For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 17th Episode: లాస్యను బుక్ చేసిన తులసి.. ఆమె ప్లాన్‌తో ప్రేమజంటకు షాక్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీలోని పాత మెషీన్లతో పని మొదలు పెట్టిన తులసిని కుటుంబ సభ్యులంతా కేక్‌తో సర్‌ప్రైజ్ చేస్తారు. అయితే, అంతలో కంపెనీ నుంచి కోపంగా వచ్చిన నందూ.. ఇంట్లో సందడి చేస్తుండడంతో పిల్లలపై ఫైర్ అవుతాడు. ఆ తర్వాత లాస్యకు నందూకు పెద్ద గొడవ అవుతుంది. అది చూసిన తులసి.. ప్రేమ్ దగ్గర తన బాధను వెల్లగక్కుతుంది. అనంతరం ఫ్యాక్టరీకి వచ్చిన గిరిధర్.. తులసిని బెదిరించే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఆమె మాత్రం అస్సలు జంకకపోగా.. అతడికే రివర్స్‌లో వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతుంది.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  గిరిధర్‌కు మరో ఛాలెంజ్ చేసిన తులసి

  గిరిధర్‌కు మరో ఛాలెంజ్ చేసిన తులసి

  తులసిని భయపెట్టేందుకు ఫ్యాక్టరీకి వచ్చిన గిరిధర్‌తో ఆమె కూడా ధీటుగానే మాట్లాడుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ‘ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా నేను మాత్రం వెనకడుగు వేయను. అస్సలు ఫ్యాక్టరీని వదులుకునే ప్రశక్తే లేదు. నీకు దీన్ని దక్కనీయను' అంటూ గిరిధర్‌కు సవాల్ విసురుతుంది తులసి. అప్పుడు ‘చూద్దాం.. మీరు ఎన్ని రోజులు ఇదే మాట మీద నిలబడి ఉంటారో. మీకు అడుగడుగునా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. రెడీగా ఉండండి' అంటూ అతడు కూడా ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  శృతికి ప్రేమను చెప్పేందుకు ప్రేమ్ ప్లాన్

  శృతికి ప్రేమను చెప్పేందుకు ప్రేమ్ ప్లాన్

  చాలా కాలంగా శృతి ప్రేమిస్తున్న ప్రేమ్.. డైరీలో ఆమె గురించి ఎన్నో కవితలు రాసుకుంటాడు. వాటిని మనసులోనే చదువుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తన ప్రేమను ఎలాగైనా ఆమెకు తెలియజేయాలని అనుకుంటాడు. ఇందుకోసం తన డైరీని ఆమెకు కనిపించేలా పెట్టి.. లోపలికి వెళ్లేలా చేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకు అనుగుణంగానే కాఫీని రూమ్‌లో పారబోసి కప్‌ను తీసుకెళ్లి ఆమెకు విషయం చెబుతాడు. అప్పుడది అంకిత చూసి ఆమె కంటే ముందే ప్రేమ్ రూమ్‌లోకి వెళ్తుంది. అంతలో పరందామయ్య పేపర్ అడగడంతో శృతి ఆ రూమ్‌లోకి వెళ్లదు.

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  డైరీ చదివేసిన శృతి.. ప్రేమ్‌కు బిగ్ షాక్

  డైరీ చదివేసిన శృతి.. ప్రేమ్‌కు బిగ్ షాక్

  తన ప్లాన్ ప్రకారం శృతిని గదిలోకి వెళ్లేలా చేసినా.. ఆమె మాత్రం ఆలస్యం అవుతుంది. దీంతో ముందే అక్కడకు వెళ్లిన అంకిత ఆ డైరీని చదివేస్తుంది. అప్పుడు అతడికి ఎంత ప్రేమ ఉందో గ్రహిస్తుంది. దీంతో ‘ప్రేమ్ నువ్వు మంచి ప్లానే వేశావ్. శృతిని లోపలికి పంపించి డైరీ చదివేలా చేద్దామని అనుకున్నావ్. కానీ, అది నా లాంటి వాళ్లు ఉండగా చేయకూడదు. ఎప్పుడైనా ప్రేమను నేరుగానే వ్యక్త పరచుకోవాలి. అంతేకానీ, ఈ పాత ప్లాన్లు వేస్తే ఉపయోగం ఉండదు' అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. అంతేకాదు, డైరీ తీసుకుని వచ్చేస్తుంది. ఇలా ప్రేమ్‌కు షాకిస్తుంది.

