Intinti Gruhalakshmi: దివ్యను పంపేందుకు కొత్త ప్లాన్.. లక్కీని రంగంలోకి దింపిన లాస్య.. కథలో మలుపు
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే: మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి వాళ్లపై నిందలు వేస్తూ చివరకు లక్కీని తీసుకుని లాస్య ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత విక్రమ్ తండ్రి ప్రకాశానికి క్లీన్ షేవ్ చేసి దివ్య బయటకు తీసుకు వస్తుంది. దీంతో విక్రమ్ తన తండ్రిని చూసి సంతోషిస్తాడు.
ఆ తర్వాత రాజ్యలక్ష్మి, ప్రకాశానికి అన్నం తినిపించేలా దివ్య ప్లాన్ చేసి ఇరికిస్తుంది. ఇదంతా చూసిన విక్రమ్ దివ్యకు థ్యాంక్స్ చెప్పానుకుని ఆగిపోతాడు. ఇక, లక్కీ విషయంలో తులసి, లాస్య మధ్య ఫోన్‌లో వాదన జరుగుతుంది. అప్పుడు నందూను మళ్లీ ఇచ్చేస్తావా అని తులసిని లాస్య అడుగుతుంది.

ఎన్ని వేషాలు వేసినా రాలేవు: విక్రమ్‌ను తన దారికి తెచ్చుకునేందుకు దివ్య చూస్తుంది. అప్పుడామె 'నువ్వు అడగాలే కానీ.. నీ వైపు ఎంతసేపైనా చూస్తూనే ఉంటాను విక్రమ్' అని అతడి కళ్లలోకి చూస్తుంది. అప్పుడు విక్రమ్ కూడా కళ్లు తిప్పుకోలేకపోతాడు. ఇంతలో బసవయ్య వచ్చి 'ఓర్నాయనో దివ్య.. విక్రమ్‌ను లైన్‌లో పెట్టేస్తుందిరో' అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత విక్రమ్ 'నువ్వు ఎన్ని వేషాలు వేసినా.. నా గది వరకూ రాగలవేమో నా మనసులోకి మాత్రం రాలేవు' అని వెళ్లిపోతాడు. దీంతో దివ్య 'నా ముందు ఎక్కువ సేపు నిలబడలేక పారిపోతున్నాడు పాపం' అని అనుకుంటుంది.

