ్చి కోపంతో ఎన్నో మాటలు అంటుంది. అదే సమయంలో ‘ఆ కుట్టు మెషీన్లతో ఎంత కాలం ఫ్యాక్టరీని నడుపుతుందో చూద్దాం. అలా కుట్టీ కుట్టీ కాళ్లు పడిపోవడం తప్ప ఏం జరగదు' అని అంటుంది. అప్పుడు దివ్య ఆమెపై ఫైర్ అవుతుంది. దీనికి తులసి ‘ఆగు దివ్య. మీ నానమ్మ వల్లే ఇది సాధ్యమైంది. ఆమె నన్ను దిగజార్చేలా మాట్లాడడం వల్లే కసి పెరిగింది. ఇప్పుడు ఈ స్థాయికి చేర్చింది' అని సరైన రిప్లై ఇస్తుంది. దీంతో పరందామయ్య చప్పట్లు కొడతాడు.

  ఇంట్లో వాళ్లపై నందూ ఫైర్.. రచ్చ రచ్చ

  ఇంట్లో వాళ్లపై నందూ ఫైర్.. రచ్చ రచ్చ

  కేక్ కట్ చేయడానికి రెడీ అయిన సమయంలో నందూ, లాస్య అక్కడకు ఎంట్రీ ఇస్తారు. అప్పుడందరూ సంతోషంగా ఉండడాన్ని జీర్ణించుకోలేరు. దీంతో నందూ ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు ప్రేమ్ ఫ్యాక్టరీ పనులు మొదలైన విషయం చెబుతాడు. దీనికి ‘ఎవడో ఫ్రీగా ఇచ్చిన ఫ్యాక్టరీలో.. ఎవడో ఫ్రీగా ఇచ్చిన మెటీరియల్‌తో.. నలభై యాభై మందికి ఆర్డర్ ఇస్తూ పని చేయించడం పెద్ద గొప్పా? ఫ్యాక్టరీ మొదలైతే చంద్రమండలం ఎక్కినట్లు సంబరాలు చేసుకుంటున్నారేంటి?' అంటూ ఫైర్ అవుతాడు నందూ. దీంతో ఇంట్లో మరోసారి పెద్ద రచ్చ మొదలవుతుంది.

  Indian Idol 12 Shanmukhapriya: షణ్ముఖప్రియుకు ఊహించని ఆఫర్లు.. ఓడిపోయినా ఆ రికార్డు సొంతం

   తండ్రి ప్రశ్నలు.. ప్రేమ్ తీవ్ర ఆగ్రహంతో

  తండ్రి ప్రశ్నలు.. ప్రేమ్ తీవ్ర ఆగ్రహంతో

  నందూ మాటలకు పరందామయ్య ‘ఏరా నందూ రామచంద్ర నీకెందుకు ఫ్యాక్టరీ ఇవ్వలేదు? మిశ్రా నీకెందుకు మెటీరియల్ ఇవ్వలేదు? నువ్వు తులసి గెలుపును గుర్తించలేకపోతున్నావురా' అంటూ ఫైర్ అవుతాడు. దీంతో నందూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లాస్య మాట్లాడడంతో ప్రేమ్ ఆమెపై ఫైర్ అవుతాడు. ‘అసలు ఆయనెవరు మా అమ్మ మీద కోప్పడుతున్నాడు. నువ్వు నీ ముసలి కన్నీళ్ల గురించి మాకు బాగా తెలుసు. నీ యాక్టింగ్‌లు మా నాన్న దగ్గర చూపించు వెళ్లు' అని చెబుతాడు. అప్పుడు లాస్య అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది.

   లాస్యపై నందూ ఆగ్రహం.. మరో గొడవ

  లాస్యపై నందూ ఆగ్రహం.. మరో గొడవ

  ప్రేమ్ అన్న మాటలను చెప్పి నందూను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది లాస్య. అంతేకాదు, మనం ఎదగాలి అంటూ చెబుతుంది. దీనికి ‘ఏం ఎదుగుతాం. నువ్వు నా పక్కన ఉండి నన్ను తప్పుదోవ పట్టిస్తున్నావ్. అప్పులు తీర్చుకుందామని నేను ప్లాన్ చేస్తుంటే.. నువ్వు మాత్రం కార్లు కొందాం.. ఇల్లు కొందాం.. పబ్బులు.. పార్టీలు అంటూ డబ్బంతా ఖర్చు చేశాం. ఇప్పుడు ఆ దివాకర్ డబ్బులు ఇవ్వలేదని గొడవ చేస్తే ఆ తులసి ముందు చీప్ అవుతాం. నా పిల్లల ముందు తల దించుకోని ఉండాల్సి వస్తుంది' అని అంటాడు. దీంతో లాస్య కూడా అతడితో గొడవ పడుతూ వెళ్లిపోతుంది.

  అతడికి ముద్దు పెట్టి బుక్కైన శ్రీముఖి: తెర వెనుక జరిగిన దానిపై నోరు విప్పన యాంకర్

   నందూ విషయంలో తులసి ప్రేమ్ చర్చ

  నందూ విషయంలో తులసి ప్రేమ్ చర్చ

  నందూ, లాస్య మధ్య జరిగిన గొడవను పక్కనే ఉండి వింటుంది తులసి. ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉండి బాధ పడుతుంటుంది. అంతలో అక్కడకు ప్రేమ్ వచ్చి అడగగా.. ‘ఆ లాస్య మీ నాన్నను నిండా ముంచేస్తుంది. లేనిపోని ఖర్చులతో డబ్బంతా వేస్ట్ చేస్తుంది' అని చెబుతుంది. దీనికి ప్రేమ్ ఆయన గురించి తమకెందుకని అడుగుతాడు. అప్పుడు ‘మనకు కాదురా.. తాతయ్య గారికి బాధ కాదా? మీ మంచి నేనెలా కోరుకుంటానో.. తాతయ్య కూడా అలానే. పైకి కనిపించకపోయినా.. మీ నాన్న మీద ఆయనకు ప్రేమ ఉండదా' అంటూ సమాధానం చెబుతుంది తులసి.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  తులసి ఫ్యాక్టరీకి వచ్చి గిరిధర్ వార్నింగ్

  తులసి ఫ్యాక్టరీకి వచ్చి గిరిధర్ వార్నింగ్

  ఫ్యాక్టరీలో వర్కర్లతో పని చేయిస్తున్న తులసి దగ్గరకు గిరిధర్ వస్తాడు. ‘ఏంటి తులసి గారు మీ స్వార్ధ కోసం వర్కర్లతో కుట్టు మెషీన్లతో పని చేయిస్తున్నారు' అని అంటాడు. దీనికి ఆమె ‘నా స్వార్ధం కాదు.. వాళ్ల ఇష్టంతోనే పని చేస్తున్నారు' అని బదులిస్తుంది. ఆ తర్వాత ‘ఫ్యాక్టరీ నాకిచ్చేయండి.. లేదంటే ఇప్పుడు కరెంటే పోయింది. తర్వాత ప్రాణాలు కూడా పోతాయేమో' అని బెదిరిస్తాడు. కానీ, దీనికి తులసి ఏమాత్రం భయపడదు. పైగా అతడిని ఎదురిస్తూ మరింత ఉత్సాహంగా తయారవుతానంటూ మాట్లాడుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 399: Family Members Surprise Tulasi with Cake. Then Nandhu Fired on his Childrens. After That Nandhu Blamed Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X