   శృతిని అలా అపార్థం చేసుకున్న ప్రేమ్

  శృతిని అలా అపార్థం చేసుకున్న ప్రేమ్

  డైరీని తనతో తెచ్చుకున్న అంకిత.. ‘ఈ డైరీని శృతి చదివిందని ప్రేమ్ అనుకుంటాడు. పాపం ఆమెకు ఈ విషయం తెలీదు. అందుకే దీని గురించి ఏమీ మాట్లాడదు. కానీ, ప్రేమ్ మాత్రం తన డైరీని శృతి చదివింది అనుకుంటాడు. అప్పుడు శృతి నుంచి రిప్లై ఆశిస్తాడు.

  ఆమె డైరీని చూడలేదు కాబట్టి ఏమీ చెప్పదు. దీంతో ప్రేమ్ తనంటే శృతికి ఇష్టంలేదని అనుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది' అంటూ ప్లాన్ చేస్తుంది. ఆమె అనుకున్నట్లుగానే ఆమె డైరీ చదివినా ఏమీ చెప్పలేదని శృతిని అపార్థం చేసుకుంటాడు ప్రేమ్. దీంతో నిరాశగా వెళ్లిపోతాడు.

  Bheemla Nayak First Glimpse: చరిత్ర సృష్టించిన పవన్.. ప్రభాస్‌ కంటే రెండితలు.. చిరు రికార్డు బద్దలు

  లాస్యను గట్టిగానే ఇరికించేసిన తులసి

  లాస్యను గట్టిగానే ఇరికించేసిన తులసి

  తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ దివాకర్.. నందూతో గొడవకు దిగుతాడు. అప్పుడు లాస్య అతడిని ఎదురించి మాట్లాడగా పెద్ద గొడవ జరుగుతుంది. అంతలో తులసి అక్కడకు వచ్చి ‘లాస్య నువ్వెంత అదృష్టవంతురాలివి. నువ్వు బ్యాంకులే చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయింది. అవసరం ఉన్నప్పుడే డబ్బు చేతికి అందడం అంటే మాటలు కాదు. ఏంటి నమ్మడం లేదా? కావాలంటే ఈ లెటర్ చూడు' అంటూ బ్యాంకు వాళ్లు పంపిన లెటర్ ఇస్తుంది. దీంతో నందూ ముందు లాస్య బాగా ఇరుక్కుపోయింది. దీంతో మనసులో ఆమెను ఎంతగానో తిట్టుకుంటుంది.

  డైరీని చించిన అంకిత.. ప్రేమ్ నిరాశగా

  డైరీని చించిన అంకిత.. ప్రేమ్ నిరాశగా

  ప్రేమ్ డైరీని తీసుకుని వెళ్లిన అంకిత దాన్ని మొత్తం చించేస్తుంది. మరోవైపు, శృతి తనను ప్రేమించడం లేదని అనుకున్న అతడు.. ఆమెను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అంతేకాదు, ‘సారీ శృతి. నువ్వు నాకు రిప్లై ఇవ్వకపోవడంతో నిన్ను ఫేస్ చేయలేకపోతున్నా.

  నీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడలేకపోతున్నా' అని మనసులో అనుకుంటాడు. అంతలో అక్కడకు వచ్చిన శృతి ‘నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్? ఏదైనా తప్పు చేస్తే చెప్పు. దోషిలా దూరం పెడితే కష్టంగా ఉంది. ఏదైనా పంచుకునేది నీతోనే కదా. కానీ ఇప్పుడు నువ్వే బాధ పెడుతున్నావ్' అని అంటుంది.

  బోల్డు షోలో బౌండరీలు దాటిన మాళవిక శర్మ: ఒంటి మీద బట్టలు నిలవనంటున్నాయా ఏంటి!

  శృతికి నిజం చెప్పిన ప్రేమ్.. అర్థం కాక

  శృతికి నిజం చెప్పిన ప్రేమ్.. అర్థం కాక

  శృతి తనను ప్రశ్నించే సరికి ప్రేమ్‌కు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అప్పుడు ‘నిన్ను నేను దూరం పెట్టడం కాదు శృతి. నిన్ను నేను ఫేస్ చేయలేకపోతున్నా. నీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నువ్వు డైరీ చూసి కూడా ఏమీ చెప్పలేదని' అని అంటాడు. అప్పుడు ‘ఏం డైరీ ప్రేమ్? నేను చూడడం ఏంటి? ఏం అర్థం కావడం లేదు' అని అయోమయంగా అడుగుతుంది శృతి. దీంతో ‘ఏంటి? డైరీ నువ్వు చూడలేదా?' అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు ప్రేమ్. దీంతో ఈరోజు ఎపిసోడ్ సస్పెన్స్‌గా ముగిసింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 400: Ankitha Breaked Prem Love Proposal plan. Then He misunderstand to Shruthi. After That Tulasi Gave Big Shock to Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X