ఛీ ఛీ చూడలేక చచ్చిపోయా: రాజ్యలక్ష్మి దగ్గర లాస్య 'ఇక్కడ నా తలనొప్పులతో నేను చస్తుంటే.. ఆ లక్కీ గాడు వచ్చి నా నెత్తిన కూర్చున్నాడు' అని అంటుంది. దీనికామె 'నీ తలనొప్పి సంగతి సరే. మరి నా తలనొప్పి సంగతి ఏంటి? దివ్యను ఇంట్లో నుంచి ఎలా తరిమేయాలి' అని అడుగుతుంది. ఇంతలో బసవయ్య వచ్చి 'మీ ఇద్దరి తలనొప్పులూ సరే.. అవతల కొంపలు అంటుకుంటున్నాయి. అక్కడ దివ్య, విక్రమ్‌లు ముద్దులాట మొదలెట్టేశారు. ఇద్దరూ కలిసి గదిలో ఛీ ఛీ చూడలేక చచ్చాను' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావ్ తమ్ముడూ.. కళ్లతోనే చూశావా? అని అడుగుతుంది.
సెన్సార్ లేని సినిమా అని: రాజ్యలక్ష్మి అడగ్గానే బసవయ్య 'చూడటం ఏంటక్కా? వాళ్లు సెన్సార్ లేని సినిమా చూపిస్తుంటే.. దివ్యకు విక్రమ్ పడిపోయాడు. నా కళ్లతో చూశాను అంటే నమ్మరే. కావాలంటే మీరే వెళ్లి చూడండి' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'ఛీ ఛీ.. అసలు విక్రమ్‌కు ఏమైంది? మళ్లీ దాని వెంటపడుతున్నాడు' అనగా బసవయ్య 'వాడు మగాడు. చేసేదంతా దివ్య.. వాడ్ని రెచ్చగొట్టేస్తుంది' అంటాడు. దీనికి లాస్య 'అవును రాజ్యలక్ష్మీ.. మనం కంట్రోల్ చేయాల్సింది విక్రమ్‌ను కాదు.. ఆ దివ్యను' అని చెప్తుంది. ఆ వెంటనే రాజ్యలక్ష్మి ఆలోచనలో పడిపోతుంది.
లక్కీని వాడుకుని చెక్ పెట్టు: ఆ తర్వాత రాజ్యలక్ష్మి 'ఎలాగూ లక్కీ నీ దగ్గరే ఉన్నాడు కాబట్టి.. వాడ్ని అడ్డం పెట్టుకుని నందూకు దగ్గరవ్వు. అప్పుడు తులసికి చెక్ పెట్టు. నీ దెబ్బకి తులసి గిలగిలా కొట్టుకుంటుంది. అప్పుడు దివ్య మన దారిలోకి వస్తుంది. వాళ్లు వాళ్లు తన్నుకు చస్తారు. ఈలోపు మనం విడాకులు విషయం తేల్చేద్దాం. దివ్యను బయటకు గెంటేద్దాం' అని సలహా ఇస్తుంది. దీంతో లాస్య ఇదేదో బాగుందే అంటూ తన ప్లాన్‌ను రెడీ చేసుకుంటుంది. ఇక, ఇంట్లో తులసి చేసిన వంటలను అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. డైటింగ్ చేస్తున్న నందూ కూడా టెంప్ట్ అయిపోయి ఆరగించేస్తాడు.
లక్కీతోనే లాస్య కొత్త ప్లాన్: రాజ్యలక్ష్మి ఇచ్చిన సలహాతో లాస్య 'దివ్యను దెబ్బ కొట్టడం ఏమో కానీ.. లక్కీ గాడిని అడ్డం పెట్టుకుని నేను మళ్లీ నందూకు దగ్గరవ్వొచ్చు' అని లక్కీ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆ బుడ్డోడితో 'నాన్నా నీ బాధ చూస్తుంటే ప్రాణం విలవిల్లాడుతుందిరా. నీ డాడీని నీకు దగ్గర చేయాలని నాకు ఉంది. కానీ వాళ్లు మొండి వాళ్లు నిన్ను రానీయరు. మనమే ఏదోటి చేయాలి' అంటుంది. దీంతో లక్కీ 'ఏదోటి చెయ్ మమ్మీ. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నాకు మాత్రం డాడీ కావాలి మమ్మీ' అంటాడు. దీంతో తన ప్లాన్‌ను లాస్య చెప్పగా.. లక్కీ చేయడానికి రెడీ అయిపోతాడు.

నందూను పొడిగిన ప్రకాశం: మామను బయటకు తీసుకు వచ్చిన దివ్య.. రాజ్యలక్ష్మి ముందు పొగడడం మొదలు పెడుతుంది. అలాగే, 'మామయ్యా.. ఇన్నాళ్లూ మీరు ఆ చీకటి గదిలో ఎలా ఉండగలిగారు' అని అడగ్గా.. 'విక్రమ్ అదృష్ట వంతుడు కాబట్టి నీలాంటి భార్య దొరికింది. కానీ నాకు ఈ రాక్షసి దొరికింది. ఆ చీకటి గదికి పరిమితం చేసింది' అంటాడు.
తర్వాత దివ్య ఆయనను ఇంకా రెచ్చగొట్టగా నందూ గొప్పోడు అంటూ మాట్లాడతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'విక్రమ్ గాడికి ఇది దగ్గరవ్వాలని చూస్తుంది.. నా మొగుడ్ని కూడా దూరం చేయాలని చూస్తుంది.. నా పాలిట తీవ్రవాదిలా తయారైంది' అని అనుకుని రంగంలోకి దిగుతుంది. అప్పుడు దివ్యకు వార్నింగ్ ఇస్తుంది.
లక్కీని రంగంలోకి దింపేసి: ప్లాన్ ప్రకారం లాస్య.. లక్కీని కారులో తీసుకుని వస్తుంది. అప్పుడతడు 'భయం ఉంది మమ్మీ. మనం చేస్తున్నది మోసం కదా. డాడీకి నిజం తెలిస్తే జీవితంలో నా ముఖం చూడడు..' అని అంటాడు. దీనికామె 'నువ్వేం కోర్టులో జడ్జీవి కాదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని చెప్పింది చెయ్. ఇష్టం లేకపోతే చెప్పు తీసుకెళ్లి హాస్టల్‌లో పడేస్తా. అయినా వీడు ఒక్క పూట తులసి దగ్గర ఉన్నందుకే గాలి తగిలినట్టు ఉంది. న్యాయం ధర్మం అంటూ సొల్లు చెప్తున్నాడు. తులసీ నా యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయింది' అంటుంది. తర్వాత లక్కీ తులసి ఇంట్లోకి వెళ్తాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











