Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మిని పడేసిన దివ్య.. అతడికే ఆస్పత్రి బాధ్యతలు.. లాస్య బుట్టలో తులసి
ఒక్క తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య.. విక్రమ్‌ను రెచ్చగొడుతూ ఉండగా బసవయ్య చూసి రాజ్యలక్ష్మి వాళ్లకు చెప్తాడు. దీంతో ఎలాగైనా దివ్యకు చెక్ పెట్టాలని వాళ్లు అనుకుంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి 'లక్కీని అడ్డు పెట్టుకుని నందూకు దగ్గరై తులసికి షాక్ ఇవ్వు' అని లాస్యకు ప్లాన్ చెప్తుంది. అందుకు అనుగుణంగానే లాస్య వెళ్లి లక్కీకి ప్లాన్‌ను వివరిస్తుంది. దీంతో ఆ పిల్లాడు తప్పక ఒప్పుకుంటాడు. ఇక, ప్రకాశాన్ని తీసుకొచ్చి రాజ్యలక్ష్మికి దివ్య మరో షాక్ ఇస్తుంది. తర్వాత లాస్య కారులో లక్కీని తీసుకుని వెళ్లి తులసి వాళ్ల ఇంట్లోకి ఎవరూ చూడకుండా పంపుతుంది.

ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అంటూ:రాజ్యలక్ష్మి చెప్పిన ప్లాన్ ప్రకారం.. లక్కీ ఎవరికీ కనిపించకుండా తులసి వాళ్ల ఇంట్లోకి వెళ్లిపోతాడు. అప్పుడు తులసి కిచెన్‌లో ఉండగా.. వెళ్లి మాట్లాడుకుందాం అనుకుంటాడు. కానీ, తన తల్లి లాస్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఆగిపోతాడు. అంతేకాదు, 'అమ్మ చెప్పేవరకూ ఎవరికీ కనపడొద్దు అని అన్నది కదా.. ఎవరి కంట పడకూడదు' అని అనుకుంటాడు. లక్కీని వదిలి వెళ్లిన లాస్య 'మా వాడు తులసి ఇంట్లోకి అడుపెట్టేశాడు. నేనిక్కడ బటన్ నొక్కేవరకూ వాడు అక్కడే ఉంటాడు. ఇంకెందుకు ఆలస్యం ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం' అని అనుకుంటుంది.
డ్రామా షురూ చేసేసిన లాస్య:ప్లాన్‌లో భాగంగా లక్కీని దించిన తర్వాత తులసికి లాస్య ఫోన్ చేస్తుంది. దీంతో తులసి దీనికి నిన్న ఇచ్చిన క్లాస్ సరిపోలేనట్టు ఉంది అనుకుంటూ 'నేను నంద గోపాల్‌ను కాదు.. సతాయిస్తే ఊరుకోవడానికి అది గుర్తుపెట్టుకో.. ఈసారి నాకు ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కేసు పెట్టి లోపల వేయిస్తాను' అని అంటుంది. దీంతో లాస్య 'నిన్ను సతాయిస్తే నాకేం వస్తుంది తులసీ.. లక్కీ మళ్లీ కనిపించడం లేదు. నిన్నటి నుంచి కనిపించడం లేదు. అక్కడికి ఏమైనా వచ్చాడేమో అని కాల్ చేశాను' అని ఏడుస్తుంది. దీంతో తులసి ఇదంతా నిజమే అనుకుని నమ్ముతుంది.

డాడీ కావాలని అంటున్నాడు:లాస్య చెప్పగానే తులసి అయ్యో.. ఇక్కడికేం రాలేదే. వాడిపై అరిచావా అని అడగ్గా.. 'పెద్దగా అరవలేదు తులసి. రాత్రి అంతా గోల చేస్తుంటే కాస్త వారించాను అంతే. ఎంత చెప్పినా మాట వినడం లేదు. డాడీ కావాలి. డాడీ కావాలి అని గోల చేస్తున్నాడు. కంట్రోల్ అవుతాడని అరిచా.. ఇలా పారిపోతాడని అనుకోలేదు' అని అంటుంది. దీంతో తులసి కొన్ని జాగ్రత్తలు చెబుతుంది. అప్పుడు లాస్య మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటుంది. తర్వాత తులసి కంగారుగా వచ్చి 'లక్కీ మళ్లీ కనిపించడం లేదు.. ఏడుస్తూ లాస్య ఫోన్ చేసింది' అని ఇంట్లో వాళ్లకు చెబుతుంది.
డాడీ నీకోసమే వచ్చేశానుగా:తులసి ఆ మాట చెప్పగానే 'అలా ఎలా వదిలేస్తారు.. పిల్లోడ్ని ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోలేదా? అంత నిర్లక్ష్యమా' అని అంటాడు. దీంతో తులసి 'ఏమోనండీ.. లక్కీ ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్ధం కావడం లేదు' అని అంటుంది. వాళ్ల మాటల్ని చాటుగా వింటున్న లక్కీ 'డాడీ కోసమే వచ్చాను' అని అనుకుంటాడు. ఆ తర్వాత తులసి 'మనం కూడా లక్కీని వెదుకుదాం పదండి' అంటుంది. దీంతో నందూ 'లాస్యకు ఎంత చేసినా వేస్ట్. అలా చేసి ఇప్పటికే చాలాసార్లు చేతులు కాల్చుకున్నాం. చేతులు జోడిస్తే అప్పుడు చూద్దాం' అని అంటాడు.

రాజ్యలక్ష్మిని పడేసిన దివ్య:మామగారిని వీల్ చైర్‌కే పరిమితం చేశానని రాజ్యలక్ష్మి అనడంతో దివ్యకు కోపం వస్తుంది. దీంతో అత్తగారిని కూడా పడేయాలని ప్లాన్ చేస్తుంది. దీనికోసం ప్రియ హెల్ప్ తీసుకుంటుంది. అప్పుడు ప్రియ.. రాజ్యలక్ష్మిని మాటల్లో పెట్టి సతాయిస్తూ ఉండగా.. దివ్య మాత్రం బాత్రూంలోకి వెళ్లి నూనెను ఫ్లోర్ మీద పోస్తుంది. అలా కోడళ్లు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి రాజ్యలక్ష్మి బాత్రూంలో కాలు జారి కింద పడిపోతుంది. అది చూసిన కోడళ్లు ఫుల్ ఖుషీ అవుతారు. ఆ తర్వాత అందరూ కలిసి రాజ్యలక్ష్మికి ఏమైందో అని చూస్తుంటారు.

ఆస్పత్రి బాధ్యతలు తీసుకో:రాజ్యలక్ష్మికి దెబ్బ తగలడంతో సంజయ్ ఆమె కాలును చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ బాగా కంగారు పడుతూ ఉండగా.. దివ్య మాత్రం లోలోపల సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ప్రకాశం తనదైన రీతిలో భార్యపై సెటైర్లు వేస్తూ ఉంటాడు. అలా కాసేపు అయిన తర్వాత సంజయ్.. వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని రాజ్యలక్ష్మికి చెప్తాడు. అప్పుడు ప్రకాశం.. ఈ వారం రోజులు ఆస్పత్రి బాధ్యతలను దగ్గరుండి చూసుకో అంటూ విక్రమ్‌కు చెప్తాడు. అతడు తనవల్ల కాదని అన్నా కూడా దివ్య సహాయం చేస్తానని అంటుంది. దీంతో సంజయ్ కోపంతో వెళ్లిపోతాడు.

ఆమ్లెట్లు తినేసి.. తులసి షాక్:ఇక, నందూ కోసం తులసి ఆమ్లెట్లు వేసి ఉంచుతుంది. దాన్ని లక్కీ దొంగతనంగా తినేస్తాడు. దీంతో అది ఏమైందా అని అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత పరందామయ్య మీద అనుమానపడతారు. దీంతో తులసి మరోసారి ఆమ్లెట్ వేయగా అది కూడా లక్కీ తినేస్తాడు. దీంతో తులసి వచ్చి ఇప్పుడైనా తిన్నారా లేదా అని ప్రశ్నించగా.. నందూ తిన్నానని అంటాడు. అదంతా చూసి లక్కీ నవ్వుకుంటూ ఉంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











